Posts

Showing posts from August, 2016

ఇంటర్నెట్లో ఆనందాలకు అలవాటు పడి, ఇంట్లో అనందాన్ని పట్టించుకోకుంటే పరిస్తితి ఇలాగే ఉంటుంది!!

Image
                                                        మనిషి యొక్క ఆనందనమనేది అతని జీవన శైలి ని అనుసరించి ఉంటుంది. పెండ్లి కాక ముందు జులాయిగా తిరుగుతున్న కొడుకులను చూసి చాలా మంది పెద్దలు ఏమంటారు అంటే " వీడికి మంచి అమ్మాయిని చూసి ముడి పెట్టేస్తే , దారి కొచ్చి బుద్దిగా ఉంటాడు" అని. అంటే జులాయిగా తిరుగుతూ తన ఆనందం తానూ వెత్తుకునే వాడి వల్ల  అతని ఆరోగ్యానికే కాక, కుటుంబానికి తద్వారా సమాజానికి మంచిది కాదు అని పెద్దల బావన .    ఉదాహరణకు ఈడోచ్చిన కుర్రాడు సావాసా ల రుచి మరిగి ఇంటి పట్టున ఉండకుండా , చెప్పిన పని చెయ్యకుండా బలాదూర్ తిరుగుతుంటే , ఎప్పుడు ఏ గొడవల్లో ఇరుక్కుంటారో అని తల్లి తండ్రులు బయపడుతూ ఉంటారు. అందుకే అతనిని ఇంటి పట్టున ఉంచటానికి పెండ్లి చెయ్యటం కూడా  ఒక మార్గం అనుకుని తగిన సంబందం చూసి పెండ్లి చేస్తుంటారు. సాదారణంగా కొత్త పెళ్ళాం మోజులో తన తిరుగుళ్ళకు స్వస్తి చెప్పి, ఇంట్ పట్టున ఉండి వేళకు తిండి తింటూ , నిద్ర పోతూ ఉం...

ఇంద్రాణి లాంటి ఇల్లాళ్ళు అయినా, నాగపూర్ లోని నవ్య వెలయాళ్ళు అయినా , "మై చాయిస్ " విష సంస్కృతీ పుత్రికలే.

Image
                                                                                                                                                            గత వారం రోజులుగా భారతావనిని నిశ్చేష్టకు గురి చేసిన ఇంతి ఇంద్రాణి ఉదంతం ఒక గొప్ప సెక్స్ , క్రైమ్ , దిల్లర్  సినిమాను మించి పోయింది. ఈమె గారి ఉదంతం ని సినిమాగా తీసి జనాల మీదకు వదిలితే , వచ్చే కలెక్షన్ లు "బాహుబలి " ని మించిపోవడం ఖాయం. దీని గురించి తెలుసుకోవాలంటే , వెనుకటి టపాను చూడండి .                                           ...

మనిషిని "రోగి"ని చేసి,"రోడ్లు" మీద పరిగెత్తిస్తుంది ఎవరో తెలుసా?

Image
                         ఇంకెవరు? మనం ఎంతో గొప్పదని చెప్పుకుని మురిసి పోతున్న మన సాంకేతిక పరిజ్ణానం.అదేమిటి అని ఆశ్చర్య పోతున్నారా? చూడండి ఎలాగో!   వెనుకటి రోజుళ్ళో ఒక చిన్నదో, పెద్దదో ఎవరి స్తాయికి తగ్గటు వార్కిఒక  ఇల్లు ఉండేది.ఇంటికి ముందూ, వెనుక కోంత ఖాళి స్తలంఉండేది.ఇంటిలో ఒక చేద బావి ఉండేది.పొద్దునే సూర్యోదయానికి ముందే  లేచే అలవాటు అందర్కి ఉండేది.                లేవగానే చీపురు పట్టి, వళ్లు వంచి,ఇంటి ముందు, వెనుక ఊడ్చే వాళ్ళు.అదొక పావుగంట  పని. కళ్ళాపి చల్లి, అందంగా  ముగ్గులు వేసేవారు. పశువులు ఉంటే వాటి దగ్గర శుబ్రం చేసి,వాటి పాలు పిండి ఆడవాళ్ళు తమ ఉదయం పనులు తెమిలే సరికి రెండు గంటలు గడిచేవి. ఇక మగాళ్ళు అయితే చేద బావి లోనుంచి నీళ్ళు తోడి,గాబుల నిండా నీళ్లు నింపేవారు. ఆ తర్వాత ఇంటి పెరట్లోని కూరాగాయల మొక్కలకు,పూల మొక్కలకు, నీళ్ళు పోసే వారు.పొలం పనులు ఉంటే పొలాలకు వెళ్లే వారు, అది లేని వారు స్త్రీలకు పనులలో సహాయం చేసే వారు. ఈ విదంగా రోజు ఉదయం పూట ...

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

Image
                                                                                                                                   హిందువులు అయిన పురుషులు వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మాటలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,నాతి చరామి అని .దాని అర్దం జీవితం లో  ప్రతి విషయంలోను తను చేపట్టబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను అని. అయితే అన్ని మంత్రాలు మాదిరే అది కూడ ఒక మంత్రం అనుకుని ప్రతి వరుడు మొక్కుబడిగా ఆ నాలుగు మాటలు అనేసి, తంతు ని మమ అనిపిచేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఆ నాలుగు మాటలకు కట్టుబడి కాపురం చేయ గలిగిన వాడే నిజమైన హిందువు. అప్పుడే హిందూ వివాహా వ్యవస్తకి ఒక అర్దం ,పరమార్దం . అలా చేసి చూపాడు ఒక సామాన్యుడు.   అనంత పురం జిల్లాలో కదిరి పరిసర ప్రాంత...

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

Image
                                                                                                  ఆమె ఒక సినిమా నటి . ఆతను టెన్నిస్ ప్లేయర్ . 1993 లో "స్తెర్న్' అనే జర్మన్ మేగజైన్ కోసం వీరిద్దరూ నగ్నంగా ఉన్న ఒక పోటో ని తీసి మాగజైన్ కవర్ గా ప్రచురించారు . దానినే తిరిగి ఇండియా లోని కలకత్తాకు చెందిన స్పోర్ట్స్ మాగజైన్ మరియు డైలీ పత్రికలు ఆర్టికిల్ ను పోటోలను రెపబ్లిష్  చేసారు . దాని మిద ఒక న్యాయవాది చేసిన కంప్లైంట్ మేరకు విచారణ జరిపిన స్తానిక కోర్టు మెజిస్ట్రేట్ కేసు నమోదుకు ఆదేసింఛి ప్రాసిక్యూషన్ చేపడితే దాని మిద సదరు పత్రికల వారు సుప్రింకోర్టు  దాక రావడం జరిగింది . చివరకు సుప్రీం కోర్టు వారు స్త్రీ నగ్న చిత్రం ప్రచురిo నంత మాత్రానా అశ్లిలం కాదు , దానివలన సామాన్య ప్రజల మనసులులొ సెక్స్ పూరితమైన తప్పుడు బావాలు ప్రేరేపించ బడితే తప్పా అ...

మొగుడు అంటే మోసేవాడు అని నిరూపించిన కేరళ అయ్యప్పన్ , ఒడిశా దానామాజీ !!!

Image
                                                                                                        భర్త అంటే భరించే వాడు అని భారతీయ సాంప్రదాయం లో పుట్టి పెరిగిన మగాళ్లు అందరికి తెలుసు. దానిని వేరొక రకంగా కూడా చెప్పవచ్చు . అదే "మొగుడు అంటే మోసే వాడు "అని కూడా . దానినే అక్షరాలా నిజం చేసి చూపారు భారతీయ సాంప్రాదాయం లో భాగమైన గిరిజన సంస్కృతీ పుత్రులు. నిజంగా భార్యా భర్తల బంధానికి మన సాంప్రాదాయం  ఎటువంటి నిర్వచనం ఇచ్చ్చిందో వీరిని చూసి తెలుసుకోవచ్చు . ఎందుకంటే ఇంకా ఆధునిక వాసనలు ఇంకా వీరికి అబ్బలేదు కాబట్టి పూర్వపు మనుషులు భార్యా భర్తల బంధానికి , కుటుంబ సంబంధాలకు ఎలాంటి విలువ నిచ్చారో, భార్యల పట్ల వీరు చూపిన ప్రేమ తో కూడిన   నిబద్ధతే సాక్ష్యం  . ఇక వివరాలు లోకి వెళితే ;       ...

అత్త మీద కోపం , జిల్లా జడ్జ్ మీద చూపించిన రాకాసి కోడలు !

Image
                                                                                                              అత్తమీద కోపం దుత్త మిద చూపింద ని మనకొక సామెత ఉంది . పూర్వం ఇండ్లలో అన్నింటికీ మట్టి పాత్రలే వాడేవారు . వెనుకటి కుటుంబాలు అన్ని ఉమ్మడి కుటుంబాలే కాబట్టి , సాదారణంగా అత్తల పెత్తనమే ఇండ్లలో కొనసాగేది . కోడళ్ళు కాపురాలు చేయడం వరకే కొడుకులు తో పని. మిగతా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా అత్తల చేతిలో ఉంటుంది . అటువంటి కంట్రోల్ కోడలికి రావాలంటే ఆమె అత్త గా మారిన తర్వాతే అది సాద్యం . అలా మన కుటుంభ వ్యవస్థ కమ్యూనిస్ట్ పార్టి వ్యవస్థ లాగా ఒక క్రమ విదానం కలిగి ఉండేది . మరి అలాంటి కుటుంబాలలో అత్తల మిద కోడళ్ళకు కొన్ని సందర్బాలలో కోపం రావడం అనేది సహజంగానే జరుగుతుంటుంది . అలా వచ్చిన కోపాన్ని డైరెక్టుగా అత్తల మిద చూ...

అద్దెకడుపుల విపరీతపుపోకడల విషయం లో " మనవు" కోరికను మన్నించిన కేంద్ర మంత్రి మండలి !! ?

Image
                                                                               ది .28/6/2016 న తేదీన ఇదే   బ్లాగులో   దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!! అనే పోస్ట్ ప్రచురించడం జరిగింది. అందులో నటుడు తుషార్ కపూర్ తాను వివాహం చేసుకోకుండా కేవలం సింగిల్ పేరెంట్ గా సరోగసి పద్దతిలో ఒక బాబుకు తండ్రిగా మారిన విధానం ని నిరసిస్తూ "     ఈ  ప్రపంచం లో సింగిల్ పేరెంట్ లకేనా హక్కులు? వారికి పుట్టే బిడ్డలకు ఉండే సహజ హక్కుల మాటేమిటి? మానవ  సమాజానికి , జంతు సమాజానికి ఉండే గీతలు చెరిపేస్తున్న ఈ  "మై చాయిస్ " వాదులకు , పిల్లలకు ఉండే పేరెంట్స్ ప్రేమ ను పొందే హక్కును కాల రాసే అధికారం ఎవరు  ఇచ్చారు?  చట్టాలు చేసే చట్ట నిర్మాతలు ఆలోచన చేయాలి. ఇటువంటి విపరీతపుపోకడలను ...

సింధు పేరెంట్స్ ని చూసి అయినా చిత్తం మార్చుకోని "పురం నాగమణి "

Image
                             రియో ఒలంపిక్స్ 2016 లో అమ్మాయిలే భారత జాతి పరువు కాపాడారు అని జాతి యావత్తు కీర్తిస్తున్న వేళ, ఆ సందర్భంగా మొన్న సోమ వారం , ఒలంపిక్స్ విజేత  P.V.  సింధుకు హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల మంత్రులు , అధికారులు ,ప్రధానమంత్రి గారికి స్వాగతం పలికిన చందంగా ఘనస్వాగతం పలికి , భారీ ఊరేగింపుతో ఊరేగించి , బోల్డన్ని నజరానాలు ఇస్తే , తమ కూతురు అయినందుకు ఆమె తల్లి తంద్రులు ఎంతో గర్వంగా పీలయ్యారు. దేశం లో చాలా మంది ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు సిందూ లాగా తమ కూతుళ్ళు  పేరు తెచ్చుకోవాలని అభిలషించి ఉంటారు. అసలు ఆడబిడ్డలే లేని వారు తమకు ఆ బాగ్యంలేకపోయిందే అని బాదపడిన వారూ ఉండవచ్చు . కాని నిజమాబాద్ జిల్లా, బీర్కూరు మండలం, దుర్కి గ్రామమ్ కి చెందిన పురం నాగమణి అనే పుత్రికల తల్లి మాత్రం అలా అనుకోలేక పోయింది. అందుకే సిందుకి సన్మానం జరిగిన తెల్లారే ఆమె అంత దారుణానికి ఒడిగట్టింది.                ఈ రోజు ఈనాడు పేపర్లో ప్రచురితమైన వార్త ప్ర...

గోపిచంద్ గారు లాంటి గురువులు ఉన్నంత కాలము, P.V. సిందూ లాంటి క్రీడా తారలు మిల మిల మెరుస్తూనే ఉంటారు!!!

Image
             అటు ప్రభుత్వ దన్ను , ఇటు గురువు ఆశీర్వచనం ఉంటే ఇటువంటి పతకాలు ఎన్నో !!.                                               ఈ దేశం లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స్కానింగ్ ల ద్వారా ఆడ  శిశువుల  ఆచూకీ కనుక్కుని వారిని హతమార్చే దుష్ట సంస్కృతీ ఉంది. దీనికి తండ్రులది ఎంత పాపపు బాధ్యతో అంతకంటే ఎక్కువ బాధ్యత తల్లులది . అదిగో అలాంటి పాపపు తల్లి తండ్రులను వరుసగా నిలబెట్టి , మొన్న ఒలంపిక్స్ లో విజయం సాధించిన భారత క్రీడాకారిణులు ఇద్దరు సింధు మరియు సాక్షి మాలిక్   ల కాలి చెప్పులతో సత్కారం చేస్తే కానీ వారికి బుద్ధి  రాదు. మన రాష్ట్రం మరియు హరియానాకు చెందిన ఆ ఇద్దరు ఆడ  పిల్లలు  ఒకరు రజతం , మరొకరు కాంస్య పతాకం సాధించినందు వలననే అంతర్జాతియ ఒలంపిక్స్ క్రీడా మైదానం లో మన దేశం యొక్క జాతీయ గీతం ఆలకించే  భాగ్యం దక్కింది. 125 కోట్లమంది ప్రజలు ఉన్న ఒక దేశం రియో  ఒలంపిక్స్ 2016 లో...

మొగుళ్ళని "విగత" లుగాను, పెళ్ళాల్ని "విదవలు " గా ను చేస్తున్న ఈ చట్టం మన సమాజానికి సరిఅయినదేనా?

Image
                                                                                                                                                  ప్రభుత్వాలు ఎంత గొప్ప చట్టాలు చేసాయి  అనేది కాదు , ప్రజలు దానిని ఎంత సక్రమంగా వినియోగొంచుకుంటున్నారు అనే దాని  మీదే  ఆ చట్టం యొక్క కొనసాగింపు ఆదారపడి ఉంటుంది . ప్రజలు స్వీకరించని చట్టాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కానీ ప్రజలు 95% దుర్వినియోగ పరచడం వలన, వ్యక్తులు  హింసించబడడమే  కాక ఆత్మహత్యలకు గురికాబడుతున్నపుడు , ఆ చట్టాలు మాత్రం ఎట్టి పరిస్తితుల్లోను కోన సాగించడానికి వీలు లేదు. ఏ  నేర చట్టం ఉద్దేశ్యమైన  ప్రజలలో మార్పు తేవడమే తప్పా , మట్టు బెట...

5 గురు కలసి అమ్మాయిని "గాంగ్ రేప్ " చేసిన వాళ్ళు "భాయ్ ప్రెండ్లు " అవుతారా?

Image
                                                                                                                              వేయి గంగా నదులు నీరు తెచ్చి కడిగినా ప్రస్తుత భారతీయ సమాజం లోని మలినం తొలగిపోయేలా లేదు. ఈ  సమాజాన్ని మతిమాలిన స్వేచ్చా విదానాలు, కట్టుబాట్లు లేని పిల్లల పెంపకాలు, బ్రష్టు పట్టి పోతున్న కుటుంబ సంబందాలు అన్నీ, అన్నీ కూడి  సర్వ నాశనం చేస్తున్నాయి. పట్టుమని పదిహేనేళ్ళు దాటని మగ పిల్లలు ఆడపిల్లలను గాంగ్ రేప్ లు చేసే హీన స్తాయిలో ఈ  సమాజం ఉందంటే, దానికి కారణO  ఎవరు? ఇప్పుడు సమాజం లో ఏమి జరుగుతుందో తెలియక ఎప్పుడో సమాజం లో ఉన్న దురాచారాలు , వాటికి కారకులైన పూర్వికులను నిరంతరం తిడుతూ , సమాజం లో మరింత విశ్రుంఖల మైన స్వేఛా  బావ...

ఆడవాళ్ళను గోకడం లో ఆంద్రా యే ఫస్ట్ అట!!?

Image
                                                                                                              నిన్న ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలు కాకపోయినా , చదువరులను ఆకర్షించే అంత అక్షరాలతో "మహిళలను అవమానించడం లో మనమే ముందు" అనే శిర్షికతో ఒక వార్తను ప్రచురించారు. దాని పక్కనే చిన్న అక్షరాలతో "సిగ్గు, సిగ్గు" అని కూడా ఉంది. ఏంటబ్బా అని విషయం మొత్తం చదివితే ఆడవాళ్ళను గోకడం లో ఆంద్రా స్టేట్ మొదటి వరుసలో ఉంటె , అత్యాచారాల విషయం లో మాత్రం ఆ క్రెడిట్ మద్యప్రదేశ్ వాళ్ళు కొట్టేసారు.తెలుగు రాష్త్రాలుకి , మద్యప్రదేశ్ కి అత్యాచారాల  సంఖ్య విషయంలో చాలా తేడా ఉంది. ఈ  లెక్కలు ఎవరో చెప్పిన కాకి లెక్కలు కావు. సాక్షాత్తు మనదేశ జాతీయ నేరాల నమోదు సంస్థ వారు ప్రకటించినవి కాబట్టి నమ్మదగినవే . వారు 2014 సంవత్సర...

చేసే ఉద్యోగం తిరుమల కొండ మీద, మత ప్రచారమేమో "కల్వరి కొండలు" గురించా?

Image
                                                                                                                                మన దౌర్భాగ్యం వల్ల, దివంగత ముఖ్యమంత్రి గారు తను నమ్మిన మతానికి రాష్ట్రంలో పెద్ద పీఠ వేయాలనే సంకల్పంతో, హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే తిరుమల-తిరుపతి కొండల స్వామి క్షేత్రాన్ని కొంత మంది అన్యమతస్తులకు అలవాలంగా చేస్సాడు. అందులో భాగంగా ఒక...

ఎంత ఘోరం ! అమ్మాయిల మాదిరి ఆవులను కూడా కారులో కిడ్నాప్ చేస్తారా ఈ కసాయీలు !!!

Image
                                                                                                    అస్సలు నమ్మబుద్ది కావటం లేదు . ఇంత దారుణానికి తెగించిన మనుషులు ఈ  భూమి  మీద మన మధ్యనే ఉన్నారా? ఇలాంటి కసాయి వాళ్లు రాక్షస సంతతికి  కాక మరే సంతతికి చెందిన వారై ఉంటారు . ఇలాంటి  అకృత్యాలు చూస్తున్నప్పుడు మనిషి అన్న వాడికెవరికైనా ఒళ్ళు మండదా? అలా మండి ఏదైనా అన్నా , చేసినా  దేశ వ్యాప్తంగా గగ్గోలు !.        ఈ  దేశం లో రక్షణ లేని ఆడపిల్లలను కారుల్లో ఇతర వాహనాల్లో బలవంతంగా తీసుకువెళ్లి పాడు చేసి చంపుతున్న కామాంధులు గురించి వింటున్నాం . అటువంటి వారికి అంగ చేదం చేసి పబ్లిక్ గా ఉరి వేసి చంపాలని కోరుకుంటున్నాం. ఈ  దేశం విధుల్లో ఇన్నాళ్లు  ఆడపిల్లల కు మాత్రమే రక్షణ లేద...

"లేచి పోయే రాజెశ్వరీలు ,కసెక్కి పోయే కామేశ్వర రావులు" ఉన్నంత కాలం జి.కొండూరు లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి!.

Image
                                               స్తీ వాదం పేరుతో  ఎంతో మంది రచనలు చేసి ఉంటారు. అందులో అందరిది ఒకటే బాధ .సంసార స్త్రీకి సంసారంలో  భర్త ఆదరణ తగినంతంగా లభించని వారు దాని కోసం వేరొకరితో లేచిపోయినా తప్పు లేదని తేల్చెయ్యడానికే మొగ్గు చూపారు. సెక్స్ విషయంలో సమాజంలో పురుషునికి ఉన్న స్వేచ్చ స్తికి లేదని అందువల్ల స్తికి చాలా అన్యాయం జరుగుతుందని స్తివాదుల ఆరోపణ. వీరికి "వీర గురువైన "చలం" గారు లేకపోయీనా ఆయన అందించిన  మైదాన సాహిత్యం ఇంకా ఆదుకుంటూనే ఉంది. కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. దానిని ఖండించడంలో తప్పులేదు. కాని మగవాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆడదానికి ఆ స్వేచ్చను ఇమ్మని అనడం ఎంత దిగజారుడు తనం!    మనిషి అన్నాకా బలహీనతలు ఉంటాయి. కాని ఆ బలహీనతలు సంసారాలు పాడు చేస్తాయి కాబట్టే దానికి నియంత్రణలు అవసరం. ఇందులో ఆడ మగ అనే బేదం ఉండటానికి వీలు లేదు. వ్యవ సాయం చెయ్యడానికి గిత్తలకు "వ్రుషణ నియంత్...