"తొక్కినోళ్లు బాగున్నారు! తొక్కించ్కున్న వాళ్లు బాగున్నారు. మద్యలో వారికి పుట్టింది మాయ రోగం"అట!
ఈ సామెత నేను పెట్టిన ఒక టపాకు స్పందిస్తూ వచ్చిన కామెంట్.(నేను కొంచం మార్పు చేసాను). ఈ సామెత వెనకున్న స్టోరీ తెలిసికోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యాల్సిందే!http://ssmanavu.blogspot.in/2013/01/blog-post.html
ఏదైనా మనకి నచ్చితే అంతా బాగున్నట్లే అన్న చందాన మన తెలుగు టీవీలు, జన విజ్ఞానాలు, సైన్సు పెద్దలు ఉన్నారు. ఈ బాబా గోలేమిటో నాకు తెలియదు కానీ, ఇంతకన్నా ఉదయాన్నే టీవీలో వచ్చే స్వాస్థత సభల గురించి ఎవరూ ఎందుకు నోరు మెదపరు? మొఖాన చెయ్య పెట్టి తొయ్యగానే[ఆడ, మొగ తేడాలేదు]వారు మూర్చ వచ్చినట్లుగా పడిపోవటం జరుగుతుంది. క్రింద కూర్చొని చూస్తున్న వారు తెగ కన్నీళ్ళు పెట్టుకొని మానసికంగా లోపం ఉన్న వారుగా తయారవుతున్నారు. ఈ విధంగా మానసిక లోపాన్ని బొధిస్తున్న, రక్షణ పేరుతో భయాన్ని ప్రచారం చేస్తున్న వారి మీద ఇప్పటి వరకూ ఒక్కరు కూడా కన్నెత్తి అయినా చూడ లేదు. జన విజ్ఞాన వేదిక వారు కానీ, సైన్సు ప్రముఖులు కానీ ఒక్క సారైనా అక్కడికి పోయి ఇది తప్పని చెప్పే పని చెయ్యలేదు. టివీల్లో హిందువుల పండగలప్పుడు చెసే పచాయితీలు వీరి విషయంలో కనపడదు. వీరు కేవలం హిందువులని మాత్రమే ఉద్దరించటానికి కంకణం కట్టుకొన్నారా? మిగిలినవారిని ఉద్దరించేవారు లేరా? ఆంతర్యమేమిటో? మూర్ఖత్వంలో కూడా సామరస్యమా? లేక సామరస్యంలో మూర్ఖత్వమా?
ReplyDelete