Posts

Showing posts from July, 2013

భారత 29 వ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఇటలీలో జన్మించిన, ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనో!

Image
Sonia Gandhi's birthplace, 31, Contrada Maini (Maini street),Lusiana, Italy (the house on the right)                                                        అది 1946  డిసెంబర్ 9  వ తారీకు. ఇటలీ దేశం లో లుశియానా అనే గ్రామంలో  మైనో వంశంలో,సాంప్రదాయిక రోమన్ కాదలిక్ కుటుంబంలో ఒక స్ట్రీ శిశువు జన్మించింది. ఆ శిశువు పేరు ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనో!.  అమే కేవళం ఒక తాపీ మేస్త్రీ కూతురు కావడం వలన ఆమే గురించి ఇటలీలో పెద్దగా ఎవరూ పట్టించుకోక పోవచ్చు! అలాగే ఆమే గారు కేంబ్రిడ్జ్ లోని ఒక గ్రీక్ రెస్టారెంట్ లో  జీవన బ్రుతి కోసం వెయిట్రెస్స్ గా పని చేస్తూ కాలేజిలో ఇంగ్లీష్ బాషా కోర్సు చదువుతున్న రోజులలో ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఒకే ఒక వ్యక్తి పట్టించుకున్నాడు. ఆయనే భారత పూర్వ ప్రధాన మంత్రి ఇందిరా గాందీ గారి పెద్దబ్బాయి రాజీవ్ గాందీ గారు. ఆమేను చూసిన తొలి చూపులోనే మనసు పారేసుకున్న ఆయన అన్నీ పారేసుకోవడం ప్రాంబించే సరికి ఇక లాబం లేదని ఆమే గారిని వివాహం చేసుకుని ఇండియాకు తీసుకు వచ్చారు.    అప్పటి దాక ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనోగా  ఉన్న ఆమే గాందీ గారి వంశం లోకి అడుగు పెట్టి "

సోనియాజీ తో గేమ్స్ ఆడితే రెండుగా విడిపోవాల్సిందే !

                                                                   "మంచీ చెడు తెలిసి కూడ చెప్పలేని పెద్దలు ఎవ్వరికీ ఏమీ  కారు, ఏమీ చెయ్యలేరూ " అన్నాడో సినీ కవి. చెప్పక పోతే చెప్పక పోయారు, కనీసం తమకేమి అవసరం లేదని ఊరుకున్నారా అంటే  అదీ లేదు . మీరిస్తే మాకేమి అబ్యంతరం లేదని సన్నాయి నొక్కులు నొక్కారు . తీరా వీరు చెప్పేది ప్రజలందరి అభిప్రాయమే అనుకుని తెలంగాణా ఇవ్వడానికి సిద్ద పడుతుంటే ఇప్పుడు దానిని ఆపటం ఎలాగా అని మల్లగుల్లాలు పడుటున్నారు.   వీరిని చూస్తుంటే ఎదో సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ లు గుర్తుకు వస్తున్నాయి. "ఖాన్ తో గేమ్స్ అడకు  శాల్తీలు  లేచి పోతాయి " అని ఒక పంచ్ డైలాగ్ ని ఊత పదం గా వాడుతుంటాడు . ఇక్కడ తెలంగాణా విషయంలో మింగలేక, కక్కలేక "ఇవ్వమంటే ప్రజలతో తంటా , వద్దంటే సోనియా అమ్మతో తంటా " అని మదనపడుతూ , ఎవరిని ఏమనలేక "అత్త  మీద కోపం దుత్త మీద చూపించినట్లు " ప్రతి పక్ష నాయకులు వద్దని చెపితే సోనియా తెలంగాణా ఇచ్చేదే కాదు అని సమర్దించుకుంటుంటే , వారి అసమర్ధపుమాటలకు  నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్తితి సమైఖ్య వాదులది.   ఒక రాష్ట్రాన్న

సోనియా గాంది, తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన దానిని వెనుకకు తీసుకుంటుందా !?

                                                                K.C.R. గారు ఆంద్రా నాయకులను తెలివిగా అడకత్తెర లో ఇరికించి తెలంగాణా రాష్ట్ర సాధనకు కారకుడయ్యాడు అని చెప్పవచ్చు. తెలంగాణా వారు  రాజకీయంగా  పావులు కదపటంలో  చాణక్యుడికి ఏ మాత్రం తీసి పొరని K.C.R. నిరూపించాడు . అటు అధిష్టాన దేవతని ప్రసన్నం చేసుకోవడంలో సపలిక్రుతుడు అవ్వడమే కాక , తన చాకచక్యంతో ఆమె నైజం ఎరిగి, కూల్ గా ఆమె చేత తెలంగాణాకు  o.k అనిపించాడు .. కొన్నాళ్ళు సునామిలా విరుచుకు పడుతూ ,మరి కొన్నాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటించే  k.c.r. లో అపర చాణక్యుడు ఉన్నాడనటo  లో అతి శయోక్తి లేదు .   ఏమిటి ! k.c.r. గారిని ఇంతలా పోగుడుతున్నాను అనుకుంటారా? అవును మరి. ఈ రోజున తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి ఎవరు ఎన్ని కారణాలు చూపించిన ముక్య కారణం సోనియా గాంది గారి మాట. అవును ఖచ్చితంగా ఆమె తెలంగాణా ప్రజలకు తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన మాటే ఈ రోజు తెలంగాణా ఏర్పడటానికి కారణ మవుతుంది తప్పా వేరేది కాదు. సోనియా గాంది గారి నైజం ఎరిగిన k.c.r. గారు ఆమె పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9 వ తారికున తెలంగాణా ప్రకటన చేసేలా చాలా కసరతు చెసాదు. అందులో బాగమే

మనవు బ్లాగును ఇండి బ్లాగర్ అవార్డ్ కోసం రికమెండ్ చెయ్యగలరని బ్లాగ్ మిత్రులకు,వీక్షకులకు మనవి .

Image
                                                                               మిత్రులకు ,వీక్షకులకు  మద్దిగుంట నరసింహ రావు  వినమ్రం గా మనవి చేయునది ఏమనగా గత సంవత్సరం సెప్టెంబర్ లో ప్రారంబించిన మనవు బ్లాగు ఆనతి కాలంలోనే మీ అందరి అదరాభి మానములతో  83,000 వీక్షణలు పొంది దిన దిన ప్రవర్డ మాన మగుచున్నది. మీరూ చూస్తున్నారు నా బ్లాగు ఎటువంటి కమర్షియల్ సమాచారం కోసం వినియోగించక, కేవలం సామాజిక , మత , కుటుంబ పరమైన అంశాల మిద సమకాలిన పరిస్తితులను విశ్లేషిస్తూ, మిత్రుల పొగడ్తలను, విమర్శలను సమానం గా స్వీకరిస్తూ ముందుకు సాగుతుమ్ది.నా బ్లాగు  మనుగడకు వారందరూ సహకరిస్తున్నందుకు వారికి హృదయ పూర్వక ధన్య వాదములు తెలుపుతున్నాను.   ప్రస్తుతం  మనవు బ్లాగు indiblogger  awards 2013 కొరకు తెలుగు విబాగంలో నామినేట్ అయినది. దిని కొరకు  వీక్షకుల రికమెండ్ అనేది అవసరమని  indi blogger వారి నిబందనలలో ఒకటి . కావున మిత్రులు వీక్షకులు  సహృదయంతో "మనవు" బ్లాగును రికమెండ్ చేసి అవార్డ్ సాదిoచుటలో  తొద్పడగలరని మనవి . రికమెండ్ చేయుటకు లింక్ మిద క్లిక్ చేయగలరు  http://www.indiblogger.in/iba/entry.php?edition=1&en

ఆ అరవై ఐదు మంది కించ పరచింది" మోడిగారినా "? లేక బారత సార్వ బౌమత్వానా ?

Image
                                                                                   'పోగాలం దాపురిమ్చినపుడు  ముందు వెనుకలు కానక చరింతురు ', అని పెద్దల ఉవాచ . అ అరవై మంది పెద్దలు మామూలు వారు కారు . చట్టాలు చేసే సభలో సబ్యులు. నూట ఇరవైకోట్ల భారత ప్రజల ఆకాంక్షలను గౌరవించా ల్సిన గురుతరమైన బాద్యత గలిగిన వారు. అవసరమైతే రాజ్యాంగానికి సవరణలు చేయగలిగిన మేదో సంపత్తి గలిగిన వారు. తమకు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా మెజార్టీ ప్రజల ఆకాంక్షలను మన్నిస్తూ, మెలిగే గౌరవ లౌకిక ప్రజాస్వామ్య వాదులు వారు. మరి అంత గొప్ప వారు కేవలం ఒక వ్యక్తీ మిద ద్వేషంతో  భారత సార్వబౌమత్వాన్ని కిoచ పరచే పనిని ఎలా చెయ్య గలిగారు?   గుజరాత్ రాష్ట్ర ముక్యమంత్రి మోడీ గారి వీసాను అమెరికా వారు నిరాకరించారట !. అది రెండు రకాలు గా అవమానమ్. ఒక వేళ మోదిగారిని హిందూ మత ప్రతినిదిగా చూస్తె  హిందువు లందరికి అవమానమ్. లేదూ గుజరాత్ ముక్య మంత్రిగా చూస్తె, గుజరాత్ ప్రజలకు తద్వారా భారత ప్రజలందరికీ అవమానమ్. ఒక వేల గోద్రా అల్లర్ల్ర కేసులో అయన గారి పాత్ర ఉంటే అది నిర్నయించాల్సినది  బారతీయ న్యాయ స్తానాలు తప్పా , అమెరికా వీసాలు కావ

నచ్చినంత కాలమే, వంటాయన అయినాఇంటాయన అయినా !

     మనకు ఇంట్లో వంట వండడానికి , ఒక వంట మనిషిని పెట్టుకున్నాం అనుకోండి. అతన్ని ఎంత కాలం ఉంచు కుంటాం ? మనకి నచ్చిన వంట చేసి పెట్టినంత కాలమ్. . చేసే వంట బాగా  లేకుంటే  వెంటనే అతన్ని తీసివేసి వెరొకన్ని పెట్టుకుంటాం .  అది మన ఇష్టం . కాని అదే ఒక బార్య కాని , భర్త కాని, వారు చేసే వంటలు  నచ్చక పొతే , అలా వదిలించుకో గలమా? లెదు. ! అలా చెయ్య లెం . కారణం , మన వివాహ వ్యవస్థ కి మనమిచ్చే విలువా , గౌరవం ! కాని ఈ భూమి మిద భూతల స్వర్గాలు అని కొంత మంది గొప్పగా చెప్పే ఇంగ్లాండ్ ,అమెరికా దేశాలలోని స్త్రీలు మాత్రం వంట వాడిని మార్చినంత సుళువు గా ఇంటి వాడిని మార్చేస్తారట ! కారణం , వారికి వివాహం అనేది ఒక నాన్సెన్స్ . అసలు అమెరికాలో నూటికి డెబ్బై మంది స్త్రీలు పెండ్లిల్లె చేసుకోరట! నచ్చిన వాడితో , నచ్సినంత కాలం సహచరీంఛి , మొహం మొత్తగానె వదిలేస్తారట ! వారి మద్య "మనువు " అనేది లేదు కాబట్టి, వారి తనువూ , వారిష్టం . మన పురాణాల్లో  చెప్పిన దేవ వేశ్యలు అయినా రంభ , ఊర్వసి , మేనకలకు వారసులు వీరంతా !అందుకే నో  పెండ్లి, నో మొగుడ్స్ .    వీరి గురించి మన మెందుకు ఆలోచించాల్సి వస్తుందంటే , మన దేశం లో కూడా

2016 నాటికి ఇంగ్లాండ్ లో "తెల్ల కోతులు" ఎక్కువయితా యట!

Image
                                                                                 మనిషి పరిణామ క్రమం లో కోతి నుండి అభివృద్ధి చెందిన వాడని "డార్విన్ " మహాశయుడు సెలవిచ్చాడు . దాని  సంగతి  ఏమో కాని ,ప్రస్తుతం  మానవ సమాజం ,జంతు సమాజంగా పరిణామం చెందుతుం దనిపిస్తుంది .దానికి ఒక బలమైన రుజువు చూపిస్తాను . మనిషికి ,జంతువుకు ప్రదాన తేడా జ్ఞానం . ఆ జ్ఞానాబి వృద్ది  వల్లే జంతు స్తాయి నుండి నేటి నాగరీక మానవుడి స్తాయికి ఎదిగాడు . జంతువుగా ఉన్నప్పుడు ప్రక్రుతి నిర్దేశి oచిన విదంగా "సెక్స్" ని సంతానోత్పత్తికి మాత్రమె జరిపేవాడు . కాని రాను, రాను , తీరిక  సమయాలు పెరిగి,పనీ పాటా తక్కువ అవ్వడం వల్లా ,సెక్స్ ని కూడా ఆనందించే పనిగా అలవాటు చెసుకున్నాడు . దానివలన ,విచ్చల విడి తనం పెరిగితే, దానిని నియంత్రించ దానికి వివాహ వ్యవస్తను ఏర్పాటు చేసుకున్నాడు . స్త్రీ పురుషుల నిష్పతి అనుసారం ,ఒక వ్యక్తికీ ఒకే బార్య, అనే "ఏక దంపతీ వివాహం" పద్దతిని  అమలు చేసాడు . ఈ విదంగా  తను అలవర్చుకున్న  అలవాట్లుకు అనుగుణంగా  తగిన వ్యవస్త లను ఏర్పాటు చేసుకుని త

శభాష్! మొత్తానికి 'సేవ్ ఇండియన్ ఫామీలీ' అనే వారూ ఉన్నారన్న మాట!

ఈ రోజు నాకు కొంత సంతోషం వేసింది. కారణం, ఒక సహ బ్లాగ్ మిత్ర్డి బ్లాగులోని  ఒక వార్త! అందులోని విశేషమేమిటంటే,  ఈ రోజు హైదరాబాదులో  క్జొంత మంది "సేవ్ ఇండియన్ ఫామిళి"  అంటూ, కాంగ్రెస్ పార్టివారి, ఆఫీసెదుట మెరుపు ధర్ణా నిర్వహించారట!. వారి ఆవేదన అర్ధవంతమయినదే. అది ఏమిటంటే కేంద్ర మంత్రి మండలి వారు, ముందు వెనుక ఆలోచించకుండా,మొన్న ఒక తిర్మానం అమొదించింది. దాని ప్రకారం, విడాకులు తీసుకునే భార్యకు,భర్త స్వార్జితంలోనే కాక పూర్వార్జితం లో కూడా వాట ఇవ్వాలట. దీనిలోని ముక్యమైన సాదక భాదకాలు వివరిస్తూ, నేను నిన్న ఒక టపా పెట్తడం జరిగింది. దాని కోసం ఈ లింక్ మీద క్లిక్ చెయ్య గలరుఈ . http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_8384.html    ఈ రోజు    పైన చెప్పిన "సేవ్ ది ఇ l డియా ఫామిలీ" వారు ఆ అనుచిత సవరణలలో ని తప్పులను మరింత వివరంగా తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ వారి ఆపీస్ ముందు దర్ణా నిర్వహించడం ముదావహం. కాకపోతే  ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే, ఆ  ధర్ణాలో స్త్రీలూ, పురుషులూ, పల్గొంటే, అది  కేవళం కొంత మంది పురుష హక్కుల కోశం పోరాడే వారే కావాలని ఉద్యమం చేస్తునారని కొంత మంది ప్రచారం చె

"సర్రోగసి మదర్స్" కి ఆస్తిలో "సముచిత వాటా" ఇస్తే సరి!.

                                                                                                                              మన సాంప్ర దాయంలో ఒక విదానం ఉంది. అదేమిటంటే,పుత్ర  వారసులు  లేని వారు చనిపోతే, ఆడపిల్లలు కొరివి పెడితే చనిపోయిన వారి ఆత్మ   "వైతరణి" దాటదు కాబట్టి, దగ్గరి బందువులలో ఎవరైనా మగవారి చేత కొరివి పెట్టిస్తుంటారు. అలా కొరివి పెట్టినందుకు వారికి త్రుణమో పణమో ఇస్తుంటారు. అంతే కాక కొరివి పెట్టే అధికారం వలననే "జ్యేష్ట" , కనిష్ట బాగాలు కూడా ఉంటాయి. అంటే పెద్దవాడు తండ్రికి, చిన్నవాడు తల్లికి కొరివి పెట్టే అధికార ముంటుంది కాబట్టి ఇలా ఏర్పాటు చేసి ఉంటారు. అయితే ఇప్పుడు ఒకరూ, లేక ఇద్దరు చాలు అనేది సాంప్రదాయం అయింది కాబట్టి, ఆ బాగాలు అనేవి వివాదాస్పదం కాకపోవచ్చు.   ఇక పోతే ఇప్పట్టి దాక మన కుటుంభ సంబందాలలో లేని రక్త బందువు ఒకరు కొత్తగా చేరిపోయారు. కాక పోతే మన వారికున్న డబ్బు వారిని "కిరాయి అమ్మ" లు గా మార్చి, తొమ్మిది నెలల టెంపరరి రేలేషన్ గా మార్చి వేసింది. వారే "సరోగసి మదర్స్".ఎవరైనా కొడుకు బాగా వేదిస్తుంటే, కన్న తల్లి అనే మొదటి మాట

పొంచుకుని ఉన్న పెనుముప్పు ను ఎదుర్కోవడానికి హైదరాబద్ ని రెండవ రాజదానిగా చెయ్యడం తక్షణ కర్త్యవ్యం.

                                                                         మన రాష్ట్రం లో జరుగుతున్న "తెలంగాణా" "సమైక్య ఆంద్రా" ఉద్యమాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంటే దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ వారు ఎదో ఓక నిర్ణయం తీసుకుని ప్రజల మద్య వైషమ్యాలు లేకుండా చూడాల్సింది పోయి, అదిగో తేలుస్తాం, ఇదిగో తేలుస్తాం అని "నాన్నా పులి వచ్చే" కదలో మాదిరి వ్యవహరిస్తుంది.   అసలే మన పొరుగున ఉన్న "డ్రాగన్" చైనా వారు ఒక పకడ్బంది వ్యూహంతో మన చుట్టూ ఉన్న పొరుగు దేశాలతో మైత్రి పెంచుకుని,మిలట్రీ పరంగా బలోపేతం అవుతుంది. ఉత్తరాన అరుణాచల్ ప్రాంతంలో, ఇతర సరిహద్దు ప్రాంతాలలో అనేక మార్లు చొర బాట్లుకు తెగబడడమే కాక, అదేమిటని ప్రశ్నిస్తే అంతా ఉత్తిదే అన్నట్లు నాటకా లాడుతుంది. మన దేశం నైసర్గికంగా మూడు వైపులా హిందూ మహా సముద్రం ఉండటంతో,తన మిలట్రీ వ్యూహంతో ఆ మూడు వైపులా కూడా చైనా "ముత్యాల సరం" పేరుతో ఇండియాని చక్ర బందం లో బంధించింది అని చెప్ప వచ్చు. దీని కోసమే మన పొరుగు దేశాలకు తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకునే కార్యక్రంఅం చేపట్టింది. ఇప్పుడు భారత దేశం డ్రాగన

సుప్రీంకోర్టు తీర్పుతో అవినీతి పరులైన అధికారులకు కాసుల పంటేనా!?

                                                            అవుననే అనిపిస్తుంది! ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు చూస్తే తాజాగా ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పు సత్పలితాలు కన్నా దుష్పలితాలే ఎక్కువ ఇచ్చేటట్లుంది.   నేరస్తులు రాజకీయాలలో కొనసాగకుండా శిక్ష పడిన మంత్రులు, ఎమ్మెల్యెలు, ఇతర రాజకీయ పదవులు అనుభవించే వారెవరైనా సరే, వారిక్ గల అప్పీల్ అవకాశాలతో సంబందం లేకుండా తక్షణమే పదవి కోల్పోతారని మొన్న సుప్రీం కోర్టు వారు ఇచ్చిన తీర్పు సర్వదా అహ్వానించదగినది. ఎందుకంటే ఏ తీర్పు అయినా కూలంకష విచారణ అనంతరం మరియు నిందితుడి కి డెపెన్స్ చేసుకునే అవకాశం కల్పించి, ఇరువైపుల ప్రవేశపెట్టబడిన సాక్ష్యాల విచారణ అనంతరం కోర్టు వారు తీసుకునే నిర్ణయం కాబట్టి, అది న్యాయమైనదే అని చెప్పాలి.   కాని రెండవ రోజు ఇచ్చిన తీర్పు అదే పోలిస్ కష్టడిలో ఉన్నా, జుడిసియల్ రిమాండ్లో ఉన్న ఎన్నికల్లో పోటి చెయ్యడానికి అనర్హులు అనేది పైకి చూడటానికి నేరమనస్తత్వం కలిగిన వారిని కట్టడిగా చేసేది కనిపించినా కచ్చితంగా అది మరింత అధికార దుర్వినియోగానికి, అవినీతికి దారి తీస్తుంది. ఎలాగంటారా    తమకు ప్రత్యర్దిగా ఉన్నవారు ఎన్నికల్లో పో

మహాభారతం బుద్దుడి తర్వాత రాయబడితే, గోపికలు అందరూ వేశ్యలైన బౌద్ద సన్యాసినులేనా!

Image
                                                        హిందూ మతాన్ని ఏదో విదంగా ఇతర మతాల వారి ద్రుష్టిలో పలచన చేసే ఉద్దేశ్యంతోనే పన్కట్టుకుని ఎప్పుడో ఎవరో బౌద్ద మతాభిమాని చెప్పిన దానిని,తెలుగులోకి అనువదించి బ్లాగులో ప్రచురిస్తున్నారు.వారి ప్రకారం: - (1). బుద్ధ,ప్రతిబుద్ధ అనే మాటలు ఇతిహాసంలో తరచుదొర్లాయి. సంస్కృతంలో స్ధూప అనే అర్థం గల పదం ఎక్కువసార్లు కనిపించింది. దేశమంతా స్థూపాలతో నిండినట్లు గమనిస్తే బౌద్ధం తరువాతనే మహాభారత రచన సాగినట్లు తెలుస్తుంది. (2). కృష్ణుడుఒక పథకం ప్రకారం ద్వారకా నగరాన్ని రూపొందించాడని పురాణాలు చెపుతున్నాయి. హరివంశం ప్రకారంద్వారకలో వేలాది మంది స్త్రీలను వ్యభిచారంలో ఉన్నవారిని స్థిరపరిచారు. హరివంశం ప్రకారం ఆ స్త్రీలకు తగ్గట్లే పురుషుల్నీ, వసతి గృహాల్నీ తెరిపించాడు. ఆనాడు కృష్ణుడి సోదరుడు బలరాముడే పెద్ద తాగుబోతు. కల్లుముంత లేకుండా అతడు కనిపించేవాడు కాదు. అందుకే హరిప్రియ అని కల్లుకు మారుపేరు వచ్చింది. అక్కడ అన్ని రకాలైన మాంసభక్ష్యాలూ లభించేవి. కృష్ణుడు కూడా వాటిననుభవించే వాడు. మజుందార్ ద్వారకను గురించి రాస్తూ హరివంశం ప్రకారం యాదవులు ఈ

ఇక నుండి చీర్ గర్ల్స్ లాగ బార్ గర్ల్స్ ని చూడొచ్చన్నమాట!.

