సిగ్గులేని పెండ్లి కూతురు చిందేస్తూ వచ్చ్చిందట !!




 బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

కళ్యాణ శోభ కనగానే కనులార తనివితీరేనే ఓ..
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే



ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే..ఓ..
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే



అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు చెరిగేనే ఓ..
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే



మనసైన వాడు వరుడు నీ మదినేలు వాడె ఘనుడు
వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఊ –ళ ళ ళ –హాయి.......
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

  సాంప్రదాయపు  వివాహ పద్దతిలో పెండ్లికూతురు కళ్యాణ మండపం కి తరలివచ్చే విధానం ని పై పాటలో రచయిత శ్రీ అనిసెట్టి సుబ్బారావు గారు చక్కగా చెప్పారు. ఇప్పటికి తెలుగునాట జరిగే సాంప్రదాయ పెండ్లిళ్లలో అమ్మాయి కళ్యాణ మండపం కి బంధువులు ,స్నేహితురాళ్ళు  వెంటరాగా , కొంత సిగ్గును ఒలకబోస్తూ , వస్తూ ఉండే దృశ్యాలే కనిపిస్తున్నాయి . 

          కానీ సాంప్రాదాయం అంటే ఒళ్ళు మండిపోయి , "నాన్సెన్స్ , వెనుకటి అమ్మమ్మ పద్ధతుల్లో సిగ్గుపడుతూ కళ్యాణ మండపం వద్దకు పెండ్లి కూతురు రావడమేమిటి ? ఇది మై చాయిస్ యుగం . కాబట్టి పెండ్లికూతురు సిగ్గు పడే సమస్యే లేదు . పడితే గిడితే పెండ్లికొడుకు సిగ్గు పడాలా ! పెండ్లికి వచ్చినోళ్ళు సిగ్గుపడాలా ! అంతే  కానీ ఎట్టి పరిస్తుతుల్లో  పెండ్లికూతురు సిగ్గుపడే సమస్యే లేదు అని భావించిన ఒక అమ్మాయి తన డాన్స్ మాస్టర్ డైరెక్షన్ ఇస్తూ తనతో స్టెప్పులేస్తూ , మరియు వేయిస్తూ ఉండగా , డాన్స్ ట్రూప్ తో ఎలా కళ్యాణ మండపం లోకి అడుగు పెట్టిందో చూడండి . నిజంగా ఇది చూసిన వారు సిగ్గుపడ్డారో లేదో కానీ పెండ్లి కొడుకు మాత్రం సిగ్గుపడి ఉంటాడు , డాన్స్ బృందం తో చిందేస్తూ వస్తున్న పెండ్లికూతురిని చూసి. ఇక సదరు పెండ్లికూతురు గారు "ఏస్కో నా రాజా ఏస్కో " అనే  పద్దతిలో వివాహ వేదికకు తరలి వచ్చేటప్పుడు ప్రదర్శించిన వివిధ డాన్స్ భంగిమలు ఎలా ఉన్నాయో చూసి ఆనందించండి . 


                                                               
అదిరింది ఎంట్రన్స్ !

నన్ను చూడు ! నా చిందులు చూడు!

పెండ్లికి సిగ్గుపడటం ఏమిటి నాన్సెన్స్!

ఏస్కో నా రాజా ఏస్కో 

డాన్స్ మాస్టర్ తో చిందేస్తూ వస్తున్న చిన్నది . 


డాన్స్ మాస్టర్ తోడు రాగా !



చిందేస్తూ వస్తున్న వధువుని చూస్తూ బిక్కు బిక్కు మంటూ కూర్చున్న పెండ్లికొడుకు!. 

    ఇలా ఫొటోలు చూస్తే సరిపోవడం లేదు అనుకునే వారు క్రింది  వీడియోలో పెండ్లికూతురి గారి చిందులు చూసి ఆనందించవచ్చు. వీడియో సరిగా కనిపించకపోతే క్రిమ్ద లింక్ ఇవ్వబడింది . దానిని క్లిక్ చేసి చూడవచ్చు. 

                          

                 Source:https://youtu.be/f0JVeKGZ4Bg

Comments

  1. టీవీ షోల ప్రభావం. "ఎంట్రీ" "డిఫరెంట్" గా కనిపించాలనే ఉబలాటం. 🙂

    ReplyDelete
    Replies
    1. ఎంట్రీ డిపరెంట్ గా ఉందాలని ఎగురుకుంటూ వచ్చింది సర్తే ! రేపు కాపురం కూడా డిపరెంట్ గా ఉండాలనే ఆలోచన వస్తే ఏమి చేస్తుందో!!Thank you for your response Vinnakota garu.

      Delete
  2. I watch the youtube link and observed that all the visitors of the marriage function also enjoying but no objection from any where. We can not blame her alone but the society should be responsible for the above.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన