పదవుల కోసమే పెదవులు ఆడిస్తారా!?
"సమైక్యాంద్ర మా వ్యక్తిగతం, అధిష్టానం నిర్ణయమే మాకు శిరోదార్యం" "పంచాయతి ప్రెసిడెంట్ గా అనే మాటలు వేరు, కేంద్ర మంత్రిగా అనే మాటలు వేరు". ఈ మాటలు లేటుగా అయినా లేటెస్ట్ గా కేంద్రమంత్రి పదవీ బాద్యతలు చేపట్టిన ఒకప్పటి వీరా సమైక్యాంద్రా వాది గారివి. పదవి వచ్చింది కాబట్టి,సమైక్యాంద్ర అనలేకపొతే, అసలు ఆ పదవి తీసుకోవడం ఎందుకు? పదవుల కోసం పెదవులు ఆడించి అది వచ్చాక కాం అయితే మిమ్మల్ని నమ్మి ఇప్పటి దాక గొంతు చించుకుని చదువులు పాడు చేసుకున్న విద్యార్దుల మాట ఏమిటి? మొత్తానికి కావూరి గారు అంటే కె.టి.ఆర్. గారికి లోపల ఏదో కసి ఉన్నట్లు ఉంది...