అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!



                              మనిషి సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యం ఎంత అవసరమో , సమాజం లో సాఫీగా మనుగడ సాగించాలి అంటే మనుషుల మద్య అరోగ్యకరమైన సంబందాలు అంతే అవసరం. అటువంటి ఆరోగ్యకరమైన సంబందాలను కొనసాగించేదుకు నిర్దేసించినవే కట్టు బాట్లు. అటువంటి కట్టుబాట్లను కాలదన్ని "నా ఇష్టం నాది " అని ప్రవర్తించే వారి కుటుంబాలు ఎలాంటి అదమా స్తితికి దిగజారుతాయో తెలుపుతుంది మొన్న నల్గొండలో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్దిని ఝాన్సీ ఆత్మహత్య ఉదంతం. వివరాలులోకి వెలితే,

                    నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోములకి చెందిన గుర్రపు పద్మ తన భర్త మరణం తర్వాత కుమార్తె ఝాన్సీరాణి, కుమారుడితో కలిసి నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో నివాసం ఉంటోంది. నల్లగొండ మండలం దీపకుంటకి చెందిన ఝాన్సీ మేనబావ విజయేందర్‌ నుంచి పద్మ రూ.4 లక్షలు అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చాలంటూ విజయేందర్‌ తరచూ పద్మ ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో ఝాన్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. 'నీ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తే... మాఫీ చేస్తా' అని చెప్పాడు. దాంతో పద్మ తన కూతురు ఝాన్సీకి చెప్పకుండానే పెళ్లికి అంగీకరించింది.

నిరుడు 2014 ఆగస్టు 22న విజేందర్‌తో ఝాన్సీనికి ఇష్టం లేని పెళ్లి చేశారు. భర్తతో ఝాన్సీ కాపురం చేస్తున్న క్రమంలో తన తల్లికి, భర్తకు మధ్య ఉండకూడని సంబంధం ఉన్నట్లు గుర్తించింది. తన సోదరుడు ఇంట్లో లేనప్పుడు విజేందర్‌ తరచూ తల్లి దగ్గరికి వస్తున్నట్లు ఆమెకుతెలిసింది. తన తల్లితో విజయేందర్‌ అత్యంత సన్నిహితంగా ఉండడాన్ని కూడా గమనించింది. విజేందర్‌తో కలిసి ఉండలేనని, విడాకులు తీసుకుంటానని ఝాన్సీ తల్లితో పోరు పెట్టింది. అయినా తల్లి వినలేదు. భర్త విజేందర్‌ కూడా అంగీకరించలేదు. 'రూ.20 లక్షలు చెల్లిస్తే విడాకులు ఇస్తా' అని చెప్పాడు. అంతేకాకుండా, తనతో సెక్స్‌కు అంగీకరించకపోతే వ్యభిచార గృహానికి అమ్మేస్తానంటూ బెదిరించడం ప్రారంభించాడు. భర్తకు తల్లి పూర్తిగా మద్దతు ఇస్తూ వచ్చింది. 
                                                              


                 
               
                   ఈ వేధింపులను తట్టుకోలేక ఝాన్సీ హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుకుంది. ఈనెల 28న పరీక్షలు ముగిశాయి. 'మేం వస్తున్నాం. నిన్ను తీసుకెళతాం' అంటూ తల్లి, భర్త నుంచి ఫోన్‌ వచ్చింది అట . వాళ్లు తనను ఎక్కడికి తీసుకెళతారోనని ఝాన్సీ ఆందోళన చెందింది. చంపేస్తారేమోనని కూడా అనుమానం వ్యక్తం చేసింది అట . భర్తపై చర్యలు తీసుకోవాలంటూ ఈనెల 23న డీజీపీ, నల్లగొండ ఎస్పీ, నల్లగొండ జిల్లా జడ్జి, నకిరేకల్‌ ఎస్‌ఐలకు లేఖలు రాసింది. ఝాన్సీ రాసిన లేఖ ఈ నెల 28న పోలీసులకు అందింది అంటున్నారు . అయితే, ఈ నెల 24వ తేదీన్నే ఝాన్సీరాణి ఆత్మహత్య చేసుకుంది. ఝాన్సీ రాసినట్లుగా చెబుతున్న లేఖలోని సంతకాన్ని, కళాశాలలోని రికార్డుల్లో ఉన్న సంతకాలతో పరిశీలిస్తామని సిఐ వెంకటేశ్వర రావు చెప్పారు. ఝాన్సీ భర్త విజయేందర్‌రెడ్డి, తల్లి పద్మపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

                    అయితే దీనంతటిని ఝాన్సీ తల్లి పద్మ కొట్టి పారేస్తుంది అట. తన కూతురికే ఇంకెవరితోనో వివాహేతర సంబందం ఉందని చెప్తుంది. దీనిలో నిజా నిజాలు సంగతి ఎలా ఉన్నా పద్మ కుటుంబ సబ్యుల మద్య బేదాభిప్రాయాలు తో పాటు అనారోగ్యకరమైన సంబందాలు ఉన్నాయని తేటతెల్లమవుతుంది. కుటుంబ పెద్ద వక్రమార్గాన నడిస్తే పిల్లల జీవితాలు ఎలా నాశనమ్ అవుతాయో ఈ  కేసు తెలియచేస్తుంది.   చిన్న వయసులో భర్తలు చనిపోతే , పిల్లల కోసం తిరిగి పెండ్లిళ్ళు చేసుకోకుండా , తమ బౌతిక సుఖాలను త్యాగం చేసి పిల్లలను చదీవించి , వారిని ఉన్నత స్తాయిలో నిలిపిన తల్లులు ఎంతో మంది ఉన్నారు. వారికి శిరస్సు వంచి ప్రణామం చేయాల్సిందే . అలా కాకపోతే తను రెండవ వివాహం చేసుకుని , తన రెందవ భర్త అంగీకారం తో తన వద్ద పిల్లలను ఉంచుకోవడమో, లేక తన పిల్లల నాయనమ్మ తాతయలు , అమ్మమ్మ తాతయ్యలు వద్దో వారిని ఉంచి వారి బాగోగులు చూసుకునే వారూ ఉన్నారు. ఇది కూడా సమాజం ఆమోదించిన పద్దతే. కాని పిల్ల బవిశ్యత్ ని గాలికొదిలేసి తన ఇష్టం వచ్చినట్లు "మై చాయిస్ " అనే పద్దతిలో వ్యవహరించే   వారి పిల్లలు ఎలాంటి సంఘర్షణ అనుభవిస్తారో , చివరకు  వారి జీవితాలు ఏమవుతాయో చక్కగా తెలియ చేస్తుంది , ఝాన్సీ ఆత్మహత్య ఉదంతం.

     4 లక్షలు ఇచ్చిన  కుర్ర బందువుతో  అక్రమసంబందం పెట్టుకోవడం, చివరకు తమ అక్రమ సంబందం కలకాలం సాగడం కోసం తన కూతురినే అతడికి  ఇచ్చి పెండ్లి చేయడం, తమ గుట్టు తెలుసుకున్న కుమార్తెను తన అల్లుడు కం ప్రియుడు కి  అనుకూలంగా ఉండమని బెదిరించడం , లేదంటే 20 లక్షలు ఇచ్చి నీ దారి నీవు చూసుకో అని బెదిరించడం , చివరకు కూతురు చనిపోతే ఏ మాత్రం పశ్చాతాప పడకుండా , తన కూతురికి అక్రమ సంబందం ఉందని ప్రపంచానికి చాటడం ఇవ్వన్ని ఏ కన్నా తల్లి అయినా చేస్తుందా ? ఇలాంటి తల్లులకు భూమి మీద బ్రతికే హక్కు ఉందా? ఇలాంటి నికృష్టపు పనులు సమాజం లో జరుగుతున్నాయి అంటే అడిగే పెద్దమనుషులు సమాజం లో లేకపోబట్టెగా? ఎవరైనా అడిగినా "మోరల్ పోలిసింగ్ "అంటు ఎగబడే సంస్క్రుతి ఈ  సమాజం లో పెచ్చుమీరబట్టె ఝాన్సీ లాంటి అభాగ్యుల జీవితాలు నాశనమ్ అవుతున్నాయి.

    అడిగే వాడు లేక " అత్తకు మొగుడు అమ్మాయికి యముడు " అయిన అల్లుడు గారిని అతడికి అన్ని విదాల సహకరిస్తున్న అత్త గారిని కటినంగా శిక్షించాలని పోలిస్ వారిని కోరడం మినహా సమాజం చేయగలిగింది ఏముంది?
                                             (1/6/2016 Post Republished)

Comments



  1. యిదియేమి వింత తల్లిర !
    కుదిర్చె నమ్మాయి బెండ్లి కోచతనంబున్ !
    బెదిరింపులు జేసెను, తను
    వొదిలె, వురేసుకు జిలేబి, ఓ తల్లీ! ఛీ!


    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన