నిత్యానందమనేది కాంతల కౌగిళ్లలో ఉండేది కాదు........!


                       

వీరబ్రహ్మం గారు తన కాలజ్గ్నానం లో "కలి యుగాంతంలో-

"ఉల్లిపాయకు ఉపదేశమిచ్చే కల్ల గురువుల్లోస్తారు,

 కల్ల గురువులను కాల్చి వేయ కల్కిఅవతారుడు వచ్చేను"

   అంటారు. కల్కిఅవతారం సంగతేమో కాని కల్ల గురువులైతే వచ్చేసారు. రావడమేంటి! ఎడా పెడా ఉపదేశాలు, బోదలు, ఉదరగొట్టడాలు, వాళ్లు పోవడాలు,వాళ్లు మిగిల్చిన ఆస్తులు కోసం వారసులు కొట్టుకోవడాలు అన్ని చక చకా జరిగి పోతూనే ఉన్నాయి. అసలు ఈ రోజుల్లొ కాషాయ వస్త్ర దారణ కూడ పెద్ద వ్యాపారమైపొయింది.

  చిన్నప్పుడు అమ్మా బాబులని వదలి ఇండ్లలోంచి పారిపోయి, గాలికి తిరిగి, గారడీలు నేర్చుకునిప్రజల్ని తమ మాజిక్లతో  బుట్టలో పడెసుకొని బాగా  సంపాదించి,,ఆశ్రమాలు(విలాసవంతమైన ఆరామాలు) నిర్మించుకుని, సర్వ బోగాలు అనుభవిస్తు, హాయీగా కాలక్షేపాలు చేస్తున్న ఈ సో కాల్డ్ గురువులు నిజంగా హిందు మతానుసారం గురువులనబడినటానికి అర్హులా?.విశ్లేషిద్దాం

       హిందూ మతమనేది నిజంగా ఇతర మతాల వలే ఒక మతం కాదు . అది జీవన విదానం.సాక్షాతు మన సుప్రీమ్ కోర్ట్ వారే ఒక కేసులో ఈ విషయాన్ని స్పష్టం చేసారు. హిందువుల జీవన విధానం ఎలా ఉండాలో ధర్మ శాస్త్రకారుడైన మనువు స్పష్టం చేసాడు.అది  అయన చెప్పినది అశ్రమ జీవన విదానం. అంటే ఆశ్రమాలలో ఉండటం కాదు.ఆశ్రమం అంటే దశ( stage). దశలో ఉండటం.  "బ్రహ్మచర్యం, గ్రుహస్తం. వానప్రస్తం, సన్యాసం అని 4 రకాల ఆశ్రమాలు ఉన్నాయి. అచ్చ తెలుగులో చెప్పాలంటే "ఏ వయసులో ఆ ముచ్చట" కాబట్టి ప్రతి హిందువు విధిగా ఈ 4 అశ్రమాలలోని విధులు క్రమం తప్పకుండ నేరవేర్చాలి.లేకుంటే వారు హిందువులే కారు. బ్రహ్మచర్యంలో విద్యనబ్యసించాలి,, గ్రుహస్తంలో వివాహం చేసుకుని,పిల్లల్ని కని సంసార బాద్యతలు నిర్వహించాలి. వానప్రస్తం లో పిల్లలకు బాద్యతలు అప్పగించి వనాలలో జీవితం గడపాలి, సన్యాసంలో సర్వం త్యజించి దైవారాదనలో శెషజీవితం గడపాలి.ఇలా చేస్తూ తన జీవిత దశలలోనే భగవంతుని దర్శించవచ్చు . బాల్య దశలో బ్రహ్మ , యవ్వనం లో విష్ణువు , వృద్ధాప్యం లో శివుడు , చివరి దశలో ప్రజాపతి ని దర్శించడo  ఎలాగో తెలిపేదే  మనవిజం (Manavuism).

  కాబట్టి,ఏ హిందువైనా సరే "సంసారి కానివాడు సన్యాసం నకు అర్హుడు కాడు". ఈ కల్ల గురువులంతా పెళ్లిపెటాకులు లేకుండా, సంసారాలు చెయ్యకుండ డైరెక్టుగా సన్యాసి వేషాలు దరించినంత మాత్రానా వీరు.
నిజమైన సన్యాసులు కాజాలరు అందుకే వీరు పగలు స్వాములుగాను, రాత్రుళ్లు సరసాంగులుగా ఉంటున్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా సన్యాస దీక్షలు తీసుకుని, నీచమైన పనులతో మతాచారాలను బ్రష్టు పట్టించి, తలవంపులు తెచ్చే ఈ కల్ల గుర్వులను ప్రజలు విడనాడాలి

   అసలు వివాహం చేసుకోని గ్రుహస్త ఆశ్రఎం స్వీకరించనివాడు ఎంతటి జ్గ్నాని అయినప్పటికి అతడు బ్రహ్మచారే. కనుక పిల్లవాడు క్రిందే లెక్క. అటువంటి వాడికి గ్రుహస్తులు కాళ్లు మొక్కడం ఎంత అపచారం! అలా తండ్రి సమానులైన గ్రుహస్తులతో కాళ్లు మొక్కించుకున్నవారు రౌరవాది నరకాలు పొందుతారని పండితుల ఉవాచ.అసలు మనిషి లో సగ బాగమైన స్తీత్వం గురించే తెలియని ఈ పురుషులు పురుషొత్తముడి  గురించి జనానికి ఉపదేసిస్తారంట!సంసారమంటే తెలియని వారు చెప్పేదేముంటది జగత్ సంసారం గురించి? కొంత మంది గురువులు త్రిమూర్తులలో ఒకరిని దేవుడిగ పూజించాలని ,వేరొకరిని తిరస్కరించాలని పరోక్షంగా ఉపదేశాలు చేస్తు భక్తులలో తప్పుడు బావాలను వ్యాప్తి చేస్తుంటారు. వీళ్ల కొరకు చేసే ఆడంబర అట్టహాసాలు చూస్తుంటె వీరు ఉన్న చోటు కి భగవంతుడు కూడ రావడానికి భయపడతాడేమో అనిపిస్తుంది.వీరు చేసే పనులుకు మళ్లి సేవా ముసుగు ఒకటి. లౌకిక సేవల పేరుతో అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాలను మబ్యపెట్టి, తమ ప్రాభవాలను పెంచుకుంటుంటారు.ఈ మాత్రం సేవలు చెయ్యడానికి వీళ్లు ఎందుకు? మాపీయా డాన్లు, ఫాక్షనిస్ట్ కింగ్ లు ఇంతకంటే ఎక్కువగానే చేస్తారు. నిరాడంబర జీవితంతో ప్రజలకు నైతిక ధర్మ భోద చేస్తూ చరించాల్సిన వీరు అనైతిక పనులు చేస్తూ, సంపన్న వర్గాల ప్రజలకు మాత్రమే ఉపయాగపడే వీరు ఎటువంటి గురువులో ఆలోచించండి.   ఆందుకే బ్రహ్మం గారు వీరిని కల్ల గురువులన్నది.

                                                                     
                                                                 
   పూర్వ కాలంలో మన రుషులందరు గ్రుహస్త ధర్మం స్వీకరించి హిందూ ధర్మ  ఔన్నత్యాని చాటి చెప్పారు.ఉదాహరణకు నాటి పూర్వ రుషులనుండి,  శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి వరకు కూడ అందరు గ్రుహస్తధర్మాన్ని పాటించినవారే.నేటి యుగంలో గాంది మహాత్ముడుని నిజమైన హిందూ గ పరిగణించాలి.ఆశ్రమ జీవన విదానం చక్కగ పాటించారు. నిజమైన సన్యాసి అంటే ఆయనే.      మానవునికి నిత్యానందమనేది క్రమమైన మనువు చెప్పిన ఆశ్రమ జీవన విదానంలో దొరుకుతుంది తప్ప, కపట వేషాలుతో మోసాలు చేస్తు, ఏకాంత సేవల పేరులతో  కాంతల కౌగిళ్లలో నలిగితే దొరకదు.వారిని నమ్మి బంగారంలాంటి సంసార జీవితాలను పాడు చేసుకుంటున్న ఓ భక్తులార ఇకనైనా కళ్లు తెరవండి.       

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన