తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

                                                                       

                 మనుస్మ్రితి ప్రకారం హిందువులలో 8 రకాల వివాహాలు ఉన్నాయి. అందులో 8 రాకాలు నేటి సమాజంలొ వాడుకలో లేవు కేవలం 2 రకాలు మాత్రమే ఆమోదం పొందుతున్నాయి. అందులో మొదటిది ప్రజాపతి వివాహంకాగ రెండవది గాందర్వ వివాహం.

  ప్రాజాపతి వివాహం:- ఈ పద్దతిలో వదూవరుల తల్లితంద్రులు తమ పిల్లలు గ్రుహస్త జీవితం పొందగలందులకు,తగిన సంబందంను వారి వ్వారి, వంశ చరిత్రలను పరీశిలించి తమకు,పిల్లలకు అనుకూలమైనదిగ బావించిన సంబందాన్ని స్తిరపరిచి వివాహం చేసీ నూతన దంపతులను ఆశీర్వదించడమే ఈ వివాహ పద్దతి.

గాందర్వ వివాహం:- ఈ పద్దతీలొ తల్లి తంద్రుల అనుమతి లేకుందా కేవలం వదూవరులే తమ ఇష్టానుసారం ఒకరినొకరు కోరుకుని కలిసి జీవించడం ఉంటుంది. ఇతువంటి వివాహాలో కేవలం కామ ఇచ్చయే ప్రదానం అని మనువు బావిస్తాడు.

 అసలు వదూవరులకు తల్లి తండ్రుల అనుమతి లేకుందా పెండ్లి చేసుకునే హక్కునివ్వడం  సమర్దనీయామా? పరీశీలిద్దాం.

  ఈ సమాజంలో ఏ వ్యక్తి స్వయంభువు కాడు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా తనకు తానుగ జన్మించిన వాడు కాడు. అతని జననానికి కారకులు తల్లి తండ్రులు. శాస్త్రీయ పరిజ్గ్నానుసారం :-

      పురుషునిలో  XY   క్రోమోజోములు ఉంటే స్త్రీ లో XX   క్రోమోజోములు  ఉంటాయి. పురుషునిలోని క్రోమోజోములు అతని తంద్రిలోని X య్క్రోమోజోము, తల్లిలోని X క్రోమోజోము కలిసి ఏర్పడుతాయి  అంటే ఒక పురుషుని క్రోమోజోములు ఒక్క మాత్రుక స్వారూపం XX, XY. అలాగే ఒక స్త్రీ లో ఉండె  క్రోమోజోములు ఒకటి తల్లి నుండి మరొకటి తండ్రి నుండి సంక్రమిస్తాయి. కాబట్టి స్త్రీ  క్రోమోజోములు ఒక్క మాత్రుక స్వారూపం కూడ  XX, XY. ఈ కారణం వల్లనే స్త్రీ పురుషులు ఇరువురు  సమానులు అవుతున్నారు.

    కాబట్టి పయి లెక్క ప్రకారం ఒక వ్యక్తి ఇరువురి ఇచ్చా రూపమే కాదు వారి అనువంశిక లక్షణాల స్వారూపం కాబాట్టీ తను బవిష్యత్తులో ఎవరితో కలిసి తమ వంశానుక్రమాని అభివ్రుద్ది పరచుకోవాలి అనే విషయములో ఆ వ్యక్తి తల్లి తండ్రులకు సంపూర్ణ అదికారముంది. దానిని కాదనే హక్కు రాజ్యా వ్యవస్తకు  ఉండటం అభిలషనీయం కాదు. ఇది కచ్చితంగా ఒక కుటుంభ పరిరక్షణ హక్కులకు బంగం కలిగించడమే అని మా అభిప్రాయం.

       యవ్వన్నం లో మనిషి బుద్ది చపలంగా ఉంటుంది . ఆ దశ లో అతను లెక ఆమే కుటుంభం కంటె తమ లోని కామ ప్రాకోపాలకే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. దానికి ప్రేమ అనో మరేది అనో ఒక అందమైన పేరు తగిలించుకుని ముందు వెనుక కానక కలిసిపొఈ జీవీతాలు నాశనం చేసుకుంటారు. ఇండియన్ కాంట్రాక్ట్ ఏక్ట్ ప్రకారం కూడ ఏదైనా ఉన్మాద స్తితిలో చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. కాని కేవలం కామ ఉన్మాదంలో చేసుకుంటున్న ఇటువంటి పెళ్ళిలను కేవలం వయసు ప్రాతిపదికగా అనుమతించడం  ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రతి వివాహానికి తల్లితంద్రుల అనుమతి తప్పనిసరి చేయాలి. ఒకవేళ వివాహం విషయమ్లో తల్లి తండ్రుల నిర్ణయం కుటుంబ అబివ్రుద్దికి గాక స్వార్ద పూరితమైందని పిల్లలు బావిస్తే దానిని కుటుంబ న్యాయ స్తానాల రుజువు చేసి అట్టి కోర్టుల అనుమతితోనే వివాహం చేసుకునేతట్లు చట్ట సవరణ తెస్తే మంచిదని మా అభిప్రాయం’ ఏమంటారు.?

                    http://wiki.answers.com/Q/What_about_court_marriage         

Comments

  1. ఆ విదంగా చట్ట సవరణ తేస్తే ప్రేమికుల ఓట్లన్ని ఎగస్పార్టీలకే .ఒకవేళా చిరంజీవి గారు భవిష్యతులో ప్రదాన మంత్రి అయితే ఇటు వంటి చట్ట సవరణకు డేర్ చెయ్యవచ్చు. మొత్తానికి ఆలోచించాల్శిందే.

    ReplyDelete
  2. ఇది మంచి ప్రతిపాదన కాదు. ఎదిగిన పిల్లలు పిల్లలు కారు. ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న పిల్లలకు మార్గదర్శనం చేయాలే తప్ప శాసించకూడదు. 16 ఏళ్ళు దాటిన పిల్లల్ని స్నేహితులుగా మాత్రమే చూడాలని మనువు వ్రాశాడు.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పేదాంట్లో ఒక మెలిక ఉంది. (1) ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న పిల్లలు (2) 16 సంవత్సరాలు నిండిన పిల్లలు. మేము చెప్పింది వయో ప్రాతిపదికన అనుమతించటం ఎంతవరకు సమంజసం అని.

      మా అభిప్రాయం ఏమిటంటే ప్రేమ అనేది ఇరువురు వ్యక్తులకు సమ్బందించినది అయితే, వివాహం రెందు కుటుంబాల మద్య అంగీకార తంతు. ముక్యంగా పెండ్లి అయిన తరువాత వరుని ఇంట్లోకి(సాదార్ణంగా మన ఇండ్లలో ఇల్లరికాలు ఉండవు కాబట్టి) గ్రుహ ప్రవేశం చేసే వదువు, ఆఇమ్టి వాతవరణంలో కలిసిపోవాలంటే ఆ కుటుంబ సబ్యుల స్వీకారం అవసరం. లేకుంటే అప్పట్టిదాక ప్రాశాంతంగా ఉన్న కుటుంబం కాస్త అల్లకల్లోలమవుతుంది. ఇది అవాంచనీయం కాదా? ఒక వెళ వేరు కాపురం పెట్టి ఎవరి దారిలో వాళ్లే ఉంతాం అన్నా ఒకరి తో కలయిక కోసం రక్త సంభందాలు తెంచుకోవడం ఎంతవరకు బావ్యం.? అర్థిక స్వాతంత్ర్యం ఉంది గదాని కుటుంభాన్ని ఖాతరు చెయ్యకుంటే మీ కుట్ంబ అర్థిక స్తితిగతుల మాటెమిటి? ఈ విదంగా సమాజం నడిస్తే ప్రతి కుటుంబ సబ్యునిలో అబద్రతా బావం పెరిగిపోయి స్వార్దాలు ఎక్కువై చివరకు అనుబాందాలు, ఆత్మీయతలు మ్ర్యుగ్యమై ప్రతివాడు అనాదలా ఫీల్ అయే పరిస్తితి దాపురిస్తుంది.

      ఒక చిన్న విషయమ్ చెప్పండి. కని 20 యెండ్లు పెంచి పోషించి మీకు అన్ని ఆప్యాతలు పంచిన కుటుంబా సభ్యులను కేవలం ప్రేమ పేరుతో కాలదన్నటం ఇదా దర్మం? కనీసం తల్లి తంద్రులకు వారి బాద చెప్పుకునే అవకాశం కూడ లేదా? ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్దం కాదా? అందుకే వివాహానికి తల్లితండ్రుల అనుమతి కాని న్యాయస్తానాల అనుమతి కాని కంపల్సరి చెయ్యాలి. అప్పుడే తల్లి తంద్రుల బాదేమిటో చెప్పుకునే అవకాశం ఉంటుంది.
      మీరన్నట్టు, స్నేహితుడైనా తనతో స్నేహం చేడిపోయే ప్రేమను ప్రోత్సహిస్తారని నేను అనుకోను.ఏదైనా ఏవిషయంలో తల్లితంద్రుల అభ్హిప్రాయలు వినడం వారికి న్యయంచెయ్యడం సమాజ బాద్యత.

      Delete
  3. మీరు ప్రతిపాదిస్తున్న నిబంధన ఆధునిక ప్రపంచంలో ఎక్కడా లేదు. బహుశా రాదు. ఎందుకంటే మన శాసనసభ్యుల్లోనూ, మంత్రుల్లోనూ (నిజానికి ప్రభుత్వోద్యోగుల్లోనూ) కూడా ఒక గణనీయశాతం మంది ప్రేమించి పెళ్ళిచేసుకున్నవాళ్ళే. ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నవాళ్ళని కట్టడి చేయడం అసాధ్యమే కాదు, అవాంఛనీయం కూడా ! పూర్వం ఉద్యోగాలు లేని రోజుల్లో, అందఱూ వంశపారంపర్య వృత్తి మాత్రమే ఉమ్మడిగా చేసుకుంటున్న కాలంలో, ఆస్తులన్నీ ఉమ్మడి అయిన పరిస్థితుల్లో ఇలాంటి చట్టం లేకపోయినా అందఱూ తల్లిదండ్రులు చెప్పినట్లే వినేవారు.

    మన దేశంలో తల్లిదండ్రులు కేవలం కులం, ఆర్థిక హోదా తప్ప ఇంకేమీ చూడరు. తలిదండ్రులకి అవకాశమిస్తే వాళ్ళు చెప్పుకునే బాధ 90 శాతం కేసుల్లో ఈ రెంటి గుఱించే అయ్యుంటుంది. కానీ కులసంకుచితాల్ని అధిగమించడం మన ఆధునిక సమాజ లక్ష్యం. అలాగే వర్గసంకుచితాల్ని అధిగమించడం నిజమైన ప్రేమ లక్షణం. తల్లిదండ్రులకి ప్రాధాన్యమిస్తే ఈ రెండు ఆదర్శాలూ మఱుగున పడతాయి.

    "ఇన్ని సంవత్సరాలు పెంచాం" అనే వాదన తార్కికంగా బానే ఉంటుంది. కానీ లైంగిక తోడు గుఱించిన ఆరాటం ఆ అన్ని సెంటిమెంట్ల కంటే బలవత్తరమైనది. సృష్టిలో దాని ఫోర్స్ చాలా చాలా శక్తిమంతమైనది. ఆ ఫోర్స్ మూలానే ఆడది పతివ్రత అవుతోంది. మగవాడు ఒళ్ళు హూనం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇది తల్లిదండ్రులకి సైతం వర్తిస్తూంటే మఱి పిల్లలకి మఱోలా ఉంటుందా ?

    ReplyDelete
  4. నేను భారతదేశంలోని తల్లి తండ్రులు గురించే మాట్లాదుతున్నాను. ప్రపంచంలో కెల్లా భరతీయ కుటుంబ వ్యవస్త విశిష్టమయినడి. కాబట్టి ఇతరదేశాలతో దానిని పోల్చటం అర్థంలెని పని. ఇకపోతే రాజకీయ నాయకుల సంగతి. వాళ్ల స్వవిషయాలు రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చెయ్యవు. ప్రజల డెమాండ్ మాత్రమే ప్రభావితం చేస్తాయీ.ఆర్థిక స్వాతంత్ర్యం తల్లితండ్రుల ఆకాంక్షలను వమ్ము చెయ్యడానికా? అళా మీరు చెప్పేది నిజమయితే ఉద్యొగాలు ఉన్నవాళ్ళు, దనవంతులు అందరు తల్లితంద్రులను కాదని, తమ సెక్స్ పార్టనర్(ఇది మీరు చెప్పిన అర్థమే) లతో తమ సెక్స్ రాజ్యాలను యేలేవారు.

    తల్లితండ్రుల మీద మీకున్న నమ్మకానికి శతకోటి వందనాలు. వాళ్ళు ఏమి చేసినా ఏమి చూసినా పిల్లల బవీషత్తు కోసమే. ఒక వేళ వారు సంకుచితంగా ఉంటే దానిని న్యాయస్తానాలు నిర్ణయిస్తాయి.దేనికైనా విది విదానాలు ఉంటాయి కాబట్టి దాని గురించి బయపడాల్శింది యేమి ఉండకపొవచ్చు.నిజమైనా ప్రేమలు అంటె సెక్స్ ప్రేమలనేగా చెప్పేది. దీని గురించి నేను చూసిన ప్రేమ గురించి ప్రత్యేకంగా టపా పెడతాను. అప్పుడు చర్చిద్దాం.

    సెక్స్ కోసం ఆడది పతివ్రత కావడమేమిటో నా చిన్న బుర్రకు అర్థం కాలేదు. కాస్త వివరించగలరు.మీ వాదన ప్రకారం నపుంసకుడు పనిచెయ్యకుండా ఇంట్లో పక్కేసుకుని పడుకుంటాడా? తల్లితండ్రులు చూసే తోడు లైంగిక తోడు కాదా? జంతువుల్ని కట్టబెడతారా? చాలా విచిత్రంగా ఉంది మీ వాదన. మేము చెప్పేది వారు కాదన్న వివాహం చేసుకునే ముందు వారి వాదనలు వినే అవకాశం వారికిమ్మని. అంతే కాని వాళ్లు అసలు పెల్లి వద్దంటే ఊరుకొమ్మని కాదు.

    ReplyDelete
  5. "...సెక్స్ కోసం ఆడది పతివ్రత కావడం..."

    ఈ మాట నేను వాడలేదు. మీరు వాడి నేనన్నానని వ్రాయడం సరికాదు. నేను ’లైంగికతోడు’ అనే మాట వాడాను. గ్రహించగలిగితే, పాతివ్రత్యం కూడా ఒకరకం లైంగిక ఆకర్షణే.

    నాకు మన దేశపు తల్లిదండ్రుల మీద నమ్మకం లేని మాట వాస్తవమే. ఎందుకంటే వారి Track record అలాంటిది. మన సమాజంలో Parental power ని దుర్వినియోగం చేసేవాళ్ళే హెచ్చు.

    "...ఒక వేళ వారు సంకుచితంగా ఉంటే దానిని న్యాయస్తానాలు నిర్ణయిస్తాయి..."

    ఒకసారి మీరు కోరిన మార్పు చేశాక ఇక న్యాయస్థానాలు నిర్ణయించేదంటూ ఏమీ ఉండదు. పిల్లల మీద తళ్లిదండ్రులకు soft power ఉండడం వాంఛనీయం. Hard power ని ఉపయోగించడం వల్ల ఇప్పుడున్న ఈ కాస్త సత్సంబంధాలు కూడా చెడిపోతాయి.

    ReplyDelete
  6. లైంగిక తోడు అంటె ఆంగ్లంలో సెక్స్ సప్పోర్ట్ అని అన్నారనుకున్నాను. ఇంక ఆమాటని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పారు కాదూ! మళ్లి ప్రాతివ్రత్యం కూడ లైంగిక ఆకర్షణే అంటారు.సరే మన చర్చ ఏ విషయం మీద కాదు కాబట్టి దీన్ని పక్కన పెడదాం.

    మీ వాదం ప్రస్తుత యువతరం బావనలకు అద్దం పడుతుంది. కుటుంభం కంటే లైంగిక ఆకర్షణే ముఖ్యమనే మీ బావనలు కుటుంభ ఉనికికే విఘాతం. అంత నిష్కర్శగా కుటుంభాన్ని కాలదన్నుతుంటే,ఆర్థిక స్వాతంత్ర్యం ఉందన్న దన్నుతో ద్రోహానికి పాల్పడుతుంటే, దానికి నష్ట నివారణ చర్యలు చట్టం ద్వారా కుటుంబానికి లభించాలి. ఇదివరలో మనకు విడాకులు ఉండేవి కావు. కాల క్రమేనా అవి మన బుద్దులుకు తగ్గట్టు అవసరమయాయీ. ఇప్పుడు మీ వాదన చూస్తుంటే విడాకులు బార్యాభర్తల మద్యే కాదు, కుటుంభ విడాకులు పద్దతి ప్రవేశ పెట్టడం అనివార్యమని పిస్తుంది. ఒక సంవత్సరం కలిసిఉన్న లైంగిక తోడుకే విడాకుల పేరుతో నష్ట పరిహారం పొందుతుంటే, 18 యేండ్లు పెంచి పోషించి నిర్ద్యగా కాలితొ తన్ని వెలుతుంటె కళ్లల్లో నీరు, నోట్లో గుడ్డలు కుక్కుకోని ఏదుస్తుందాల? అంత ఖర్మేంటి? మమ్మల్ని వద్దనుకున్న వారు, మాకు వద్దు అని దీమాగా భారతీయ తల్లితండ్రులు అనుకోవాలి. నష్ట పరిహారం కట్టి కోడుకులు బయటకు పోవాలి. అందుకోసమఈనా చట్ట సవరణ తప్పనిసరి.

    ReplyDelete
  7. 1999 లో పుట్టిన మీరు, మీ వయసుకు తగ్గట్టే రాసారు. మీ ఆలోచనల్లో పరిపక్వత లేని విషయం మీకు తెలియదు లెండి, టీనేజ్ వయసు కదా. మహాశయా, మన దేశం లో యువత సంఖ్య ఎంత? అందులో

    ప్రేమించే వాళ్ళు ఎందరు? ఆ ప్రేమను అవతలవారికి జంకు లేకుండా వ్యక్తపరిచేవారెందరు? అందులో పరస్పరం ప్రేమను అంగీకరించుకునేవారెందరు? లైఫ్ లో సెటిల్ అయ్యేవరకూ ఆగేవారు/ఆగని వారు

    ఎందరు? తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించేవాల్లెందరు? లేచిపోయేవాల్లెందరు? ఏదో పేపర్లో వార్తలు చదివి అసలు ఏం జరుగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఇలా చట్టం చేయ్యండి, అలా చట్టం చెయ్యండి అనటం

    ఎంతవరకు సమర్థనీయం?
    పేపర్లో ఇలాంటి వార్తలే కాని, నిజ జీవితం లో తల్లి దండ్రులని ఒప్పించి పెళ్ళి చేసుకున్న ప్రేమికులని చూసారా మీరు? పోనీ లైఫ్ లో సెటిల్ అయ్యాక కూడా తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే తాము పెళ్ళి చేసుకుని

    కొన్నేళ్ళ తరువాత (మనవడో మనవరాలో పుట్టాక) తల్లిదండ్రులతో సంతోషంగా కలిసిపోయిన ప్రేమికులని చూసారా? నా మిత్రుల్లో సహోద్యోగుల్లో నేను చూసాను. పెళ్ళి చేసుకున్న దంపతులని పరువు హత్యల

    పేరుతో చంపటం విన్నారా తమరు? ఇపుడు చెప్పండి. మీరు చూసిన ఏవో కొన్ని దిక్కుమాలిన వార్తలపై బేస్ చేసుకుని "పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి" అని చట్టం చేసెయ్యటం పిచ్చితనం కాక

    మరేమిటి?
    రాముడు శివధనస్సు ని తండ్రి ని అడిగి విరచలేదు. కృష్ణుడు అమ్మా నాన్నలని అడిగి కన్యలని వరించలేదు. వారిది తప్పేనను మీరు అనుకుంటే నేనేం చెయ్యలేను. నా దృష్టిలో వాళ్ళకి పరిపక్వత నిండాక

    నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే యుక్త వయసువారు తమ జీవనాధారాన్ని సాధించి తరువాత పెళ్ళిగురించి కలగనమంటాను. అంతవరకూ హద్దులో ఉండి ప్రేమించుకోవటం నా దృష్టిలో తప్పు కాదు..X

    క్రోమోజోము, Y క్రోమోజోము అంటూ ఇందులోకి సైన్సుని లాగితిరి. ఆ లెక్కన ఈ శరీరమే అమ్మానాన్నల సొత్తుగాని ఆత్మ కాదు కదా. ఈ లక్కన తల్లిదండ్రులు అంగీకరించకపో వారు పుట్టించిన శరీరాలని

    వాళ్ళకి అప్పగించేసి ప్రేమికులు చచ్చి వెళ్ళిపోతే బాగుంటుందా? ఎంతసేపూ కన్నవారి కలల గురించే ఆరాట పడ్డారుగాని అసలు టీనేజర్లు ఎందుకు ప్రేమలో పడ్డారో ఆలోచించారా? దగ్గరగా గమనిస్తే అటువంటి

    ప్రేమికుల్లో ఎక్కువమందికి ఆ వయసులో కుటుంబ సభ్యులనుంచి ప్రేమ, సహకారం అందట్లేదని అర్థమవుతుంది. ఎంతసేపూ మన పిల్లడు/పిల్ల ఇంజనీరో డాక్టరో అయిపోవాలని మెరుపు కలలు కనడమేగాని

    వారి ఆలోచనా ధోరణిని పెంచే విధంగా చర్చించటం, మంచి కథలో పురాణాలో చదివించటం ఎంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారు?
    ఇక మన సంస్కృతికి ఓ గొప్ప విశిష్టత ఉందని, ఇతర దేశాలతో పోల్చటం అర్థం లేని పని అని తేల్చేసారు. అంటే తమరి ఉద్దేశం ఏమిటి? ఇతర దేశస్థులకి "సభ్యత సంస్కారం" లేవనా? నూతిలోని కప్పలా

    మనుస్మృతిని నెమరువేసుకోవటం కాదు, వీలైతే వివేకానందుని రచనలు చదవండి. ప్రతి దేశానికి తన పరిస్థితులు బట్టి సంస్కృతులు ఏర్పడ్డాయి. ప్రతి జాతికీ తనదైన ఓ విశిష్ట సంస్కృతి ఉంది. ఏదో మనమే

    పెద్ద పుడుంగులం అనుకొంటే అంతకంటే వెర్రితనం మరొకటి లేదు.

    కన్నవారికి తమ అభిప్రాయాలు చెప్పే అవకాశమే ఇవ్వటం లేదని తేల్చేసారు. అసలు కన్నవారికి వారి ప్రేమ విషయం తెలియపరుస్తూనే ఉన్నారే? ప్రేమికులేమీ వెంటనే పారిపోవటం లేదే. ఎప్పుడైతే

    తల్లిదండ్రులు సరైన వాతావరణం లో ఒక స్నేహితుల్లా చర్చించకుండా కర్కశంగా అణచి వెయ్యాలని చూస్తారో అప్పుడే పిల్లలు ఒత్తిడిలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ విషయం గమనిస్తే మంచిది.

    చివరగా ఒక మాట. ప్రేమ పెళ్ళిల్లు అనేది ఒక అసాంఘిక క్రిమినల్ సమస్య కాదు. ఒక కుటుంబ (సివిల్) సమస్య. ఇటువంతి సమస్యలని అటు పెద్దలకూ ఇటు పిల్లలకూ కౌన్సిలింగ్ చెయ్యటం ద్వారా,

    సుహృద్భావ వాతావరణం కల్పించటం ద్వారా పరిష్కరించాలేగాని, ఎడ పెడా చట్టాలు చేసేస్తే మనకీ నియంతలకీ తేడాలు ఉండవు. నిజానికి మీరు చెప్పినట్లు ఓ దిక్కుమాలిన చట్టాన్ని అమలుపరిస్తే, కేవలం

    దాన్ని అధిగమించడానికి మరింత మంది యువత కావాలని ప్రేమలో పడతారు. ఇది కాదనలేని నిజం. ఆ తరువాత మీలాంటి మేధావులు "ఇలా ఎందుకు జరిగిందబ్బా" అని వేల్లు కొరుక్కున్నా సుఖం ఉండదు.

    ReplyDelete
    Replies
    1. (1) "ప్రేమ పెళ్ళిల్లు అనేది ఒక అసాంఘిక క్రిమినల్ సమస్య కాదు. ఒక కుటుంబ (సివిల్) సమస్య. ఇటువంతి సమస్యలని అటు పెద్దలకూ ఇటు పిల్లలకూ కౌన్సిలింగ్ చెయ్యటం ద్వారా,

      సుహృద్భావ వాతావరణం కల్పించటం ద్వారా పరిష్కరించాలేగాని,"

      అబ్బా ! నా మీద విమర్శలు చేస్తే చేశారు గాని చివరకు మీకు తెలియకుండానే నేను చెప్పిన దానిలో కొచ్చారు. నా దగ్గర ఉన్న ప్రేమికుల అనుభవాలు బయట పెడితే కాని ఎవరు దేని మీద ఆదారపడి చెపుతున్నరో అర్థం కాదు. మీరు చెప్పినట్టు కౌన్సిలిన్గ్ చెయ్యలన్నా దానికొక చట్ట బద్దత అవసరం . 18 యేండ్లు నిండితే చాలు మన ఇష్టం మనదే అని బావన కొచ్చాక ఇక మీరేదో కౌన్సిలింగ్ ఇస్టారని మోహాం లో ఉన్న వారు అలోచిస్తారా? నేను ప్రేమించి, తల్లి తండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నవారిని తప్పని చెప్పానా? కోర్టులకు నిర్ణయాదికారం ఇవ్వమంటే అందులో కౌన్సిలింగ్ ప్రక్రియ అంతర్బాగం కాదా? రాముడు, క్రిష్ణుడు చేసినది ఆనాటి రాజుల సాంప్రాదాయమే. దానికి సమాజ అనుమతి ఉంది. అదె సమ్మ్జ అనుమతి కోర్టుల ద్వారా తీసుకొమ్మని మేము చెప్పేది. ఏందుకు మీరు తెలివి గలవాల్లని, మేము అవివేకులమని ఆలోచించారు. ఆఫ్ట్రాల్ మీ గురించి మీరు దైర్యంగా ప్రచురించుకొలెని మీరా నన్ను ఎంచగల దైర్యమ్? నా గురించి తెలుసుకొని మాట్లాడడం మంచిది. లేకుంటే విషయానికి పరిమితమై మాట్లాడడం మంచిది.

      (2) "నేను భారతదేశంలోని తల్లి తండ్రులు గురించే మాట్లాదుతున్నాను. ప్రపంచంలో కెల్లా భరతీయ కుటుంబ వ్యవస్త విశిష్టమయినడి. కాబట్టి ఇతరదేశాలతో దానిని పోల్చటం అర్థంలెని పని."

      "ప్రతి దేశానికి తన పరిస్థితులు బట్టి సంస్కృతులు ఏర్పడ్డాయి. ప్రతి జాతికీ తనదైన ఓ విశిష్ట సంస్కృతి ఉంది. ఏదో మనమేపెద్ద పుడుంగులం అనుకొంటే అంతకంటే వెర్రితనం మరొకటి లేదు."
      పై వాఖ్యాలు మేము చెప్పినవి. క్రిందివి మీరన్నవి. ఈ రెంటి మద్య తేడా యేమిటొ చెప్పగలరా? ఇతర దేశాలలో స్వలింగ సంపర్కం చట్ట బద్దత చెయ్యమని ఆందోళనలు జరుగుతున్నాయి. రేపు మీరూ మొదలుపెట్టండి మీ లింగ బాదలు గురించి. దేనికఈనా ఒక హద్దుండాలా? ఏమి మాట్లాడుతున్నామో ముందు వెనుక ఆలోచన చెయ్యాలి లేకుంటే అబాసుపాలు కాక తప్పదు...
      (3)మేము పేపర్ న్యూస్ అదారంగా ప్రతిపాదనలు చేస్తున్నాం అనడం మీ అవగాహానా రాహిత్యం. ఎంతోమందిని స్వయంగా గమనించి చేసిన ప్రతిపాదన అది. మీర్య్ చెప్పె ఉత్తములు పది మంది ఉంటే మేము చేప్పే వారు తొంబై శాతం ఉంటారు(అలా చేసేవారిలో). ఉదాహరరణకు ఈ రోజు మేము పెట్టిన తపాని చూడంది.(కామం ని ప్రేమ అనుకుంటే కాలమంతా చిత్తకార్తే!) ఇది యదార్ద గాద.

      Delete
  8. మేము చట్ట సవరణ చెయ్యమంది తల్లితండ్రులకు తమ వాదన వినిపించే అవకాశం సహజ న్యాయ సూత్రాల కనుగుణంగా ఇవ్వమని. ఒక ప్రక్క వివాహం కుటుంబ సమస్య అని మీరే ఒప్పుకుంటూ, కుటుంబ పెద్దలకు సహజ హక్కులు ప్రసాదించడం నియంత్రుత్వం ఎలా అవుతుంది? నియంత్రుత్వం కొరుకునే వారు చట్ట సవరణలు చేసి కోర్టులకు అదికారమిమ్మని అడుగుతారా? ఏమిటో ఈ గోలా! లింగ! లింగా!

    ReplyDelete
    Replies
    1. ముందుగా ఒక్క మాట. మీ గురించి ఊరు పేరు ఫోటోలు వేసుకున్నారు. తప్పు లేదు. అది మీ ఇష్టం. అలాగే కొందరికి తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించడం ఇష్టం ఉండదు. అది వారి హక్కు, ఇష్టమూను.
      దానిని కాదనడం, సవాలు చేయటం అర్థరహితం. అందరూ మీరు చేసినట్లే చెయ్యాలని అనుకొంటే అది మనవిజమా లేక ఇగోయిజమా? మీ గురించి తెలుసుకొని మాట్లాడం నాకు అవసరం లేదు. ఏదైనా
      చర్చించేప్పుడు విషయం ముఖ్యం గాని అవతలి వ్యక్తి ముఖ్యం కాదు నాకు. మీ సంగతి అయితే నాకు తెలియదు. సరే ఇక విషయానికొస్తాను.
      ప్రేమ పెళ్ళిని నేను ఒక కుటుంబ సమస్యగా చెప్పాను. అంతేగాని అదో పెద్ద నేరమనో, లేక ప్రేమికులు ద్రోహులు మూర్ఖులనో, పెద్దవారికేమీ తెలియదనో నేను అనలేదు. తమ పిల్లడో పిల్లో ప్రేమలో పడటం తల్లిదండ్రులకు ఒక చిన్న షాక్ (మీకు పెద్ద షాకేమో మరి). ఒక సంఘటన లాంటిది. ఆ సమయం లో అది వారికి ఒక సమస్యలాంటిది. దాని పట్ల ప్రతిస్పందించే తీరు ఆ పిల్లల తరువాయి పనులను ప్రభావితం చెయ్యగలదని చెప్పాను. పైన నేను అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఇవే. తల్లిదండ్రులు పిల్లలను స్నేహితుల్లా కూర్చోబెట్టి వారి అభిప్రాయాలను స్నేహపూర్వక వాతావరణం లో చర్చించమని నా ఉద్దేశం. పైన LBS గారు చెప్పినది కూడా అదే అని నా ఉద్దేశం. అంతే కాని సినిమాల్లో విలన్లా రంకెలు వేయటమో శాపనార్థాలు పెట్టడమో చేస్తే మొదటికే మోసం. మీరు చెప్పిన ఆటొ ప్రేమ కథలో కూడా పిల్లల్లు పారిపోటానికి ముందు ఇల్లలోనే ఉన్నారే, అప్పుడు తల్లిదండ్రులు చర్చించారా? చర్చిస్తే ఎలాంటి ఉద్దేశం తో చర్చించారు. "నీకేం తెలీదు, నువ్వో పిల్లకాకివి" అంటూ చర్చిస్తే ఇక ఆ చర్చకు అర్థమే లేదు. సరే ఆ పిల్లలు పారిపోయారు. అపుడు నమోదు చెయ్యాల్సింది "మిస్సింగ్" కేసు. ఎందుకంటే ఆ అమ్మాయి తనిష్టప్రకారమే వెల్లి ఉండవచ్చు (ఆ అమ్మాయికి నిర్ణయించుకునే హక్కులేదని మీరు వాదించవచ్చు. అది వాదనే కాని నిజం
      కాదు.). మరి "కిడ్నాప్" కేసు ఎందుకు నమోదు చేసినట్లో. అపుడు అవతలివారు వీరిపై కేసు వేస్తే ఇంక ఇద్దరిలో ఎవరిది తప్పో తేల్చుకోలేక కొత్త తలనొప్పులు.
      ఇక ఉదాహరణల సంగతికొద్దాం. కోట్లమంది యువత ఉన్న భారతం లో కొన్ని వందలమందో వేలమందో ప్రేమ పెళ్ళిల్లు చేసుకుంటే అందులో కూడా కొన్నే పరిణతి లేని నిర్ణయాలైతే అందరినీ ఒకేగాటన కట్టెయ్యటం
      మూర్ఖత్వం కాక మరేమిటి? నా దృష్టిలో వారు తమ కాళ్ళపై తాము నిలబడకుండా ప్రేమ వివాహం చేసుకోవటం తప్పు. నిజానికి అదే అసలు సమస్య. కాబట్టి ప్రభుత్వం అలాంటి "జీవనాధారం లేని ప్రేమ
      వివాహాలను" నిషేధిస్తే నేను అభ్యంతరం చెప్పను. దీనికి మీరేమంటారు? అలాంటి ప్రతిపాదనతో మీరు రాస్తే మేం బుధ్ధిగా తలూపేవాల్లం. కాని మీరు పెట్టిన టపా టైటిల్, దానికి జోడించిన శాస్త్రీయ పరిశీలన అనే
      ముసుగు మమ్మల్ని ఇలా వాదించేందుకు పురికొల్పాయి.
      ఒక్క మాట చెప్పండి. కొంతమంది పిల్లలు పార్టీలకు వెళ్ళి మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్నారు. అందుచేత "యూత్ పార్టీలు చేసుకోకూడదు, బయటకు వెల్లాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి" అని ఓ చట్టం చేస్తే ఏమవుతుంది? అపుడు జనాలు నోటితో నవ్వరు!

      Delete
    2. "1999 లో పుట్టిన మీరు, మీ వయసుకు తగ్గట్టే రాసారు. మీ ఆలోచనల్లో పరిపక్వత లేని విషయం మీకు తెలియదు లెండి, టీనేజ్ వయసు కదా. మహాశయా
      నూతిలోని కప్పలా"


      "మనుస్మృతిని నెమరువేసుకోవటం కాదు, వీలైతే వివేకానందుని రచనలు చదవండి. ప్రతి దేశానికి తన పరిస్థితులు బట్టి సంస్కృతులు ఏర్పడ్డాయి. ప్రతి జాతికీ తనదైన ఓ విశిష్ట సంస్కృతి ఉంది. ఏదో మనమేపెద్ద పుడుంగులం అనుకొంటే అంతకంటే వెర్రితనం మరొకటి లేదు."

      పైన మీరన్న మాటలు విషయ పరిథి దాటి, వ్యక్తిగత జ్గ్నానం ను సవాలు చేసే విదంగా వున్నాయి.మేమేమి చదవాలో కూడ మీతో చెప్పించుకునే స్తాయిలో ఉనట్టు మాట్లాడడం అది మీకు అవసరమా? అందుకే విషయానికి కట్టుబడమంది. లేకుంటే మీరెవరయినా మా కనవసరం.
      మీది,LBS గారిది ఒకటే వాదన. ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నవారు తల్లితండ్రుల ఇష్టంనకు వ్యతిరేకంగా అయినా పెండ్లి చేసుకోవచ్చు. తక్కిన వాల్లకు ఆ హక్కు ఉండరాదు అని. మీరు చెప్పేది అమలు చెయ్యాలన్నా చట్ట సవరణ తప్పనిసరి. మీ అభిప్రాయం వరకు మీరు చెప్పకుండా అంతా మేము అనుకున్నట్టె విజ్గ్ణులు అనుకుంటారని సూత్రీకరించడం, ఇవ్వన్ని మీ వాదాన్ని బలపరచని వారి మీద మీరు వెళ్ల గక్కే అక్కసు తప్ప వెరేమి కాదు.

      తల్లి తండ్రులకు, పిల్లలకు మద్య వివాహం గురించి అభిప్రాయ బేదాలు వచ్చినప్పుడు వాటి గురించి కూలంకషంగా విచారించి, ఎవరిది సహేతుకమైన నిర్ణయం? అట్టి పెళ్లి వల్ల కుటుంబానికి జరిగే నష్టం ఏమిటి? అర్థికంగా ఆదుకోవల్సిన కొడుకు పెళ్లి వల్లా కుటుంబానికి దూరమైపొతున్నాడు అనే అభద్రతా బావనలో తల్లి తండ్రులు ఉన్నారా? అటువంటి పరిస్తితిలో ఆ కొడుకు కుటుంభానికి చెయ్యాల్సింది ఎమైనా ఉందా? ఇటు వంటి విషయాలన్ని కూలంకషంగా విచారించి కౌన్స్ లింగ్ పద్దతిలో నచ్చ చెప్పటానికి, వినని వారికి చెయాల్సిన దానిని నిర్దేశించడానికి చట్ట సవరణ అవసరం.

      మెము చెప్పిన దాంట్లొ కూడ మీరు పిల్లల్ని ఎలా సమర్థించారో అర్థం కావడం లేదు ఇది మీరు చెప్పే అర్థిక స్వాలంభన సూత్రానికి వ్యతిరేకం కాదా? "తాతలు తాగినది తలాపునే ఉంటుంది" . ఈరొజు ఒకరి కూతుర్ని ప్రేమ పెరుతో ఇద్దరు తీసుకువెళ్లి ఆనందిస్తే రేపు అలా తీసుకువెల్లిన వాడి ఆడపిల్లల్ని, పదిమంది తీసుకు వెళతారు. "ధర్మో రక్షతి రక్షితః".

      మాదక ద్రవ్యాల మత్తుని ప్రభుత్వం నిషేదించింది. కాబట్టి మీరు వేరేదానితో పని లేకుండా నోటితోనే హాయిగా నవ్వుకోవచ్చు.కౌమారంలో ఆకర్షణను కూడ మత్తులో చేస్తున్నట్టె బావిస్తే తల్లి తండ్రుల నియంత్రణ తో పాటు సమాజ నియంత్రణ ఉంటుంది,అది లేదు కనుకనే చట్ట సవరణ అవసరం.

      Delete
    3. చట్ట సవరణ అవసరం అన్నారు, కాని ఆ సవరణ కి నేను చెప్పింది వేరుగా మీరు చెప్పింది వేరుగా ఉంది. ఒక అమ్మాయి ప్రేమించినవాడితో వెల్లిపోతే ఆమెను ఇద్దరు అనుభవిస్తున్నట్లు ఊహిస్తూ రాసేసారు. ఇది మీ వ్యక్తిగత పరిగ్ఞానాన్ని సూచించదూ? కేవలం బ్లంట్ statements ఇచ్చేస్తే నేనే కాదు బ్లాగర్లు కూడా తగులుకుంటారు. పోనీ నేను చెప్పిన చట్ట సవరణకి, మీరు మొదట యథాతథంగా చెప్పిన చట్టానికి ఎంత తేడా ఉందో కావాలంటే మిగతా బ్లాగర్లని అడిగి తెలుసుకోండి. కేవలం ఓ లేచిపోయిన జంట (అది కూడా పరిణతి లేక లేచిపోయిన జంట) ని చూపించి అభద్రతలూ, తల్లిదండ్రుల కలలూ అంటూ సెంటిమెంట్ రంగులు పూసి మీ అభిప్రాయాన్ని మాపై రుద్ది అదే హిందూత్వమంటే ఇక్కడ ఎవరికైనా మండుతుంది. నేను చెప్పిన ఉదాహరణల్లో ఎక్కడా తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయమనలేదు. లైఫ్ లో సెటిల్ అయిన జంట మొదట తల్లిదండ్రులకు దూరమైనా, తరువాత ఇరు తరాలవారూ దగ్గరకి వస్తారని, అది చాలా చోట్ల జరిగిందని చెప్పాను (పరువు హత్యల పేరిట చంపుకోకుండా ఉంటే). ఇక కన్నవారి కలలు అంటూ సెంటిమెంట్ పూసారు. కలలు అన్నీ నిజం కావు మాస్టారు. అదే జీవితం. మన ఇంటిలో పెంచుకునే జంతువైనా.. కంటి పాపల్లా పెంచుకున్న పిల్లలనైనా.. కేవలం మనం అనుకున్నట్లు ఆడించాలంటే కుదరదు. తల్లిదండ్రులు కోరుకున్న చదువే పిల్లలు చదవలేకపోవచ్చు, వారు ఊహించిన ఉద్యోగమే వరించకపోవచ్చు, అలాగే వారు అనుకున్నట్లుగానే పిల్లల పెళ్ళి జరగకపోవచ్చు.
      మీరనుకున్నట్లు అభద్రత, బాధ్యత, సహజ హక్కులూ అంటూ మొదలెడితే అటు పిల్లలనుంచీ కూడా కొత్తవాదాలు మొదలవుతాయి. ఇపుడు చెప్పండి మీరు చెప్పినట్లు బ్లంట్ గా చట్టం చేసెయ్యమంటారా?

      Delete
    4. "మీరు చెప్పిన ఆటొ ప్రేమ కథలో కూడా పిల్లల్లు పారిపోటానికి ముందు ఇల్లలోనే ఉన్నారే, అప్పుడు తల్లిదండ్రులు చర్చించారా? చర్చిస్తే ఎలాంటి ఉద్దేశం తో చర్చించారు. "నీకేం తెలీదు, నువ్వో పిల్లకాకివి" అంటూ చర్చిస్తే ఇక ఆ చర్చకు అర్థమే లేదు. సరే ఆ పిల్లలు పారిపోయారు. అపుడు నమోదు చెయ్యాల్సింది "మిస్సింగ్" కేసు. ఎందుకంటే ఆ అమ్మాయి తనిష్టప్రకారమే వెల్లి ఉండవచ్చు (ఆ అమ్మాయికి నిర్ణయించుకునే హక్కులేదని మీరు వాదించవచ్చు. అది వాదనే కాని నిజంకాదు.). "............
      "మెము చెప్పిన దాంట్లొ కూడ మీరు పిల్లల్ని ఎలా సమర్థించారో అర్థం కావడం లేదు ఇది మీరు చెప్పే అర్థిక స్వాలంభన సూత్రానికి వ్యతిరేకం కాదా? "తాతలు తాగినది తలాపునే ఉంటుంది" . ఈరొజు ఒకరి కూతుర్ని ప్రేమ పెరుతో ఇద్దరు తీసుకువెళ్లి ఆనందిస్తే రేపు అలా తీసుకువెల్లిన వాడి ఆడపిల్లల్ని, పదిమంది తీసుకు వెళతారు. "ధర్మో రక్షతి రక్షితః"." .............



      పైన మీరు చెప్పింది.క్రింద మేమన్నది. నేను ఒక యదార్థ గాదనే ఆటో కథగా చెప్పాను.ఇందులో నా ఊహ ఏముంది? దానిని మీరు సమర్థించి నెపం నా మీద వేస్తున్నారు. పైపెచ్చు బ్లాగర్లు తగులుకుంటారు అని వారి సహాయం కోసం చూస్తున్నారు. మీకు తగుల్కోవటమంటే ఇష్టం అనుకుంటా అందుకే అందరూ తగుల్కుంటే బాగుండు అని ఆశిశ్తున్నట్టుంది. పాపము శమించుగాక.

      ముందు దూరంగా పోవటాలు, పిల్లలు పుట్టాక దగ్గరకు రావటాలు,ఈ బాదలకు కూడ సరిఅయిన పరిష్కారం హిందూ వివాహ చట్ట సవరణయే. మొదత్నుండి మేము కోరేది తల్లితంద్రులకు సహజ హక్కును ప్రసాదించమని. ఆ ఒక్క హక్కు పిల్లల ఇష్టాన్ని రద్దుచెయ్యలేక పొయినా, వాటి వల్ల కలిగే అన్ని సమస్యలను తీర్చి వేయ గలదు.ఆ విదంగా చట్ట సవరణ చేయ వచ్చు.

      మొదట్నుంచి మా మీద అక్కసు వెల్లగ్రక్కడం తప్ప మేమేమి చెప్పామో అర్థం చేసుకోకుండా మేఏ ఇష్టం వచ్చిన్నట్టు మాట్లాడడం సరి అయిన వాదన అనిపించుకోదు.

      Delete
    5. నేను సూటిగా స్పష్టంగా సమస్యని ప్రస్తావించేసరికి ఇపుడు నెమ్మదిగా సైడయిపోతున్నారు. నేను పిల్లలని సమర్థించానా? "ముందు అసలు పెద్దలు పిల్లలతో చర్చించారా, చర్చిస్తే ఎలాంటి వాతావరణం లో చర్చించారు?" అన్నాను. విషయం ముందు పూర్తిగా తెలుసుకుని అప్పుడు పిల్లలనో తల్లిదండ్రులనో అనవచ్చు. జరిగిన వరుస సంఘటనలలో (లేచిపోవటం, కేసు, పై కేసు) తప్పు ఇరువైపులనుంచీ కనిపిస్తుంది. అందుకే అన్నాను "ఎవరిది తప్పో తేల్చుకోలేక కొత్త తలనొప్పులు" అని. ఇపుడు నా స్టాండ్ అర్థం అయిందా? మరి తమరు. పిల్లలు లేచిపోయారు అనగానే అపుడే అవతల ఆ పిల్లని ఎంతమంది అనుభవించేస్తున్నారో, ఏ రెడ్ లైట్ ఏరియా లో ఉందో అన్నట్లు మొదలెట్టారు. మీరు తరువాత రాసిన పోస్టులు చూసుకోండి.
      ఇక చివరగా, మీతో వాదించటానికి కారణం మీరు కేవలం ఒకవైపు స్టాండ్ తీసుకోవటం. నేను చెప్పినది జీవితం లో నేటురల్ గా "అంతా మంచికే దారి తీసే" ప్రేమలని మినహాయించి "పరిణతి లేని పిల్లల తొందరపాటు" ని "సరిదిద్దేలా" చర్యలు తీసుకోవచ్చునని.(దీఇనికి కూడా చట్టం వరకూ అవసరం లేదు. తల్లిదండ్రులు పోలీసులు సం యమనం తో పరిష్కరించుకోగలరు)
      నేను ఊరికే తగులుకోను. హిందువుల్లారా లేవండి అన్నారుగా, అందుకే లేచాను. మీ మొహం మీద నీల్లు జల్లుతున్నా మత్తులోంచి బయటకు రమ్మని. బ్లాగర్ల సహాయం కోరాల్సిన అవసరం లేదు. ఆమాత్రం జీవితానుభవం నాకూ ఉంది. మీ చిరు బుధ్ధిని దేవుడు క్షమించుగాక.

      Delete
    6. అంతే బ్రథర్ అంతే! ఎవారైనా సైడవ్వాల్సిందే మన ప్రేమ దెబ్బకి! మహా మహా రజులే తలవంచారు ! అఫ్ట్రాల్ అమ్మా బాబులెంత! అసలు ఈళ్ళు పిచ్చొళు గాని, మనమేమన్నా వాళ్లని కాదంటున్నామా? మనకి ఉద్యోగాలు రావాలంటె తల్లో జుట్టు తెల్లబడుతుండే. 20 యేంద్లు వచ్చేసరికి ఓంట్లో రిమ రిమలు మొదలవుతుండే. పెండ్లి చేసుకుంటాము అంటె తప్పా ఏ పిల్ల కన్నేతి చూడదాయే . అందుకే ప్రెమ పెళ్లి పేరుతో లేపుకుపొయి, కొన్నాళ్లు కాపురం చేసేత్తే ఆ తర్వాత ఎట్టాగు మొహం మొత్తుది. ఇంటి దగ్గరనుంచి అది తెచ్చిన డబ్బుతోనే ఏంజాయి చేసేసి, దానినొదిలేత్తే మా అమ్మా బాబులు ఏమనరు.ఆ పిల్లా అమ్మబాబులు ఏమనరు. ఎట్టాగు వారికిష్టం లేని సంబందమేగా మాది.ఒక వేల కేస్ పెట్టిన అంతా ఇష్ట ప్రకారమే కాబట్టి,ఇటు మా కుల పెద్దలు, అటు వాళ్ల కుల పెద్దలు వాలే పంచాయతి చేసేసి సర్థుబాటు చేస్తారు. ఎవరి పిల్లల్ని ఎవరు పోగొట్టుకుంటారు. ఆ తర్వాత కట్నం కొంచం తక్కువంటె ఎవరో ఒకళ్లు నాకు దొరకపోరు. ఇది మా అమ్మా బాబులు చూసిన సంభందం కాబట్టి అంతా హాపీసే.ఏమిటి? ఆ అమ్మయి సంగతా? సేమ్ స్టోరీ. మంచిదేగా అనుభవం ఉంది కాబట్టి, ఇంకా ప్రేమా దోమా అనకుండా ఎవరి కాపురం వాళ్లు చేసుకుంటాం.హ..హా..హా..

      Delete
  9. కమ్యూనిజం మీద "భక్తి" తో వ్రాస్తున్న బ్లాగులు ఉన్నాయి. అవి చదివితే కమ్యూనిజం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్న వాళ్ళకైనా సరే, వాళ్ళ అతి భక్తి వెగటు పుట్టిస్తుంది. ఒక్కోసారి నాకు అనుమానం కూడా వస్తుంటుంది, కమ్యూనిజం గురించి వీళ్ళకు తెలుసనుకుంటున్నది మనకు చెప్పటానికి వచ్చారా, లేక ఆ ఇజం మీద అసహ్యం కలిగించటానికా అని.

    తరువాత వ్రాసే విషయంలో ప్రాధాన్యత ఉన్నా కూడా వ్రాస్తున్న వాక్యాల్లో తప్పులు దొర్లుతుంటే ఆ విషయ ప్రాధాన్యత ఆవిరైపోతుంది. మీరు వ్రాస్తున్న వాటిల్లో వత్తులు, పొల్లుల తప్పులు అనేకం. వ్రాసిన తరువాత ఒకసారి చూసుకుని, తప్పులు సరిచేసి అప్పుడు ప్రచురిస్తే చదివే వారికి సౌకర్యంగా ఉంటుందని నా భావన. ఈ విషయంలో లేఖిని లో అయితే ట్రాన్స్‌లిటరేషన్‌లో ఆంగ్లంలో వ్రాసినది తెలుగులో ఎలా వచ్చిందో చూసుకుని అవసరమైన చోట సరిచేసుకుని చక్కటి తెలుగులో వ్రాయవచ్చు. "మాకు" ఇంతే వచ్చు మా బరహాలో ఇంతే అనుకుంటూ ఉంటే చేసేదేమీలేదు.

    lekhini.org

    ReplyDelete
    Replies
    1. మీ సూచన బాగుంది సార్. తప్పకుండ మేము వాక్య దోష నివారణకు చర్యలు తీసుకుంటాము.మీరు చెప్పిన లేఖిని పరీశీలిస్తాము. మీకు మరొక్కమారు దన్యవాదాలు ప్రసాదు గారు.

      Delete
  10. తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

    మీరు పెట్టిన హెడ్డింగు "శాస్త్రీయ పరిశీలన". అంటే ఏమిటసలు. ఒకటి రెండు సంఘటనలు అవి కూడా మీడియా నోళ్ళల్లో పడి చిలవలు పలవలు అయిపోయినవి పట్టుకుని ఒక అభిప్రాయానికి రావటం, ఎంతవరకూ శాస్త్రీయమైనది! మైనారిటీ రాకపూర్వం, మైనారిటీ వచ్చిన తరువాత అనే కాల విభజన ఉన్నది. మైనారిటీ తీరకుండా, పెళ్ళి చట్ట విరుధ్ధమే కాని, అదే చట్టంలో ఒక మెలిక ఉన్నది. ఓకవేళ మైనారిటీ తీరకుండా పిల్లల పెళ్ళి జరిగిపోతే, అలా జరిగిన తరువాత ఆ పెళ్ళి చట్టబధ్ధమే. జరగక పూర్వం అలా చెయ్య చూడటం చట్ట వ్యతిరేకం, పోలీసులు ఆపవచ్చు. కాని జరిగిపోయినాక, అది పెళ్ళే. ఇది చట్టంలో ఉన్న విషయం. మైనారిటీ తీరని వాళ్ళ విషయంలోనే పెళ్ళంటూ జరిగిపోతే, అది చట్టబధ్ధమే అని చట్టంలో ఎందుకు అన్నారు? మనకు పెళ్ళి అనే వ్యవస్థ మీద ఉన్న గౌరవం, సమాజంలో పెళ్ళికి ఉన్న విలువ వల్ల.

    మైనారిటీ తీరకు పూర్వం, పెద్దలు బలవంతాన లేదా పిల్లలు తమంత తాముగా తెలుసుకోలేని వయస్సులో పెళ్ళి చేసేస్తే, అలా జరగటానికి ముందు ఆపటం జరగకపోతే, ఆ పెళ్ళి చట్ట బధ్ధమైనప్పుడు, పిల్లలు మైనారిటీ తీరిన తరువాత తమ పేళ్ళి తమకు ఇష్టం ఉన్న వ్యక్తితో చేసుకుంటే, ఆ పెళ్ళి చట్ట వ్యతిరేకం అని ఎలా అనాలి? తల్లి తండ్రుల ఇష్టం లేకుండా పెళ్ళి చట్ట బధ్ధం కాకూడదు అని చట్టం తీసుకు వస్తే, ఆ చట్టానికి ఉండవలసిన నిబధ్ధత ఏమిటి అయిఉండాలి!! చట్టం చెయ్యాలంటే, మీడియాలో వచ్చే వార్తలు, ఇరుగు పొరుగుల్లోనో, లేదా చుట్టాల్లోనో జరిగిన ఒకటి రెండు విపరీత సంఘటనలు ప్రాతిపదిక కావు, కాకూడదు కూడా. సమాజం మొత్తం మీద ఆ చట్టం చెయ్యాల్సిన అవసరం గుర్తించాలి కాని ఒకళ్ళిద్దరు, ఈ సమాజానికి ఏమి తెలుసు, మాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని "అనేసుకుని" చట్టాలు తేవటానికి ప్రయత్నిస్తే అది హాస్యాస్పదం అయ్యి, చట్ట నిర్మాణ వ్యవస్థ నవ్వులు పాలవుతుంది.

    ఇక పిల్లల పెళ్ళికి తల్లి తండ్రుల అనుమతి ఎప్పుడు కావాలి, ఆ పిల్లలు పెళ్ళి అయినతరువాత కూడా ఆ తల్లి తండ్రులమీద తమ తిండి తిప్పలకి, ఇతర అవసరాలకి ఇంకా ఆధారపడి ఉండవలిసిన పరిస్థితిలో ఉంటే, వాళ్ళ అనుమతి కావాలి. ఎందుకని ఎవరినో ఒకళ్ళను పెళ్ళి చేసుకొచ్చి వీళ్ళకి కూడా తిండి గుడ్డ ఇవ్వమనటానికి పిల్లలకు ఎటువంటి నైతికత లేదు. కాబట్టి ఇంతవరకూ చట్టం చెయ్యాల్సిన పని లేదు. ఇలాంటి విషయాలు సమాజం తనంతట తానుగా అద్భుతంగా నియంత్రించుకోగల శక్తితో ఉన్నది, మన వ్యక్తిగత తెలివితేటలు(?!) సమాజం మీద రుద్దాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు.

    ReplyDelete
    Replies
    1. బలేగా చెప్పారు గురువుగారు. డబ్బు సంపాదిస్తే అమ్మా,బాబుల ఇష్టంతో పని లేదా?సంపాదన లేనోళ్లంతా అనుమతులు తీసుకోవాల? ఇదేమి న్యాయం అండి. కుటుంబంలో ఒక్కడికి సంపాదన ఉంటే అందరికి ఉన్నట్టు కాదా? ఎవడికి వాడు సంపాదనలో పడ్డామని కుటుంభాని వదిలేసి పోతే తక్కిన పిల్లలం మా గతి యేంటి. మీరు చెప్పేదే బేస్ అయితే ముందు ఉద్యోగం వచ్చినవాడు తక్కిన వాల్లు సంపాదనలో పడిందాక ఆగి కుటుంభానికి చేదొడుగా ఉండాలి. అయినా కుటుంభ ఆస్తిలో పిల్లలకు వాటా ఉండదా? మా ఇష్టం వచ్చిన వాల్లను ప్రేమించి పెండ్లి చేసుకుని ఆ ఇంట్లొనే ఉంటాము.మేము అక్కర్లేదంటె మా వాటా మేము పంచుకుంటాం. అంతే కాని సంపాదన లేదని మా పెళ్లికేమో మీ అనుమతి కావాలా? ఉద్యోగం ఉన్నోడికి అక్కర్లేదా? అసలు న్యాయం యేమితంటే కుటుంబ సంపాదనతో చదవి ఉద్యోగం చేసేవాడి వాడి సంపాదన కుటుంబానికే చేమ్దాలి . ఏమాంటారు

      Delete
  11. పిల్లలు పెద్దయ్యి (మైనారిటీ తీరిన తరువాత) తమ స్వంత కాళ్ళ మీద, ఆర్ధికపరంగా నిలబడి వాళ్ళ నిర్ణయం తీసుకునే శక్తి వచ్చినాక (ఇప్పటికే చట్ట బధ్ధంగా మైనారిటీ తీరిన వాళ్ళు పెద్ద వాళ్ళే అని మీకు తెలుసనుకుంటాను. లేదా తల్లి తండ్రులు బతికి ఉన్నంతకాలం పిల్లలు పిల్లలే, వాళ్ళు ఏమి చేసినా వాళ్ళ అనుమతితోనే ఏ పనైనా చెయ్యాలని అనుకోవటం లేదుకదా!) తల్లి తండ్రులకి చెప్పి పెళ్ళి చేసుకోవటం ఒక మర్యాద. మర్యాద మాత్రమే. ఆ మర్యాద కూడా తల్లి తండ్రులు, పిల్లల మధ్య ఉన్న అనురాగ గౌరవాల మీద ఆధారపడినదే తప్ప, ఎవరో చేసిన వెర్రి చట్టం కానే కాదు. ఇలా సమాజంలో ఒక కుటుంబంలో ఉండే సహజ ప్రేమానురాగాల మీద ఆధారపడి జరుగుతున్న విషయాన్ని ఇలాగే జరిగి తీరాలి అంటె, హాస్యాస్పదమైన విషయం. అలా తల్లి తండ్రుల ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకుంటే అది చెల్లదు అంటానికి ఎవరికి మటుకు హక్కు ఉన్నది? అటువంటి చట్టానికి ఉండాలిసిన ప్రాతిపదిక, అలా చట్టం చెయ్యాల్సిన అవసరం ఏమిటి (మీడియాల్లో మీరు చదివిన "వార్త" లు కాకుండా). ఒకవేళ ఎవరన్న అలాంటి చట్టం చేస్తే, ఇప్పుడున్నవి కాక అనేక వికారాలు పుట్టుకొస్తాయి. తల్లి తండ్రులు అనుమతి ఇవ్వలేదు కాబట్టి పెళ్ళి చేసుకోలేక, తమకు ఇష్టమైన వాళ్ళతో కలిసి ఉంటారు, పిల్లలను కంటారు. అప్పుడు ఏమవుతుంది సమాజ పరిస్థితి? అప్పుడు ఆడ మగ పెళ్ళి కాకుండా కలిసి ఉండకూడదు అని ఇప్పటికే ఉన్న చట్టాన్ని అమలు పరచటానికి ఒక ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పరుస్తారా? ఎంతటి పురాణ కాలాల్లోనూ కూడా తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి చెల్లదు అన్న మాట లేదు.

    మరొక ఏంగిల్ చూద్దాం. తల్లి తండ్రులది ప్రేమ వివాహం, వాళ్ళు, వాళ్ళ తల్లి తండ్రులకి ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నారు. తరువాత కొంత కాలానికి అంతా కలిసిపోయారు. పోలికలు ఎక్కడికి పోతాయి, వాళ్ళ పిల్లలూ ప్రేమ, పెళ్ళని అంటున్నారు. వాళ్ళకు తల్లి తండ్రులు అనుమతి ఇస్తేనే ఆ వివాహం చట్టబధ్ధత అంటె, అలా అనుమతి ఇవ్వటానికి ఇవ్వకపోవటానికి ఆ తల్లి తండ్రులకి ఉన్న నైతికత ఏది? వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రుల అనుమతి కోసం ఆగి ఉంటె, ఇప్పుడు ఈ పిల్లలు ప్రపంచంలోకి వచ్చే వాళ్ళేకాదు! దాదాపు 1960ల నుంచి వేల సంఖ్యలో ప్రేమ వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి పిల్లలు పుట్టినాక వాళ్ళల్లో ఎంతమంది తల్లి తండ్రులు, ప్రేమ వివాహాలను ప్రోత్సహించి ఉంటారు, లేదా కనీసం వాళ్ళను అర్ధం చేసుకుని ఉంటారు? సినిమాలనండి, చౌకబారు కథా రచనలు అనండి, ఈ ప్రేమ అనే మాట పుట్టుకొచ్చి, వయస్సు ప్రభావాన సహజంగా ఏర్పడే సామాన్యపు శారీరిక భావనలకు ఏదో పేద్ద పేరు పెట్టుకుని తిరగటం,ఫ్యాషన్ అయ్యిందన్న విషయం నేను తప్పనిసరిగా ఒప్పుకుంటాను. ఒక చిరంజీవి కాని, మోహన్ బాబు కాని, కృష్ణ కాని, సినిమాల్లో ప్రేమ ప్రేమ అంటూ, వాళ్ళ జీవనాధారాన్ని సంపాయించుకోవటానికి నస డైలాగులు వినోదం పేరిట చెప్పి సమాజంలో ఉన్న టీన్ ఏజ్ వాళ్ళను ప్రభావితం చేసిపారేశారు. కాని వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేప్పటికి వాళ్ళు ఏమి చేశారు? ఏమి జరిగింది??

    ReplyDelete
  12. సమాజం తనంత తానుగా నియంత్రించుకుంటూ, ఒక పధ్ధతిలో మారుతూ పోతూ ఉంటుంది. సామాజిక విషయాల్లోకి చట్టం తీసుకు రావటం వల్ల ఒనకూడేది ఏమీ లేదు అని వెర్రి ఇజాలు నెత్తికెత్తుకుని, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో జొరబడి అభివృధ్ధిలో దిగజారిపోయి చివరకు ముక్క చెక్కలైన దేశాలే దీనికి ఉదాహరణ. వేరే దేశాల గోల మనకెందుకు, మనదేశంలోనే దీనికి ఉదాహరణగా రెండు చెప్తాను:

    1. వరకట్న నిషేధ చట్టం అమలు ఎంతవరకూ ఉన్నది. లాయర్లు, జడ్జీల పిల్లలకన్నా కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటారా!? మరి ఆ చట్టం చేసినది ఎవరికోసం. పెళ్ళైన తరువాత కోపాలు వస్తే, కేసులు పెట్టుకోవటానికా?

    2. పెంచి పెద్ద చేసిన తల్లితండ్రులను, చూడని పిల్లల మీద చట్ట రీత్యా ఆ తల్లి తండ్రులు కేసు పెట్టి తమను చూసుకునేట్టుగా చెయ్యమని న్యాయ స్థానాన్ని ప్రార్ధించ వచ్చు. కాని అలా న్యాయస్థానం చొరబాటుతో వచ్చే ఆ "చూడటం" అనేది, ఆదరణతో ఉంటుందా. పెద్దయిన తరువాత కావలిసినది ఒక్క చిన్న మాట, ప్రేమతో పలకరింపు. అవి కోర్ట్లు, చట్టాలు ఎప్పటికీ తేలేవు గాక తేలేవు. ప్రజలను భయపెట్ట గలవు,అంతే.

    ఏతా వాతా చెప్పేది ఏమంటే, మానవ సంభధాల విషయం, వివాహం, కుటుంబ వ్యవస్థ లో చట్టం ఎంత తక్కువగా చొరబడితే అంత మంచిది. అంతే కాని ప్రతిదానికి ఒక చట్టం చేసుకుంటూ పోతే, సమాజంలో ఇప్పటికే అనవసర విదేశీ ఇజాల ప్రభావాన జరుగుతున్న అల్లరికి కొత్త అల్లర్లు జమకూడి, మరింతగా సాంఘిక అశాంతి పెరగటం తప్ప మరేమీ కాదు. ముఖ్యమైన విషయం, తల్లి తండ్రులను కాదని పిల్లలు పెళ్ళి చేసుకోవటం, సాంఘిక దురాచారం అనీ, దానిని ఆపవలసిన అవసరం ఉన్నదనీ ఇంతవరకూ ఎవరన్నా అనుకుంటున్నారా అసలు. మనం మన చ్ట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అలా అనుకుంటె, అది మొత్తం ప్రజా అభిప్రాయం అయిపోయి వెంటనే పార్లమెటు చట్టం తీసుకు రావాలిసిన అవసరం ఉండదు. అలా చట్టం తెచ్చి, తల్లి తండ్రుల అనుమతితో మాత్రమేజరిగే పెళ్ళిళ్ళ వల్ల పిల్లల జీవితాలు నరకం కావని గ్యారంటీ ఏమిటి. దానికి మరొక చట్టం తేవాలా!

    ఆ తరువాత మీరు ఎప్పుడు మీ అభిప్రాయం వ్రాసినా "మేము" అంటూ బహువచనం దేనికి. ఇదేమన్నా రాయల్ ఉయ్? ఇద్దరు కలిసి ఈ బ్లాగు నడుపుతున్నారనుకుంటాను అందుకని "మేము"? కాని ఎప్పుడు చూసినా ఒక్క పేరుతోనే వ్యాఖ్యలు, సమాధానాలు వస్తున్నాయి. మరి ఆ మేములో ఉన్న రెండొవ వారెవరు. లేదా భమిడిపాటి కామేశ్వరరావుగారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఇలా మేము మేము అని మాట్లాడే వాళ్ళ గురించి. "మేము అంటే, ఏమిటి నువ్వు నీ అహంభావం కలిసా?" అలా కాదుకదా కొంపతీసి. కాదని ఒకసారి చెప్పండి, పెద్దవాళ్ళం సంతోషిస్తాము.

    ReplyDelete
    Replies
    1. మేము ఇదివరకే చెప్పాము, ఈ బ్లాగును మా రెజిస్టర్డ్ ఆశ్రమం ఆశయాలకనుగుణంగా నిర్వహిస్తున్నామని. రచయిత లెవరయినా అంతా సమిష్టి కుటుంబ బావనగానే బావిస్తూ ఆ పద ప్రయోగం చేస్తున్నాము. మీరు బమిడిపాటి గారిని ఉదహరించి మీ పెద్దలకు సంతోషం కలిగేల చెయ్యమన్నారు కాబట్టి కొత్త నిర్వచనంలో చెప్తాను .చిత్తగించండి.

      " యావన్మంది పాఠకులకు(వీక్షకులకు}, మద్దిగుంట సరస్వతి, తిరుపతయ్య అను మేము దంపతులమయి ఉండి, మా పుత్రుడయిన చిరంజీవి మద్దిగుంట నరసింహారావు రూపంలో రచయిత గా ఈ బ్లాగునకు వ్య్వహరించుచున్నాము.కావున మీ అందరి ఆశిస్సులు మా బిడ్డకు అంద చేస్తారని ఆశిస్తూ......"మేము"

      Delete
  13. మీకు మీరుగా చెప్పుకున్న వయస్సు రిత్యా ఇటువంటి వాదన తీసుకు రావటం చిత్రంగా ఉన్నది. అందుకే నేను ఇంతకు ముందు వ్రాసిన (లేఖిని గురించి) వ్యాఖ్యలో ఇండైరెక్ట్‌గా చెప్పాను. ప్రేమ వివాహాలకు తల్లి తండ్రులు అడ్డం, వాళ్ళు అడ్డుపడకూడదు అన్న మీ పాయింట్ బలపరుచుకోవటానికి, ఇలా రివర్సులో వచ్చి, అందరినీ, మీ పాయింటుకు వాదించే విధంగా ప్రొవోక్ చేస్తున్నారని నా అనుమానం.

    ReplyDelete
    Replies
    1. మనకు 1954 లో స్పెషల్ మారేజ్ ఏక్ట్ వస్తే, ఇంచు మించు అటువంటి ప్రొవిజన్స్ తోనే హిందూ మారేజ్ ఏక్ట్ 1955 లో వచ్చింది. వాటిలో అమ్మయి వయస్సు 18, అబ్బయి వయస్సు 21 ని కనీస వివాహ అర్హతగ నిర్ణయించారు. అందులోనే వదువు గాని, వరుడు గాని వివాహానికి "వాలీడ్ కంన్సెంట్" అంటే ఎటువంటి మానసిక ప్రలోబాలకు గురికానటువంటి అంగీకారం ఇవ్వవలసి ఉంటుంది.

      ఆ విదంగా చూస్తే 18 సంవ్త్సరాలు కి, 18 సంవత్సరాల 1 రొజుకి యేమి తేడా వస్తుంది. 18 సంవస్త్సరాలు నిందిన ప్రతిఒక్కరికి తమ బాగోగులు చూసుకునే జ్గ్నానం ఉందని యెలా అనుకోవటం. యెవరు నిర్దారించాలి. అవివేకులైన పిల్లలు ప్రేమఆకర్షనలో పడి జీవితాలు నాశనం చేసుకుంతుటే వారిని వయో ప్రాతిపదికన చట్టం పేరున బలి అవుతుంటే చూస్తూ ఉండాలా? అందుకే నేచురల్ గార్డియన్స్ అయిన తల్లి తండ్రులు వారిని రక్షించుకునే అవ కాశం చట్ట పరంగా ఉండాలి. ఈ విషయంలో చట్టానికి వ్యతిరేకంగా ఫొలిస్లు వ్యవహరించమని చెప్పడం సరికాదు. ఇది ఒక వైపు.

      ఇక రెండవ వైపు వివేకులైన పిల్లల జీవిత బాగస్వాముల ఎంపిక పెద్దల నిర్ణయాలు కంటె మిన్నగా
      వుండవచ్చు. అటువంటి పరిస్తితిలో పెద్దలు కుటుంబ కట్టు బాట్ల పేరుతో వారిని దూరం చేసుకోవడం కుటుంబ అబివ్రుద్ది కాకపోగా,వారి మద్య అనుబందాలకు శాశ్వత విఘాతం ఏర్పడే ప్రమాదముంది.ఒక వేళ మనం కాదన్న వారు విజ్గ్నానవంతులు కాబట్టి చట్ట రక్షణ పొంది అయినా జీవించగలరు. అంతిమంగా నష్టపొయెది కుటుంభమే.

      అందుకే అటు అవివేకులను చట్టం పేరుతో బలి చేసుకోకుండా, ఇటు వివేకులను సాంప్రదాయం పేరుతో దూరం చేసుకోకుండా ఉందెందుకే చట్ట సవరణ అవసరం అన్నాము.దీని వల్ల తల్లి తండ్రులకు పిల్లలకు మద్య అపార అనుభవ, చట్ట జ్గ్నానం కలిగిన న్యాయ మూర్తుల కౌన్స్లింగ్ తో చట్ట ప్రక్రియ అనే సామజిక అమోదంతో సమస్యను పరిష్కరించుకుని అందరూ హాయిగా జీవిస్తూ,మారుతున్న పరిస్తుతుల కనుగుణంగా మన సాంప్రదాయాలు మార్చుకుని నిజాయితీగా బ్రతకవచ్చు అనేది మా అభిప్రాయం.

      కోర్ట్ జ్యొక్యంతో మారేజ్ లు చేసుకోవడమనేది ఈ దేశం లో మొదలైపొయింది. దీనిని సుప్రీమ్ కోర్ట్ వారు ఒక కేస్ లో ఇచ్చిన తీర్పు ద్వారా సమర్థించారు. కాబట్టి ఇప్పుడు మేము కొత్తగా చట్టం చెయ్యమని చెపుతుంది కాదు. ఆల్ రడీ అమలవుతున్న దానినే మనం మన హిందూ వివాహ చట్ట సవరణ ద్వార అమోదింపచేసుకుంటే అవివేకులైన మన పిల్లల్ను రక్షించుకోగలుగుతాము. లేకపోతే రెంటికి చెడ్డ రేవడి అవుతాము.( కోర్ట్ మారేజ్ ప్రక్రియ గురించి టపాలోని రెఫరెన్స్ క్లిక్ చెయ్యండి).
      శ్రమ తీసుకుని చక్కటి విషాయాలు చెప్పిన ప్రసాద్ గారికి దన్యవాదాలతో


      Delete
    2. 18 ఏళ్ళకు పరిణితి లేనిది 18 ఏళ్ళ ఒక్కరోజుకి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు బాగానే ఉన్నది. పెళ్ళిళ్లయ్యి, పిల్లలు పుట్టిన వాళ్ళకు పరిణితి వచ్చి ఉంటుందని ఏమిటి? ఎవరు చెప్తారు ఆ తల్లి తండ్రులు సవ్యంగా ఆలోచించ గలరని. తల్లి తండ్రులు అందరూ అంతటి గొప్ప ఆలోచనా పరులు అయితే వరకట్న సమస్య ఎందుకు ఇప్పటికీ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నది?

      పిల్లలందరూ అవివేకులు, తల్లి తండ్రులు గొప్ప తెలివైనవారు, విజ్ఞానవంతులు అని గీతగీసేసి, జనరలైజ్ చేసెయ్యటం సరి కాదు. ప్రేమ , పెళ్ళి అనేవి సినిమాల్లోనూ, నవలల్లోనూ చూపించినంత తామర తంపరగా మన సమాజంలో రాలేదు. అలా వచ్చి ఉంటె ఇన్నన్ని మారేజి బ్యూరోలు, పెళ్ళి సంబంధాల సదస్సులు, ఎందుకు జరుగుతున్నాయి. తల్లి తండ్రులు పిల్లలు కలిసి కుదుర్చుకున్న పెళ్ళిళ్ళే ఎక్కువ. ఎక్కడో లక్షలో రెండు జరిగే వాటికి, అతిగా స్పందించి, ఒక చట్టం తెచ్చి లేనిపోని గొడవలు తేవటం అనవసరం అని నా అభిప్రాయం. మీరు చెప్పినట్టుగా తల్లి తండ్రుల అనుమతితోనే పిల్లల పెళ్ళిళ్ళు జరిగి తీరాలి అని చట్టం వచ్చిందే అనుకోండి, ఈ కింది సందర్భాలలో ఏమి చెస్తారు?

      1. తల్లి ఒప్పుకుంటుంది, తండ్రి ఒప్పుకోడు. అమ్మాయి తల్లి తండ్రులు ఒప్పుకుంటారు, అబ్బాయి తల్లి తండ్రులు ఒప్పుకోరు. అప్పుడు ఏమిటి గతి!! పిల్లలు ఈ గోల చూసి ఎటో లేచిపోతారు. మీ చట్టం ఆపగలదా? వాళ్ళూ అలా పెళ్ళి కాకుండానే ఎక్కడో ఒకటిగా బతుకుతూ పిల్లల్ని కంటూ ఉంటారు. ఆ పిల్లలు పెద్దయ్యి, వాళ్ళు ఇంకేదో వెర్రి పధ్ధతిని అనుసరిస్తారు. మీరనుకునే ఆలోచన, చట్టం చేసినంతా మాత్రాన అది అమలవుతుందన్న నమ్మకమూ లేదు, ఇక్కడేదో మీరు ఉందనుకునే సమస్యను అది పరిష్కరించనూ లేదు. ఇక పెళ్ళిళ్ల విషయంలో కూడా లంచాలు, గుమాస్తాల అల్లరి, మొదలవుతుంది అంతే.

      2. అబ్బాయికి తల్లి తండ్రులు లేరు, అమ్మాయికి తల్లి ఉన్నది, ఆమెకు మతి సరిగ్గా లేదు. ఇప్పుడు ఎవరివ్వాలి వాళ్ళకు అనుమతి? అబ్బాయికి అమ్మాయికి తల్లి తండ్రులు బతికి లేరు. అప్పుడు ఎవరిస్తారు ఆ అనుమతి. వాళ్ళు పెళ్ళి చేసుకునేది ఎలా?
      3. తల్లీ తండ్రులు అనుమతి ఇచ్చినట్టు ఏమిటి ఋజువు? ఎటువంటి పత్రాలు సృష్టించాలి, ఎవరి ముందుకెళ్ళి వాళ్ళ అనుమతి తెలియచేస్తే ఎవరు రికార్డు చేస్తారు. ఇలా సవాలక్ష గుమాస్తా సమస్యలు వస్తాయి. ఒక పెళ్ళి చేసుకుని, అది పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండ్రా అంటే ఎవ్వరూ వినటం లేదు, ఇక తల్లి తండ్రుల అనుమతి ఎక్కడ ఎలా పొందుపరిచి ఆ వివాహం మీరనుకునే చట్ట బధ్దత తీసుకొస్తారు.
      4 ఒక యువతి, ఒక యువకుడు, తమ తల్లి తండ్రులను తీసుకుని మీరు ఏర్పరచబొయ్యే చట్టం ప్రకారం వచ్చి మాకు వీళ్ళ అనుమతి ఉన్నది అని తల్లి తండ్రులుగా కొంచెం వయసు మళ్ళిన రెండు జంటలను చూపిస్తే, మీ చట్టం ప్రకారం నియమించబడ్డ ఆ అధికారి ఏమి చూసి వాళ్ళు వీళ్ళ తల్లి తండ్రులే అని నమ్మాలి? అప్పుడు డి ఎన్ ఎ టెస్టులు చేసి, ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారా.
      5. అసలు ఇవన్నీ కాదు, మేము మేజర్లం, మాకు ఎవరి అనుమతీ అక్కర్లేదు. మేము పెళ్ళి చేసుకుంటాం అని ఒక అబ్బాయి, అమ్మాయి అని పెళ్ళి చేసేసుకుంటే, అప్పుడు మీ చట్ట ప్రకారం వాళ్ళను ఏమి చేస్తారు.

      డిబేట్లల్లో చెప్పటానికి సందర్భాన్ని బట్టి అనేక ఆలోచనలు, మాటలు చెప్పి చప్పట్లు కొట్టించుకోవచ్చు. కాని నిజ పరిస్థితి వేరు. మనకు తట్టింది కాబట్టి ఆ ఆలోచన మీద ఆవేశం ఎక్కువ ఉంటుంది, అది సహజం.

      మీరేదొ ఆశ్రమం లో "మేమూ" అంటున్నారు కదా. ఆ ఆశ్రమంలో, ఇలా చట్టం తేవాలి అనుకున్న వాళ్ళను మాత్రమే అనుమతించండి, వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిన అనంతరం (కనీసం ఒక వెయ్యి మంది తల్లి తండ్రులు), అందరూ కలిసి ఆ చట్టం ఎలా ఉండాలి అన్న విషయం మీద కూలకషంగా చర్చించి, ఒక పెద్ద సభ చేసి, మీరనుకునే విషయాన్ని అందరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఆప్పుడు వచ్చే ఫలితాన్ని బట్టి తదుపరి కార్యక్రమం ఉండాలా వద్దా అని చూసుకోవచ్చు.

      దేశంలో ఎన్నెన్నో ఘోరమైన సమస్యలు ఉంటే, పిల్లల పెళ్ళికి పెద్దల అనుమతి ఉండి తీరాలి అని చట్టం చెయ్యటమనేది ఒక ప్రాధాన్యత సంతరించుకున్నదా. చిత్రంగా ఉన్నది. వివాహం అనేది అతి సున్నితమైన విషయం. ఈ విషయం మీద కుంటుంబంలోనూ, కుటుంబాల మధ్య చక్కటి సామరస్య ధోరణిలో జరగవలసిన కార్యక్రమాలు, చట్టం పేరుతో ఎవడెవడో చొరబడేట్టుగా చెయ్యటం సహించరానిది, శ్రేయస్కరం కూడా కాదు.

      మీరనే "మేము" ఏమిటో అర్ధం అయ్యింది కాని, వ్రాస్తున్నదేమో వ్యక్తి పేరుతో, ఇలా "మేము" "మేము" అంటూ ఉంటె చదవటానికి చాలా ఎబ్బెట్టుగా ఉన్నది.

      Delete
    3. "అందుకే అటు అవివేకులను చట్టం పేరుతో బలి చేసుకోకుండా, ఇటు వివేకులను సాంప్రదాయం పేరుతో దూరం చేసుకోకుండా ఉందెందుకే చట్ట సవరణ అవసరం అన్నాము.దీని వల్ల తల్లి తండ్రులకు పిల్లలకు మద్య అపార అనుభవ, చట్ట జ్గ్నానం కలిగిన న్యాయ మూర్తుల కౌన్స్లింగ్ తో చట్ట ప్రక్రియ అనే సామజిక అమోదంతో సమస్యను పరిష్కరించుకుని అందరూ హాయిగా జీవిస్తూ,మారుతున్న పరిస్తుతుల కనుగుణంగా మన సాంప్రదాయాలు మార్చుకుని నిజాయితీగా బ్రతకవచ్చు అనేది మా అభిప్రాయం."
      మేము పిల్లలందరు అవివేకులుఅని,పెద్దవాల్లు మాత్రమే వివేకులు అనలేదు. అటూ,ఇటూ ఆలొచించలేని వారు ఉంటారు కాబట్టె, జ్గ్నానవంంతుల జ్యొక్యం అవసరం అన్నాము. మేఏరేదో ఆదర్శవాదం(కుటుంబ సంఅస్యలలో యెవరూ జ్యొక్యం చేసుకో రాదు ) చెప్పేది యదార్దానికి దూరంగా ఉంది. ఏప్పూడో చట్ట జ్యొక్యం కుటుంబాలలో ప్రవేసించింది.దాని పరిణామాలే ప్ఫొలిస్ స్టేషన్లలో పెల్ళ్లిల్లు.కొర్ట్ మారజీలు. దానికి అబ్యంతరం పెట్టని మీరు, తల్లితందండ్రుల జ్యొక్యానికి అబ్యంతరం పెట్టడం విచిత్రం. మీరు చేప్పే వారు తెలిగలవారైనంత మాత్రా(వారు అదిక శాతం వుండవచ్చు గాక) మిగతా పిల్లల జీవితాలకు కూడ మీరే గ్యారంటీయా? మీరు లేవనెత్తిన అన్ని సమస్యలకు కోర్ట్ ఆర్డర్ అనే సామజిక ఆమోదయే ఫైనల్. ఏలాగు ఫిల్లలు పార్టీలుగా ఉంటారు కాబట్టి,పెద్దలకు కూడ రెప్రజంటేషన్ చాన్స్ ఇవ్వమంటున్నాము. అసలు ఎవరి జ్యోక్యం వద్దంటే హిందూ వివాహ చట్టాన్ని రద్దు చెయ్యమనాలి. నేను చెప్పేదే సాద్యపడనప్పుడు, మీరు చెప్పేది అసలే సాద్యపడదు.
      మేము లేచిపోతే చట్టం యెమి చేస్తుంది అంటే ఏమి చెయ్యదు. దాని అవసరం కలిగిన నాడే పరిశీలిస్తుంది. ఈ నాడు ౧౩.౧ శాతం జంటలు ఆంద్రప్రదేశ్ లో వివాహాలు లేకుండా సహజీవనం చేస్తున్నారు. ఇది రాను రాను పెరిగే సూచనలే అదికంగా ఉన్నాయని సర్వే లు చెపుతున్నాయి. అలాగే లేచిపోయే వారి సంఖ్య (ముఖ్యంగా మీరు చెపుతున్న ఆర్థిక స్వాతంత్ర్యం గల వారిలో) అదికమవుతుంది. ఇవన్ని ఈ రొఝు కాకపొఈనా ఏదో ఒక రొజు సామాజిక సమస్యలే. వీటన్నింటిని ఎవరు పరిష్కరిస్తారు. మీరనే లక్షకు ఒకటి రెంటికి ఏది ప్రాతిపదకో మాకు అర్థం కాలేదు. విషయం ప్రాదాన్యం లెనిదని మేము అనుకోవడం లేదు ముక్యంగా మీలాటి వారు స్పందిస్తున్న తీరే మా నమ్మకాని మరింత పెంచుతుంది.

      సబలు పెట్టమన్న మీ సూచన మేము అనుసరించలేము. అది మత వాద రాజకీయ నాయకులు చెయ్యల్సిన పని. మేము అవసరమనుకుంటే ఉన్నత న్యాయస్తానాల ద్వారా ప్రబుత్వాలను ప్రశినిస్తాం. అదే మాకు తెలిసిన విద్య. మేము సేకరించిన రీకార్డులు జ్గ్నానవంతులైన ౩ పార్టీ జ్య్క్యం అవసరమనే చెపుతున్నాయి. కాబట్టి ఒక వేళ మీరు మాతో విబేదించినా అది మీ అభిప్రాయం మాత్రమే అవుతుంది. కాలమే దీనికి సమాదానం .శలవు.

      Delete
    4. "...తల్లి తండ్రులకు పిల్లలకు మద్య అపార అనుభవ, చట్ట జ్ఞానం కలిగిన న్యాయ మూర్తుల కౌన్సిలింగ్ తో చట్ట ప్రక్రియ అనే సామాజిక అమోదంతో..."

      చట్ట జ్ఞానం కలిగిన న్యాయ మూర్తులు కాక చట్ట జ్ఞానం లేని న్యాయ మూర్తులు కూడా ఉంటారా!! న్యాయ మూర్తులు అంటే చట్టం, న్యాయం తెలిసినవారే అయ్యుంటారని అర్ధం చేసుకుంటున్నాను ఇన్నాళ్ళూనూ.

      "చట్ట ప్రక్రియ అనే సామాజిక ఆమోదంతో" అంటే? చట్టాలన్నీ కూడా సామాజిక ఆమోదం పొందినవేనా!! వరకట్న సమస్య అల్లానే ఉన్నదే మరి, చట్టం చేసినా కూడా!! సామజికతతో ముడిపెట్టుకుని చట్టం చేస్తే, ప్రభుత్వం హిందూ వివాహ చట్టాన్ని చేసి ఉండకూడదు. ఒక మతానికి సంబంధించినది కాబట్టి ఆ మత పెద్దలకే వదిలేసి ఉండాలిసింది. అలా చెయ్యలేదే. ప్రభుత్వం పూనుకుని ఎంతవరకూ తమ ప్రమేయం ఉండాలో తెలిసి అంతవరకూ ఉండేట్టుగా జాగ్రత్త పడి చేశారు. ఈ సామాజిక చట్ట ప్రక్రియ అంటె ఎమిటో తెలియచేస్తే సంతోషిస్తాము.

      మీరు "శాస్త్ర పరిశీలన" అంటే ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. కాని మీరు ఆ పరిశీలనేమిటో ఇంతవరకూ కనపరచకపోగా, నేను అనని మాటలను నాకు అంటకడుతున్నారు. మీరు నాకు ఆపాదించిన మాటలు "...ప్ఫొలిస్ స్టేషన్లలో పెల్ళ్లిల్లు.కొర్ట్ మారజీలు. దానికి అబ్యంతరం పెట్టని మీరు, తల్లితందండ్రుల జ్యొక్యానికి అబ్యంతరం పెట్టడం విచిత్రం...:

      పోలీసు స్టేషన్లల్లో పెళ్ళిళ్ళు ఆ తరువాతేమిటో గజిబిజిగా వ్రాశారు, దానికి అబ్యంతరం పెట్టని నేను?? అసలు ఈ విషయం నేను ఎక్కడన్నా ఎత్తానా? పోలీసుల మాట ఎక్కడ వచ్చింది నేను చెప్పిన మాటల్లో? ఆ వచ్చిన సందర్భం ఏమిటి? తల్లి తండ్రుల జోక్యాన్ని నేను అబ్యంతరం ఎక్కడ పెట్టాను. తల్లి తండ్రులు తమ పిల్లలకి చిన్నప్పటినుంచి పెంపకం చేసేప్పుడే అనేక మంచి విషయాలు చెప్పి పెంచుతారు. అది ప్రకృఇతి సహజం, దానిని తల్లి తండ్రుల జోక్యం అంకూడదని మీకు కూడా తెలిసే ఉంటుందని నా ఊహ. కాని, పిల్లల పెళ్ళిళ్ళకు తల్లి తండ్రుల అనుమతి తప్పనిసరి అని చట్ట తీసుకురావటం తప్పు అన్నాను. ఈ రెండిటికీ తేడా ఉన్నది మాష్టారూ. కొంచెం ఆలోచించి చూడండి.

      ఒక పక్కన శాస్త్ర పరిశీలన అంటారు, నేను మచ్చుకు రెండు మూడు విషయాలు లేవనెత్తితే సూటిగా సమాధానం లేకుండా ఏదో "కోర్ట్ ఆర్డర్ అనే సామజిక ఆమోదయే ఫైనల్" అంటారేమిటి!! కోర్టు ఆర్డరే సామాజికమైతే ఇన్నన్ని అప్పీళ్ళు దేనికి, ఫుల్ బెంచ్ విచారణలు దేనికి. కోర్టు ఆర్డరే సామాజికం అయినప్పుడు షాబానో కేసులో పాపం ప్రభుత్వం చట్టన్ని మార్చటం దేనికి. ఉరి శిక్ష వేయబడ్డ కేసుల్లో, మళ్ళి రాష్ట్రపతి క్షమా భిక్ష దేనికి.

      "ఈ నాడు ౧౩.౧ శాతం జంటలు ఆంద్రప్రదేశ్ లో వివాహాలు లేకుండా సహజీవనం చేస్తున్నారు" ఈ విషయం ఎలాకనిపెట్టారు? ఈ గణాంకాలకి ఆధారం ఏమిటి? వార్తా పత్రికల్లో వచ్చే గాసిప్ కాలంసేనా, ఇంకేమన్నా గణాంకాలు కొంత సాంపుల్ సర్వే లాంటిది తీయించారా. అలా చేసి ఉంటె ఆ సాంపుల్ సర్వే పరిమాణం ఎంత ఏ ఏ ప్రాంతాల్లో చేయించారు?

      "... మీరనే లక్షకు ఒకటి రెంటికి ఏది ప్రాతిపదకో మాకు అర్థం కాలేదు..." అర్దం కావటం కష్టమేలెండి. అలాంటివి రోజూ ప్రతి క్షణమూ కనపడవు కదా మరి.

      "కాలమే దీనికి సమాదానం" ఈ మాట మాత్రం నేను ఒప్పుకుంటాను.అవును కాలమేనిర్ణయిస్తుంది ఏ విషయమైనా సరే. సర్వరోగ నివారిణి కాలమే.

      వారి శాస్త్రీయ పరిసీలన అంటూ మొదలు పెట్టిన వారు, వాదనలో ఆవతలి పాయింట్లు అర్ధంచేసుకునే ప్రయత్నం చేసి చర్చ చెయ్యగలగాలి కాని ఉట్టి వాదన చేసేసి, సూటి సమాధానాలు చెప్పకుండా దాటవేస్తుంటే దానిని శాస్త్ర పరిశీలన అనగలమా అని నా అనుమానం.

      "మీలాటి వారు స్పందిస్తున్న తీరే మా నమ్మకాని మరింత పెంచుతుంది" నేను ఇంతకు ముందు ఉదహరించిన కమ్యునిస్ట్ బ్లాగుల్లో కూడా అచ్చు ఇలాగే ఉంటుంది వాళ్ళ స్పందన. నేను స్పందించిటానికి కారణం మీరు ప్రతిపాదిస్తున్న చట్ట సవరణ అసంగతమైనది అని చెప్పటానికి మాత్రమే.

      నేను మిమ్మల్ని ముందుగా సభలు పెట్టమని చెప్పలేదు. మీ ఆశ్రమంలో తల్లి తండ్రుల అనుమతి లేకుండా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటే, అవి చెల్లవు అని చట్టం చేసి తీరాలి అనుకునే తల్లి తండ్రులను సభ్యులుగా, కనీసం ఒక వెయ్యి మందిని చేర్చండి. ఆ తరువాత సభ పెట్టటమా లేదా అవసరం అయితే నింపాదిగా ఆలోచన చెయ్యవచ్చు.

      శలవా మరి!

      Delete
    5. మీరు తెలుగు వ్యాకరణ దోషాలు ఎన్నడంలో ఉన్న పరీసీలన విషయం మీద లేదు అని చెప్పగలను మాష్టారు గారు . నేను చెప్పిన 13.1 శాతం ఎక్కడిదో మీరు నమ్మలేరు. కాని మీరు చెప్పిన లక్షకు ఒకటి అనేదానిని చెపుతూంటే మీ వాదనలో నిజాయితీ యెంతో అత్మ విమర్శ చేసుకో గలరు అంటే మీరు చెప్పేది 8 కోట్లు ఉన్న ఆంద్రప్రదేశ్లో లక్షకు ఇద్దరు చొప్పున కొటికి 200 చొప్పున మొత్తం 1600 మందే తల్లితండ్రుల ఆమోదం లేని జంటలు . ఇది నమ్మదగిన గణాంకమని ఈ రాష్త్రంలో ఏ స్శామాజిక సర్వెయ్ రీకార్డ్లు ఆదారం చూపించిన నేను మీరు చెప్పింది కరక్ట్ అని ఒప్పుకుంటాను. లేదూ నేను చెప్పిన 13.1 శాతం రెకార్డ్ ఆదారాలు చూపిస్తాను మేము చెప్పేది కరఖ్ట్ అని మీరు ఒప్పుకో గలరా? మేము చెదే వేదం అనే వారితో ఏమి వాదిస్తాం ,ఏ అదారాలు చూపించినా అవి గాలివి అన్న తర్వాత వాదించి పలితం ఏమిటి? అందుకే శలవు.

      Delete
    6. మీ లెఖ్క తప్పు గురువుగారు! మొత్తం రాష్త్రంలో ఉంది ౨.౧౦ కోట్ల కుటుంబాలు. అందులో 13.4 శాతం మంది పెళ్లిలు లేకుండా సహజీవణం చేస్తున్నారు. ఆ విదంగా సుమారు 29 లక్షలమంది సహజీవనం చేస్తుంటే కేవ్లం లక్షకు ఇద్దరా! అంతే 2 కోట్లకు 400 మందే రాష్ట్రంలో ఉన్నారా? పైగా ఎలా కనపడ్తారు అని ఎకసక్కాలు ఎవరఈనా వింటే నవ్విపోతారు.

      అయినా అపరాద బావం గలవారే ఎదుటివారిలో అయినదానికి కానిదానికి తప్పులు వెతుకుతారట! మా సార్ చెప్పారు.దమ్ముంటే 10 లక్షలు పందేం పెడితే నేను నిరూపిస్తా. రాష్ట్రంలో ఎవరి శాతం ఎంతో!అందుకే వేమనగారంది "తప్పులెన్నువారు తండోప తండంబ్బు, లుర్వి జనులకెల్ల నుండుతప్పు, తప్పులెన్నువారు తమతప్పు లెరుగరయ్యా! అని. ఏదైనా మాటనేముందు ఎనుక ముందూ చూసుకోవాలి.లేకపోతే అబాసుపాలే.

      Delete
    7. "రాజ్ విను" ఎవరు నాయనా మీరు! ఈ ఆశ్రమంలో ఉండే "మేము" లో భాగమేనా ఏమిటి? "...దమ్ముంటే 10 లక్షలు పందేం పెడితే నేను నిరూపిస్తా. ఇలా తొడలు కొట్టటమేనా మీ శాస్త్ర పరిశీలన...." వాదనలో ఆవతలి వాళ్ళల్లొ ఒక్కడిని ఒప్పించలేని మీరు చట్టం తేగలరా? ఈ రెండురోజులూ మీరేమన్నా సవ్యమైన చర్చ చెస్తారేమో ఒపికగా ఎదురుచూశాను. కాని అలాంటిదేమీ లేదు. మీరు వ్రాసే వాటిల్లో ఒకదానికొకటి పొంతనలేదు. నేను చెప్పినది లక్షకు ఇద్దరు అనేది, గొడవలయిపోయి, మీడియాకు ఎక్కిన వాళ్ళ గురించి. మీరు మీకు మీరుగా వేసుకున్న పెళ్ళి కాని జంటల లెక్క. ఈ రెండు వేరు వేరు విషయాలు అని చెపితే అర్ధంచేసుకునే స్థాయిలో లేరు మీరు. ఎవరో కొంతమంది పెళ్ళి కాకుండా కొన్ని జంటలు ఉంటె మీరు చెప్పిన లెక్క ప్రకారం 13 శాతం అయినా సరే, చట్టం చెయ్యాల్సిన అవసరం ఏమిటిటా. వాళ్ళు పెళ్ళి కాకుండా ఎందుకు ఉన్నారో కారణాలు ఏమిటి. తల్లి తండ్రులు ఒప్పుకోకనేనా? ఆ విషయం మీరు కనెక్ట్ చెయ్యటం లేదు. ఏదో బోడిగుండుకీ, బట్టతలకీ ముడిపెట్టే ప్రయత్నమే ఎక్కువగా కనపడుతున్నది. మీరన్న మాట ("...ఏదైనా మాటనేముందు ఎనుక ముందూ చూసుకోవాలి.లేకపోతే అబాసుపా...") మీరే చదువుకుని అందులో ఉన్నదేమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. కష్టమైన విషయం, కాని తప్పదు మరి.

      మీరు చెప్పే వాదనకు మరొక కోణం చూపించే ప్రయత్నం చేస్తుంటే, "తప్పులెన్నువారు" అంటూ చిలకపలుకులు చెప్పటమేమిటి. ఇప్పటికి కూడా మీరనుకునే చట్టంలో నేను చూపించిన రెండు మూడు విషయాలకు జవాబు చెప్పలేరు కాని తొడకొట్టి (అది కూడా వేరేవారి చేత అనిపించటం) పందాలా. ఇదేమన్నా బాలయ్య సినిమానా. ఎంతటి శాస్త్ర పరిశీలన!!

      "అయినా అపరాద బావం గలవారే ఎదుటివారిలో అయినదానికి కానిదానికి తప్పులు వెతుకుతారట!" ఏదో మాటలు తెలుసు కాబట్టి వాటి అర్ధమేమిటో తెలియకుండా వాడెయ్యకండి. అపరాధ భావం ఏమిటి ఇందులో. విచిత్ర స్పందన.

      "...ఎకసక్కాలు ఎవరఈనా వింటే నవ్విపోతారు....". అవును మీరు వ్రాసే వ్రాతలు, ఎవరూ రాకపోతే మాటి మాటికి అదే అదే పాడిందే పాడరా అన్నట్టు ప్రచురించటం చూసి నవ్వేపోతున్నారు మరి.

      ఈ చౌకబారు స్పందన కట్టిపెట్టి, నేను అడిగిన పాయింట్లకు చట్టం చేద్దాం అనుకునే మీరు ఏమన్నా సమాధానం చెప్పి, ఆ చట్టం ఎలా ఉండాలి అని చెప్పగలిగితే చెప్పండి లేదంటే మీరు ఒప్పుకున్నట్టుగానే "శలవు"

      Delete
    8. "ప్రేమ , పెళ్ళి అనేవి సినిమాల్లోనూ, నవలల్లోనూ చూపించినంత తామర తంపరగా మన సమాజంలో రాలేదు. అలా వచ్చి ఉంటె ఇన్నన్ని మారేజి బ్యూరోలు, పెళ్ళి సంబంధాల సదస్సులు, ఎందుకు జరుగుతున్నాయి. తల్లి తండ్రులు పిల్లలు కలిసి కుదుర్చుకున్న పెళ్ళిళ్ళే ఎక్కువ. ఎక్కడో లక్షలో రెండు జరిగే వాటికి, అతిగా స్పందించి, ఒక చట్టం తెచ్చి లేనిపోని గొడవలు తేవటం అనవసరం అని నా అభిప్రాయం"
      IVI MEERANNA MAAtALe MAHAAsAYAA!
      "నేను చెప్పినది లక్షకు ఇద్దరు అనేది, గొడవలయిపోయి, మీడియాకు ఎక్కిన వాళ్ళ గురించి."
      IDI MEERANNADe . EVAdINI PICCOOLLU CHeSTAARU MEERU. i REmDOO OKATeNAA MUmDUGAA NIROOPImCHU.a TAAVAATA MeMAVARIMo TELUSUKUmDUVU GAANI

      Delete
    9. యవ్వన్నం లో మనిషి బుద్ది చపలంగా ఉంటుంది . ఆ దశ లో అతను లెక ఆమే కుటుంభం కంటె తమ లోని కామ ప్రాకోపాలకే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. దానికి ప్రేమ అనో మరేది అనో ఒక అందమైన పేరు తగిలించుకుని ముందు వెనుక కానక కలిసిపొఈ జీవీతాలు నాశనం చేసుకుంటారు. ఇండియన్ కాంట్రాక్ట్ ఏక్ట్ ప్రకారం కూడ ఏదైనా ఉన్మాద స్తితిలో చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. కాని కేవలం కామ ఉన్మాదంలో చేసుకుంటున్న ఇటువంటి పెళ్ళిలను కేవలం వయసు ప్రాతిపదికగా అనుమతించడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రతి వివాహానికి తల్లితంద్రుల అనుమతి తప్పనిసరి చేయాలి. ఒకవేళ వివాహం విషయమ్లో తల్లి తండ్రుల నిర్ణయం కుటుంబ అబివ్రుద్దికి గాక స్వార్ద పూరితమైందని పిల్లలు బావిస్తే దానిని కుటుంబ న్యాయ స్తానాల రుజువు చేసి అట్టి కోర్టుల అనుమతితోనే వివాహం చేసుకునేతట్లు చట్ట సవరణ తెస్తే మంచిదని మా అభిప్రాయం’ ఏమంటారు.?chatta savarana elaa uMdaalO imtakaMtE spashtamgaa evaru cheputaaru?

      Delete
    10. ఏకవచనంలోకి వచ్చేసిందే ఆశ్రమవాసుల భాష!! ఇదే అన్న మాట మీ శాస్త్ర పరిశీలన. తెలుగు అర్ధం అయితే నేను వ్రాసినది అర్ధం అవుతుంది లక్షల్లో ఒకటో రెండో మీడియాకి ఎక్కుతున్నారనే అన్నది నేను. మీరు (నేను ఇంకా మీరు అనే అంటున్నాను తెలుసుకోగలరు) ఉటంకించిన నా మాటల అర్ధం ఏమిటి సరిగ్గా సందర్భ శుధ్ధితో అర్ధం చేసుకోండి. లెదా ఎవరికన్నా చూపించి అర్ధం చెప్పించుకోండి. ఊరికే పూనకం వచ్చినట్టుగా ఊగిపోతే చట్టాలు చెయ్యరు. అర్ధం అవుతున్నదా.

      Delete
    11. ( 1) ప్రేమ , పెళ్ళి అనేవి సినిమాల్లోనూ, నవలల్లోనూ చూపించినంత తామర తంపరగా మన సమాజంలో రాలేదు. అలా వచ్చి ఉంటె ఇన్నన్ని మారేజి బ్యూరోలు, పెళ్ళి సంబంధాల సదస్సులు, ఎందుకు జరుగుతున్నాయి. తల్లి తండ్రులు పిల్లలు కలిసి కదుర్చుకున్న పెళ్ళిళ్ళే ఎక్కువ. ఎక్కడో లక్షలో రెండు జరిగే వాటికి, అతిగా స్పందించి, ఒక చట్టం తెచ్చి లేనిపోని గొడవలు తేవటం అనవసరం అని నా అభిప్రాయం"

      (2)"నేను చెప్పినది లక్షకు ఇద్దరు అనేది, గొడవలయిపోయి, మీడియాకు ఎక్కిన వాళ్ళ గురించి."
      nennadi 1.2.lo meeru anna vyakyala artham okatenaa? evarni picchollu chestaaru ani? Aftraal nEnEvarO teliyani meeru oka rendu lineloalo "nuvvu" annamduke imta feel ayite 18 samvastarallu pemchina talli tamdrulanu afftraall ani yellipoyevaani chattapraakaaram prashnimche adikaaramimmanatam tappaa?

      Delete
  14. పిల్లల పెళ్ళిళ్ళకు పెద్దల అమోదం అనేది రాజ్యాంగం లోని ఆదేశిక సుత్రాలు లాంటివే. ఈ విషయంలో చట్టబద్ధం చెయ్య్టం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకమే అవుతుంది....దేశలోని పిల్లలు పిల్లలుగా ఉన్నంతవరకే వారికి తల్లిదండ్రుల నుండీ ఆమోదం రక్షణా అవసరం........పిల్లలే పెద్దలై చట్ట బద్దంగా మేజర్లు అయినప్పుడు వారు చేసే పనులకి తల్లిదండ్రులు బాధ్యత వహించ వలసిన పని లేదు.....అలా చట్టం చేస్తే అది అక్కడితో ఆగక, పెద్దలైన పిల్లలు చేసే విపరీత చేష్టలకి తల్లిదండ్రులు జీవితాంతం చట్టానికి లొంగి ఉండవలసి వస్తుంది. మనకు కావాలిసినప్పుడు చట్టం కావాలి.....లేదంటే అఖర్లెదు అనుకోవటం కుదరదు. మనం హక్కులు అనే మాట వాడినప్పుడు చట్టాన్ని కూడా మన కుటుంబ వ్యవస్తలోనికి మనకి మనంగా ఆహ్వానించినట్లే..... ఇక పిల్లలు పెద్దలు అవటం అనేది ఎక్కడో ఒక వయసు దగ్గర అయితే కదా వారు చట్ట బద్దమైన దేశ పౌరులవుతారు. లేక మీరు చెప్పినట్లు పిల్లలు పెద్దల అనుమతితోనే వివాహం చేసుకోవాలంటే అది కేవలం బాల్య వివాహ వ్యవస్థలోనే కుదురుతుంది...మరి ఆ వ్యవస్థ చట్ట వ్యతిరేకం.

    కాబట్టి, పిల్లల పెళ్ళి విషయంలో పెద్దల ఆమోదం అవసరమే కానీ అది కృతజ్ఞతా భావంతోనో లేక తల్లిదండ్రుల పట్ల తమ గౌరవం ప్రకారం సరిగ్గానే ఉన్నా, చట్ట ప్రకారం చట్టం చెయ్యటం చట్ట వ్యతిరేకమే అవుతుంది. ఇప్పటికే చట్టలు ఎక్కువైపోయి ఏది ఏమిటో తెలియక అది తెలుసుకునేందుకే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవలసి వస్తోంది. అన్నిటినీ చట్టాలు చెయ్యలేకనే మంచిగా ఉండాలనే వాటిని ఆదేశిక సూత్రాలుగా మన రాజ్యాంగంలో చేర్చారు. ఎవరికి వారు మంచి పౌరులుగా ఉండి అందరి ఎడలా బాధ్యతాయుతంగా ఉండాలిసినదే కానీ, ప్రతీ దానికీ చట్టం చేసుకొంటూ పోతే చట్టానికే విలువ ఉండదు. ఇప్పటికే అలా అమలు కానీ చట్టాలు అనేకం ఉన్నాయి.......ఇది కూడా వాటి సరసన చేరుతుంది. అంతె.

    ReplyDelete
    Replies
    1. LBS తాడేపల్లి23 అక్టోబర్ 2012 1:37 ఉ
      పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి ఉండాలన్న మీ ప్రతిపాదన గుఱించి మళ్లీ మళ్ళీ ఆలోచించాను. మీ ప్రతిపాదన దూరదృష్టితో కూడుకున్నదనీ, సరైనదేనని నాకు అనిపించింది. దీని కోసం మనం తప్పకుండా కృషిచేద్దాం.

      Delete
  15. బహుశా మేము చెప్పింది అర్థం కాక మీ అభిప్రాయం చెపుతున్నారనుకుంటా! చట్టం లేక ముందు పిల్లలు ప్రేమ పెల్లి చేసుకోవాలంతే ఇతర బందువుల సహాయమో,పారిపొఈ పెల్లి చేసుకోవటమో జరిగేది. అప్పుడు అతు తరపు పెద్దలు ఇటు తరపు పెద్దలు కqలిసి ఒక నిర్ణయం తీసుకునెవారు. ఇక్కడ పెద్దలు అభిప్రాయాలు, పిల్లల మనోబావాలు ఇతర పెద్దలు విని ఒక ఆంగికారానికి రావడంఆ లేక పిల్లలు వెళ్లిపోవడమో ఎదో జరిగేది. కాని చట్టం వచ్చిన తర్వాత పిల్లలకు ఎవరితో పని లెకుండా చట్టమే రక్షణ కల్పించి పెద్దల అభిప్రాయలను అటు పిల్లలు కాని, ఇటు సమాజం కాని తెలిసుకోకుండా కట్టడి చేస్తుంది. అందుకే చట్ట ప్రాకారం పెద్దల అభిప్రాయలను విని ఆ తర్వాత కుటుంబ న్యాయ స్తానాలు తగిన కౌన్స్లింగ్ ఇటు పెద్దలకు, అటు పిల్లలకు చేస్తే , దానిని బట్టి కొర్ట్ అనుమతితో పిల్లలు పెంద్లి చేసుకుంటే వాళ్లు పారిపోవాల్సిన అవసరం లేదు, ఇటు పెద్దలు బాదపాడాల్సిన అవసరం ఉండదు అని మా అభిప్రాయం. లేదూ అసలు కుటుంబాలలో చట్ట జ్యోక్యం అనవసరమనుకుంటే పూర్తిగా చట్టాని రద్దు చెయ్యాలి. కేవలం పిల్లల హక్కులు వరకే మా బాద్యత, పెద్దల అభిప్రాయాలు మాకనవసరం అనుకుంటే రేపు స్వలింగ వివాహాలు చేసుకుంటామని పిల్లలు హక్కుగా అదిగినా చేసేది ఎమి ఉండక పోవచ్చు.అంతా వోట్ల రాజకీయాలే కాబట్టి ఎవరీష్టం వారిది. ఏది ఏమైనా అవేశంలో చేసే ప్రతి పనికి ఒక ఆలో చించ గలిగిన అవకాశం ఉంటే మంచిది.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.