"పశువుల గడ్డి మేసినందుకు పదిహేడేల్లకి శిక్ష విదించారట!
ఈ దేశం లో కేవలం ఒక్క న్యాయస్తానాలు మాత్రమే అవినీతి గడ్డి తీంటున్న పెద్దలను నిష్కర్షగా జైల్ లోకి పంపి, ఈ దేశం కోసం తపించే వారిని అప్పుడప్పుడు ఆనందపరుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. 'ఈ దేశం ని ఎవరూ బాగు చెయ్యలేరు, అవినీతి అనేది సర్వసాదార్ణం విషయం' అని మన దేశం లో పామరులు నుంచి మేదావులు దాకా ఒక ద్రుడ నిర్ణయానికి వచ్చే శారు. దీని వలన అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులలో కానీ, అధికారులలో కాని చట్టం అంటే ఏ మాత్రం భయం లేకుండా పోయింది. అవినితి పరులకు జనం నీరాజానాలు పట్టి ఎన్నికలలో గెలిపిస్తుంటే తాము చేసే పనికి ప్రజామోదం ఉంది అని అవినీతి పరులు బుకాయిస్తూ, అధికార దర్పం వెలగపెడుతుం...