తిరుమల కొండ మీద "పంది " సంచరిస్తుందని "వీర బ్రహ్మం " గారు చెప్పిన మాట ఈ విధంగా నిజం అయిందా!!
నమో వేంకటేశాయ నమః |
హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామీ వేంచేసిన తిరుమల పరమ పుణ్య పవిత్ర క్షేత్రం . ప్రపంచం లోని అన్ని మతాల వారు ఆ దేవ దేవుని భక్తీ ప్రపత్తులతో కొలుస్తున్న తీరు ఆ స్వామీ మహత్యానికి నిదర్శనం . మరి అటువంటి తిరుమల కొండ మీదకు వెళ్ళడమే కాక , సాక్షాత్తు ఆ దేవ దేవున్ని తూలనాడి , కోట్లాది హిందూ భక్తుల మనోబావాలను గాయపరచిన వాడు ఈ తెలుగు గడ్డ మీద ఇంకా శిక్షింప బడకుండా ఉన్నాడు అంటే అది ఇండియా లాంటి కుహానా సెక్యులర్ వాదులు ఉన్న దేశం లొనే సాద్యం .
మాజీ ముఖ్య మంత్రి గారి పుణ్యమా అని తెలుగు గడ్డ మీద విచ్చలవిడిగా కిరస్తానీ మతం కు చెందిన కొంత మంది మత మార్పిడి కార్యక్రమాలు పెచ్చు మీరి పోయాయి. సాక్షాత్తు ఏడుకొండల స్వామీ నే రెండు కొండలుకు పరిమితం చేసే తెంపరి తనం అన్య మతస్తులకు కలిగిందంటె అది ఖచ్చితంగా ఆ మహానుబావుని చలవే. హిందూ మత విస్వాసాల మీద నమ్మక్కం లేని వ్యక్తులను ధర్మకర్తలుగా, ఎండోమేంట్ అధికారులుగా నియమించబట్టె ఇటువంటి ఆగడలు ఏడుకొండలు మీద ఏదో ఒక రూపం లో నిత్యం జరుగుతున్నాయి. ఇంత వరకు మత మార్పిడి వ్యవహారాలలో చట్ట విరుద్దంగా ప్రవర్తించిన వారికీ శిక్షలు విదించిన దాఖ్హాలలు లేవు. కారణం అటువంటి విషయాలలో కేసులు పెట్టె టప్పూడు ఉన్న శ్రద్ద, ప్రాసిక్యూట్ చేసేటప్పుడు ఉండక పోవడమే. మరి అటువంటప్పుడు చట్టాలు ఎందుకు? ఎవరి కళ్ళ నీళ్ళు తుడవడానికి? తిరుమల కొండ మీద ప్రభుత్వ జ్యోక్యం తొలగించి నిఖార్సైన హిందూ సంస్తలకు పాలనా బాద్యత అప్పగించి చూడండి. ఇటువంటి తప్పుడు మత ప్రచారాలు చేసే వారు కొండ ఎక్కడానికి సాహసించగలరా ? దేవ దేవున్ని ధూషించి బ్రతికి బట్ట కట్ట గలరా?
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటె కిరస్తాని మతం న చెందిన వ్యక్తి ఒకతను తిరుమల కొంద మీదకు వేళ్ళి ఆ దేవ దేవున్ని, ఆయనను పూజించే భక్త కోటి వీస్వాసాలను చాలా తీవ్రంగా అవమానిస్తూ, దానిని ఒక వీడియోగా తీయడమే కాక, దానిని వీదేశాలలో ఉన్న మత మార్పిడి స్పాన్శర్ లకు పంపి అక్కడ నుండి డబ్బు తెప్పించుకుని ఇక్కడ తన దుష్ట కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. దానిని అతడు య్యూ టూభ్ లో పెట్టి మరీ హిందూ జాతిని అవమానిస్తున్నాడు అంటె అది ఇండియాలో మరియు తెలుగు గడ్డ మీదే సాద్యం అని అతనికి గట్టి నమ్మఖ్ఖం కాబట్టి. వీడియోలో అతను ఏమి వాగాడొ తెలుసుకోవాలంటె క్రింది విడియోను క్లిక్ చేసి చూడవచ్చు. ఈ వీషయంలో అతను, అతనితో ఉన్నవారి మీదే కాక ఇతువంటి అప్రాచ్యపు పనులకు ప్రోత్సాహించిన అతని విదేశి స్పాన్సర్ ల మీద కేసు బుక్ చేసి వారిని శిఖ్షింప చేయగలందులకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడమైనది.
బ్రహ్మం గారి కాల జ్ణానం లో ఒక చోట ఒక "పంది" తిరుమల కోండ మీద సంచరించి ఆ ప్రదేశాన్ని పాడు చేస్తుందని ఉంది. బహూశా అది ఈ వ్యక్తి గురించే కావచ్చు. ఎందుకంటె పంది సంచారమ్ ని మలినానికి ప్రతీక గా బావిస్తాం. ఇటువంటి దైవ దూషకుడు వలన తిరుమల అపవిత్రం అయింది. కాబట్టి శుద్ది కార్యక్రమాలు చేపట్ట వలసిన అవసరం ఉంది. ఇకనుండి ఇతువంటి వారి పట్ల దేవస్తానం అధికారులు అలెర్ట్ గా ఉండాలి.
(30/10/2014 Post Republished).
Comments
Post a Comment