"బాడీ కెమిస్ట్రీ " కి బలి అయిపోయిన 9 వతరగతి ప్రేయసి,10వతరగతి ప్రియుడు !!

                                                                         


            తోటలు పెంచే రైతు చేసే తెలివిగల పని ఏమిటో తెలుసా? సరి అయిన సమయం లో కాకుండా ముందే తోట లో చెట్లు కాపుకు వస్తే వెంటనే వాటి పూత విరిచేసి కాపు కాయకుండా జాగర్త పడతాడు. ఆ చెట్లుకు  నిర్ణీత సమయం  తర్వాత వచ్చే కాపును మాత్రం బద్రంగా చూసుకుంటూ తన ఫల సాయాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అలా కాకుండా ప్రక్రుతి ధర్మమే కదా అని రెండేళ్ళ చెట్టుకే కాపు కాయనిస్తే వచ్చేవి  కుక్కమూతి పిందెలే. ఇదే సూత్రం మానసికంగా పరిణతి చెందకుండా కేవలం వయస్సు తెచ్చే వ్యామోహం లో పడి జీవితాలు నాశనం చేసుకునే అమ్మాయిలు , అబ్బాయిలకు వర్తిస్తుంది.
             
       తెలివిగల తల్లి తల్లితండ్రులు తమ బిడ్డలు కు యవ్వనపు చాయలు పొడసూపుతున్నప్పుడే చాలా జాగర్తగా ఉండాలి. అమ్మాయిలూ , అబ్బాయిలు కలిసి తిరగడం కామనేలే , వారి స్నేహాలకు అడ్డుకట్ట వేయడమంటే చాందస వాదాన్ని ప్రొస్తాహించినట్లే అని బావింఛి , మొదట్లో ఉదాసీనంగా  ఉండే తల్లి తండ్రులు , చివరకు తమ పిల్లల బవిష్యత్ నాశనానికి తామే కారకులవుతారు అని తెలిపే ఉదంతం మొన్న 14 వ తారీఖున ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా లో జరిగింది. వివరాలు లోకి వెళితే

                  కొత్వాలి సదర్ ఏరియా కి చెందిన సోను మహ్మద్ , షీలా కుమారి 10 వ తరగతి, 9 వ తరగతి చదువుతున్న విద్యార్దిని విద్యార్దులు. వీరికి  వంటబట్టిన చదువు కంటే ఒంట్లో పుట్టిన ప్రేమ వేడి బలవత్తరమైనది. అందుకే వీరి బాడి కెమిస్త్రీ  వీరిద్దరిని దగ్గరగా చేర్చీంది . దీనికి అందరూ అనుకున్నట్లే వారు కూడా తమ మద్య అంకురించింది ప్రేమే అనుకుని అటూ ఊహా లోకంలో ఇటూ వాస్తవ లోకంలో విహరించ సాగారు. ఈ  విషయం వారి పెద్దలకు తెలిసి వారి మద్య సాగుతున్న ప్రేమాయణం కి నో అని చెప్పారు. అయితే పెద్దలు నో చెప్పింది , పిల్లల కెరీర్ ని దృష్టిలోపెట్టుకుని కాక , వారి వారి మతాలను ద్రుష్టిలో పెట్టుకుని" నో " అన్నారట!
                                                                                       
                             అయినా వారు మాట వినక పోయే సరికి , చివరకు అమ్మాయిని ఆగ్రాలోని కుబేర్ పూర్ కి చెందిన తమ మతస్తుడికే ఇచ్చి బలవంతంగా పెండ్లి చేసారట. అది  మే 9 న జరిగింది . 13 వ తారీఖున అమ్మాయి అత్త గారి ఇంటి నుండి పుట్టింటికి వచ్చింది. ఆ సాయంత్రం ఆమె చాలా ఆనందంగా కనిపించింది అట. కాని అలా ఆనందంగా కనిపించిన అమ్మాయి గది నుండి తెల్లవారు జాము 4. 30 గంటలకు పొగలు , మంటలు కనిపించే సరికి కుటుంబ సబ్యులు ఆందోళనతో ఆమే గది వద్దకు పరిగెత్తి చూడగా అప్పట్కే కాలిన స్తితిలో రూం లో పడి ఉన్న సోను , షీలా ల  మృత దేహాలు పెనవేసుకుని కనిపించాయి అట. 
                                                                                 


                       ఆ తర్వాత గంటకు వచ్చిన పోలిసులు రూమ్ గోడలు బద్దలు చేసి వారి శవాలను పోస్ట్ మారటం కి పంపించారు. అసలు వారివురు ఎలా కాలి చనిపోయారో తెలియకున్న్నా, ప్రాదమిక సాక్ష్యాలు అట్టి అది ఆత్మహత్యగా బావిస్తున్నారు పోలిసులు. ఐ విషంలో కేసు పెట్టడానికి ఇరువైపులా పెద్దలు ముందుకు రానప్పటికీ , సుమోటోగా కేసు నమోదు చేసిన పోలిసులు విచారణ సాగిస్తున్నారట. ఈ పిల్లల విషాదానికి  ప్రేమ అనో , మతం అనో అనే బదులు సకాలం లో   పెద్దలు సరి అయిన చర్యలు తీసుకోకపోవడం వలననే వారి మద్య ఏర్పడిన మోహం ముదిరి , చివరకు వారిని ఇలా బలి తీసుకుంది అని చెప్పవచ్చు. 

       ప్రేమ అనేది సర్వ వ్యాప్తమైనది. అంది అందరిలో ఉంటుంది . అనేక రూపాలలో ఉంటుంది .అన్నదమ్ముల మద్య , అక్క చెల్లెళ్ళు మద్య, తల్లి కొడుకుల మద్య, తండ్రి కూతుళ్ళ మద్య ఉండేది మాత్రమే కాదు ఒక కుక్క దానిని ఎంతో అపురూపంగా చూసుకునే వారి మద్య ఉండేది కూడా సాక్షాత్తు ప్రేమే .  కాని యౌవనం అంకురిస్తున్న స్త్రీ పురుషుల విషయం లో మాత్రం ప్రేమ కంటే ముందు మోహం పుడుతుంది . దానినే ప్రేమ అని బ్రమిస్తుంటారు పిల్లలు. దీనికి కారణం ప్రక్రుతి చేసే మాయ. ప్రక్రుతి తన ధర్మానుసారం జీవొత్పాత్తిని  ప్రోత్సాహిస్తుంది. అందుకే కొఉమారపు చాయలు మొదలు అయినప్పుడే ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ కలుగుతుంది. దానినే బాడీ కెమిస్ట్రి అనవచ్చు. అలా దగ్గరు అయిన వారు కొంత కాలం గడచే సరికి అంటే ప్రక్రుతి కోరుకున్న పని అయ్యాక , వారిని మోహం విడచి వేయడం వలన వాస్తవం లోకి వస్తారు. అలా మోహం విడిచే సమయానికి వారి మద్య ఏర్పడిన సాంగత్యం వారిని మరొక బందం లో బిగించగలిగితే వారి బందం శాశ్వత మవుతుంది. అలా ఏర్పడే మలి బందమే  నిజమైన ప్రేమ . అటువంటి ప్రేమ బందం ఏర్పడని వారు "దీనెలా వదిలించుకోవడమా ? అని ప్రియుడు అనుకోవడం , వీడి చేతిలో చిక్కి నాశనమ్ అయ్యానే "అని ప్రియురాలు అనుకోవడం చివరకు బండ బూతులు తిట్టుకుని ఎవరి దారి వారు చూసుకోవడం జరుగుతుంది. ఈ  లోపు వారికి ఏమన్నాసంతానం కలిగితే వారూ రోగాలు రొష్టులతో న, బలహీనంగా పుట్టి అటూ ఆరోగ్య పరంగా  , ఇటూ సమాజ పరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

    కాబట్టి వీటన్నీంటిని ద్రుష్టిలో ఉంచుకునే     భారతీయ చ్జట్టాలు స్త్రీలకు 18 యేండ్లు, పురుషులకు 21 సంవత్సరం కనీస వివాహ వయసుగా నిర్ణయించాయి. కాని ఒక అద్యయనం ప్రకారం అన్నీ సరిగా ఉన్న వ్యక్తులు  మానసికంగా  పరిపక్వత చెందే వయస్సు 25 యేండ్లు గా నిర్నయించారు. అందుకే ఈ మద్య చాలా మందిని చూస్తున్నాం. వారి 18 యేండ్లు  దాటినా వారి ప్రవర్తన చిన్నపిల్ల చేష్టలు లాగే ఉంటున్నాయి. కాబట్టి మన చట్టాలకు  కూడా సవరణలు చేసి వ్యక్తుల కనీస వివాహ వయస్సు 25 యేండ్లు చేయాలి . ఒక వేల 18యేండ్లు , 21 యేండ్లకే పెండ్లిళ్ళు చేసుకోవాలి అనుకుంటే అందుకు తల్లి తండ్రులు అనుమతి కాని, ప్యామిలీ కోర్టుల అనుమతి కాని తీసుకుని  పెండ్లిళ్ళు చేసుకోవాలి .దీని వలన వారి నిర్ణయాలు సరి అయినవా  లేక  వయసు వేడిలో తీసుకున్నవా ? అనేది పరిసిలించడానికి పెద్దలకు అవకాశం ఉంటుంది.  ఇదే విషయం పై నేను ఇంతకు ముందు  ప్రచురించిన టపాలను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. 

    కాట్టి తల్లి తండ్రుల్లారా! పిల్లలు పిన్న వయసులోనే ప్రేమలో పడ్డారు అని, అది ఎంతో అప్రతిష్ట అయిన పని అని బావించే బదులు ప్రక్రుతి ప్రేరెపితమైన బాడీ కెమిస్ట్రీ వికారాలకి కి మీ పిల్లలు గురి అయ్యారు అని బావించటం  సరి అయిన పని. మొదట్లోనే దాని మీరు గ్రహిస్తే "కౌన్ స్లింగ్ " లు లాంటి  ప్రక్రియలు ద్వారా వారిని ఆ ఉత్పాతం నుండి కాపాడుకోవచ్చు. లేకుంటే వారిని పరిసరాలకు దూరంగా పంపించి  వేయడం లాంటి చర్యలు చేపట్టి తిరిగి వారిని వారి కెరీర్ డెవలప్మెంట్ కోసం ఆలోచించేలా చేయాలి. అంతే కాని తమ మతం కాదనో, కులం కాదనో కారణం తో తిరస్కరించిన వారే , తిరిగి వారికి తమ బందువులు తోనె పిన్న వయసులోనే పెండ్లి చేసినా  అది అనర్ద దాయకమే అవుతుంది. తెలివి కల తల్లి తండ్రులు ఎప్పుడు , పైన నేను చెప్పిన రైతు లాగే ఆలోచించాలి . పిల్లల కెరీర్ కాంక్షిస్తూ ,పెద్దల ప్రేమ తో కూడిన జాగ్రత్తలే పిన్నలకు ఎల్లప్పుడూ శ్రీ రామ రక్ష .
Source: http://timesofindia.indiatimes.com/city/agra/Hindu-Muslim-teen-couple-burn-themselves-to-death-cops-find-bodies-in-tight-embrace/articleshow/52268981.cms


Comments



  1. పరిచయము మారె ప్రణయపు
    గరిమయు పెరిగెను జిలేబి కాలము మారెన్ !
    విరివిగ తిరిగిరి మనసులు
    విరిగెను తనువులు వదిలిరి వీడెను లోకం !

    ReplyDelete
    Replies
    1. Thanks Zilebi Garu for your Supportive response.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన