అర్దరాత్రి ఆరంభం అయ్యే ఇంగ్లీష్ ఇయర్ ! ఉషోదయంతో మొదలయ్యే తెలుగు ఉగాది ! మనకు ఏది కరెక్టు ?
నూతన సంవత్సరంలో తొలి రోజు .తొలిరోజు లో మొదటి క్షణాలకు కు మనం స్వాగతం చెప్పే విదానం ఎలా ఉండాలి ?ప్రజలందరూ ఆనందంగా గడచి పోయిన సంవత్సరానికి వీడ్కోలు చెపుతూ ,వస్తున్న సంవత్సరానికి ఆహ్వానం పలకాలి . అసలు పాత సంవత్సరo చీకటిలోదొంగలా వెళ్ళిపోవడం ,కొత్త సంవత్సరంఅదే చీకట్లో మరో దొంగలా రావడం,దానికి మనమేమో పుల్ గా మందు కొట్టి ,ఒళ్ళు పైనా తెలియని స్తితిలో ,పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తూ ,స్వాగతం పలకడం చూస్తుంటె ,ఇదేదో నిశాచరులు చేసుకునే పండుగ లాగుంటుంది కాని ,పౌరులు చేసుకునే పండుగ లాగుంటుందా? రాత్రంతా తాగి ఉగడం ,వాగడం ,అర్దరాత...