Posts

Showing posts from February, 2014

పేస్ బుక్ లో పులి ! అసలు పని చెయ్యాల్సి వస్తే ఒంట్లో చలి !?

                                                             ఈ రోజు ఈనాడు పత్రికలో ఒక ఆర్టికిల్ వచ్చింది . పేస్ బుక్ లో వీరాది వీరుల్లా చెలరేగి గంటలు గంటలు చాటింగ్ చేసే కుర్ర కారు , కూరగాయల  మార్కెట్ కు వెళ్లి వెళ్లి బేరం ఆడడానికి తెగ కంగారు పడి పోతున్నారట . ఇటువంటి పరిస్తితిని అదిగమించాలంటే, తల్లి తండ్రులు అప్పుడప్పుడు పిల్లలను వెంట పెట్టుకుని మార్కెట్ కు తీసుకు వెళ్లి బేరమాడే విదానం నేర్పడమే బెస్ట్ అని మానసిక నిపుణులు సెలవిస్తున్నారట !.     కూరగాయలు బెరమాడడానికే తెగ కంగారు పడిపోతున్న కుర్రకారు , తమ పెస్బుక్ మిత్రులతో గంటలు గంటలు ఎలా చాటింగ్ చేయగలుగుతున్నారు అంటే ఒకటే కారణం కావచ్చు. పేస్ బుక్ మిత్రులుకు  సమాదానమివ్వడానికి కావలసినoత  టైం ఉంటుంది . ఎందుకంటే పేస్ బుక్ లో ఒకే సమయంలో నలుగురైగురితో చాటింగ్ చెయ్యడానికి విలు ఉంటుంది కాబట్టి , ఇవతలి వారు సమాదానమివ్వడానికి లేట్ చేసినా అవతలి వారు అసహనం చూపరు . కాని కూరాగాయల బేర గాడు అoత సమయం ఇవ్వడు కదా ! "ఏంటయ్యా ! కొంటె కొను .లేకుoటే లేదు . నా బేరం చెడగొట్టకు " అంటాడు . దానితో కంగారు . చివరకు బేరం ఆడలేక, వాళ్ళు చెప్పిన

ఇంత జరిగాక ఇప్పుడు సుప్రీం కోర్టు ను ఆశ్రయించి రాష్ట్ర విభజన ఆపడం వలన తెలుగు ప్రజలకు లాభమా ?నష్టమా ?

                                                        ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే అయన చేతిలో ఇంకా లాస్ట్ బాల్  ఉండనే బలంగా నమ్ముతున్నట్లు కనపడుతుంది . అలాగే K.C.R  గారు కూడా T.R.S  పార్టిని ఇంకా కాంగ్రెస్ లో విలీనం చేయకుండా మీనమేషాలు లెక్కించడం , పార్టి వర్గాలు చేత కాంగ్రెస్ తో విలినమే కాదు పొత్తు కూడా వద్దని చెప్పించడం చూస్తుంటే ఆ పార్టి వారికి కూడా రాష్ట్ర విభజన చెల్లుబాటు  మిద కొన్ని అనుమానాలు ఉన్నాయి  అనిపిస్తుంది  . తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తేదిని ప్రకటించకుండానే నిన్న K.C.R గారు, అంతకు ముందు చేసిన వాగ్దానం  "నేను తిరిగి అడుగంటూ పెడితే తెలంగాణా రాష్ట్రం లోనే" అన్నదానికి విరుద్దంగా హైదరాబాద్లో అడుగుపెట్టి , గుర్రాలు , లొట్టి పిట్టల సహిత స్వాగత సత్కారాలు స్వికరిoచడం కూడా పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపడానికే నన్నది అర్ధమవుతుంది .    రాష్ట్ర విభజన అనేది రాజ్యంగ బద్దంగా జరగలేదని భారత పార్లమెంటేరియన్లకు అందరికి తెలుసు . విభజన బిల్ చట్టం గా మారాక సుప్రింకోర్టు  వారు తప్పకుండా జ్యోక్యం  చేసుకుంటారని కేంద్రం లోని అ

అమర వీరుల త్యాగ పలితం, ధరల తెలంగాణా ! దొరల తెలంగాణా !?

                                                          సుమారు 1300 మంది ఆత్మ హత్యలు చేసుకుంటే కాని తెలంగాణాకు విముక్తి లభించలేదు . ఇది తెలంగాణా లోని ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి వేళా , ప్రతి చోటా నొక్కి వక్కానించిన మాట .అలాగే తెలంగాణా ఏర్పడ్డాక ప్రతి అమరవిరుడి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని K.C.R గారు అన్నట్లు గుర్తు . కాని తెలంగాణా ప్రకటించాక ఈ అమరవీరుల కుటుంబాల వారెవ్వరూ "సంబురాల్లో " పాల్గొన్నట్లు మీడియాలో ఎక్కడా కనిపించలేదు . బహూశా ఆత్మానందం పొంది సంతృప్తి చెంది ఉంటారు .    చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన ముక్యమైన సామజిక పరివర్తన నిమ్న వర్గాల ప్రజలకు రాజ్యాదికారం సిద్దించడం అని భారత రాజ్యంగ నిర్మాత శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు . దానిని నమ్మి తెలంగాణా సాధనకు ఉద్యమించిన వారిలో   గద్దర్ అన్న, విమలక్క, దళిత బహుజన వర్గాల   నాయకత్వంలో లక్షలాది ప్రజలు, కవులు , కళాకారులూ "సామాజిక తెలంగాణా " కోసం నినదించారు . వీరందరినీ దృష్టిలో పెట్టుకునే K.C.R  గారు కూడా తెలంగాణా తోలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించి తాను బహుజనుల పక్షపాతి అన్నంత బావం దళితులలో కలుగ చే

కిరణ్ కుమార్ రెడ్డి &కో ని దారుణంగా అవమానిస్తున్న దిగ్విజయ్ సింగ్ !

                                                     అయన గారి పేరు దిగ్విజయ్ సింగ్ ! మద్య బారతంలో ఉన్న మద్య ప్రదేశ్ కి అయన ఒకప్పుడు ముఖ్యమంత్రి . ఇప్పుడు అ  రాష్ట్రంలో అయన పరిస్తితి ఏమిటంటే మొన్ని మద్య ఆ రాష్ట్ర కాంగ్రెస్ వారు సమావేశాలు నిర్వహించుకుంటుంటే  ఈయన గారు కూడా ఆ సమావేశంలో పాల్గొoదామని ఎగేసుకు వెళ్ళాడట . కాని ఈయన గారి రాకను గమనించిన అక్కడి కాంగ్రెసియులు ఈయనగారు లోపలకు అడుగు పెట్టకుండా ముఖం మీదే తలుపులు మూసేసారట  !దానితో అయన గారు బిక్క ముఖం వేసుకుని డిల్లి దారి పట్టాడట !. ఆది  మద్య ప్రదేశ్ లో అయన పరిస్తితి!   ఒక ఊరికి కరణం ఇంకో ఊరికి వెట్టి అట ! అందుకే మధ్యప్రదేశ్ లో ఎందుకు పనికి రాని ఆయన్ని ఆంద్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ గా నియమించారు . అయన గారి చెతులుమిదగనె తెలంగాణా వచ్చిందన్న సంబరంతో మొన్న తెలంగాణా కాంగ్రెస్ నాయకులు చాలా మంది అయన ఇంటికి వెళ్లి , పూలు పండ్లు ఇవ్వడమే కాక పన్నీరు చల్లి మరి క్రుతజ్ఞతలు  తెలియ చేసారట! దానితో అయన జన్మంటూ ఉంటె "తెలంగాణా గడ్డ " మీదే పుడతాను అని గట్టిగా తిర్మానిమ్చుకున్నాడట !   మరి అటువంటి తెలంగాణాకి వ్యతిరేకంగా ప్రవర్తించిన ముఖ

"తెలంగాణా దొర" ప్రజలకు ఇచ్చిన మాట తప్పి, దేవతను అటువంటి కోరికను కొరుతాడా ? !

                                                        "తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, దళితుడే ముఖ్యమంత్రి " . ఇది తెలంగాణా రాష్ట్ర సమితి అద్యక్షులు అయిన K.C.R   వారు తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం . మరి అటువంటి వాగ్దాన్నాన్ని మరచి పోయారా !? T.R.S  పార్టి స్వయంగా అధికారం లోకి వచ్చినా , లేక ఇతర పార్టీల సహకారంతో అధికారంలోకి వచ్చినా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం K.C.R గారి ప్రదమ కర్తవ్యo . కాని ఈ రోజు టైమ్స్ అప్ ఇండియాలో వచ్చిన ఈ సమాచారం చూస్తుంటే ఆయనగారి వాగ్దాన విశ్వస నియతను తెలంగాణా ప్రజలు శంకిoచే పరిస్తితి ఏర్పడింది . టైమ్స్ అప్ ఇండియా వారి ప్రకారం T.R.S  వారు డిల్లి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక బంపర్ అపర్ ఇచ్చారట ! తెలంగాణా రాష్ట్రానికి తోలి ముఖ్యమంత్రి కావాలన్న K.C.R గారి కోరికను తీరిస్తే తెలంగాణలో M.P సీట్లలో  సింహ బాగం కాంగ్రెస్ వారికే వదిలేస్తాం అని . ఎంత మాట !    నిన్న K.C.R గారు సొనియాగాoది గారిని కుటుంభ సమేతంగా కలిసి తెలంగాణా రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం చూస్తుంటే చాలా మందికి ఒళ్ళు పులకరించి పోయి ఉంటుంది . తెలంగాణా గడ్డకు మళ్ళి పూర్వ వైభవం వచ

సిమాంద్ర కి మరో "కేజ్రి వాల్ " కావాలని ఉవ్విలూరుతున్న సినిమా నటుడు" శివాజీ "

Image
                                                  ఆ మద్య పాలెం దగ్గర జరిగిన "వోల్వో బస్సు" దుర్ఘటనలో 45 మంది దాక చని పోవటం దేశ ప్రజలను ముఖ్యంగా తెలుగు ప్రజలను కలచి వేసింది . అయితే సదరు వోల్వో బస్సు ప్రైవేట్ అపరేటర్లది కావడం , ప్రైవేట్ ఆపరేటర్ల చట్ట వ్యతిరేక విదానాలను రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అధికారులు , పైసలకు ప్రలొబపడి చూసి చూడనట్లు ఉండటం మిద అనేక విమర్శలు వెలువెత్తెసరికి , అందుకు కిరణ్ కుమార్ గారి ప్రబుత్వం స్పందించి ఇప్పటి వరకు ఆకస్మిక దాడులు జరుపుతూ అక్రమంగా తిరిగే ప్రైవేట్ బస్ లను సిజ్ చేస్తూనే ఉంది .         నిజానికి పాలెం వద్ద దుర్ఘటనకు గురి అయిన బస్ ప్రైవేట్ బస్ కాబట్టి దాని యజమాని కాని , బస్సు కి  ఇన్స్యూర్ చేసిన కంపెని కాని నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది . వాటి కోసం అస్సిడేంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్స్ లో క్లైమ్  చేసి బాదితులు నష్ట పరిహారం పొందవచ్చు . అయితే జరిగిందో ఘోర దుస్సంఘటన కాబట్టి  బాదితులె కాకుండా ,ప్రజలు కూడా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం వలననే ప్రైవేట్ ఆపరేటర్ల మిద చర్యలు తీసుకుంది . అయితే ఈ సంఘటన ను డిల్లి లోని "నిర్భయ " సంఘటన లాగా చేసి  దాన

ముగ్గురూ అమ్మాయిలనే ఎందుకు చంపాడు ? ఆ పై తను ఎందుకు మాయం అయ్యాడు ?

Image
                                                           కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా , వింటున్నా నిజంగా వేలాది సంవత్సరాల మానవ ప్రస్తానం ఎటువైపు వెళుతుంది ? మానవత్వం వైపా ? దానవత్వం వైపా అనిపిస్తుంది . నిన్న నిజామాబాద్ నగర శివారులలొ జరిగిన ఈ ఘోరం చూస్తుంటే మనుషుల్లో దానవత్వం ఎంతగా ప్రభలి పోయిందో అర్ధమవుతుంది . అమాయకమైన , ముగ్ద మోహనంగా ఉండే ఆ  చిన్నారులను , కర్కశంగా పెట్రోల్ పోసి కాల్చి చంపింది ఒక మనిషి అంటే నమ్మ బుద్ది కావటం లేదు . నిందితుడు ఆ పిల్లల్ని ఎప్పుడూ ఆడించే వాళ్ళ బాబాయ్ అంటే అసలు నమ్మబుద్ది కావటం లేదు . కాని జరిగిన ఘోరం వెనుక ఉన్న కారణాలు పరిసిలిస్తుoటే  మీడియాలో వస్తున్న కధనాలు కూడా అనుమానం రేకెత్తిoచేవిగా  ఉన్నాయి . అవేమిటో చూదాం .    నిజామాబాద్ జిల్లా , రెంజల్   మండలం , భూపల్లి లోని రఘుపతి రెడ్డి గారికి 3 గురు కుమారులు. వారితో పాటు తన వదిన  కుమారుడును తనే పెంచి పెద్ద చేసాడు . అతని పేరు నరేందర్ రెడ్డి . నరేందర్ రెడ్డి కి ప్రస్తుతం 35 యేండ్లు . అంత వయసు వచ్చినా అతనికి పెండ్లి కాలేదట . అతనికి ఆర్దిక పరమైనా , ఇతరత్రా సమస్యలేమీ లేకున్నా పెండ్లి కాక పోవటం , దాని కో

చివరకు సిమాంద్ర రాజదానికి "ఉంపుడు గత్తె " హోదాయేనా !?

                                                      తెలంగాణా రాష్ట్రం ! అనివార్యం .! ఆ రాష్ట్ర ఏర్పాటుకు ఏ రాజకీయ పార్టి అడ్డుచేప్పటం లెదు అని అన్ని రాజకీయ పార్టీలు పైకి చెపుతున్నాయి . కాని ఏదో వంకతో రాష్ట్రవిభజన ఆగితే బాగుండు అని సిమాంద్ర లోని అన్ని రాజకీయ పార్టీల వారు మనసులో అనుకుంటున్నారు . దిని కోసం "విభజించడానికి మాకు అబ్యంతరం లేదు , కేవలం విభజన తిరు మీదే మా అబ్యంతరం " అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు . ప్రజల మనసులో ఏముందో దానిని కూడా సరిగా అవసరమైన వేళ , అవసరమైన వేదికల మిద చెప్పడం చేతకాని రాజకీయ నాయకులు ఉండటం సిమాంద్ర ప్రజల దురదృష్టం . కారాలు మిరియాలు నూరి బీరాలు పలికిన వారంతా ఇప్పుడు మీడియా సాక్షిగా బోరున ఏడుస్తుంటే , అవకాశాలు ఉన్నా సరిగా అటాడలేక,  ఓడిపోయి ఏడుస్తున్న ఆటగాళ్ళు గుర్తుకు వస్తున్నారు . ఇక ఉద్యోగుల నాయకులైతే మరీను ! మన డ్యూటి మనం చేసాం ! ఇక ఒక్క రోజు పని ఎగ్గొట్టినా ఇక ప్రబుత్వాలు జీతాలు ఇవ్వవు కాబట్టి , వెంటనే విదుల్లొ చేరాలని అత్ర పడుతున్నారు . అంటే వెనుకటి సమ్మెలు అన్నీ, ప్రభుత్వ ముందస్తు లోపాయకారి అంగీకారం తోనే చేసారు అన్న మాట ! ఇటువంటి రాజకీయ

" స్త్రీ స్వెచ్చ"తొ మొదలై ,18 నెలల కాలంలో 2,00,000 పైగా వీక్షణములు పొందిన "మనవు "!

                                                                                                                     మీ, మా బ్లాగు అయిన "మనవు" మొదలెట్టి నేటికి 18 నెలల 13 రోజులు అయింది .ఈ బ్లాగు మొదలెట్టిన నాడు "సూర్య సావర్ణిక " అనే పేరుతొ మొదలెట్టిన నాకు , మద్యలో ఎందుకో అసలు పేరుతోనే టపాలు రాస్తే వీ మంచిదనిపించి అలాగే చేస్తున్నాను . నా మొదటి టపా (టైటిల్ కాకుండా ), పేరు "స్త్రీ స్వీచ్చ ".  దీనికి అజ్ఞాత వ్యక్తీ  గారెవరో "కాయ " అనే పేరుతొ స్పందన తెలిపిన తోలి కామెంటర్ . తోలి చూపు , తొలివలపు అనేవి  ఎప్పటికి గుర్తున్నట్లే ఈ తోలి పోస్ట్ , తోలి కామెంటర్ గారు కూడా నా బ్లాగు ఉన్నంత కాలం గుర్తు ఉంటారు . ఆ తర్వాత వారి వ్యాక్యానాలతొనె ప్రత్యెక టపా ఒకటి ప్రచురించడం జరిగింది . మీరు కూడా కావాలంటే ఆ టపా , కామెంట్లు , జవాబులు ఈ క్రింది లింక్ లో చూడవచ్చు . బోర్ కొట్టదు . అంతవరకూ గ్యారంటి ! నా బ్లాగు దిన దిన ప్రవర్ద మానానికి తోడ్పడుతున్న వీక్షకులకు , మిత్రులకు , సద్విమర్శకులకు , అగ్రిగ్రేటర్ లకు కృతజ్ఞలతో మీ                ......  మద్దిగుంట నరసింహా  రావు

కాళహస్తిలొ T.V 9 వారి "సంచలన సామూహిక అత్యాచార యత్నం"

                                                               కందకు లేని దురద కత్తి పీట కు ఎందుకు అనేది మీడియా వారికి అస్సలు నచ్చని  మాట . కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి చానల్ పెట్టింది ఖాలిగా కూర్చోవటానికా ? అని T.V చానల్స్ వారి ప్రశ్న . అందుకే రంద్రాలు ఉన్నా లేక పోయినా రంద్రాన్వేషణ తప్పదు .               హిందూ మతo అంటే సరిపడని T.V 9 వారికి ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళ హస్తిలొ ఏదో గాంగ్ రేప్ అటెంప్ట్ జరిగిందని ఉప్పు అందింది అట ! దానితో వారు నానా హైరానా పడుతూ గొట్టాలు , కెమెరాలు తీసుకుని స్పాట్ కెళితే అక్కడ ఏమి కన్పించలేదు . అయినా మూల శంక తీరక పోలిస్ స్టేషన్ కి వెళితే అక్కడ అటువంటి పిర్యాదు చేయలేదన్నారు . దానితో లాభం లేదని వారే ఉన్నతాదికారులకు తమకు అందిన కూజాడ అందించి , దానికి కొంత మసాలా దట్టించి "సంచలన న్యూస్ " గా చానల్ లో"ఇంతా చేస్తే ఏమి జరగలేదే" అన్న తమ అందోళన ను ను ఘటన మిద ప్రజల ఆందోళన  గా చెపుతూ ప్రసారం చేసారు .అది చూస్తుంటే కాళ హస్తిలొని T.V 9 విలేకరికి , స్తానికంగా ఉండే వారికి సరిపడక సృష్టించిన కద  అనిపిస్తుంది . ఒక వేళా అది  నిజమే అయినా దాని వె

శ్రీజ విషయంలో "అజయ్ దేవగన్" అనుమానమే నిజమయింది !

Image
                                                             శ్రీజ ! ఒక ప్రముఖ తెలుగు సిని హిరో కుమార్తె ! సినిమా హిరో గారు అనేక సినిమాలలో హిరోయిన్లను వారి తల్లితండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రేమించి లేపుకు పోయిన సన్నివేశాలు చూసి పిచ్చెత్తి పోయి అయనకు  అభిమానులు గా మారిన యువత ఉండవచ్చు . కన్నవారి ముందే ప్రేమించిన ప్రియురాలును ముద్దేట్టుకుంటూ , అమ్మాయి తండ్రిని వేదవగా చూస్తూ ఆ హిరో చెప్పిన డైలాగులు ఆ యా సినిమా నిర్మాతలకు కోట్లాది రూపాయల లాబాల పంట పండిoచాయి . కాని సినిమా వేరు , నిజ జీవితం వేరు అని ఆ మెగా స్టార్ గారికి అయన కూతురే ఒక గోప్ప జీవన సత్యం బోదించింది . వందల సినిమాల్లో చెప్పిన వీర ప్రేమ డైలాగులు , నిజ జీవితంలో నీరు  కారి పోయాయి . సినిమా నటులలో సైతం ప్రేమించి పెండ్లి చేసుకున్న వారు ఉన్నారు . అందులోనూ సపలమైన వారు , విపలమైన వారు ఉన్నారు . పరిపక్వత చెందిన మనసుతో , సమాజం పట్ల ఉన్న నిబద్దతో అలొచిoచే వారు సంసారం అంటే సర్దుకు పోవడమే అని గ్రహించి సపలమవుతారు . సర్దుకు పోయే గుణం లేని వారు ఎక్కడున్నా కష్టమే !   శ్రీజ విషయానికి వస్తే అ అమ్మాయికి 15 సంవత్సరాలు వచ్చే  సరికి ప్రేమలో పడ్డది

"నాయక్" కెజ్రివాల్ విషయంలో "మనవు" చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమయింది !

                                                                                                    కెజ్రివాల్ రాజీనామా చేసేసాడు  కెజ్రివాల్ గారు "నాయక్ "{తెలుగులో ఒకే ఒక్కడు" ) అనే సినిమా స్పూర్తితో రాజకీయాలలోకి వచ్చినట్లుంది .టూకీగా ఆ సినిమాలో కూడా ఒకానొక సందర్బంలో ముక్యమoత్రి తో చాలెంజ్ చేసిన జర్నలిస్ట్ అయిన హిరో ఒక్క రోజు ముక్య మంత్రిగా పదవి చేపట్ట వలసి వస్తున్ది. అయితే అది సినిమా కాబట్టి హిరో గారు ఆ ఒక్క రోజులోనే అవినీతి పరులను ఏరి పారేస్తాడు . తనవెంట ఒక స్తెనొ ను తీసుకువెళ్ళి రేషన్ షాప్ డీలర్ మొదలు బడా ఆపిసర్ ల వద్దకు స్వయంగా తనే వెళ్లి అక్కడికక్కడే రూల్స్ ఏవి పాటించకుండా వారిని స్పాట్ సస్పెండ్ చేసేస్తాడు . ఇది చూస్తున్న ప్రేక్షకులకు అస్సలు సీట్లో కూర్చో బుద్ది కాదు . యమ హుషార్ వస్తుంది . నిజ జీవితంలో జరగని పనులు మూడు గంటల సినిమాలో చూసి అయినా ఆనందించే అల్పసంతోషం భారతీయ ప్రేక్షకులలో ఉంది కాబట్టి ఆ సినిమా నిర్మాతకు డబ్బులు తెచ్చిపెట్టి ఉన్దవచ్చు. కాని నిజ జీవితం లో అలా చేయాలని చూస్తె మాత్రం "ఎదురు దెబ్బలు" తప్పవు అని కెజ్రివాల్ గారి "జనలొక్ పాల్

చీపురు కట్ట చేతిలో ఉంది కదా అని అనుమతి లేకుండా ఇల్లు ఊడుద్దామనుకుంటే , చివరకు ఉద్యోగమే ఊడి పోయేటట్టుంది !

                                                         నేను ఇంతకు ముందు టపాలో "  పుట్టగానే అవినీతి పొట్ట చీల్చడానికి ఆం ఆద్మీ కెజ్రివాల్ ఏమన్నా "నరసింహవతారమా !?"     అనే దానిలో " ఇంకొక ప్రక్క ఆం ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నB.J.P   పార్టీ  ప్రధాన ప్రతి పక్షం గ ఉన్నంత కాలం, ఆం ఆద్మీ వారి పాలన తుమితే ఊడి పోయే ముక్కు లాంటిదే . అసలు ఆం ఆద్మీ పార్టీ అధినాయకుడు కి పాలనా పగ్గాలు చేపట్టడానికి ఎవరి సహాయం తీసుకోవాలి అన్న విషయం లో సరి అయిన నిర్ణయం తీసుకోలెదు అని పిస్తుంది. తమ పార్టీ ప్రాదాన అజెండ అవినీతి నిర్మూలన అయినప్పుడు , పోయి పోయి, దేశం లోని అవినీతికి మూల కారణమయిన కాంగ్రెస్ పార్టీ వారి సహాయం తీసుకోవడం ఏమిటి? విడ్డూరం కాకపోతే!తమకు కాంగ్రెస్ మరియు B.J.P పార్టీలు రెండు శత్రువులే అని ప్రకటించిన పెద్ద మనిషికి, అవినీతి విషయం లో ఎవరు ప్రదాన శత్రువు, ఎవరు ద్వితీయ శత్రువు అని ఆలోచించే ఇంగిత జ్నానం లేక పొయింది . కమ్మ్యునిస్ట్ సిద్దాంతం ప్రకారం బడా బూర్జువాలను ఎదుర్కోవాలంటే , అంత కంటే తక్కువ బూర్జువాలతో కలసి పని చేయాలి. ఈ సూత్రమే కేజ్రీ వాల్ గారి

పార్టీల పబ్లిసిటిల కోసం "పరువాల ప్రదర్శన " చేస్తున్న "పాపం పాపలు"!

Image
                                                             ఉడతా భక్తీ ! ఒక మహాత్ కార్యంలోఎవరైనా తమకు తోచిన లేక చేతనైన చిన్న సహాయం చెయ్యడాన్ని "ఉడతా భక్తీ " సహాయం అంటారు . పూర్వం శ్రీ రాముల వారు లంక మిద దండెత్తడం కోసం సముద్రం మిద వారధి నిర్మాణం తలపెట్టాడు . దాని కోసం మహా బలాద్యులైన వానర వీరులు పెద్ద పెద్ద బండరాళ్ళను తెచ్చి సముద్రంలో పదవెస్తుoటే అవి మునగకుండా ఒక రాతి వంతెన లా ఏర్పడుతున్నాయి అట ! దానిని చూస్తున్న అక్కడే ఉన్న ఒక ఉడుత తను కూడా రామ కార్యంలో పాలుపంచుకోవాలని తలచి ,  చిన్నగా ఉన్న తను  మహా సేతువు నిర్మాణానికి ఎ విదంగా సహాయ పడగలనని ఆలోచించిoదట !  వెంటనే దానికొక ఉపాయం తోచింది . సముద్రం దగ్గరలో ఉన్న ఇసుకను తన ఒంటి నిండా పులుముకుని , సేతువు నిర్మాణం వద్దకు వెళ్లి అక్కడ ఒంటికి ఉన్న ఇసుకను విదల్చడం చేసిందట . అలా రోజంతా చేస్తూ కొంత ఇసుకను సేతువు నిర్మాణానికి సమకూర్చిమ్దట . అది చూసిన రాముల వారు దాని భక్తికి మురిసిపోయి ,  ఆ ఉడతను ప్రేమగా చేతిలోకి తీసుకుని దాని విపు మిద నిమిరాడు అట ! అవే ప్రస్తుతం ఉడత మిద కనిపిస్తున్న మూడు చారలు అని పురాణం కద !   ఇదిగో ఇప్పుడు ఇద్దరు  మ

ఆరేసుకుంటే సినిమాల్లో,పారేసుకుంటే రాజకీయాల్లో ఎలా రాణించవచ్చో ఈ రాజమండ్రి "మదుర వాణి " ని చూసి తెల్సుకోవచ్చు

                                                       రాజకీయాలు అంటే సామాన్యులు కన్నెత్తి చూడదగిన రంగం కాదు . ఏదో డిల్లీలో అమ్ అద్మి పార్టీ  లాంటి ప్రయోగం విజయవంతం కావడానికి కచ్చితంగా "నిర్భయ" ఉదంతం లాంటివి కారణం . ఒక వ్యక్తీ ఎంత గొప్పవారైనా అతని గురించి సరి అయిన గుర్తింపు లేకపోతె ప్రజాస్వామ్యంలో నెగ్గడం కష్టం . మరి ఎన్నికల్లో నిలబడే అబ్యర్దికి అటువంటి గుర్తింపు  రావాలంటే, అబ్యర్ది ప్రముఖ పార్టికి చెందిన వ్యక్తీ అయినా అయి ఉండాలి . లేదా ప్రజల్లో ఏదో రకంగా పబ్లిసిటి పొందిన వ్యక్తీ అయినా అయి ఉండాలి .అందుకే  రాజకీయ రంగంలో సినిమా నటులకు అందులో అందమైన ముద్దుగుమ్మలకు అవకాశాలు ఎక్కువ . వారికి రాజకీయాలు గురించి ఎ మాత్రం తెలియక పోయినా పర్వాలేదు . ప్రజలను ఆకర్షించగల రూప , హావ బావాలు తో పాటు చక్కగా మాట్లాడగల "మదుర వాణి " లు అయితే  చాలు . పార్టీల నాయకులే వారికి పిలిచి మరి టికెట్ లు ఇచ్చి గౌరవిస్తారు . పార్టి ఇమేజ్ తో పాటు పర్సనల్ ఇమేజ్ తోడైతే ఇక ప్రజా స్వామ్యంలో గెలుపుకు అడ్డేముంది ?   ఈ విషయం తెలుసుకున్న నటీమణులు పాం లో ఉన్నంత కాలం సినిమాల్లో అందాలు ఆరబోసి ప్రజలను మైమ

నిర్భయ చట్ట భయమే అనూహ్య మర్డర్ కు కారణమా ?

                                                                                           ముంబాయి పోలీసులు చెపుతున్న కొన్ని అంశాలు వింటుంటే అనూహ్య హత్యకు నిర్భయ చట్ట భయమే హంతకులు ను ఆమెను హత్య చేసేలా పురి కోల్పాయి ఏమో అనిపిస్తుంది .  సంచలనం రేపుతున్న మచిలీ పట్నo ఇంజనియర్ అనూహ్య కేసులో ఇంతవరకు నిందితులు ఎవరో తేలలేదు . ఆ  అమ్మాయి మిద ఎటువంటి అత్యాచారం జరిగినట్లు పోస్ట్ మార్టం లో తేలలేదు . మరి ఆమె వద్ద నున్న సోమ్ము కోసం ఎవరైనా దోపిడీ చేసి ఆ తర్వాత ఆమెను చంపారా అంటే ఆమె వద్ద అంత విలువైన వస్తువులు ఉన్నట్లు ఆమె కుటుంభ సబ్యులు చెప్పలేదు కాబట్టి , అది కారణం కాదు . మరింకేమై ఉంటుంది ఆమె మర్డర్ వెనుకాల మోటివేషన్ అనేది ముంబాయి పోలీసులను వేదిస్తున్న ప్రశ్న !.   పోస్టు మార్టం  రిపోర్టు లో ఆమె  మద్యం సేవించినట్లు ఆనవాళ్ళు లభించాయి అంటున్నారు . ఆమె చివరి సారిగా కన్పించింది(సి.సి పుటేజ్ ) జనవరి 5 న . ఆమె శవం  ని కనుగొన్నది జనవరి 16 న . అప్పటికే సగం  కాలిన ఆమె శరీరం కుళ్ళి పోవడానికి సిద్దంగా ఉన్నట్లుంది . అంటే ఈ మద్య   కాలంలో ఆమెను ఎవరో నిర్బందించి , ఆమెను ఏదో కోరితే ఆమె ఒప్పుకోక పోవటం వ

పెళ్ళాం బిడ్డలతో కలసి ఉండలేని కైకలూరు M.L.A గారు రాష్ట్ర ప్రజలను కలిసి ఉండమంటున్నారు

Image
                                                        ప్రజలకు ఏదైనా చెప్పే అధికార స్తాయి ఉన్న పెద్దమనుషులకు కొంత నైతిక అర్హత కూడా ఉండాలి . అలా లేని వారు ప్రజలకు సుద్దులు చెప్పాలని చూడడం శుద్ద అవివేకం అవుతుంది . ఈ సూత్రం సిమాంద్రాకు చెందిన కైకలూరు M.L.A జయ మంగళం వెంకట రమణ గారికి నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది .     జయమంగళం గారు కైకలూరు నియోజక వర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిది. అయన గారి నియోజక వర్గంలో ప్రజల బాగోగులను చూడడం అయన గారి బాద్యత . కుటుంభ సమస్యల పరిష్కారం నిమిత్తం కౌన్సెలింగ్ ఇవ్వడమనేది ప్రబుత్వం యొక్క విదుల్లొ ఒకటి . అందుకోసం ప్రతి పోలిస్ స్టేషన్ లో నమోదయ్యేకుటుంభ  కేసుల్లో తొలుత కౌన్సెలింగ్ నిర్వహించి ,పలితం లేకపోతేనే క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని మార్గ దర్సకాలు ఉన్నాయి . మరి అటువంటిది సాక్షాతూ ప్రజా ప్రతినిది అయిన M.L.A గారి మీదే కుటుంబ వేదింపుల కేసు నమోదు కావడం ఎంత సిగ్గు చేటు . 5 నెలలు గడువు ఇచ్చినప్పటికీ కట్టుకున్న బార్యతొను , కన్న బిడ్డలతోనూ ఒక అవగాహనకు రాలేని వారు ప్రజలకు ఏమని నీతిని బోదిస్తారు ?  M.L.A అయినంత మాత్రానా కుటుంభ సమస్యలు ఉండవా అని ఎవరై

డిల్లీ లో హెయిర్ స్టయిల్ నచ్చకపొతె కొట్టి చంపుతారట !

                                                          మన దేశ  రాజధాని డిల్లి రేపిస్ట్ లకు రేసిస్ట్ లకు నిలయం అయిందా అని అనిపిస్తుంది ఈ  మద్య జరుగుతున్నా ఘోర సంఘటనలు చూస్తుంటే !. సరిగా సంవత్సరం క్రితం దేశాన్ని ఒక ఊపు ఊపిన నిర్భయ రేప్  ఉదంతం దేశ  రాజదానిలో స్త్రీలకు ఉన్న రక్షణను తేట తెల్లం చేసింది . డిల్లి రాష్ట్రంలో , కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టి మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పటికీ డిల్లి ప్రబుత్వాన్ని డిల్లి పోలిస్ యంత్రాంగం లెక్క చేయని పరిస్తితి! ఎందుకంటే డిల్లి  పోలిస్ వారి పగ్గాలు కేంద్ర హొమ్ మంత్రిత్వ శాఖ పరిదిలో ఉండటమే . ఇక ఇప్పుడు కెజ్రివాల్ గారి ప్రబుత్వం వచ్చాక పోలిస్ వారు రాష్ట్ర ప్రబుత్వం ని ఖాతరు చేస్తారు అన్నది అనుమానమే ! ముగ్గురు పోలిస్ అధికారుల మిద చర్యలు సాక్షాత్తు డిల్లి ముక్య మంత్రి ఒక రోజల్లా ధర్నా చెయ్యాల్సి వచ్చిందంటే డిల్లి పోలిస్ వారి పవర్ ఏమిటో అర్దమవుతున్ది. ఇలాంటి దౌర్బాగ్యపు విదానం ఉండబట్టే డిల్లీలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది .   5 రోజుల క్రితం దిల్లిలొని లజపతి నగర్ లో జరిగిన ఈ  దారుణ ఉదంతం దేశ  రాజదానిలో శాంతి బద్రతలు పరిస్తితిని తెలియ

నోటి దూల డైలాగే మూతిమీద కొట్టింది ! ఫస్ట్ క్లాస్ లో పాసయిన వారే "పద్మశ్రీ " ని ఉపయోగించోదన్నారు !

                                                           అయన గారొక డైలాగ్ కింగ్ . తన సినిమాలు బాగా ఆడాలని అడ్డమైన డైలాగ్లు అన్ని తన సినిమాలో చొప్పించి అందరిని అవమాన పరుస్తూ ఉంటాడు . అదేమని అడిగినవారిని తన వాళ్ళను ఉసికొల్పి బాదిస్తాడు . అందుకే ఎవరికీ జరగని ఘోర అవమానం జాతీయ స్తాయిలో ఇతనికి జరిగిoది . అందరూ చేసే పనినే ఈయన చేసినప్పటికీ ఇతనికే శిక్ష ఎందుకు అంటే కేవలం అతని నోటి దూల మాత్రమె అని చెప్పక తప్పదు.    సాదారణంగా సినిమా నటులు తమకు గల "పద్మశ్రీ " బిరుదును సినిమా టైటిల్స్ లో వేసుకుంటుoటారు . తమ పేరు ముందు అలా తమ బిరుదులూ పెట్టమని నటులు ప్రత్యేకంగా చెప్పకపోయినా , నిర్మాతలు అలా టైటిల్స్ వేయడం సాంప్రదాయంగా వస్తున్నదే !అయితే ఇలా జాతీయ అవార్డులను కమర్షియల్ గా వాడుకోవడం కేంద్ర ప్రబుత్వ మార్గ దర్సకాలకు వ్యతిరేకమని గతంలో ఒక కేసులో సుప్రిం కోర్టు వారు తీర్పును ఇచ్చినప్పటికీ దాని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అంటే కాకుడా ఎవరి విషయంలోనూ ఇది వివాదాస్పదం కాలేదు . కాని డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి విషయంలోనే ఎందుకు వివాదాస్పదం అయిందో అందరికి తెలుసు.   "దేనికైనా రెడి &quo

కోపమొస్తే ఆ బార్యా భర్తలకి బట్టలిప్పదీసి విశ్వ రూపం చూపించడం ఒక అలవాటట !.

                                                        అ అమ్మాయి పేరు అనురాధ , అబ్బాయి పేరు ప్రభాస్ . వారిద్దరికి ఉన్న ఒక ప్రత్యెక లక్షణం ఏమిటంటే , ఎవరైనా తమకు నచ్చని పని చేసి కోపం కలిగిస్తే వారిని ఏమి అనరు అట ! సింపుల్ గ ఒంటి మిద బట్టలు విప్పదిసి విశ్వ రూప ప్రదర్సన చూపిస్తారట . ఆ దెబ్బతో ఎదుటి వాళ్ళు ఠారెత్తి పోయి బ్రతుకు జీవుడా అంటూ పారి పోవటం కాని , అ జంట కోరిన పని చేసి పెట్టడం కాని జరుగుతుందట . మరి ఇతరుల సంగతి సరే , వారిద్దరిలో ఒకరి మిద మరొకరికి కోపం వస్తే ఏమి చేస్తారని కదూ మీ అనుమానం . అదే చెప్పబోతున్నా ! ఒక వేళా అ జంటలో ఒకరి మిద ఇంకొకరికి కోపం వచ్చినా సేమ్ పద్దతి! బట్టలిప్పదదీసుకుని బాదేసుకుంటారట ! అనక ఆవేశం చల్లారాకా ఏమి చెయ్యాలా అని అప్పుడు అలొచిస్తారట ! అది వారి స్పెషాలిటి !   అదిగో అలాంటి యువ జంట ప్రభాస్ , అనురాధ లకు డిల్లిలొని రాష్ట్రపతి గారిని కలిసి మాట్లాడాలి అనిపించిందట . అనుకున్నదే తడవుగా ఇరువురూ బయలుదేరి డిల్లి వెళ్ళారు . అక్కడ రాజ్ భవన్ చూడాగానే అన్నమాచార్యులుకుమొదటి సారి తిరుమల కొండ చూస్తె ఎంత అనందం కలిగిందో అంత ఆనందం కలిగింది . అయితే వారికి అన్నమయ్య గారి

సినిమాలో నటించాలంటే రంకు, రాజకీయాల్లో రాణించాలంటే బొంకు లాడాల్సిందేనా!?

                                                            నీతి అంటే ఎమిటి? సమాజంలో బ్రతకడానికి నీతిగా ఉండాల్సిన  అవసరం ఉందా? ఉంటే ఆ అవసరం కొంతమందికే  ఉందా? లేక సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉందా? ఇవ్వన్ని సామాన్యుడికి అర్దం కాని ప్రశ్నలు .   కొంతమంది అంటుంటారు, పొట్టకూటికోసం  చేసే  తప్పు తప్పు కాదు అని .  కేవలం పై స్తాయిలో దోపిడి చేస్తున్న రాజకీయ నాయకులని , ఇతర వర్గాలను విమర్శించాలి కాని, క్రింది స్తాయి వారిని  విమర్శించ రాదు అని కొంత మంది ద్రుడాభిప్రాయం. సరే! అలాగే అనుకుందాం కాసేపు. నా జేబులో నుంచి పది రూపాయలు కొట్టేసిన వాడి పట్ల జాలి చూపించడం అలవాటైన నాకు క్రమంగా కోట్లు కొట్టేసిన వాడి పట్ల అదే బావం కలుగుతుంది. ఎందుకంటే నా జీవన శైలి లో తప్పులును క్షమించటం ఒక అలవాటుగా మారడం వల్లా అది చిన్నదైనా , పెద్దదైనా ఒకే రకంగా ట్రీట్ చేసే స్తాయికి అలవాటు పడిపోతాను .ప్రస్తుతం ఇదే అలవాటు ప్రజలకు  ఉండటం వలననే దేనిని పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవటం వలన సమాజ పతనానికి  కారకులవుతున్నాం.   ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే మొన్న టి.వి 9.వారు ఒక సినిమా హీరోయిన్ ని స్టింగ్ ఆపరేషన్ లో బ్రోతల్ గా రెడ్ హాం

కంచర పాలెం అమ్మాయి స్కూల్ కు వెళ్ళక పొతే, లెక్కల మాస్టర్ ఒళ్ళు పగలాల్సిందేనా ?

Image
                                                                                                                                                ఈ  మద్య తెలుగు ప్రజలు బాగా చైతన్య వంతులై పోయారు . ఎంత చైతన్యo అంటే ఆడపిల్లలు ఒక మాట తమ పంతుళ్ళు గురించి చెపితే చాలు ఇక వారె అన్ని అధికారాలను తమ చేతులలోకి తీసుకుని నిందితులను విచారణ చేయకుండానే శిక్షించే స్తాయికి ఎదిగి పోయారు . చివరకు పోలీసులు కూడా అలా ప్రజలు చట్టాలను తమ చేతుల్లోకి తిసుకోవడాన్ని కళ్ళప్పగించి చూస్తున్నారు తప్పా వారినేమి అనలేక పోతున్నారు . చివరకు ఈ అరాచక దండన విదానం ఎక్క డికి దారి తీస్తుందో అర్ధం కావడం లెదు.    నక్సైలైట్లు నిర్వహించే "ప్రజా కోర్టులు " కానీ, హర్యానాలో జరిగే "ఖాప్ పంచాయతీలు " కాని ,వారి పద్దతిలో విచారణ అంటూ జరిపాకే శిక్షలు విదించడం జరుగుతుంది . ఇవి చట్ట విరుద్దమయిన న్యాయ విదానాలు అయినప్పటికీ నిo దితులు కు తమ పై ఆరోపించబడిన ఆరోపణలకు సమాదానం చెప్పుకునే వీలు ఉంటుంది . ఇది పంచాయతి విచారణ యొక్క మౌలిక లక్షణం . కాని ఏదో తమ అమ్మాయి చెప్పిoదనే ఒకే ఒక సాకుతో పంతుళ్ళను ఇష్టం వచినట్లు , పదిమంది కల