సార్, పాప ఏడ్చింది! అలాగా,అయితే అరెస్ట్ చెయ్యండి!
మీకు గ్రైప్ వాటర్ వారి ఒక అడ్వర్టైజ్ మెంట్ గుర్తుండే ఉంటుంది. "పాప ఏడ్చింది అని తల్లి అంటే "వుడ్ వర్డ్స్" పట్టండి అని అమ్మమ్మ అంటుంది.కాని "నార్వేలో" మాత్రం పోలిస్ వాటర్ తాగాల్శిందే! మొన్న పిల్లల్ని మందలీంచారని,సరిగా పట్టించుకోవటం లేదని ఇద్దరి పిల్లల్ను తమ తల్లితండ్రుల నుండి వేరు చేసి, వారికి శిక్ష విదించారట "నార్వే" దేశం వారు. ఇది జరిగింది నార్వే లోనే అయినా బాదితులు మాత్రం ఇండియన్ దంపతులు.ఇండియన్ దంపతులకి, ఇద్దరు పిల్లలు. పిల్లలు ఇద్దర్ని విడి విడిగా పడుకోపెత్టకుండా ఒకే మంచం మీద పడుకోబెట్టడం, వారు చేసే పనులకు వారిని మందలించడం ఇవి తల్లి తండ్రులు చేసిన తప్పులట. అలా పిల్లల్ని దండించడం...