                                                                                                                                                 ఖర్మ భూమిలో  కాంతలకు  సమానత్వం లేదని తెగ బాద పడిపోతున్న నియో వ్యాపార వాదులకు శుభ వార్త!. కర్ణాటక లో బార్ యజమానులంతా కలసి, తాము తమ బారులలో స్తిలను వెయిటర్ లు పెట్టుకుని కస్టమర్ లకు కిక్కు ఎక్కిస్తుంటే, ఓర్వలేని పోలిసులు అడ్డు చెపుతున్నారని, హైకోర్టు వారిని ఆశ్రయించారట. హై కోర్టు వారు కూడ వారి సమస్యను సానుభూతితో పరిశిలించి, బార్ లలో "వేచివుండే"(వెయిటర్స్) వారి గా స్త్రీలను నియమించుకోవచ్చని ఆర్డర్ ఇచ్చారట. కాకపోతే కొన్ని నిబందనలు పాటించమని చెప్పే అధికారం ప్రభుత్వానికి ఉందని హై కోర్టు వారు అంటే, దానికి కూడ బార్ యజమానుల తరపు లాయర్లు లా పాఇంట్ తీసి అబ్యంతరం చెపితే, ముందు ట్రైల్ వెయ్యండి. తర్వాత మీ సాదక బాదకాలు గవర్నమెంటు తో చెప్పి సమస్యను పరిష్కరించుకోవచ్చు. అని సెలవిచ్చారట గవర్నమెంట్ తరపు వకీలు గారు. మొత్తానికి కన్నడ బార్ యజమానులు స్తి వెయిటర్ ల కోసం చేసిన పోరాటం లో విజయం సాదించారు అన్న మాట!.    కొంచెం వేలు పెట్టే సందు ఇస్తే చాలు

దిక్కుమాలిన సమాజంలొ ఫుట్టడమే ఇళవరసన్, నాగరాజులు చేసిన తప్పా?

                                                                                                                                                                                                                                               అది ధ ర్మపురి. ధర్మం ఎన్నిపాదాల మీద నడుస్తుందో తెలియదు మరి!ఆ వూళ్లో యువతీ యువకులు ఇళవరసన్, దివ్య. ఇద్దరూ ప్రెమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. ఆ పెళ్లికి అమ్మాయి తల్లి తంద్రుల అనుమతి లేదు. ఇద్దరి కులాలు వేరు. అయినా పర్వాలెదు పెళ్లికి కుల మతాలు అడ్డు కాదు. ఎందుకంటే మన రాజ్యాంగం లోనే రాసుకున్నాం.అటు అమ్మాయి కులస్తులు పెద్దకులం కాబట్టి సహజంగానే పెళ్లిని వ్చ్యతిరేకించి ఉండవచ్చు.అబ్బాయి దళితుడు కాబట్టి ఎన్నో తరాల నుండి వస్తున్న సాంప్రదాయ వ్యతీరేకత అమ్మాయి తరపు వారు కలిగి ఉండడం సహజమే అయినప్పట్టికి మారుతున్న పరిస్తితులకు అనుగునంగా సమాజాన్ని మార్చదంలో విఫలమ కావడంలో అందరి పాత్ర ఉంది.    ఒక అమ్మాయి అబాయి పెండ్లి చేసుకోవడానికి కుల మతాలు అనుమతి అవసరం లేకపోయినా ఇరువైపుల తల్లి తండ్రుల అనుమతి కాని వారు ఒప్పుకోని పక్షంలో కోర్టు అనుమతి కాని   అవసరం ఉందనేద

వోటు అమ్ముకునే వారికి, ఒళ్లమ్ముకునే వారికి తేడా ఏముంది?

                                                                                                                               మనది గొప్ప ప్రజా స్వామ్యంగా తెగ మురిసిపోయే వారికి ఈ మద్య అక్కడాక్కడా జరుగుతున్న పంచాయతి "వేలం పాటలు" చూస్తే ఇది ఏ తరహా ప్రజాస్వామ్యమో అర్దం కాకుండా ఉంది.ప్రజలంతా ఒకే మాట మీద నిలబడి చట్ట వ్యతిరేక పనులు చేస్తే ప్రజా స్వామ్యం అవుతుందా? ఖచ్చితంగా కాదు. అటువంటి తప్పులను చట్టబద్దం చేస్తే తప్పా, తప్పులు చేసిన వారు శిక్షల నుండి తప్పించుకోలేరు.   మన పంచాయతి ఎన్నికల చట్టం ప్రకారం ఏకగ్రీవంగా  ఎన్నికైన "పంచాయతీలకు" ఆర్దిక పరమైన అవార్డులు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికి, అట్టి ఎన్నిక స్వచ్చందంగా ఏ ప్రలోబాలకు లోనుకాకుండా జరగాలి. కాని నిర్లజ్జగా, బహిరంగంగానే పంచాయతి పదవులను వేలం పాట పెట్టి, అది హెచ్చు డబ్బు ఇచ్చి కొన్న వారికే ఆ సీటు దక్కేలా చెయ్యడం నిజంగా అతి హేయమైన చర్య.ఇలా బహిరంగంగంగా నే డబ్బున్నవాడికి పదవి కట్టబెడుతుంటే, అది పేపర్లలో కూడా ప్రచురిస్తుంటే ఒక్కడంటే , ఒక్కడైనా పార్టీ వారు ఖండిస్తున్నారా? అలా చేస్తున్న వారి మీద చర్యలకు ఎలక్షన్ కమీషనర

మేమే విజ్ణానులం అనుకునే వారు ఇస్రో చెర్మన్ గారిని ని చూసి నేర్చుకునేది చాలా ఉందనుకుంటా!.

                                                                                                                                       ఈ రోజు నింగిలోకి ఎగరనున్న  ఉపగ్రహం ( PSLVc22), రాకెట్ లాంచింగ్ సమస్యలు లేకుండా సజావుగా జరగాలని సాక్షాత్తు, ఇస్రో చేర్మన్ శ్రీ రాదక్రిష్ణన్ గారు సతీ సమేతంగా తిరుమలకు విచ్చేసి, ఆ ఏడుకొండల వాని సన్నిదిలో ఆ ఉపగ్రహ కక్ష్య మార్గం నమూనాకు పూజళూ చేయించి, అ భగవంతుని  అశీసుల కోసం ప్రార్దించారు. ఇది సైంటిస్ట్ లు అనబడే వారు కొంతమందికి ఏమనిపించినా ఆ దైవాన్ని విశ్వసించే వారికి ఆనందం కలిగించే విషయం.   మనిష్ బౌతికంగా ఎంత విజ్ణాన వంతుడైనప్పటికి, అతను మానసికంగా తనను నడిపించే శక్తి ఈ విశ్వంలో ఏదో ఉందనే బావిస్తుంటాడు. అది మూడ విశ్వాసం కాదు.అనాదిగా అతని నరనరాల్లో జిర్ణించుకుని ఉన్న మత లేక అద్యాత్మిక పరమైన  బావన. సాక్షాత్తు ఐన్ స్టీన్ అంతటి వాడే "సైన్స్, మతమూ అనేవి ఒకే వ్రుక్షానికి ఉన్న రెండు కొమ్మలు లాంటివి " అన్నాడు. కాబట్టి అన్నింటికి సైన్స్ సమాదానం చెప్పలేదు అనేది మనకు అనుభవమే. అలా అంతిమ సత్యమ్ కనుగొనబడే వరకు అటు ఆద్యాత్మికత బావననలు, ఇటు విజ్ణాన బావనల