మూడ వాదం ఎవరిది? పిరమిడ్ వాదులదా,సైన్స్ వాదులదా?
  మా బ్లాగులొ శాస్త్రీయ వాదం గురించి ఒక టపాలో చెపుతూ, దేనినైనా గుడ్డిగా నమ్మడం ఎంత తప్పో, వ్యతిరెకించడం అంతే తప్పు అని చెప్పడం జరిగింది. ఈ రోజు "మహా న్యూస్" చానల్ వారు నిర్వహించిన ఒక ప్రత్యక్ష వాదులాట కార్యక్రమం చూశాక ఈ దేశం లో సైన్స్ వాదులు అని చెప్పుకునె వారు కూడ  ఎటువంటి పరిశోదనలు చెయ్యకుండానే, తాము నమ్మినదే సత్యం అని వాదించడానికి చానల్ స్టూడియోలలో ప్రత్యక్షమవుతున్నారంటే,వారిని ఏ విదంగా అర్థం చేసుకోవాలి? వారు కూడ చీప్ పబ్లిసిటీకి అతీతులు కాదనుకోవాలా?

  విషయం ఏమిటంటే ఈ రోజు మహా న్యూస్ వారు పిరమిడ్ ద్యానమ్ యొక్క శాస్త్రీయత గురించి ఒక అభిప్రాయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెవలం ఇద్దర్నె కూర్చో పెట్టారు. వారివురూ పిరమిడ్ వాదాన్ని వ్యతిరెకించె వారే. అసలు పిరమిడ్ వాదుల ప్రకారం ద్యానమ్ అనేది పిరమిడ్ ఆకారం లొ ఉన్న ఏ వస్తువు లేక కట్టడం క్రింద కూర్చుని చేస్తే త్వరగా ద్యాన పలితాలు పొందవచ్చని, అంతే కాక పిరమిడ్ వల్ల విశ్వవ్యాప్తంగా ఉండే విశ్వ శక్తిని మనిషి గ్రహించడం వలన  అనేక రుగ్మతల నుండి విముక్తుడు కావచ్చని చెపుతారు. కాదు ఇదంతా బోగస్ అని సైన్స్ వాదుల ద్రుడ అభిప్రాయం.

  సరే స్టూడియోలో ఉంది ఇద్దరూ సైన్స్ వాదులే కాబట్టి పిరమిడ్ వాదం తప్పని ఏక పక్షంగా తేలి పోతుంది అనుకున్నాను. కాని అశ్చర్యకరంగా నందం ప్రసాద్ అనె అయన పోన్ లైన్లొ వచ్చి అక్కడ ఉన్న ఇద్దరు సైన్స్ వాదులను తన అనుభవ వాదం ద్వారా నిరుత్తరులను చెయ్యడమే కాక, అసలు పిరమిడ్ లోని శాస్త్రీయత ను పరిశోదించకుండానె అ ఇద్దరు సైన్స్ వాదులు తమ అభి ప్రాయాలను ప్రజల మీద రుద్దడానికి కూర్చున్నారని తెలియ చెప్పడం లో సఫలిక్రుతుడయ్యాడు. చివరకు అందులోని ఒక సైన్స్ వాది సవాలుకు పిరమిడ్ వాది అంగీకరించి, ఏదయినా ఒక పదార్దం మీద పిరమిడ్ కలుగచెసే ప్రబావాన్ని పరిసీలించుటకు తాను ఒక పిరమిడ్ మహన్యూస్ కి పంపుతానని దానిని పరిశిలించి,వాస్తవాలను ప్రజలకు చెప్పాలని కోరాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పిరమిడ్ వాది నిజాయితీని తెలిసికోవటానికి.

  అసలు పిరమిడ్ ద్వారా  విశ్వ శక్తిని పొందొచ్చో లేదో మనకు తెలియదు. కాని ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు, శాస్త్రీయ జ్ణానం ఉన్నవారె అలాంటి శక్తి పొందామని తమ అనుభవాలను పుస్తకాల రూపం లొ ప్రచురించారు. కాని సైన్స్ వాదులు మాత్రం ఏ మాత్రమ్ పరిశొదించకుండానే  ఇది గారడీ లాంటి టక్కు టమారా విద్యగా కొట్టి పారెస్తునారు. ఒక వేళా పిరమిడ్ శక్తి నిజమయితే నేటి వ్యాపార ఉత్పత్తులు మార్కెట్ కీ తీవ్ర నష్టం. కాబట్టి దీని మీద పరిశొదనలకు వ్యాపార వాదులు ముందుకు రారు. పెట్టుబడులు లేకుండా ఏ పరిశొదనలు జరుగవు.

 ఆద్యాత్మికులు అనుభవ పలితాలను మాత్రమె వెల్లడించ గలరు. దానిలోని శాస్త్రీయ కారణాలను వివరించే పరిజ్ణానమ్ వారికుండదు. ఆ అవసరం కూడ వారికి లేదు. ప్రతి వ్యక్తీ స్వయమ్ అనుభవమ్ ద్వారానే వాటిని నమ్ముతారు. ఒక వేళా మాన వాళి కి దానివలన మేలు జరుగుతుందని బావిస్తే,లేదా కీడు జరుగుతుందని బావించినా తక్షణమే అటువంటి దాని మీద శాస్త్రీయ పరిసోదనలు చేసి నిజా నిజాలను పక్ష పాత రహితంగా ప్రజలకు వివరించాల్సిన బాద్యత ప్రభుత్వమ్ మీద,సైంటిస్ట్ ల మీద ఉంది. అంతే కాని అద్యాత్మికులను అవహేళన చేస్తూ,తాము పరిశొదించని వాటి మీద అభిప్రాయలు చెప్పబూనడం సైన్స్ వాదులమని చెప్పుకునే వారికి సరి కాదు. అటువంట్టప్పుడు బోగస్ బాబాల కు వీరికి మద్య పెద్ద తేడా ఉండదు..ఈ రోజు నేను ప్రత్యక్షంగా చూసాను పిరమిడ్ వాది ఎంతో వినయంతో పిరమిద్ ని పరిశొదించమని కోరుతుంటే, సైన్స్ వాది అతన్ని, అవహేళన చెయ్యడం.అంతే కాక పిరమిడ్ వాదనని తిప్పి కొట్టలేక నాన్సెన్స్  వాల్లతో తమను మాట్లాడనియ్యవద్దని యాంకర్ని అడగడం చూస్తుంటే నిజమైన మూడత్వం ఎవరిదో ప్రేక్షకులకు తెలిసిపోతుంది.

  మహా న్యూస్ వారు ఎలాగు అటు సైన్స్ వాదులకు, ఇటు పిరమిడ్ వాదులకు మద్య పిరమిడ్ శాస్తియత గురించి పరిశిలించటానికి, ఒక అంగీకారానికి వచ్చేలా చేసారు కాబట్టి, ఆ ప్రక్రియను త్వరగా ప్రారంబించి,పిరమిడ్ శక్తి లోని నిజానిజాలను ప్రజలకు వెల్లడయ్యేలా క్రుషి చెయ్యాలి అని కోరుచున్నాను..

Comments

 1. మీ పిరమిడ్ బాబా గత రెండు రోజుల నుండి tv9 లో బాగా ప్రాచుర్యం పొందుతున్నారు.

  ReplyDelete
  Replies
  1. "మీ పిరమిడ్ బాబా గత రెండు రోజుల నుండి tv9 లో బాగా ప్రాచుర్యం పొందుతున్నారు".
   ఈ వ్యాఖ్యానమ్ తప్పు.
   "పిరమిడ్ బాబా గత రెండు రోజుల నుండి tv9 లో బాగా ప్రాచుర్యం పొందుతున్నారు"
   .
   ఈ కామేంట్ కరెక్ట్ కావచ్చు. టి.వి.9 నేను చూడలేదు.

   Delete
 2. భక్తి భావం తో ఉన్నవారి లో శాస్త్రీయత కోసం చూడలేం అది వారి నమ్మకం అంతే .. కానీ సైన్స్ కు ప్రతినిడులం అనుకునే వారి వాదనలో కచ్చితంగా శాస్త్రీయత ఉండాలి. ఈ చర్చలో ఫోన్ చేసిన వ్యక్తి పిరమిడ్ ధ్యానం పై మీరు పరిశోదన చేశారా ? అని ప్రిశ్నిస్తే సైన్స్ ప్రతినిది తనకు ఆ అవసరం లేదని చెప్పాడు ..
  ఇక టివ్ 9 లో ఒక యువతిని 1పత్రీ కౌగిలించుకోవడం చూపి అసభ్యం అని చెబుతున్నాడు. 2. ఒక మహిళా పత్రీ కళ్ళు వత్తడం చూపి మసాజ్ అంటున్నాడు .. ఈ రెండు ద్రుశ్యాలనే పడే పడే చూపుతున్నాడు.
  .. కడ్తాల్ లో లక్షమందికి పైగా ధ్యానం చేస్తున్నారు. ఒక లక్షమంది ముందు ఎవరైనా సెక్స్ దృష్టితో కౌగిలించుకోగాలరా? పత్రీ వయసు 65 ఏళ్ళు .
  ఒక మహిళా చేతులను దాదాపు ఐదుగురు సహాయంగా పట్టుకుంటే ఆమె పత్రీ కళ్ళను తన కళ్ళతో తొక్కుతున్నారు .. మసాజ్ అంటే కళ్ళు తొక్కడం కాదు .. మనకు టివి లో కనిపించే దానిలోనే ఆమె కాళ్ళు తోక్కేప్పుడు అక్కడ 25 మంది వరకు కనిపిస్తున్నారు ... అందులో కనీసం 5-6 మంది పురుషులు కనిపిస్తున్నారు. వేదిక మిద ఉన్నప్పుడు శక్తి ఉంటుందని.. అది పోవడానికికాళ్ళు తోక్కిన్చుకుంటారని పిరమిడ్ వాళ్ళు చెబుతున్నారు .. వాళ్ళు చూపే ద్రుష్యల్లోనే ఐదుగురు పురుషులు కనిపిస్తింటే పత్రీ ఆడవారిని మాత్రమే దగ్గరకు రాణిస్తాడు .. మగ వారు కైఇపిస్థెనె ఛి ఛి అని దూరం పెడతాడు అని చెబుతున్నారు నా కామెంట్ ను మీరు పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు యు ట్యూబ్ లో అది ఉంది .. చూసి నిర్ణయించుకోండి (tv 9 24x 7 sex kendram studiyo lopala )

  ReplyDelete
 3. "ఆవు బాగానే ఉంది, దూడ బాగానే ఉంది,గుంజకు పుట్టింది గురక తెగులు" అని సామెత. తొక్కినోళ్లు బాగున్నారు! తొక్కించ్కున్నోల్లు బాగున్నారు. మద్యలో టి.వి.వాళ్లకి పుట్టింది తిక్క రోగం అని సామెతను మారిస్తే సరిపోతుంది. లెక పొతే ఏమిటండి, ఆయనెదో ఆడవాల్లతో, మగవాళ్ళతో మర్దన చెయించుకుంటే, ఆడవాల్లు తొక్కేడాన్ని మాత్రమే చూపించి, మగవాళ్ళు చేసే దాన్ని ఎడిట్ చేసి చూపిస్తూ ప్రజల్ని ద్యానపీటమ్ మీదకి రెచ్చగొట్టి పంపిస్తారా? ఈ రోజు ద్యానపిటం మీద చేసిన దాడికి టి. వీ వాళ్ళే కారణం. విచిత్రమయిన అంశం ఏమిటంటే టి.వి వాళ్ళు రెచ్చగొట్టిందాక అఖ్ఖడి రైతులకు తమ భూములు ఆన్యాక్రాంతంఅయ్యాయని తెలియదట. చానళ్ల రేటింగ్ కొసం ప్రశాంతంగ ఉన్న పబ్లిక్ ని రెచ్చగొట్టడం నేరం కాదా?

  ReplyDelete
 4. ఓహో! మరి ధ్యానం గురించి కొంచెం గుచ్చి గుచ్చి ప్రశ్నలడిగిన విలేకరీ ఆయన ఇంటర్వ్యూ నచ్చలేదంటూ మధ్యలోనే అస్త్ర సన్యాసం చెయ్యడం నిజమైన పిరమిడ్ గురువు లక్షణమేనా??

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశ్న ఎవర్ని అడిగారో అర్థం కాలేదు. నేను మౌలికంగా పత్రిజీ గారితో కొన్ని విషయాలలో విబేదిస్తాను. ఆయన గురించి నాకు ఎక్కువుగా తెలియదు కూడ. కాని హిందూ జీవన విదానానికి, హిందువుల అహారపు అలవాట్లుకి వ్యతిరేకంగా ఆయన బావాలు కొన్ని ఉన్నాయి. వాటిని వ్యతిరెకిస్తాను. నా ఈ టపా పెట్టడం లో ఉద్దేశ్యం కొన్ని లక్షల మంది ప్రజలు అనుభవ పూర్వకంగా నమ్ముతున్న విషయాన్ని, కాదని చెప్పే సైంటిస్ట్లు తగిన పరిశొదనలు చెసి అవి నిరూపితం కాలెదు అనిచెపితే బాగుంటుంది. చానల్ స్టూడియో లో ఉన్న గోగినేని బాబు గారు తాను పిరమిడ్ వాది పంపిస్తానన్న పిరమిడ్ ని దాని ప్రబావాన్ని, ప్రయోగపూర్వకంగా సైంటిస్టుల చేత పరీక్షింప చెయ్యడానికి ఒప్పుకోవడం చూస్తే అసలు ఆ పిరమిడ్ అనే దాని మీద గోగినేని బాబుగారు పరిశోదనా సహిత అదారాలు లేకుండానే వ్యతిరేకిస్తునారని అర్థమయింది. ఎంతవరకు, పిరమిడ్ వాదిని, తాను అనుభవ పూర్వకంగా చెపుతున్నాను అని చెప్పినా,మీకు ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారే కాని వారు ఏ పరిశొదనా సారాంశం ఆదారంగా వ్యతిరేకిస్తున్నారో చెప్పలేదు. అలా వాదించడం సైన్స్ వాదులకు సరి కాదని చెప్పడమే నా ఉద్దేశ్యం. నాది పిరమిడ్ శక్తి గురించి తెలుసుకోవాలన్నదే తాపత్రయమ్ తప్పా, పిరమిడ్ గురువు గురించి కాదు. అయినా పిరమిడ్ వాది నిజాయితీని గోగినేని బాబు గారు సహితంశంకించలేదు. పిరమీడ్ మిద ప్రయోగానికి ఇరువురూ అంగీకరించారు .ఇక మహా న్యూస్ చానల్ వారు చొరవ తీసుకుంటె నిజానిజాలు తెలియవచ్చు.

   Delete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!