తిట్టిందేమో హిందూ మతాన్ని, తేల్చుకునేదేమో ఎన్నికల్లోనట!
అనుకున్నంతా చేస్తున్నారు మజ్లిస్ పార్టి వారు. హిందూ మత విశ్వాశాలను ఎంతగా అవమానించాలో అంతగా అవమానించారు. పావు గంట సేపు పోలిసులు కళ్ళు మూసుకుంటే, హిందువు అన్నవాడిని లేకుండా చేస్తాం అన్నారు.అన్నోడు లండన్ వెళ్ళాడు కాబట్టి రెండు రోజులు చూస్తాం, తేడా వస్తే ఇంటర్ పోల్ సహాయం తీసుకుని అయినా అరెస్ట్ చేస్తాం అన్నారు పోలిస్ పెద్ద దొరగారు. ఆయన గారు వచ్చి విచారణకు హాజరు అవుతానని పోలిసులుకు సమాచారం ఇచ్చాడట. లండన్ నుంచి వస్తున్నాడని ఆ వీరాది వీరుడికి స్వాగతం పలికారు ఆయన పార్టీ వారు. రానూ వచ్చాడు, ఇంటికి వెళ్ళి నాలుగు రోజులాగివస్తా పో అని పోలిసులకు చెప్పాడట!
ఇక ఆయన పార్టీ పెద్ద ఒకటే సవాలు బి.జె.పి.కి విసిరాడు. మిమ్మల్ని అవమానించిన విషయం గురించి తేల్చుకోవాలంటే దమ్ముంటే ఎన్నికల్లో తమతో పోటి చేసి గెలవాలని. అవమానించిందేమో హిందూ మతాన్ని, తేల్చుకోమనేదేమో రాజకీయ పార్టీని. అసలు దీని బావమేమిటి? మీకేమైనా అర్థ మైందా?
ఇటు వంటిదే ఒక రాజకీయ పార్టీ ఈ మద్య రాష్ట్రం లో సవాల్ చేసింది. వాల్ల నాయకున్ని నేర విచారణ నిమిత్తం కోర్టులు రిమాండ్ చేస్తే, కోటి సంతాకాలు ప్రజల నుంచి సేకరించి ఆయన నేరం చెయ్యలేదని ప్రజలు తీర్పు ఇచ్చరు అని నమ్మాలంటున్నారు. చూడబోతే వీరి మద్య ఏదో మతలబ్ ఉందనిపిస్తుంది. లేకుంటే నేరాలు చెయ్యడమేమిటి, వాటి నిరూపణ ప్రజల్లో తేల్చుకుందామనడమేమిటి? దీని ద్వారా , వారికి ఈ ప్రజలు మీద ఎంత నమ్మక్క ముందో అర్థ మవుతుంది.మన స్పందన కూడ వారు అనుకున్నట్లే ఉందనడం లో ఏ మాత్రం సందేహం లేదు.
మరింత సమాచారం కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండి http://ssmanavu.blogspot.in/2013/01/blog-post_4.html
Comments
Post a Comment