పెండ్లి కానివారు , పెటాకులు అయిన వారు, "హృదయం" విషయం లో ఒకటే నట !
"మనువు ", వివాహం , కల్యాణం ,పెండ్లి ,పేరు ఏదైతేనేం భారతీయుల జీవితంలో అది ఒక ముక్యమైన ఘట్టం .స్త్రీ పురుషులకు బ్రహ్మ ముడి ని వేసి సంపూర్ణ మానవుడిగా జీవించడానికి అవకాశ మిచ్చె మహత్తర తంతు . మనువు మహాశయుడు చెప్పిన "ఆశ్రమ " సిద్దాంతం ప్రకారం ప్రతి మనిషికి "గృహస్త " ఆశ్రమం కంపల్సరి .అసలు సంసారి కాని వాడికి సన్యాసి అయ్యే అర్హత లేదు . కాబట్టి మన ఋషులు సైతం తగిన కన్యను వివాహమాడడం ద్వారా గృహస్త ఆశ్రమం స్వీకరించి ప్రశస్తి గాంచారు తప్పా పెండ్లి ,పెటాకులు లేకుండా , సంసారం అంటే ఏమిటో తెలియకుండా సంసార సారం చెప్పడానికి సాహసించలేదు . చివరకు భగవద్ అవతారాలు కూడా వివాహమాడి దానికున్న విశిష్టతను తెలియ చేసారు . పెండ్లి కాని వాడు ఎంత జ్ఞాని అయినా భగవంతుడు కాలేదు , గృహస్తు కు మాత్రమె ఆ అర్హత . ఇదే సత్యం నారదుల వారి వలన తెలుస్తుంది . నారదుడు ఎంత జ్ఞానవంతుడైనా అతడు పరిపూర్ణుడు కాలేడు . అందుకే అతడు నిత్యం బగవత్ నామ స్మరణ చేస్తూ , సతి సమేత త్రిమూర్తులను కీర్తిస్తూ