"విగ్రహం" లో ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకోలేని వారు జ్ఞానులా ?


                                                                         
Maha Garuda Statue at Sri Lakshmi Narasimha Swamy Temple , Garlavoddu


ఈ  మద్య కొందరు పని కట్టుకుని హిందూ జీవన విదానం లోని  "విగ్రహారాదన" మీద విగ్రహారాదకుల  తమ ఆగ్రహం వెళ్ళగ్రక్కుతున్నారు. ప్రపంచంలోని  ఎడారిలో పుట్టిన ఎడారి మతాలూ , వారి ఆరాధన పద్దతులు మీద మక్కువ కలిగిన కొందరు , పచ్చని బారత భూమిలో ఉద్బవించిన మతాలు--శైవం, వైష్ణవం , శాక్తేయం, సాయిబాబీయమ్,శాక్తేయం--  కు సంబందించిన  ఆరాధన పద్దతులను తప్పు పడుతూ , విగ్రహారాదన అనేది జ్ఞానులు బగవంతుని గురించి తెలుసుకోవడానికి ఏ మాత్రం ఉపయోగ పడదని, భగవంతుని గురించి తెలుసుకోవాలంటే జ్ఞానమార్గమైన "ఉపాసన మార్గం "ఒక్కటే కరెక్టు అని నొక్కి నొక్కి వక్కాణిస్తున్నారు. దీనికి వారు బోల్డన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అవ్వన్నీ సహేతుకమైనవే అని అనిపిస్తుండడం వలన,  కొంత మంది ఆ ప్రబోదకుల మాయలో పడి డోలాయమాన స్తితిలో ఉన్నారు. మరి వారు చెప్పేది అలా ఉంది. శ్రీకృష్ణ భగవానుడు విగ్రహారాదనకు వ్యతిరేకమని, అయన చెప్పబట్టే ఎడారి మతాల్లో విగ్రహారాదన లేకుండా పోయిందని , అందుకే అయన విశ్వ గురువు అయ్యాడు అని, విగ్రహరాదనను అయన సమర్దించి ఉంటె కేవలం "భరత గురువు " మాత్రమే అవుతాడని గడుసు వాదనలు చెయ్యటం మొదలు పెట్టారు .

        అసలు ఈ ఎడారి మతస్తులకు శ్రీ కృష్ణ బగవానుడికి  విశ్వ గురువు ముద్ర వేసి , అయన విగ్రఃఅరాదనను ఖండించారు అని ,దానినే తమ మతస్తులు పాలో అవుతున్నారని,అసలు వేదాల్లో చెప్పింది తమ ప్రవక్త గురించే అని తెగ ఊదరగొడుతూ , మోకాలికి బట్టతలకు ముడి వేసే ప్రయత్నాలు ఎందుకు  చేస్తున్నారు ?. తాము అనుసరిస్తుంది  వేద మతం లో చెప్పినదే   కాబట్టి ఇండియాలోని హిందువులంతా తమ పద్ధతినే అనుసరించమని పదే పదే చెబుతుండడం వెనుకాల  ఏదైనా మతలబ్ ఉందా అని ఆలోచిస్తే  రోజు ఈనాడు పేపర్లో రాసిన ఒక విషయం నన్ను ఆకర్షించింది. సదరు విషయానికి , ఈ  బ్లాగ్ ప్రవక్తల రీపిటడ్ ప్రచారాలకు  సంబందం ఉన్నట్లే కనిపిస్తుంది. అదేమిటో మీరు క్రింది చిత్రం లో చూడండి.

                                                                 



                        పై సమాచరం ప్రకారం 2020 నాటికి భారత దేశం లో కూడా  ఖలీఫా రాజ్య స్తాపనే  ఎడారి మతస్తుల పరమోద్దేశ్యం . కేవలం 5 సంవత్సరాలలో కోట్లాది మంది ప్రజలను తమ మతానికి అనుగుణంగా మార్చాలి అంటె , భారత దేశం లోని మెజార్తీ మతస్తుల మనోబావాలను డైరెక్టుగా గాయపరచే చర్యలు మానుకోవాలి అని వారు బావించి ఉండవచ్చు. . హిందువుల  దేవుళ్ళను మెచ్చుకూంటూ , వారి ఆరాధన పద్దతులను నిరసిస్తూ . ఇవ్వన్ని స్వార్ధపరులైన కొంతమంది హిందూ పండితుల కుట్ర అని ప్రచారం చేసి యువతను తమ ఆరాధనా పద్దతుల పట్ల ఆకర్షితులు అయ్యేలా చేస్తే, ఆ తర్వాత వారిని పూర్తిగా తమ ప్రబావానికి గురి చేయవచ్చు. హిందూ మతాలకు . ఎడారి మతానికి ముఖ్య బేదం విగ్రహరాదన . ఎడారి మతస్తులు  దేనినైనా ఒప్పుకుంటారు కాని , విగ్రహారాదన ఒప్పుకోరు. విగ్రహారాదన ఉన్నంత కాలం హిందు దేశం లో తమ పప్పులు ఉడకవు. కాబట్టే విగ్రఃహారాదనను అజ్ఞాన పూజా పద్దతిగా ముద్ర వేసి ,యువతను దాని   నుండి దూరం చేస్తే , తమ రాజ్య స్తాపన సులువు అవుతుంది. ఇదే ఉద్దేశ్యం తో కొన్ని సంస్తలు చెసే ప్రచారం లో బాగమే "విగ్రహారాదన " పై విమర్శలు కావచ్చు. . 

       పై విషయం సంగతి కాసేపు అటు ఉంచి , అసలు మన దేశం లోని దైవ ఆరాధన పద్దతులు గురించి ఆలోచిద్దాం. హోందూ జీవన విదానం లో బగవంతుని దర్శించే మార్గాలులో భక్తీ మార్గం , జ్ఞాన మార్గం రేండూ ఉన్నాయి.భక్తీ మార్గం లో విగ్రహరాదన ఉంటె , జ్ఞాన మార్గం లో దాని అవసరం లేక పోవచ్చు. కాని  భగవత్ దర్సనం అనేది వ్యక్తీ గతం గా ఎవరికీ వారే తెలుసుకోవాలి తప్పా , ఎవరో కొంత మంది దర్శనం పొందినంత మాత్రానా , తతిమ్మా వారు పొందాల్సిన అవసరం లేదని మన రుషులు చెప్పలేదు. ఒక వేల ఎడారి మతస్తులు చెపుతున్నట్లు అజ్ఞాన దశ లోనే "విగ్రాహారదన " అవసరం అనుకుంటే బగవంతున్ని నిజ దర్సనం పొందే జ్ఞానుల  సంఖ్య ఎంత ? దాని గురించి  సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారే గీత లో సెలవు ఇచ్చారు . "వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానశక్తి  ప్రయత్నించును, అట్లు ప్రయత్నించిన వారిలో ఒకా నొకడు మాత్రమే నన్ను యదార్దముగా తెలుసుకోగలుగుతున్నాడు" . మరి అయన చెప్పిన దాని ప్రకారమే దైవం అంటే ఏమిటో నిజంగా తెలుసుకునే జ్ఞానుల  సంఖ్య బహు స్వల్పమ్. వారికి మాత్రమే విగ్రాహారదన అవసరం లేదు. మిగతా వారందరికి అవసరమే కదా! 

      విగ్రహారాదన చెయ్యకుండా , కేవలం మేమే జ్ణానులమని అపోహపడుతూ , రోజుకి 4,5 సార్లు వంగుని లేచినంత మాత్రానా వారికి నిజ దైవ దర్సనం కలుగుతుంది అనుకోవడం బ్రమే . విగ్రఃహారా దన అవసరమా ,వద్దా అనేది ఆరాదకుడు తన మానసిక స్తాయి ననుసరించి నిర్ణయించుకూంటాదు. దానికి వేరే మతస్తుల జ్యోక్యం అనవసరం. విగ్రాహరదనను వ్యతిరేకించడం అంటే హిందు మతాల ఆరాధనా పద్దతులను అవమాన పరచడమే . 

   హిందూ మతాల పద్దతులులో చాలా వరకు శాస్త్రీయ దోరణులు ఉన్న్నయి. అది సైన్స్ కి వ్యతిరేకం కాదు. శ్రీ కృష్ణుడి కాలం నాటికి , ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి . వాటికి అనుగుణంగా హిందూ జీవన విదానం లో మార్పులు సూచించడానికి మహాత్ములు పుడతారని , వారే అవతార పురుషులని ఈ  గడ్డ మీద పుట్టిన మతాల నమ్మకం. వేరే మతాల లాగా ఒక్కరి తో పుట్టి వారి తోనే అంతం కాదు హిందూ జీవన విదానం. శ్రీ కృష్ణుడు కాలం నాటికి తెలుసుకున్న  జ్ణానానుసారo  అయన ప్రబోదిస్తే , ఈ నాటి జ్ణానా నుసారం "కల్కి అవతారుడు  ప్రబోదించవచ్చు.దానికోసమే దశావతారాలు , 14 మంది మనువులు అని  చెప్పింది. వారే సరి చేస్తారు, కాలంతరం వలన  సమాజం లో కలిగే దోషాలను.  అంతే కాని ఎడారిలో పుట్టిన మతాలుకు సంబందించిన వారు, , అసలు భారత దేశం గురించి తెలియని వారు ప్రబోదింస్తే వాటిని పాలో కావాల్సిన దుర్గతి హిందువులకు లేదు కాక లేదు. 

                                 చివరగా ఒక్క విషయం చెపుతాను .   ప్రస్తుత యుగం సైంటిఫిక్ యుగం.  సైంటిఫిక్ దియరి  అనుసారం , విశ్వం మొత్తం అణువుల మయం అని ,   ప్రతి అణువు ఎలక్ట్రాన్ లు, ప్రోటాన్ లు , న్యూట్రాన్ లు  నిర్మితమని , కాబట్టి చెట్టులో గట్టులో , పుట్టలో , ఇది రాస్తున్న నాలో, చదువుతున్న మీలో అందరిలో , విశ్వం అంతటా వ్యాపించి ఉంది అణువులే కదా . దాని ప్రకారం విగ్రహం వేరు, దేవుడు వేరు ఎలా అవుతారు ? విగ్రహం లో ఏముందో విశ్వం అంతటా అదే ఉంది. ఆ జ్ఞానం తెలుసుకుంటే శుష్క వాదనలు చేయడం ఎందుకు? "ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్లు అవుతుందో" అదే బ్రహ్మ జ్ణానమ్. మన అందరిలో ఉన్నది ఒకటే అని చాల మందికి తెలుసు. కాని  వారు కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉండలేక పోతున్నారు అంటే కారణం , మాయ!! 

       అవును మాయే ! బ్రహ్మ జ్ఞానం తెలిసినంత మాత్రానా బ్రహ్మ జ్ణానిగా ఉండలేరు. ఎందుకంటె ఆ జ్ఞానాన్ని నిరంతరం మాయ కప్పేస్తూ ఉంటుంది. దాని వలననే నీవు వేరు, దేవుడు వేరు అనే బావన. తనలో ఉన్న దేవుడిని కనుగొనడానికి ఎక్కడికో యాత్రలకు వెళ్లి అక్కడి రాళ్ళను రాళ్ళతో కొట్టడం , ఇక్కడి కొచ్చి విగ్రహారాదన వేస్ట్ అనడం. నిజమైన బ్రహ్మ జ్ఞాని గా మిగలాలి అంటె  నిరంతరం ప్రకృతిని తన యందును , తనను ప్రకృతి యందును చూచుకుంటు , తన  ప్రక్రుతి  ధర్మం తానూ నెరవేర్చి చివరకు ప్రకృతిలో ఐక్యమై పోవడమే. 

       ఎవరి తోచిన పద్దతిలో వారు భగవంతున్ని ఆరాదించుకోడం లోనే నిజమైన అలౌకిక ఆనందం ఉంది . అటువంటి ఆనందానికి అరాదకులను దూరం చేసే  పనికి రాని  వాదనలు ప్రస్తుత తరుణం లో అనవసరం   విగ్రహం లో  ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకున్న నాడు వాదనలకు ఆస్కారం ఉండదు. 
                                         (Republished Post). 

Comments

  1. బ్రహ్మ జ్ఞానం తెలిసినంత మాత్రానా బ్రహ్మ జ్ణానిగా ఉండలేరనటం పొరపాటు. బ్రహ్మజ్ఞానం వస్తూ పోతూ ఉండే లౌకికస్థితి కాదు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని నిరంతరం మాయ కప్పేస్తూ ఉంటుందనటం అసందర్భం - అది మాయాతీతం కాబట్టి. బ్రహ్మజ్ఞానులు లోకసంగ్రహార్థం మనలోవారిలా మసలుతున్నా వారు ఉన్నతస్థితిలోనే ఉంటారు. బ్రహ్మజ్ఞానులు ప్రకృతిలో ఐక్యమై పోవడమేమీ ఉండదు ప్రకృతిని దాటిన స్థితి బ్రహ్మజ్ఞానం - వారికి ప్రకృతి వశవర్తిని. బ్రహ్మజ్ఞాని 'నిరంతరం ప్రకృతిని తన యందును , తనను ప్రకృతి యందును చూచుకుంటూ ఉండట ' మేమిటి? బ్రహ్మజ్ఞాని ఈశ్వరానుసంధానం కలిగి, ప్రకృతికి అతీతమైన స్థితిని కలిగి ఉంటాడు యధేఛ్చగా. మీరు వేదాంతపరిభాషను వాడుతున్నారు కాని ఆ పారిభాషికపదాలను శాస్త్రీయంగా తెలుసుకొని వాడితే మరింతగా బాగుంటుంది. ఇష్టానుసారం వాటిని వాడితే ఇలాంటి చాలా పొరపాట్లు, తలక్రిందులు భావాలూ వంటివి వెల్లువెత్తి గందరగోళానికి దారితీస్తాయి! తస్మాత్ జాగ్రత జాగ్రత.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన దానితో నేను ఏకీభవించలేక పోవటానికి కారణం మీరు అనుకుంటున్న లేక మీకు తెలిసిన బ్రహ్మ జ్ణానం అర్దం వేరు. నేను చెపుతున్న బ్రహ్మ జ్నానం అర్దం వేరు. నేనేమి గురుపరపంర వారసత్వమ్ కలిగిన మఠాదీశున్నో, లేక వారి శిష్యుడినో కాను. నేను ఇంతకు ముందే చెప్పినట్లు గుర్తు. నేను హిందువుని . లక్శ్మీ నరసింహా స్వామి తప్పా నాకు ఎవరూ గురువులు లేరు. కాబట్టి బ్రహ్మజ్ణానం గురించి ఏ గురువు ఏమి చెప్పాడో కూడా అద్యయనం చేయలేదు.

      నాకు తెలిసినంత వరకు బ్రహ్మ జ్ణానం అంటే ఒకటే. అందరిలో ఉన్నది ఒకటే అని, కాబట్టి అన్నింటిని తనయందును , తనను అన్నింటి యందును చుడగలిగిన వాడే బ్రహ్మ జ్నానిఅని మాత్రమే నాకు తెలుసు. అన్నింటిని అనేచోట ప్రక్రుతి అనె పదం వాడాను. అంతేకాని ప్రక్రుతికి ఉన్నా నానార్దాలు చూడలేదు. ఈ నాడు సైంటిస్టులకు చాలా మందికి ఈ విశ్వం అంతా ఎలెక్ట్రాన్ ప్రోటాన్ నూట్రన్ ల కలయిక మాత్రమే అని తెలుసు. అంటే ఒక రకంగా నేను చెప్పే దాని ప్రకారం వారు బ్రహ్మ ఝ్నానులే. కాని అదే సైంటిస్టులు రాగద్వేశాలకు అతీతంగా ఉండగలుగుతున్నారా? లేదు ఎందుకంటె వారిలో ఉన్న ఏకత్వ జ్ణానాన్ని ఏదో మాయ కప్పేస్తూ ఉండడమే. ఇదే అర్దం లో చెప్పాను తప్పా , మీరనుకునే బ్రహ్మజ్నానం ద్రుష్టిలో పెట్టుకుని కాదు. పై పేరాలో స్పష్టంగా చెప్పడం కూడాఅ జరిగింది.


      ఇక మీరు స్పందించిన తీరు చూస్తుంటె చిన్నప్పుడు ఎప్పుడో ఒక వారపత్రికలో చూసిన కార్టున్ గుర్తుకు వచ్చింది. "ఒక వ్యక్తి త్రోవన పోతుంటే ఒక దొంగ అడ్డగించి అతడి దగ్గర ఉన్న సొత్తు ఇమ్మని లేకుంటె చంపేస్తాను అని బెదిరించాడు అంట. దానితో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న చిన్న తుపాకితో దొంగను నిలువరిస్తూ పక్కకు తప్పుకోకపోతే కాల్చేస్తా అనే సరికి దొంగ బిత్తరపోయి చూస్తున్నాడు అంట. అంతలో అటుగా వచ్చిన వచ్చిన పోలిసు బెదిరిస్తున్న దొంగను అదుపులోకి తీసుకోవడం మానేసి, స్వీయ రక్షణ కోసం తుపాకిని ఉపయోగిస్తున్న వ్యక్తిని "తుపాకికి లైసెన్స్ ఉందా? లేకుంటె అరెస్ట్ చేస్తాను అన్నాడంట." అలా ఉంది మీరు నన్ను ప్రస్నిస్తున్న విదానం.

      పై కధలో వ్యక్తిని నేను, పోలిస్ మీరు . నేను నడిచే త్రోవ హిందూ జీవన విదానం. ఇక దొంగ ఎవరో మీరే ఉహించుకొండి . నాకు బ్రహ్మజ్ననం గురించి అంతగా తెలియకపోయినా , ఇంగిత జ్నానం గురించి తెలుసు కాబట్టి ఇంతకంటె ఎక్కువుగా బ్రహ్మజ్నానం గురించి ఇక్కడ చర్చించదలచుకోలేదు.

      Delete
    2. రకరకాల బ్రహ్మజ్ఞానాలుంటాయా?
      మీరు అవేశపడకండి.అన్ని శాస్త్రాలకూ, అవి భౌతిక విజ్ఞానశాస్త్రాలైనా, అథ్యాత్మికమైన వేదాంత మీమాంస తర్కాది శాస్త్రాలైనా అన్నింటికీ సుష్టువైన పరిభాషలు ఉంటాయి. కేవలం వినికిడి జ్ఞానంతో పారిభాషికపదాలను వాడుతూ పోతే గందరగోళం ఏర్పడుతుంది. అలాగే వేర్వేరు అర్థాలలో కావాలనో తెలియకనో వ్రాయటం వలన మరింతగా గందరగోళం పెరుగుతుంది. మీరు ఏకీభవించకపోతే వాదన ఏమీ లేదు. మీరు కోప్పడినంతమాత్రాన మీకు ఒరిగేదీ మరొకరికి తరిగేదీ ఏముంటుంది? నిదానించంది. పొరపాటును ఎత్తిచూపటం మీ దృష్టిలో పోలీసింగులాగా అనిపిస్తే ఇక పొగడ్తలు తప్ప మీరు ఏమీ ఆశించరని అనుకోవలసి వస్తుంది. పొగడటం కోసం వ్యాఖ్యలు వ్రాయవచ్చును - జనం మెప్పూ పొందవచ్చును కాని అట్టి పొగడికల వలన ఎవరికైనా ఉపయోగం ఉంటుందా?

      Delete
    3. పోలీస్ బాటసారి ఉదాహరణ యే మీకర్థం కాలేదంటే నా పోస్ట్ లో ఉన్న నా భావం మీకు అర్ధం కాలేదని నాకు అర్ధం అయిన విషయం.ఏదేమైనా మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete


  2. నిగ్రహము లేక బోయెను !
    విగ్రహ ఖండన జిలేబి విచ్చల విడిగా
    వ్యాఘ్రము వోలెన్ జేసెను!
    శీఘ్రము దీనికి జవాబు శివుడే యిచ్చున్ !

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన