యాంకర్ అడిగే దానికే సమాధానం దాటవేసే మీరు , రేపు సీమాంద్రుల ప్రశ్న లకు ఏమని సమాదానం చెపుతారు బాబూ!
మంచో చెడో, తెలిసో తెలియకో, లేదా పార్టీలోని తెలంగాణ వాదుల ఒత్తిడి వలనో, అధీ కాకపోతే కేంద్రం ఎట్టి పరిస్తితిలోను తెలంగాణా ఇచ్చే సాహసం చెయ్యదనో, చంద్రబాబు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అభ్యంతరం లేదని అంగీకార పత్రం పార్టీ తరపున ఇచ్చారు. ఇప్పుడేమో అధికార పార్టీ వారు తెలంగాణకు ఓ.కె అనే సరికి అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ లోని సీమాంద్రా నాయకులకు గొంతులో పచ్చి వెలకాయ పడినట్లైంది. అటు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ఏర్పాటు ఖాయమంటుంటే, ఇటు సీమాంద్ర ప్రజలు సమైఖ్యతకు తేడా వస్తే తెలంగాణాకు ఒ.కె అన్న పార్టిలను సీమాంద్రలో పూడ్చిపెట్టడం ఖాయం అంటున్నారు. ఇప్పుడు సీమాంద్రకు చెందిన అటు అధికార పార్టీ నాయకులు, ఇటు ప్రతి పక్ష నాయకులు నష్ట నివారణ చర్యల్లో బాగంగా సమైక్యతకు అనుకూలంగ వాదనలు చేస్తున్నా, ప్రజలు వారి చిత్త శుద్దిని నమ్మే పరిస్తితిలో లేరు.అందుకే తమ ఉద్యమ వేదికలను రాజకీయ నాయకులు పంచుకోవడం