మని"'she" లో "అందం" అనేది ఎక్కడుంటుంది?




 
                            ఈ ప్రశ్న నాలో ఉదయించడానికి కారణం ఈ రోజు విశాఖ  లో "ఫ్యాషన్ వీక్" పేరుతో ప్రారంభం కానున్న అతివల "అందాల ప్రదర్శన" జరుగుతుండడం, దానిని మన మహిళా సంఘాల వారు ముక్త కంటం తో నిరసిస్తుంటే, వారిని కర్తవ్య పరాయణులైన మహీళా పోలిసులు ఈడ్చివెయ్యడం, అరెస్టులు చెయ్యడం , ఇదంతా చూసిన నాకు పై సందేహం కలగడం చక చకా జరిగిపోయాయి.

  అసలు అందాల పోటిలు ఎందుకు ఆడవారికే నిర్వహిస్తారు? మగవారికి అందం ఉండదా? ఇది కూడ నాకు కలిగే డౌటుల్లో ఒకటి! బహూశా  మగవారిలా చొంగ కార్చుకుంటూ చూసే బుద్ది ఆడవాళ్లకి లేకపోవడం వల్లా "అందాల పురుషుల" పోటిలు కి ఎక్కువుగా ఆదరణ ఉండదేమో? కాకపోతే "కండల వీరుల్ని" చూపించే "మిస్టర్" పోటిలు ఉంటాయి.ఎడ్ల పందాలు, బుల్ ఫైట్ లాగా ఇటువంటివి కొంత మందికి వినోదం కలిగించ వచ్చు!
                                                                             



                           ఇక పోతే అసలు విషయం "మనిషిలొ అందం " ఎక్కడుంటుంది. నా ఉద్దేశ్యం లో ప్రతి వ్యక్తిలో ఏదొ రకమైనా అందం ఉంటుంది. అందం ఒక్క ప్రదాన లక్షణం ప్రత్యేక ఆకర్షణ కలిగించేది.ఉదాహరణకి కొంత మందికి నవ్వు అందం. మరికొంతమందికి మాటలో అందం ఉంటుంది, వారు మాట్లాడుతుంటే అలాగే వినబుద్ది వేస్తుంది. కొంతమంద్కి వారి అమాయకత్వం అందాన్నిస్తుంది.కొంత మందికి వారిలోని  సేవా గుణం అందాన్నిస్తుంది.ఈ విదంగా ఒక వ్యక్తిని మనం ప్రత్యేకంగా ఆరాదించడానికి లేక వారి పట్ల ఆకర్షితులు కావడానికి వారిలోని ఏది కారణమో అదే వారి అందం.

  కాని వీటన్నిటిని కాదని కేవలం  ఆడవారిని వ్యాపార వస్తువులుగా చూపించే అంగాంగ ప్రదర్సనే అందాల పోటిలుగా ప్రచారం చేస్తూ తమ వ్యాపార లాబాల కోసం స్త్రీలను నీచంగా చూపించే సంస్రుతిని ప్రతి ఒక్కరూ గర్హించాలి. ఈ విషయంలో తమ వంతు బాద్యతగా, నిరసనలు ప్రదర్సించి అరెస్ట్ అయిన విశాఖ మహిళా సంఘాల ప్రతినిదులకు, వివిద ప్రజా సంఘాల వారికి అభినందనలు.ఇటువంటి ఫ్యాషన్ పేరేడ్ లు స్త్రీల ఔనత్యాన్ని కించపరచి, వారిని తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా వినియోగించడానికి ఉపయోగపడేవి తప్పా అన్యదా కాదు. కనుక తక్షణం ఇటువంటి వాటిని నిషేదించాలి.మన సంస్రుతిని కాల రాస్తున్న ఇటువంటి ప్రదర్శనలను తక్షణం ఆపుచేయించాల్సిన బాద్యత ప్రభుత్వ పెద్దల పైనా ఎంతైనా ఉంది.  
                                                          (1/2/2013 Post Republished)  

Comments

  1. చట్ట ప్రకారం వారికి అందాల పోటీలు నిర్వహించుకోవచ్చు. పాల్గోనే వారికీ, చూసే వారికీ ఏ ఇబ్బంది లేనపుడు, మిగిలిన వారికి ఏల? మనం మరీ మోరల్ పోలీసింగు దిశగా వెలుతున్నామేమో ఆలోచించండి.

    ReplyDelete
    Replies
    1. చట్ట ప్రకారం నిరసనలు కూడ తెలుపవచ్చు. మోరల్ వేరు, ఇల్లీగల్ వేరు. వారు చేసేది ఇమ్మోరల్ అనిపించినపుడు మోరల్ పోలిసింగ్ తప్పు కాదనుకుంటా."మన వెనుక పోలిస్ ఉండబట్టే మనమంతా ఉత్తమ పౌరులం" అని ఆంగ్ల సామెత ఉంది. అలాగే నైతిక జీవనం కొన సాగాలంటే,ఒకరి కొకరు, మోరల్ పోలిసింగ్ డ్యూటి చెయ్యక తప్పదు.

      Delete
  2. నిజమేనండి , స్త్రీల ఔన్నత్యాన్ని కించపరచే ప్రదర్శనలను ప్రోత్సహించకూడదు..

    అయితే బాధాకరమైన విషయమేమిటంటే , స్త్రీల ఔన్నత్యాన్ని కించపరచే ప్రదర్శనలలో కొందరు స్త్రీలే పాల్గొనటం, వాటిని సమర్ధించటం.

    ReplyDelete
    Replies
    1. స్త్రీలందు పుణ్య స్త్రీలు వేరు. అటువంటి వారే తమ నిరసనలు తెల్పటమే కాక అరెస్టులుకు సైతం వెరవక మన సంస్క్రుతిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా అటువంటి వారు ఉండబట్టే మనలో బారతీయత మిగిలి ఉంది.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన