బరి తెగించిన బాయ్ ప్రెండ్ సంస్కృతికి బలి అయిపోయిన "బాలికా వధు " ప్రత్యుషా బెనర్జీ !!

                                                             


                     బారత టెలివిజన్ సీరియల్ చరిత్రలో రామాయణ , మహా భారత సీరియల్స్ తర్వాత అంత జనాదరణ పొందిన సీరియల్ బాలికా వధు . దానినే తెలుగులో "చిన్నారి పెండ్లి కూతురు " గా అనువదించి  ప్రసారం చేసారు. హిందీ లో ఆ సిరియల్ ఎంత జానాదరణ పొందిందో , తెలుగులోను అంతే ప్రేక్షకాదరణ పొందింది. ఆ సీరియల్ లో  చిన్నారి పెండ్లి కూతురు  టైటిల్ రోల్ ను పోషించిన  ప్రత్యూష బెనర్జీని తెలుగు ప్రేక్షకులు తమ స్వంత ఇంటి ఆడపడచులాగా బావించి ఆమెకు అభిమానులుగా మారారు. దీనికి ప్రధాన కారణం రాజస్తానీ సంప్రాదాయ దుస్తులలో ఆమె చూపిన హావ బావ విన్యాసం తో కూడిన నటనా కౌశల్యం . తెలుగు సీరియల్స్ ని సైతం కాదని , తెలుగు మహిళా మణులు ఈ  సీరియల్ కు బ్రహ్మ రధం పట్టారు అంటె కేవలం అందులో చూపించిన  సాంప్రాదాయ గ్రామీణ  కుటుంబ నేపద్యం పట్ల ఆసక్తి అని చెప్పవచ్చు.

    సీరియల్స్ నటించడం వేరు. బయట నిజ జీవితం లో జీవించడం వేరు. సినిమాలలో రాముడు లాంటి ఆదర్శ మూర్తి పాత్ర దరించిన నటుడు అమ్మాయిల కు మత్తు మందు ఇచ్చి బ్లూ ఫిలిం లు తీసిన కేసులో పట్టుబడి , పోలిసుల చేతిలో ఒళ్ళు హూనం చేయించుకున్న హీరో చరిత్ర మనకు విదితమే . అలాగే ఆదర్శ హీరోయిన్ పాత్రలు వేసిన వారు సైతం బ్రోతల్ కేసుల్లో బుక్ అయిన సందర్బాలు గురించి మనం చదివాం. అంటె దీనర్దం ఏమిటంటె "రీల్ లైఫ్ " వేరు! రియల్ లైఫ్ వేరు. ప్రేక్షకులు  అభిమానించాల్సింది నటననే తప్పా , నటుల్ని కాదు అని కొంత మంది నటి నటుల జీవితాలు మనకు తెలియ చేస్తున్నాయి.

                                                                 


     బాలికా వధు లో కధానాయిక ఆనంది గా నటించిన ప్రత్యూషా బెనర్జీ జీవితం ఆనందమయం కాదు ఆమె ఆత్మహత్య ఉదంతం తెలియ చేస్తుంది. "నేను నా ఝార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాలకు పేరు తెస్తాను " అని సగర్వంగా ప్రకటించిన ఈ చిన్నారి పెండ్లి కూతురు తన 24 వ యేటనే అర్దాంతరంగా ఎందుకు ఊపిరి తీసుకుంది? దీనికి కారణం ఎవరు? సామాజిక దురాచారాలలో ఒకటి అయిన బాల్య వివాహం నేపద్యంగా నిర్మించిన సీరియల్ లోకి టైటిల్ రోల్ కధానాయిక గా రంగ ప్రవేశం చేసి యావత్ బారతావని మహిళా ప్రేక్షకుల చేత శహబాష్ అనిపించుకున్న ఈ వర్ధమాన నటిమణి కి ఏమి తక్కువ అయిందని ఆత్మహత్య చేసుకుంది? కోట్లకు కోట్లు లాబాలు గడించే సీరియల్ ఫేం కి డబ్బు తక్కువ  అని ఎవరూ అనుకోలేరు. పోని కుటుంబ సబ్యులతో ఏమన్నా గొడవలూ ఉన్నాయా అంటే అవీ లేవు. ఉంటె గింటే ఆమెకు బాయి ప్రెండ్ లతో గొడవలు ఉన్నాయని ఆమె పోలిస్ స్టేషన్ లలో ఇచ్చిన కంప్లైంట్ లు చెపుతున్నాయి. ఆమె స్నేహితులు చెపుతున్న దాని ప్రకారం ఆమె ప్రస్తుత బాయి ప్రెండ్ అయిన రాహుల్ రాజ్ ఆమెను కొట్టేవాడు అని తెలుస్తుంది. మరి అలా భాయి ప్రెండ్ చేతిలో తన్నులు తినే దురవస్త ఆమెకు ఎందుకు కలిగింది?

                                                                     


                        ఆమె 2010 నుంచి సిరియల్ లోనటించడం మొదలుపెట్టింది .  2011 నుంచి  మకరంద్ మల్హోత్రా అనే బాయి ప్రెండ్ తో "డేటింగ్ సంస్క్రుతి " లో చెట్టా పట్టాల్ వేసుకుని తిరిగింది. ఆ తర్వాత అతగాడి మీద, తనతోను తన తండ్రి తోను అసబ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని పోలిస్ కేసు పెడితే , "అదేమి లేదు , కేవలం వేరెవరితోనో ప్రెష్ డేటింగ్ కార్యకలాపాలు మొదలు పెట్టింది కాబట్టే , తనతో తెగతెంపులు చేసుకోవడానికే ఇలా తప్పుడు కేసు పెట్టింది " అని మీడియా ముందు చెప్పాడు మకరంద్. ఆ తర్వాత రాహుల్ రాజ్ అనే బాయిప్రెండ్ తో డేటింగ్ పేరుతో ఏకంగా సహజీవనమే చేసింది. అతని మీద కూడా రీసెంట్ గా ఒక పోలిస్ కేసు పెట్టింది అట. అంతే కాక ఆమె పోస్ట్ మారటం లో 2 నెలల గర్భవతి అని రిపోర్ట్ వచ్చిందట . ప్రత్యుష స్నేహితులు చెప్పే దాని ప్రకారం రాహుల్ రాజ్ ఆమె మీద బహిరంగ ప్రదేసాల్లోనే చేయి చేసుకునే వాడట. ఆమె ఎంత సహజీవనం చేస్తున్న గర్ల్ ప్రెండ్ అయినా   సమాజం దృష్టిలో వివాహం చేసుకున్న  భార్యకు ఉన్నగౌరవ మరియు భద్రతా స్తానం ఆమెకు ఉండవు కదా. బహుశా ఆ స్తానం కోసమె పోరాడి ఉంటుంది. రాహుల్ రాజ్ కు ఆమె కు మద్య ఏదో ఒక సున్నిత అంశం మద్య గొడవ ఏర్పడి చివరకు అది ఆమెలో అభద్రతా బావానికి గురి చేసి ఉంటుంది. దానిని తట్టుకోలేక ఆ డెప్రెషన్ లోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఆమె 2 నెలల గర్బవతి అని మెడికల్ రిపోర్ట్ చెపుతుండడం ఐ విషయాన్ని మరింత బాల పరుస్తుంది.

                                                                           

 
                        ఏది ఏమైనా నాటి సిల్క్ స్మిత నుంచి నేటి ప్రత్యూశా బెనర్జీ ఆత్మహత్య ల కేసుల వరకు మనకు అర్దం అయ్యేది ఒకటె. మానసిక పరిణతి చెందని వారు , తమ చుట్టూ ఉండె రంగుల ప్రపంచమే నిజం అని బ్రమపడి తమకు తెలియకుండానే ఆ ఊబిలో దిగబడి పోతున్నారు. తీరా అది ఉబి తెలిసీ దాని నుంచి బయట పడడానికి ప్రయత్నించినా అప్పటికే పీకల్లోతు కూరుకు పోయిన వారికి అది సాద్యం కాక బలవంతంగా తనువులు చాలిస్తున్నారు. వారు ఎంతో సౌక్యం అని  బ్రమ  పడుతున్న" భాయి ప్రెండ్ , గర్ల్ ప్రెండ్ సంస్క్రుతి " అందులో బాగమైన డేటింగ్ విదానం అంతిమంగా వారిని పురుషుల విలాసాలకు పనికి వచ్చే బొమ్మలుగా మారుస్తున్నాయే తప్పా , వారి  పిల్లలకు  అమ్మ లుగా ఉండెందుకు ఉపయోగపడలేక పోతున్నాయి.సదరు సంస్కృతిలో చేసే పనులుకు  స్త్రీ పురుషులు ఇరువురూ బాద్యులు అయినప్పటికి కుటుంబ బ్యాక్ గ్రౌండ్ బలంగా లేని వారు  చివరకు ఆ తప్పులకు బలి అవుతున్నారు . కాకపోతే స్త్రీలు పురుషులు కంటె ఎక్కువ  ఎమోషనల్ కాబట్టి , ఎక్కువుగా వారే ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు.

      కాబట్టి  బాలికా వధు  హీరోయిన్ ఆత్మహత్యకు బరి తెగించిన బాయ్ ప్రెండ్, గర్ల్ ప్రెండ్  సంస్కృతి యే కారణమని చెప్పక తప్పదు.  ఆమె రియల్ లైఫ్ ఎలా లీద్ చేసిందో తెలుసుకోవాలంటే You Tube విడియోలలో  లో చూడవచ్చు. ఏది ఏమైనా తన నటన ద్వారా  ప్రజలకు ముక్యంగా తెలుగు మహిళా ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయిన ఈ  24  ఏండ్ల అమ్మాయి ఒక దుష్ట సంస్కృతికి బలి అయి పోవటం అందరూ విచారించ దాగిన విషయమే. ఆమె ఆత్మకు శాంతి చే కూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్దించడం తప్పా మనం చేయగలిగింది ఏముంది?
                       (  5/4/2016 Post Resubmitted.)

Comments

  1. Narasimha Rao Garu, there are several theories going on regarding Pratyusha death and some says it is suicide and her Boy friend was blamed and it is a murder and some opines her parents spent all her money (In the case of earlier Telugu actress Kanchana her father was proved trouble maker) so she had taken some lakshs of loans any how it is a sad incident.

    ReplyDelete
    Replies
    1. ఈ కేసులో ఇప్పటివరకు లభించిన ఆదారాలు బట్టి ప్రత్యుష బెనర్జీ ఆత్మహత్యకు ఆమె బాయిప్రెండ్ రాహుల్ కారకుడని తెలుస్తుంది. రాహుల్ తండ్రి తప్పా ఎవరూ ప్రత్యూష చావుకు ఆమె తల్లి తండ్రులు కారకులు అని చెప్పలేదు. మరి ఒక గమనార్హమైన విషయం ఏమిటంటె అటు ప్రత్యూషా కి ఇతర బాయిప్రెండ్ లతో స్నేహాలు ఉన్నట్లే , ఇటు రాహుల్ కి కూడా ఇతర గర్ల్ ప్రెండ్స్ తో సంబందాలు ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి వీరి మద్య గొడవలు తరచుగా చోటు చేసుకోవటం, అమితంగా ప్రేమించాల్సిన బాయి ప్రెండ్ ఆమెను పబ్లిక్ గా కొడుతుండటం జరుగుతున్నాయి అట. దీనికి కారణం రాహుళ్ ప్రస్తుతం ఎక్స్ గర్ల్ ప్రెండ్ తో డేటింగ్ రిలేషన్ లో ఉండటమేనట. ఇటు సహజీవనం చేసే గర్ల్ ప్రెండ్ కి గర్భం వస్తే అటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో డెటింగ్ చేసే బాయిప్రెండ్ ని ఏమనాలి? అందుకే అన్నది "బరి తెగించిన బాయిప్రెండ్ సంస్క్రుతికి బలి అయిన బాలికా వధు " అని.

      ఏదేమైతేనేమి గర్ల్ ప్రెండ్ ఆత్మహత్య చేసుకుని పెద్దల్లో కలిసి పోయింది. బాయిప్రెండ్ మీద కేసు బుక్ అయింది కాబట్టి కొన్నాళ్ళు జైలులో ఉండి బయతకు వచ్చి మరొక గర్ల్ ప్రెండ్ తో ఎంజాయి చేస్తాడు. కేసు పెట్టారు కాబట్టి పోలిసులు విచారణ చేసి చార్జ్ షీట్ వేస్తారు. భారతీయ చటాలననుసరించి విచారణ జరుగుతుంది . నాలుగు యేంద్ల తర్వాత అప్పటి పరిస్తితులు బట్టి సాక్ష్యాలు బలంగా ఉంటె బాయి ప్రెండ్ కొన్నాల్లు లోపలికి వెళతాడు. లేదంటె కాలరు ఎగరేసుకుని ఇంట్లో ఇల్లాలు వీదిలో ప్రియురాళ్ళతో హ్యాపీగా కాలం గడిపేస్తాడు. దట్సాల్!

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన