స్త్రీలందు "పుణ్య స్త్రీలు" వేరయా!
  ఈ వాక్యం వేమన గారి పద్యానికి రివర్సులో ఉంది. ఆయన పురుషులు గురించి చెపితే నేను స్త్రీలకు కూడ ఇది వర్తిస్తుంది అనే ఉద్దేశ్యంతో చెప్పడం జరుగుతుంది. నాలో ఈ బావన కలగడానికి కారణం, ఇప్పుడే ఒక టి.వి. చానల్ వారు పేరున్న ఒక సినిమా కమ్ బుల్లి తెర నటి బాగోతాన్ని గురించి ప్రసారం చేసిన  కార్యక్రమం చూడటం.

  అందులో ఆ చానల్ లేడి రీపోర్టర్ చాక చక్యంగా జరిపిన "డర్టీ పిక్చర్స్" ఆపరేషన్ చాల వరకు స్త్రీలు ఎ విదంగా రంగుల జీవితాన్ని పొందటానికి నైతికంగా దిగజారడానికి సిద్దపడుతున్నారో తేట తెల్లం చేస్తుంది. తను స్వయంగా నటి అయి ఉండి, చెప్పిన ఆమె అనుబవాలు అబద్దమని అనుకోలేము. అమే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పేరున్న వాల్లు నైతికంగా దిగజారాకే పాపులర్ అయ్యారని నర్మ గర్బంగా చెప్పుకొచ్చింది. ఆ ఆపరేషన్ లాస్ట్ లో  చిన్న పొరపాటు వల్ల కొంతమంది బడాబాబులు తప్పించుకున్నారు కాని లేకపోతే వారు కూడ బుక్ అయ్యేవారే. కాని అమే నోటితో చెప్పిన చాల మంది సినీ పెద్దల పేరులు టి.వీ. వారు ఎందుకు ఎడిట్ చేశారో తెలియదు కాని వెల్లడిస్తే బాగుండేది.

  మనకు పురాణాలలో దేవ వేశ్యలు అయినా రంభ, ఊర్వశి, మేనక, తిలోతమ ఇలా ఉండే వారు. వారు దేవతలు కాబట్టి, మానవ జాతిలో ఉన్న కట్టుబాట్లు వీరికి ఉండేవి కావు. వీరిని దేవతల రాజు ఇంద్రుడు దైవ శక్తులు కోసం ప్రయత్నించే మునుల తపస్సులు చెడగొడతానికి పంపే వారు. ఎంతవారలైనా కాంత దాసులే అని ఆ ఒక్క విషయం లో ఉన్న బలహీనత రుషులను సైతం భ్రమలో పడేసేది. వారి మాయలో పడి తమ శక్తుల్ని వ్రుదా చేసుకునే వారు. అంత శక్తి ఆ దేవ వేశ్యలకు ఉండేది.

  ఈ కాలం లో అటువంటి దేవ స్త్రీలు లేకపోవచ్చు.కాని వారి స్తానాన్ని, ఈ సినిమా స్టార్లు ఆక్రమించారా అని అనిపిస్తుంది.  ఈ రొజు ఆ నటి చెప్పిన దానిని బట్టి చూస్తే వీరికి నైతిక విలువలు గురించి పెద్ద పట్టింపులు లేవనిపిస్తుంది. నాటి ఇంద్రుడు వారిని ఉపయోగించినట్టే నేటి రాజకీయ నాయకులు వీరిని తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. మన జనంకూడ వీరినే ఆదర్శంగా తీసుకుని వారి వెనుక నడుస్తున్నారు. ఇండస్ట్రీలో అలా అందరూ ఉండక పొవచ్చు. నీతి నియమాలు కలిగిన వారు ఉండొచ్చు. కాని అలా ఉంటే పాపులర్ కావడ కష్టం అని స్వయంగా సినిమా నటే అన్న తర్వాత,రెండో ఆలోచనకు తావు ఎక్కడిది? సరే ఎవరి జీవితం వారిది. కాని వీరే తిరిగి ప్రజా జివితాలోకి వచ్చి సుద్దులు చెపుతూ, స్తిలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని దర్మ పన్నాలు వల్లిస్తుంటే, నొరెళ్ల బెట్టడం మినహా ప్రజలు చేయగలిగింది ఏముంది.
   స్త్రీలను సెక్స్ కు ఉపయోగపడే  ఆటబొమ్మగా  మార్చడం లో కొంతమంది పురుషుల పాత్ర ఎంత ఉందో, స్త్రీల పాత్ర అంతే ఉందన్నది నగ్న సత్యం. కాబట్టి వీరిని స్త్రీ జాతికి  శత్రువులుగానె పరిగణించాలి. స్తిలు అనేది బాదిత జాతి, పురుషులు అనబడే వారు హింసించే జాతి అనే తప్పుడు  వేర్పాటు దోరణి వల్ల ఈ స్త్రీలు చెస్తున్న అనైతిక చర్యలు మరుగున పడి పోతున్నాయి. కాబట్టి పురుషులందు పుణ్య పురుషులు వేరు ఎలాగో స్త్రీల యందు పుణ్య స్త్రీలు వేరు అని గ్రహిస్తే మంచిది.వీరి అనైతిక చర్యలను స్త్రీలే ఆడ్దుకుంటె, సమాజంలో స్త్రీలు అంటే ఉన్న చులకన బావాన్ని కోంతవరకు తగ్గించ వచ్చు.       

Comments

  1. //స్త్రీలందు "పుణ్య స్త్రీలు" వేరయా! //
    స్త్రీలందు పణ్య స్త్రీలూ వేరయా...

    పూర్ణప్రజ్ఞాభారతి
    pragnabharathy.blogpsot.in

    ReplyDelete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )