అమాయక బాలల మీద బాంబులేసి చంపేది సాంప్రదాయ వాదమా?శాస్త్రీయా వాదమా?

                                                                                                                              
బాలల ఆదునిక పెంపకం గురించి తెగ గొప్పలు చెప్పే వ్యాపార సంస్క్రుతివారు,వారి వ్యాపార ప్రయోజనాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది బాలలను పొట్టన బెట్టుకున్నారో, లెక్కలు చూసుకుంటే తెలుస్తుంది. తమ స్వార్ద ప్రయోజనాలకోసం ఇతర దేసాల మీద దురాక్రమణలకు తెగబడుతూ, అక్కడి పిల్లలకు తిండి,వైద్య సహాయం అందకుండ చేసి లక్షలాది పిల్లల చావుకు కారణమయింది ఎవరు? సాంప్రాదాయక వాదులా? అదునికులమని విర్రవీగే ఈ వ్యాపారవాదులా?

 అటు ప్రక్రుతిని, ఇటు సకల జీవరాసి నాశనానికి కారణం మనిషి సాదించిన "శాస్త్ర విజ్ణాన పరిజ్ణానమే". సంపూర్ణ జ్ణానం  లేని మానవుడుకు ఏ సాంకేతిక జ్ణానం అబ్బినా అంతిమంగా అది సకల వినాశనానికే దారి తీస్తుంది. దీనికి ప్రస్తుత పరిస్తితులే ఉదాహరణ. స్వార్దం తప్ప పరమార్దం తెలియని "తెల్ల నీతి" ని చూసి, అదే గొప్ప విదానమంటు అనుకరించే వాళ్ళను చూస్తే జాలిపడక తప్పదు.నేను ఇంతకు మునుపు ఒక బ్లాగ్ మిత్రుడు ఈ వ్యాపార వాదుల పిల్లల"ఆదునిక పెంపకం" వెనుక ఉన్న అసలు రహస్యం గురించి తన బ్లాగులో చక్కని విశ్లేషణ చేయటం చూసాను

  అదేమిటంటే, ఒక పిల్లవాడు ఏడిస్తే గద్దించి ఊరుకోబెడితే వ్యాపారులకు తమ బొమ్మలు అమ్ముడు పోవట. అందుకే అలా గద్దించేవారిని శిక్షించి, వారిచేత "ఆదునిక పెంపకం" అవలంభింప చేస్తే వ్యాపారులకు లాభం. ఏలాగంటారా,ఒక పిల్లవాడు ఖరీదయిన బొమ్మ కొనమని పేచిపెడితే కిమ్మనకుండా ఆ బొమ్మను కొని వాడి చేతిలో పెడితే,రెండ్రోజులు దానితో ఆదుకుని మరొకటి కావాలంటాడు. లేదంటే వాడి వెనుక ఉన్న పోలిసులు, తల్లి తండ్రులను లోపల వేస్తారు.అందుకేనేమో ఇద్దరు పిల్లలు ఉంటే వారిద్దర్ని ఒకే మంచం మిద పడుకోబెట్ట కూడదంట! చెరి ఒక మంచం ఉండాల్శిందేనంటా! లేకపోతే మంచాలు అమ్ముకునే వాడు బ్రతికేదెట్టా.అంటే ఈ వ్యాపారవాదులు తమ బొమ్మలూ అమ్ముకోవడం కోసం అమ్మా నాన్న లని "జయిల్లో’ పెడతారు. ఇది, వీరి "శాస్త్రీయ పిల్లల పెంపకం" వెనుకున్న అసలు రహస్యం!

  మనం ఎక్కడున్నా,వారినే గొప్ప అనాలి. వారి పద్దతులే గ్రేట్ అనాలి. మన పిల్లలే కాదు దేశాలు కూడ కలిసి ఉండకూడదు ఉంటే వారి ఆయుదాలు అమ్ముడు  పోవు. అందుకే ఎల్లప్పుడు కయ్యాలకు కాలు దువ్వుతుండాలి.వీరి దగ్గర్ణుంచి ఆదునిక ఆయుదాలు కొనుగోలు చెయ్యాలి.ఈ "నీచ్ కమీన్ వాదాన్ని" అదునికత,శాస్త్రీయత అని పిచ్చి పొగడ్తలు పొగిడేవారు ఒక్క విషయం గుర్తుంచుకుంటే మంచిది.

  " చక్కగా అనుష్టింపబడిన "పరదర్మం"కన్నను, గుణం లేనిదయినా "స్వదర్మమే" మేలు. అట్టి దర్మా చరణమున మరణం సంభవించినా మేలే. పరదర్మం భయంకరమయినది. ఆచరణకు అనుచితమయినది"
         మరింత సమాచారం కొరకు లింక్ మీద  క్లిక్ చెయ్యండి                                                                               ( http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_5368.html)

Comments

  1. /అట్టి దర్మా చరణమున మరణం సంభవించినా మేలే./
    మరణం బదులు 18నెలలు జైలు సంభవిస్తే మరీ మేలే. :))

    ReplyDelete
    Replies
    1. పిల్లల్ని హింసించడం రాక్షసత్వం. తప్పుచెస్తే దండిచడం తండ్రి ప్రథమ విది. అది చెయ్యకపోతే కొడుకులు "కసబ్" లవుతారు. చివరకు పుత్ర శొకమే. ఇక పోతే వల్లభనేని చంద్రశేఖర్ "రాక్షసుడు" అని నేను బావించటం లేదు. కేవలం తండ్రిగా తన దర్మాని తాను నిర్వర్తించాడు. శిక్ష పడటం అతని దురద్రుష్టం. రోడు మీద వెలుతుంటే "పిచ్చి కుక్క" కరిస్తే ఏమి చేస్తాం.ఇది అంతే! "హింస’ కి "దండన"కి తేడా తెలియని పిచ్చివాళ్ళ చేతిలో ఆయన ఇరుక్కుపోయాడు. ఆ దంపతులకు ప్రగాడ సానుబూతి చూపటం మనుషులు చేసే పని. "వెక్కిరించడం" అనేది వారి జన్మ సంస్కారం బట్టి ఉంటుంది.

      Delete
    2. మీరు ధర్మయుద్ధం/కర్తవ్యం గురించి చెప్పిన భగవద్గీత వాక్యాలను, పిల్లలను దండించే విషయంలో వాడారు. వాడితిరి పో... "మరణమే మేలు" అనడం ఆ దంపతులపై "సానుభూతి" చూపడం కాదు, అక్కడి చట్టాలను ప్రాణాలను పణంగా పెట్టైనా వుల్లంఘించమని ప్రేరేపించేదిగా/"వెక్కిరింతగా" వుంది.

      ఒకే విషయం మీద సీరియల్ టపాలు వేస్తున్నారంటే, కొద్దిగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయేమో అనిపించ్స్తోంది. "ధీరులు మోహమునొందరు" అని కూడా గీతలో చెప్పబడిందిమరి! ;)

      చిన్ని కృష్ణుడి అల్లరిపనులు జగద్విదితం. యశోద సుతారంగా మందలించిందే కాని, గరిటె కాలేసి వాతలు పెట్టినట్టు, బెల్టుతో చావగొట్టినట్టు చెప్పబడలేదని కఠోర ఆశ్రమవాసులైన మీకు తెలిసిందే.
      ఖురాన్ చదవలేదని బ్రిటన్లో ఓ తల్లి పిల్లాణ్ణి పాతరేసిందట. తల్లిదండ్రులు ఓ పిల్లని వేశ్యావృత్తికి బలవంతం చేశారని పేపర్లో పడింది.
      చివరిగా చెప్పేదేమంటే...
      వలభనేనులకు శిక్ష అతిగావుంది, సానుభూతులు. అక్కడి చట్టాల 'తత్వం' బోధ పడివుంటుందనే ఆశిస్తాను. ఆ చట్టాలు అలా కఠినంగా ఎందుకున్నాయంటే, అక్కడి పిల్లలకు బయొలాజికల్ తల్లిదండ్రులు తక్కువగా వుంటారు. మూడవ తండ్రి, నాల్గవ తల్లి ఇలా.. :P. మీరు శాంతించి అర్థం చేసుకోవాలి.

      Delete
    3. మేము ఎక్కడా,"తల్లి తండ్రులను"పిల్లల్ని హింసించటం సరిఅయినదేనని చెప్పలేదు. మన కుటుంబ సమస్యలను విదేశి చట్టాల ద్వారా విచారించటం తప్పని మాత్రమె చెప్పాము. గితా ధర్మం యుద్దసమయంలో చెప్పినప్పటికి, అది సర్వదా,సర్వులకు,సర్వ విషయాలకు ఆచర్ణాత్మకం.లేకుంటే అది మీరనుకుంటున్నట్లు "యుద్దానికి" మాత్రమే సంబందించినది అయితే రోజు "గీతా పారాయణం" భక్తులు,గ్రుహస్తులు, చేయాల్సిన అవసరం లేదు.

      అంత దాక ఎందుకు మీరు చెప్పిన పరిస్టితులనే "గీతా దర్మానికి" అన్వయించవచ్చు."బయోలాజికల్" తల్లి,తండ్రులు "మన దర్మం"."యాక్ట్"(ఇంగ్), తల్లి తండ్రులు వారి దర్మం. వారికా చట్టం ఉండటం నూటికి నూరు పాళ్లు కరెక్ట్ కావచ్చు. కాని ఆ చట్టాని ఉపయోగించించి "సహజ సంరక్షణ"దారులను సిఖ్షించడం ఎంతవరకు సమంజసం.అది ఎంత చక్కని న్యాయం అయినా వారికి మాత్రమే,మనకు అది అన్యాయమే. ఇదే స్వదర్మం, పర దర్మాల మద్య తేడా. అది నీ ల్యాండ్ అయినా బాదితులు నీ వారు కాదు. అందుకే కుటుంబ"తప్పులు" ను స్వదేశి న్యాయస్తానాలే విచారించాలి. ఇది అంతర్జాతియ న్యాయం కావాలి. మన ప్రభుత్వం ఈ విషయ్యాన్ని అంతర్జాతియ వేదికల మీది ప్రస్తావించాలి. అందుకే మేము ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నది . మాది సర్వదా "దర్మాగ్రహమే".

      Delete
    4. దురదృష్టమో అదృష్టమో ఎక్కడ నేరం జరిగితే అక్కడి చట్టాలే వర్తిస్తాయి, చట్టం ఆయాదేశ సార్వభౌమత్వ పరిధిలోనే చెల్లుతుంది. ఉరి, యావజ్జీవ శిక్ష వేయము, అన్నాకే పోర్చుగల్ అబూసలేంను డిపోర్ట్ చేసింది, రోజూ చికెన్ దం బిరియాని తినే అవకాశం ఆయనకు దక్కింది.

      మీరన్నట్టు మన కోర్టులైతే బాగుండేది 500రూపాయలు కట్టి బెయిలు తీసుకుని, కంప్లైంట్ చేసిన బుడ్డోడిని మళ్ళీ చితక్కొట్టేయొచ్చు, ఓహ్.. పోలీసులు, కోర్టుల సహకారంతో 40ఏళ్ళు సుప్రీం కోర్ట్ దాకా సాగదీసి, ఆ తరవాత క్షమాభిక్ష అప్లై చేసుకుంటే నిశ్చింతగా బతికేయొచ్చు. ఇక్కడ మాత్రం స్వకోర్టులకన్నా, చట్టాలకన్నా పరకోర్టులే మిన్న, వెధవది ఇక్కడ 'లా టేక్సు ఇట్సు ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓన్ కోర్సూ ', ఏమంటారు? :)

      Delete
    5. అంటే మీరనేది ఇక్కడి వారు దద్దమ్మలు, కాబట్టి,వాళ్లని అక్కడి వారికి అప్ప చెపితేనే బెటర్ అంటారు.అసలు నార్వేయన్లు శిక్షించింది తల్లితండ్రులనా? పిల్లల్నా? ఒక సారి బాదిత "బుడ్డోడ్ని" అడగండి. వాళ్ల అమ్మ నాన్న కావాలో వద్దో?
      ఇక్కడ తండ్రి అడ్డగోలుగా కోడితే ,తాత ఉంటాడు, ఇంకా ఎవరయినా పెద్దలు ఉంటారు. బుద్ది చెప్పటానికి.ఇక్కడ కుటుంబం ఒక సహజ బందం.అక్కడి లాగ కాంట్రాక్ట్ ఫరం కాదు.మీకు తెలుసా? ఇక్ఖడ పిల్లల్ని కొట్టినందుకు, తమ పెద్దవాళ్లతో తిట్లు, తన్నులు తిన్న సంఘటణలు చాలా కుటుంబాల్లో జరుగుతాయి.పోలిస్లు అవసరం ఉండదు. అమ్మామ,తాతయ్య, నాయనమ్మ, మామయ్యా.అందరూ పోలిసులే ఈ విషయంలో "రాక్షస తండ్రులను" నిరోదించటానికి.

      Delete
  2. మనం మన భుక్తి కోసం ఇంకో దేశం వెళ్తే వాళ్ళ రూల్స్ పాటించాల్సిందే. అంతకన్నా చేసేదేమీ లేదు. మన దేశంలో బహిరంగంగా ముద్దు పెట్టుకున్నారని రిచర్డ్ గేర్ ను అరెస్టు చెయ్యలేదా?

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన