"భారతీయ సంస్క్రుతి,బాలిఉడ్ హీరో ఇజం అంత నీచమైనది" అన్న లాయర్ వాదనతో ఏకీభవించి ,నిందితుడిని వదిలేసిన ఆస్త్రేలియన్ కోర్టు !
భారత దేశం లో కొంతమంది మగాళ్ళకు ఉన్న ప్రత్యెక గుణం "భారతీయ మగబుద్ది ". దిని గురించి ఆనోటా ,ఈ నోటా పాకి చివరకు ప్రపంచం అంతా పాకిపోతుంది . అయితే అన్నీ దేశాల్లోచివరకు ఇండియాలో దీన్ని" వేదవ తనం " గా పరిగణించి శిక్షలు వేస్తుంటారు . కాని భారత దేశంలోని కొంత మంది మోడ్రన్ యువత మాత్రం "హీరో యిజం "గా బావిస్తుంది . అందుకే మన సినిమాల్లో హీరోలు వేసే ఈ వెదవేషాలకు యువత బ్రహ్మ రదం పట్టి పిక్చర్ ని సూపర్ డూపర్ హిట్ చేస్తుంటారు . అదే పని బయట చేస్తే మాత్రం గగ్గోలు పెడుతూ ,ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇస్తూ భారతీయ మగ బుద్ది ఇదే అంటూ నానా యాగి చేస్తుంటారు . అయితే భారతీయ బాలిఉడ్ సినిమాలు లో హీరోలు ప్రదర్శించే సదరు వేదవ బుద్దిని జడ్జ్ గారికి చూపించి ,...