Posts

Showing posts from March, 2014

ఎంత మేదావి అయినా ,ఒంటె నెక్కక పొతే ఓట్లు వేసేది లేదన్నారట హైదరాబాద్ వాసులు!

                                                                            నిజంగా మానాభి మానాలు ఉన్న వారికి , మేధావులకు ఈ కాలపు రాజకీయాలు చూస్తుంటే ఎంత అసహ్యం వేయాలో అంత అసహ్యం వేస్తుంది . ఎన్ని డిగ్రీలు పుచ్చుకున్నా , ఎంత మేదావి అయినా రాజకీయం లోకి అడుగు పెట్టాకా చేతులు కట్టుకు నిలబడి , పైసాకు పనికి రాని వాడితో పోటీలు పడి నానా మాటలు అనిపించుకోవలసిందే . ఇంట్లో పెళ్ళాం బిద్దలుని పట్టించుకోని వారు, బలాదూర్ గా పోకిరిగా తిరిగే వారు , జులుం చేసి ప్రజలను భయపెట్టే వారు , చీటికి మాటికి కొట్లాటలు కు పోయి కేసులు పెట్టించుకునే వారు , విరే రాజకీయ రంగానికి పనికొచ్చే కార్యకర్తలు . వీరికి బాగా  డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారు గాడ్ పాదర్లుగా ఉంటె , ఆనతి కాలంలోనే నాయకులై ప్రజల ని ఎలేయ్యడానికి , అర్హత సంపాదిస్తారు .   అటువంటి వారు , రాజకీయ పార్తిలలో ప్రదాన స్తానాలో ఉంటె , వారికి చిన్న పెద్ద అని కాని , జ్ఞానం , వివేకం ఉన్నవారికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో కాని తెలియదు .ఎక్కడ మేధావులకు ప్రాదాన్యత ఇస్తే తమ లాంటి వారిని తోకేస్తారో అనే అబద్రతా బావంతో , వారిని  అవహేళన చేస్తూ , మానసికంగా దెబ్బ తీస్తూ ఉం

తాగిన మత్తులో తాళి కట్టిన ఇల్లాలిని చంపితే , ప్రభుత్వం పైన్ కట్టాల్సిందే నట !

Image
                                                                          ఇన్నాళ్ళు  "మద్యం" ఆదాయపు మత్తు తలకెక్కి , ప్రజల సంసార జీవన స్తితిగతులను పట్టించుకోని ఆంద్ర ప్రదేశ్ సర్కార్ కు రాష్ట్ర హై కోర్టు వారు చాచి లెంపకాయ ఒకటి కొట్టారు . మొన్న వారు ఇచ్చిన తీర్పు స్పూర్తి తో , తెలుగువారిలో ఏమన్నా తెలివి వచ్చి , ఇక నుంచి  రాష్ట్ర ప్రభుత్వ మద్యo  పాలసి వల్ల  బాదితులైన కుటుంబాలు కోర్టులను ఆశ్రయిస్తే , మద్యం అమ్మకాలు వలన రాష్ట్ర ప్రబుత్వానికి వచ్చె ఆదాయం కంటే , బాదితులకు చెల్లించే నష్ట పరిహారాల మొత్తమే ఎక్కువుంటుంది . "సాహెబ్ గారి సంపాదన బేగం గారి మందుల ఖర్చుకు చాలవు" అన్నట్లు తయారవుతుంది రాష్ట్ర ఖజానా పరిస్తితి. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రబుత్వాల పరమావధి కావాలి అనే విషయాన్ని రాష్ట్ర సర్కార్ కు గుర్తు చేస్తూ , హై కోర్టు వారు ఇచ్చిన ఈ  తీర్పు ఆహ్వానించ తగినది మరియు ఆలోచించ తగినది .   వరంగల్ జిల్లా అర్పనపల్లికి చెందిన ఘనపురపు రవి , రాష్ట్ర ప్రభుత్వ "మద్యం పాలసి " కి మెచ్చి ,  మద్యం దుకా ణానికి డైలీ  రెగ్యులర్ కష్టమర్ అయ్యాడు . మద్యం అమ్మకాలు లో వృద్ది కోసం కష

"పాకీ " పని అమానవీయం! ,O.K !, మరి ఈ "లపాకీ " పని గురించి ఏమిటి?

Image
                                                                                "ఆ పాడు పనుల పై చట్టాలను అమలు చేయండి " అనే హెడ్డింగ్ తో ఈ రోజు "ఈనాడు" పేపర్లో వచ్చిన ఐటెం ను చూసి ఈ విషయాన్నీ ఈ టపా ద్వారా ప్రస్తావిస్తున్నాను . నిన్న గురువారం మన సుప్రీం కోర్టు వారు , మానవ విసిర్జితాలను మనుషుల ద్వారా చేయించారాదని చెపుతున్న చట్టాలను పూర్తీ స్తాయిలో అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను , కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది . చాలా సంతోష కరమైన విషయo .          సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెపుతున్న మన దేశం లో ఒక అంచనా ప్రకారం సుమారు 7 లక్షలు మంది "పాకి పని చేసే వారు ఉండటం, సాంకేతికంగా  సిగ్గుపడాల్సిన విషయమే . ఒక మనిషి విసర్జించిన దానిని మరొక మనిషి తన చేతులతో  తీసి శుబ్రపరచాల్సిన అవసరం , యంత్ర సంస్కృతీ లేని పూర్వకాలంలో అయితే O.K. కాని , హై  టెక్  యుగం అని చెప్పబడుతున్న నేటి సమాజంలో ఎంత మాత్రం కూడనిది . అయితే ఏదైనా ఉనికిలో ఉన్న ఒక వ్రుత్తి వ్యవస్తను సమూలంగా నిర్మూలించాలి అంటే , దాని మీదే ఆదార పడి బ్రతికే ప్రజలకు  ప్రత్యామ్నాయ ఉపాది చూపించవలసిన బాద్యత

పవన్ కళ్యాణ్ "ఇజం " ద్వారా రాజు రవితేజ ఆవిష్కరిస్తున్న "నిజం" ఏమిటి?

Image
                                                                        నూతనంగా రాజకీయ పార్టి పెట్టబోయే ప్రతి ఒకరికి ఏదో ఒక ప్రత్యెక "ఇజం" ఉండాలా ? అవును ఉండాల్సిందే అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ . దాని ద్వారా నే పార్టి ఉద్దేశ్యాలు , ఆశయాలు , తెలుస్తాయి .మరి పార్టి మానిపెస్తో ఎందుకు? పార్టి ఆశయాలను   సాదించడానికి రానున్న 5 యేండ్ల కాలంలో తాము ఏర్పరచుకున్న ప్రణాళికలు , వాటి అమలు విదానం ఇవ్వన్ని తెలియ చేసేదే "పార్టి మేనిపెస్తో ". మరి ప్రజలకు కావాల్సింది పార్టి "ఇజమా ? లేక మేనిపెస్తో నా అంటే ఖచ్చితంగా మేనిపేస్ట్ యే అని అనక తప్పదు .     ఇలా ఖచ్చితం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే , ఎన్నో ఇజాలు పుట్టాయి . అన్ని ఇజాలులొ అంతో ఇంతో నిజం ఉంటుంది . కాని ఏ ఇజం కూడా అందర్నీ సంతృప్తి పరచేలా ఉండదు . ఎవరి ఇజం వారికే కరెక్టు అనిపిస్తుంది . ఈ ఇజాలు గురించి భారత దేశ ప్రజలు విని , విని ఉండటం వలన వారికి ఇజాల మిద ఆసక్తి ఉన్నట్లు కనపడటం లేదు . పవన్ కళ్యాణ్  గారి "ఇజం " గురించి వినపడుతున్న వార్తలు పట్టి చూస్తె అది భారత రాజ్యాంగo లాంటిదేమో అన్న అనుమానం కలుగుతుంది .

పెళ్ళాం మీద అలిగి వెళ్ళిపోయినా, గాడిదలకూ పోలిస్ సెర్చ్ డ్యూటి తప్పదా !?

                                                                    వెనుకటికి ఒకాయన అపరాద పరిశోదన నవలలు చదివి , చదివి , తానూ ఒక డిటెక్టివ్ అయి బాగుండు అనుకున్నాడట . వెంటనే కొంత డబ్బు ఖర్చు చేసి "xxx డిటెక్టివ్ ఏజెన్సి" అనే దానిని అట్టహాసంగా ప్రారంభించాడట. మొదటి రోజు మొదటి బేరం ఏమి తగులుతుందా అని ఎదురు చూస్తున్న అ డిటెక్టివ్ గారి దాగ్గరకు  , పంచే పైకెగ దోపుకుని , ఆయాసంగా ఒగర్స్తూ ఉన్న వ్యక్తీ ఒకరు రావడం జరిగింది . వచ్చి రావడంతోనే "అయ్యా ఇక్కడ, కనపడకుండా పారిపోయిన వాళ్ళ , జాడ కనిపెడతరంటగా " అని అడిగే సరికి , మొదటి కేసు ఏదో మిస్సింగ్ పర్సన్ కేసు తగిలందుకుని "అవును" , అన్నాడట  ఔత్సాహిక డిటెక్టివ్ . దానికి ఆ ఆసామి "బ్బాబ్బాబు ! మీకు పుణ్యముంటుంది . వారం రోజుల నుంచి నా గాడిద కనపడటం లేదు . వెతికి పెడితే "చచ్చిమీ కడుపున పుడతా " అని అంటుoటే   తెల్ల ముఖం వేసాడట ఆ కొత్త డిటెక్టివ్ . మన రాష్ట్రం లో పోలిస్ వారు నిర్వహిస్తున్న కొన్ని డ్యూటి లు చూస్తుంటే ఈ కదే గుర్తుకు వస్తుంది . విషయం ఏమిటంటే ,     సికింద్రాబాద్ జీడిమెట్ల పోలిస్ స్టేషన్ పరిది లో

స్వతంత్ర భారతంలోB.J.P హిందు వాదులు చేసిన హత్యలేన్ని ? లౌకిక వాదులు చేసిన హత్యలేన్ని?

Image
                                                                                                                                       భారత దేశం లోని రాజకీయ పార్టీలు ఒక సిదాంత పరంగా నడుస్తున్నాయి అని ఎవరైనా అంటే , వారు నూటికి నోరు పాళ్ళు అమాయకులైనా అయి ఉండాలి, లేకుంటే ఎదుటి వారి చెవిలో పూవులు పెట్టేవారైనా  అయి ఉండాలి . 1950 లో భారత రాజ్యాంగం ఏర్పడ్డాకా , ఎవరికీ ఇష్టం ఉన్నా , లేకపోయనా అంతా రాజ్యాంగానికి బద్ధులై నడువ వలసిందే . అలా నడచెవారికే ఎన్నికలలో పోటి చేసే అర్హత ఉంటుంది . కులం పేరునో , మతం పేరునో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసి ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టడం మన దేశంలో అసాద్యం . మరి అటువంటి దేశం లో B.J.P అనే పార్టి కేంద్రంలోనూ , రాష్ట్రాలలోను అధికారం చేపట్టి , ఆయా రాష్ట్ర ప్రజల చేత మన్ననలు పొందుతుంటే , దానికి మత పార్టి అని ముద్ర వేయడానికి పూనుకోవడం కచ్చితంగా ఓర్వలేని తనమో , కళ్ళు ఉండి చూడలేని కబోది తనమో అయి ఉండాలి .   B.J.P ని హిందూ మత  వాది పార్టి అని ఊ క దంపుడు  ఉపన్యాసాలు ఇస్తూ , ప్రజలను మబ్య పెట్టె వారు , అంతిమంగా వారు ఉపయోగ పడుతుంది లౌకిక వాదుల ముసుగులో ఉన్న "గే&quo

T.D.P ,B.J.P ల తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి B.C. ముఖ్యమంత్రి అబ్యర్ది "పవర్ స్టార్ పవన్ కళ్యాణా"!?

                                                                          పోయిన వారంలో ఆంధ్రా గబ్బర్ సింగ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  గారు , ఏదో  ఆవహించిన  వాడిలా , ఒక స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన సభ ఒకటి ఏర్పాటు చేసి "జనసేన" అనే నూతన రాజకీయ పార్టిని ప్రకటించడం , ఆ సందర్బంగా కేవలం 45 నిమిషాలు మాట్లాడుతారు అని ముందుగా చెప్పిన వ్యక్తీ 2 గంటలు పాటు అభిమానులను పంచ్  డైలాగులతో అలరించడం జరిగింది . అయన చేసిన ఉపన్యాస దోరణి  చూస్తె , తెలంగాణా లోని సిమాంద్ర సెటిలర్స్ కి కొంత మనో దైర్యం ఇచ్చేలా ఉన్నవి. K.C.R గారికి డైరెక్టు వార్నింగ్ లు ఇవ్వడం ద్వారా అయన తనలో ఉన్న డేరింగ్ నెస్ ని బయట పెట్టుకోవడం జరిగింది .           1956 తెలంగాణాకి , 2014 లో తెలంగాణా కి బోల్దంత తేడా ఉంది . ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డాక , సిమాంద్ర నుండి లక్షలాది తెలుగువారు తెలంగాణా కు వచ్చి స్తిర పడ్డారు . కొన్ని ప్రాంతాలలో వారి ఓట్లు అబ్యర్దుల గెలుపు ఓటములను నిర్ణయించే స్తాయిలో ఉన్నాయి .ఎవరు ఎన్ని కహనిలు చెప్పినా సెటిలర్స్  ఓట్లు K.C.R కి వేసే ప్రశ్నే లేదు .  అవ్వన్నీ T.R.S  కి వ్యతిరేకంగా పడేవే . మరి తెలంగాణా వ్యాప్తం

'కప్పగంతుల' వారి మాటను తెల్లారే సరికి నిజం చేసిన "దుబ్బాక పోలిస్ A.S.I,Mr.పాషా "

                                                                  నిన్న ఇదే బ్లాగులో విజయవాడ లోని పటమట పోలిస్ వారు ఒక కేసు దర్యాప్తు విషయంలో , పిర్యాదిదారుల పట్ల వ్యవహరించిన తీరును తప్పు పడుతూ   "అవమానకర  దర్యాప్తు తో ఇల్లాలిని అవమానించి మాజీ న్యాయ మూర్తి చేతనే కంట తడి పెట్టించిన పటమట పోలీసులు "    అనే టపా పెట్టడం జరిగింది . దానికి బ్లాగ్ మిత్రులు ,పెద్దలు శ్రీ తాడిగడప శ్యామల రావు గారు , శ్రీ కప్పగంతుల శివ రామ ప్రసాద్ గారు,మరియు  శ్రీ నిష్టల సుబ్రహ్మణ్యం గారు  వారి వారి స్పందనలు తెలియ చేసారు . ముఖ్యంగా శ్రీ శివ రామ ప్రసాద్ గారు   "   మన దేశంలో పోలీసుల వైఖరి ఇప్పటికి కూడా వాళ్ళేదో పైనెక్కడో ఉన్నారని, ప్రజలను  బానిసల్లాగా చూడాలని అన్న భావన వాళ్ళ రక్తంలో పారుతోంది. రిక్రూట్మెంట్ సమయంలో జరిగే ఘోర అక్రమాలు, ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి, ప్రమొషన్లు, పోస్టింగులు వేలంవేసుకునే సంస్కౄతి ఉన్న పోలీసు వ్యవస్థలో మామూలు  మనుష్యులు ఉంటారని ఎలా అనుకోగలం. పోలీసుల్లో మర్యాదగా మాట్లాడగల వాళ్ళు అసలు ఉంటారా? ఈ సంఘటనలో పోలీసుల తీరు ఘోరం." అని స్పందించడం జరిగింది . అలా అన్న 3 గంటల ల

అవమానకర దర్యాప్తుతో ఇల్లాలి ని అనుమానించి, మాజీ న్యాయ మూర్త్రి చేతనే కంట తడి పెట్టించిన "పటమట పోలీసులు "

                                                                              తెలుగు జాతి సిగ్గుతో తల వంచుకోవాలి, ఇటువంటి పొలిసు అధికారులను నియమించుకున్నందుకు! స్కాట్లాండ్ లాండ్ యార్డ్ పోలిస్ మాదిరి గొప్ప సాహస పరిశోదనలు చేసి ప్రజలకు న్యాయం చేయమని ఎవరూ అడగటం లేదు కాని , కనీసం పిర్యాదు చేసే వారి మనోబావాలు గుర్తించి , వారికి స్వాంతన కలిగేలా మాట్లాడుతూ , విచారణ చేసే బదులు , వారిని మానసికంగా హింసిoచేలా మాట్లాడుతూ , అదేదో తమ డ్యూటిలో బాగం అని పిలయ్యే పోలిస్ అధికారులను చూస్తుంటే అసలు పిర్యాదు ఎందుకు చేసామా అని అనిపిస్తుంది . ఇండియన్ పోలిస్ వారికీ కొన్ని జనరల్ ప్రిన్సిపుల్స్ ఉన్నాయట . ఎ దర్యాప్తులోనైన వాటిని పాటించటం ఇండియన్ పోలీసులో భాగమైన తెలుగు నాట పొలిసు వారికీ సహజo అని విజయవాడ కు చెందిన "పటమట లంక" పోలిస్ వారు సెలవిచ్చారట . పాపం ! విరి దర్యాప్తు తీరుకు సాక్షాత్ ఒక మాజీ న్యాయమూర్తి గారే కళ్ళ నీరు పెట్టుకున్నారంటే , వారి దర్యాప్తు విదానం లో ఎంత "పెప్పర్ స్ప్రే " ఉందొ చూడండి . వివరాలు లోకి వెళితే     విజయవాడ కు చెందిన హిమ బిందు ,సప్తగిరి  బాంక్ మేనేజర్ గారి బార్య .

'సారా టెక్ ' పల్లెలు , హై టెక్ సిటీలు , ఇవేనా బంగారు తెలంగాణా , సింగపూర్ సిమాంద్ర !?

                                                                      ఎన్నికల సీజన్ వచ్చింది . దిక్కుమాలిన రాజకీయ నాయకులు ఒక పార్టి లో నుండి మరో పార్టి లోకి  "జంపింగ్ "లు చేస్తుంటే అ యా పార్టి నేతలకు  వీరావేశం పొంగి పొర్లుకు వస్తుంది . అ ఆవేశం లో ప్రజలకు వాగ్దానాల వరాలు కురిపిస్తున్నారు . తెలంగాణా నాయకులు ఏమో "బంగారు తెలంగాణా " మాతోనే సాద్యం అంటుంటే , సిమాంద్ర నాయకులు "సింగపూర్ సిమాంద్ర " చూడరా బాబూ అంటూ బై స్కోప్ చూపిచేస్తున్నారు . చాలా సoతోషం కాని హై  టెక్ నగరాలు గురించి మాటలను కోటలు దాటిస్తున్న ఈ  సో కాల్డ్  రాజకీయ విరులు , పల్లెల్ని కబలించి, ప్రజల ఆరోగ్యాల్ని , ప్రాణాలను దారుణంగా హరిస్తున్న " సారా రాక్షసి " గురించి ఒక్క మాట మాట్లాడరే !దానిని నిర్మూలన చేసే మగాడు , ఒక్కడు అంటే ఒక్కడైనా తెలుగు నాట ఉన్నాడా ? ఖచ్చితంగా లేడు . ఉన్నా వాడు మాట్లాడడు . మాట్లాడితే వారి పార్టికి వచ్చె వోట్లు రావు కనుక!    నిజంగా ప్రజల జీవన విదానం ఎలా ఉందొ తెలుసుకోవాలంటే పల్లెలకు వెళ్లి చూడండి . ముక్యంగా విద్యా గందం లేని షెడ్యూల్డ్ కులాలు , తెగలు వారు , వెనుక

ఆంధ్రా అసెంభ్లికి దారేది అంటున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగ్రేటం పై ఒక పరిశిలన !.

                                                      పవన్ కళ్యాణ్ ! వేలాది అభిమానుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న తెలుగు నటుడు . మెగా స్టార్  తమ్ముడిగా సినిమా రంగానికి పరిచయమయినా  , ఆనతి కాలంలోనే తన ప్రత్యెక మేనరిజం తో అభిమానులను ఆకర్షించ గలిగాడు . దానివలన అయన సినిమాలు బాక్సపిస్ వద్ద విజయాలు నమోదు చెసుకున్నాయి. అయన కున్న ప్రత్యెక మేనరిజాలలో సరిగ్గా నిలబడి ఎక్కడా డైలాగ్ చెప్పక పోవడం ఒకటి . నిలబడి డైలాగే చెప్పలేని వాడు , నిజజీవితం లో మాట మిద నిలబడగలుగుతాడా  అని అయన విమర్శకుల ప్రశ్న . అలాగే అయన వైవాహిక జీవితంలో అస్తిరత్వం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. నిలబడి డైలాగ్ చెప్పలేని మేనరిజానికి , అయన వైవాహిక జీవితంలో అవలంబిస్తున్న అస్తిర చర్యలకు ఏమైనా సంబందం ఉందా అనేది మానసిక ప్రవర్తనా విశ్లేషకులు చెప్పాలి తప్పా, రాజకీయ విశ్లేషకులు కాదన్నది నిర్వివాదాంశం .   ఇక పొతే బయట అయన ప్రవర్తించే తీరు . అయన మనసులో అనంత కోటి బావాలు ఉoడవచ్చు . అయన సన్నిహితులు చెపుతున్నట్లు ఆయనలోసామాజిక  సేవా దృక్పదం ఎక్కువే కావచ్చు . కాని ఆయనలోని మొహమాటం , అసహనం ఆయనలోని సామాజిక సేవ తత్పరుడిని బయటకు ర

మంచి వాడి సంగతి మాంసం కూర దగ్గర తెలుస్తుoది అన్నట్లుంది సిమాంద్ర సమైక్యత సంగతి!

                                                       అరె రే ! ఎన్ని మాటలు చెప్పారు ! తెలంగాణా విడిపోతే తెలుగుజాతి ఐక్యతే పోతుంది అన్నారు . తెలంగాణా విభజన వాదులు తెలుగు జాతిని చిలుస్తున్నారు అన్నారు . తెలుగు జాతి సమైక్యంగా ఉండాలని 2 నెలలు పైగా సమ్మె  చేసారు . ఆంద్ర ప్రదేశ్ ను విడదిస్తే తమ తడాఖా డిల్లికి చూపిస్తాం అని ప్రగల్బాలు పలికారు . తమకు జెండాలు , ఎజెండాలు ఏమి లేవు , సమైక్యతా ఒకట్టే తమ ఎజెండా అని రాష్ట్ర విభజన ప్రకటించక ముందు సమైక్యా రాగాలు తీస్తుంటే దేశం అంతా  నిజమే అనుకుంది . సిమాంద్ర లోని తెలుగు ప్రజలు ఉప్పెనలా కధలి వస్తుంటే రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో ఉప్పొంగిన సమైక్యతా బావం ఇది అని నా లాంటి అమాయకులు అనుకున్నారు . కాని అది అంతా  ఉత్తిదె అని ఇటివలి పరిణామాలు చూచిస్తున్నాయి .   మంచి వాడి సంగతి మాంసం కూర దగ్గర  తెలుస్తుoది అన్నట్లుంది సిమాన్ద్రులలో సమైక్యత  సంగతి .ఆంధ్రులు ఆరంభ శూరులు అనే దానిని మరో సారి రుజువు చేస్తున్నారు సిమాంద్ర నాయకులు, వారిని అనుసరిస్తున్న ప్రజలు. తెలంగాణా విభజన జరుగక ముందు , కాంగ్రెస్ , తెలుగు దేశం , రెండు పార్టిలే ఉండేవి . పరాజ రాజ్యం వచ

"ఆమె" గురించి ఆంద్ర ప్రదేశ్ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియక పోవచ్చునేమో !?

                                                          ఆమె! ఒక అమ్మగా , ఒక అక్కగా , ఒక అలిగా, ఒక బిడ్డగా , మన మధ్యే ఉంటుంది . మన తోనే ఉంటుంది . ఆమె ను అబల  అని తెలియని  కొందరంటే , కాదు ఆదిశక్తి అని ఆమె గురించి పూర్తిగా తెలిసిన వారు అంటుంటారు . అందుకే ఆమె శక్తిని తెలిసిన వారు ఆమెను పూజిస్తుంటే , తెలియని రాక్షసులు ఆమెను చెర బట్టి హింసించాలని చూస్తుంటారు . ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని విశ్వసించిన భరత  జాతి మనది  . "గౌతమి పుత్ర  శాత కర్ణి , వాసిష్ట పుత్ర పులుమావి అని తల్లి పేర్లను తమ పేర్ల ముందు చేర్చుకుని గర్వంగా మీసం మేలేసిన వారు మన ప్రదమాంద్ర పాలకులు . కాబట్టి ఆ  "ఆమె"  గురించి తెలుగు వారికి ఎల్లప్పుడూ సద్బావనే !   కాని "ఆమె"లో ఉన్న పాజిటివ్ గుణం ఆమెను గౌరవించేలా చేస్తుంటే , నెగటివ్ గుణం  ఆమె ను ద్వేషించే లా చేస్తుంది . అప్కోర్స్ ఇదే సూత్రం "అతడు"కు  కూడా వర్తిస్తుంది . ఆమె తలచుకుంటే తల్లిలా కుటుంబం ని కలిపి ఉంచగలుగుతుంది, కాదనుకుంటే కోపం వచ్చిన కోడలిలా అదే కుటుంబాన్ని నిట్ట నిలువునా చీల్చి వేయ గలుగుతుంది . ఇది

ఆలూ లేక పోయినా , చూలు లేకపోయినా ఖమ్మం లో అబ్బాయి పుడితే మాత్రం కేంద్ర మంత్రి పదవి ఖాయమట !

                                                      అయన గారు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు . రాష్ట్ర విభజన జరుగక ముందు, అయన పార్టి పెట్టిన కొత్తలో 42 నియోజకవర్గాల్లో అయన పార్టికి కొంత హవా ఉన్న మాట నిజమే కావచ్చు . కాని ఆయనను ఆర్దిక నేరాల విచారణలో బాగంగా 18 నెలలు జైలులో పెట్టడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వలన అయన గారి పార్టికి జనం లో ఆదరణ తగ్గుతూ రావడం మొదలు పెట్టింది . చివరకు రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 3 ప్రకారం విభజన  చేసినా అబ్యంతరం లేదని తొలుత ప్రకటించిన అయన , అ తర్వాత నాలుక్కరచుకుని జై సమైక్యతాoద్ర  అనే సరికి తెలంగాణా లో ఆయన్ని నమ్ముకుని ఉన్న ఆయనగారి విరాభిమానులు ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ పార్టిని దాదాపు ఖాళి చేసారు                ఏదో అయన మిద ఉన్న అభిమానంతోనో , లేక అయన తండ్రి గారి మిద ఉన్న అభిమానంతోనో ఓట్లు పడవచ్చు అనే దింపుడు కళ్ళాలు ఆశ  ఉన్నవారు తప్పా దాదాపు తెలంగాణా లో అయన పార్టిలోఅనుభవమున్న నాయకులు ఎవరూ లేరనే చెప్పవచ్చు . అంటే 17 నియోజక వర్గాల్లో అయన గారి పార్టి కి నమ్మకమైన  ఆశలు ఏమి లేవు .ఇక మిగిలింది సిమాంద్ర లోని 25 పార్లమెంటరి సీట్లు . అక్కడ కూడా ఇతర పార్ట

'అన్యాయంగా విడగొట్టారు'అని బాదపడుతున్న వారిని ' ఆవిర్బావ దినం'అంటూ అవమానించటం కరెక్టా ?

                                                        జూన్ 2,2014 ! తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావ దినం . ఆ రోజుని తెలంగాణా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖిoచ వలసిన రొజు. తెలంగాణా ప్రజలు నిజంగా ఆ రోజు "సంబురాలు" జరపుకోవడమే  కాక , ప్రతి యేట  ఘనంగా అధికారికoగా "తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం" జరుపుకునే రోజుగా  మారనుంది . అంతవరకూ సంతోషమే . కాని అదే రోజును ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం గా పరిగణిస్తామని కేంద్ర ప్రబుత్వం ప్రకటించడం చూస్తుంటే , కాంగ్రెస్ వారికి ఎందుకో కాని , సిమాంద్ర వారు అంటే చెప్పలేని కసి ఉన్నట్లు అనిపిస్తుంది . వారిని అవమానిoచటానికే ఆ ప్రకటన విడుదల చేసినట్లు కనిపిస్తుంది .  నిజానికి ఆంద్ర ప్రదేశ్ ఏర్పడింది నవంబర్ 1 1956. ఇప్పుడు తెలంగాణా అందులో నుండి విడిపోయినంత మాత్రానా అది ఆంద్ర ప్రదేశ్ పేరుతోనే ఉంది తప్పా , దానికి కొత్త పేరు ఏమి పెట్టలేదు కదా ! కనీసం సిమాంద్ర అనో , న్యూ ఆంధ్రా అనో పేరు మారిస్తే అప్పుడు నూతన రాష్ట్రం గా బావించి ఆవిర్భావ దినోత్సవం చేస్తే బాగుంటుంది . అంతే  కాని పాత ఆంద్ర ప్రదేశ్ కి కొత్తగా ఆవిర్బావ దినోత్సవం చేసేదేముంటుంది ? మతి

"అందాల "పేరంటాల పల్లి " ని అదృశ్యం చేస్తున్న వారు రాక్షసులేనా ?

Image
                                                          పేరంటాల పల్లి ! ఖమ్మం జిల్లాకు ఉన్న ఏకైక అందమైన నదీ పరివాహక టూరిజం స్పాట్ . ఇక్కడకు నిత్యం అనేక వందల మంది రాష్ట్రం లోని వివిధ జిల్ల్లాల నుండి మాత్రమె కాక, పొరుగు రాష్ట్రాలనుండి కూడా  వచ్చి ఇక్కడి రమణీయ ప్రక్రుతి కి పరవశించి పోతుంటారు . అలా ఈ ప్రాంతం బోట్ టూరిజం కి ప్రసిద్ది గాంచింది . మరి అలాంటి ప్రాంతం ఇంకా కొద్ది రోజులలో అధికారికంగా సిమాంద్ర రాష్ట్ర ప్రాంతంలో కలిపివేయ్యడమే కాకుండా పూర్తిగా గోదావరి లో ముంచి వెయ్యడానికి "సోనియా సర్కార్" సిద్ద మయింది .      భద్రా చలం పరమ పుణ్య దామం . తెలంగాణ ప్రజలు రాముల వారిని తమ రాష్ట్రంలోనే ఉంచాలని , రాముల వారికి హైదరాబాద్ సంస్తానానికి ఉన్న చారిత్రిక నేపద్యం,రామాలయ సంప్రాదాయాల రిత్యా అది అనివార్యం కాబట్టి , కేవలం రామ క్షేత్ర్రాలు ను మాత్రమె తెలంగాణా లోని ఖమ్మం జిల్లాలో ఉంచి , మిగాతా ప్రాంతం అంతటిని "పోలవరం ముంపు ప్రాంతాలు" పేరుతొ సిమాంద్రా లో కలిపి వేస్తున్నారు . దిని కోసం ఆర్డినెన్స్ జారి చెయ్యటానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది . ప్రస్తుతం ఉన్న పరిస్తితిలో

ఇక నుంచి ఖమ్మం లో 10,000 విలువ చేసే వస్తువు విజయవాడలో 8,000 అట!

                                                            జై తెలంగాణా అని పదేళ్ళు పోరాడినందుకు తెలంగాణా వారికి "హైదరాబాద్ సహిత" తెలంగాణా ప్రసాదించినందుకు మేడం సోనియాను వేనోళ్ళ కిర్తిస్తున్నారు తెలంగాణా రాజకీయ నాయకులు . కొందరైతే ఏకంగా ఆమెకు గుడులు కట్టి రోజువారి పూజలు చేయాలని కూడా పిక్స్ అయి పోయారు . కాని ఇన్నాళ్లు పోరాడినందుకు   పాడి ఆవు  తెలంగాణా కు దక్కినా , పాల రేట్లు మాత్రం సిమాంద్ర కు తగ్గిoచడo వలన దాని ప్రబావం తెలంగాణా మార్కెట్ ను నిర్వీర్యం చేయక మానదు అని పిస్తుంది . అది ఎలాగో చూదాం .    ప్రజలు ఇంటి ఆవసరాలు కు వాడే వస్తువుల మిద సెంట్రల్ గవర్నమెంట్ టాక్స్ విదిస్తుంది . ఉదాహరణకి ఒక టెలివిజన్ ను మనం 10,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే , దానిలో సుమారు 1200 రూపాయల నుంచి 1400 రూపాయల దాక సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ కె పోతుంది . అలాగే ఇంకా చిన్నా చితక , అన్ని కలిపి సుమారు రెండు వేల దాక కేంద్ర ప్రబుత్వం వారికి కట్టాల్సి ఉంటుంది . ఇది డైరెక్టుగా వినియోగ దారుడు కట్టక పోయినా, పంపిణి దారులు వస్తువు రేటుల లోనే అది వసూలు చేస్తారు కాబట్టి అంతిమంగా వినియోగ దారులు మిద పడే బారమే