Posts

Showing posts from December, 2013

ఇప్పట్టి దాక "నిత్యానందిని " అయిన రంజిత ఇక నుంచి "మాతా ఆనందమయి " అట!.

                                                        ఆశ్రమం  అంటే అర్దం మారిపోయిన రోజులివి. హిందూ తాత్విక దృక్పదం లో ఆశ్రమ అంటే దశ అని అర్దం. ప్రతి వ్యక్తి  జీవితం లో నాలుగు దశ లు ఉంటాయని ఆ యా దశలలో నిర్వర్తించిన బాద్యతలు గురించి "మను ధర్మ"  శాస్త్రం లో విపులంగా చెప్పబడింది. దాని ప్రకారం హిందువు అయిన ప్రతి ఒక్కరు 4  ఆశ్రమం లలో  అంటే 4జీవన దశలో ఏదో ఒక ఆశ్రమం లో ఉన్న వారే. అలాగే "సంసారి కాని వారికి సన్యాసి అయ్యే అర్హత లేదు " దీని గురించి వివరం గా తెలుసుకోవాలంటే ( కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే. http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_18.html ని క్లిక్ చేసి చూడండి)          అయితే ఈ కలి కాలం లో అన్నీ మారినట్లే ఆశ్రమ విదానాలు  మారాయి .  ఆశ్రమం అంటే పెండ్లి కాని సన్యాసులు ఉండే బోగలాలస మందిరాలు అనే అర్దం వచ్చేలా కొం...

'ప్రజా పతి ' అవుతాడేమోనని ఆశపడుతుంటే , పర్మనెంట్ పతి కావడానికే జీవిత కాలం సరిపోనట్లుంది!.

                                                        స్తిర చిత్తుడు కానివాడు ఏదీ సాదించలేడు. ఒక వ్యక్తీ యొక్క వైవాహిక జీవితం అతని పర్సనల్ మేటర్ కావచ్చు. కానీ కొన్ని వేల మందికి ఆరాద్య నీయుడు గా ఉన్న వాడు కొన్నిక్రమమైన  జీవన పద్దతులు అవలంబించవలసి ఉంది . తెలుగు సినీ అభిమానులలో ఒక అత్యున్నత స్తానం సంపాదించుకున్న ఒక  సినీ హీరో నిజ జీవితం లో మాత్రం చంచల మనస్తత్వం గలవాడిగా మిగిలి పోవటం విది లిఖితం . .   బార్యా భర్తల బందం అనేది జన్మ జన్మ ల బందం అని హిందువుల నమ్మఖ్ఖం. పెండ్లి చేసుకోవడానికి పూర్వమే అన్నీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని తన వాళ్లకు  నచ్చిన , తను మెచ్చిన అమ్మాయితో సంసార గృహంలోకి అడుగు పెడతాడు మగవాడు  . అలా మొదలైన వారి సంసారం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడి విజయం సాదిస్తుంది అంటే జీవిత బాగస్వామి మీద ప్రేమాభిమానాలు తో పాటు స్తిరమైన మనస్సు, సర్దుకు పోయే గుణం ఉండబట్టే ఇది సాద్యపడుతుంది. భారత దేశంల...

మగాడు మ్రుగాడిగా మారటానికి అతనిలోని "హార్మోన్ల ప్రబావం " కారణమా!?.

Image
                                                         ఈ విషయం గురించి పరిశోదించి చెప్పవలసింది శాస్త్రజ్ణులే. నాకు ఈ  ఆలోచన రావడానికి కారణం నిన్న ఒక ఆర్టికిల్ చదివాను అందులో చింపాజీలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో లో గల "లో లాండ్" ఫారెస్ట్ లోని చింపాంజీ  ల మీద చేసిన పరిశోదనల్లో తేలిన సారాంశం ఏమిటంటే మామూలుగా చూడటానికి చింపాజీలు , బొనోబో లు ఒకే లాగా ఉన్నప్పటికి , వాటి ప్రవర్తనల్లో చాలా వైవిధ్య ముందట.    బొనోబో లు చింపాంజీలు కంటే ఎక్కువ శాంతంగా ఉంటూ ఆడ బొనోబోలతో సఖ్యంగా కలసి మెలసి ఉండటానికి ఇష్టపడతాయి అట. అలాగే యుక్తవయస్సు వచ్చే వరకు తల్లి తోనే ఉంటాయట. కానీ అదే చింపాజీలు విషయానికి వచ్చే సరికి అవి యుక్త వయస్సు రాక ముందే తోటి మగ చింపాంజీల...

మన తెలుగు అమ్మాయిని మాయం చేసిన ఆ పంజాబీ అమ్మాయి ఎవరు ?!

నేను  ఈ బ్లాగు మొదలు పెట్టిన తొలి నాళ్లలో రాసిన టపా  ఇది. నాకు నచ్చిన టపాలలో ఇది ఒకటి . తప్పకుండా అందరికి  నచ్చుతుంది. అందుకే మరొక సారి రీ పబ్లిష్ చెస్తున్నాను. క్రింది లింక్ మిద క్లిక్ చెయ్యండి "మాయమైపోతున్న తెలుగు అమ్మాయి ని రక్షించండి"

R.K న్యూస్ చానల్ విషయం లో కూడా "మనవు" చెప్పిందే నిజమయింది!.

Image
                                                                   నేను మొన్న 21 వ తారీఖున ఇదే బ్లాగులో R.K  న్యూస్ చానల్ వారి ఊదరగొట్టే ప్రసారాలను గూర్చి ఒక విషయం చెప్పడం జరిగింది. అదే నిజమని రుజువు చేసేలా నిన్న A.B.N  చానల్ వారు సదరు R.K  న్యూస్ చానల్  వారీ బ్లాక్మెయిలింగ్ ప్రసారాల తీరును విమర్శిస్తూ "చ.. చ.. చానల్  అనే పేరుతో ప్రసారం చేసిన కార్యక్రమం ద్వారా బహిర్గతమైంది.   నేను R.K  న్యూస్ చానల్ గురించి "న్యూస్ చానల్  వారు గత 3 రోజులుగా , ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి గారి గురించి ఒక కదనం ప్రసారం చేస్తున్నారు. ఒక వేళా వైద్యానికి వచ్చే స్త్రీలతో , వైద్యశాలలో అయన అసబ్యంగా ప్రవర్తిస్తుంటే తగిన సాక్ష్యాదారాలతో చానల్ వారు సంబండిత వైద్య విభాగ అధికారులకు తెలియ చేసి అతని గుర్తింపు సర్టిపికేట్ ను రద్దు చేయించవచ్చు. అంతే కానీ వరుసగా చెప్పిందే చెప్పి ఊదరగొట్టడం...

దేనికైనా రెడీ యే అన్న ఈ 'భంబోళ జంభళ' కి బ్రాహ్మణుల శాపం తగిలినట్లుంది!.

                                                            గత సంవత్సరం విడుదలైన "దేనికైనా రెడీ" అనే సినిమా మంచు మోహన్ బాబు గారికి అచ్చి వచ్చినట్లు లేదు. ఆ సినిమా వలన లాభం  ఎంత వచ్చిందో కానీ , యావత్ ఆంద్రప్రదేశ్ లోని బ్రాహ్మణుల ఆగ్రహానికి మంచు వారి కుటుంభం గురి అయింది. ఆ సినిమాలో బ్రహ్మణులను కించపరచే సన్నివేశాలు ఉన్నాయని నిరసనలు తెలపడానికి వెళ్ళిన కొంతమంది బ్రాహ్మణ యువకులను మోహన్ బాబు తనయుడు తన అనుచరుల చేత తన్నిస్తే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. అప్పుడే కొంతంది బ్రాహ్మణులు మోహన్ బాబు కుటుంబానికి శాపనార్దాలు పెట్టారు. మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు కానీ బ్రాహ్మణుల శాపాలకు లేదా వారి తరపున తీసుకున్న చట్టపరమైన చర్యలకు మోహన్ బాబు కు జాతీయ స్తాయిలో తీరని అవమానం జరిగింది.  జాతీయ అవార్డు అయిన పద్మశ్రీ  అనేది ఒక గౌరవ పుర్తస్కారమే తప్పా , టైటిల్  కాదని , కాబట్టి ఇన్విటేషన్  కార్డుల్లో కానీ, పోస్...

వందమంది దేవయాని లను వివస్త్ర లను చేసినా , అమెరికా అమెరికాయే, కాంట్రాక్ట్ కాంట్రాక్టే !

                                                         దేవయాని ! మన పురాణ గాధలలోని  రాక్షస గురువులు అయిన శుక్రాచార్యుల వారీ కుమార్తె పేరు అది. ఆ పేరును ముంబాయికి చేందిన I.A.S  ఆపిసర్ గారైన ఉత్తమ్  కోబ్రగాదె  గారు తన కుమార్తెకు పెట్టుకున్నారు. ఆ అమ్మాయే ఇప్పుడు బారత, అమెరికా మద్య చెలరేగిన దౌత్య సంబందాల వివాదాలకు కేంద్ర బిందువు.        దేవయాని కోబ్రగాదె  U.S  లోని న్యూ యార్క్ లో   భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటి కాన్స్యుల్ జనరల్ గా పని చేస్తుంది. దేవయానీ పుట్టి , పెరిగిందీ ముంబై లోనే .  మరాఠీ తో పాటూ ఆమె ఇంగ్లీష్, హిందీ , జర్మనీ బాషలలో అసామాన్యమైన పట్తుందని అంటారు . సివిల్స్ రాసి ఐఎఎఫ్ అధికారిగా ఆమె భాద్యతలు చేపట్టింది 1999 లో . పాకిస్తాన్ , ఇటలీ , జర్మనీ దేశాల్లోని భారత రాయబార కేంద్రాల్లో పనిచేసారు .  . ఐఎఫ్...

ఈడొచ్చినా యువరం లేనోళ్ళు , పదవి వచ్చినా లౌక్యం తెలియనోళ్ళు ,అచ్చంగా ఈయన లా ఉంటారు!.

                                                          డిల్లీ ప్రజలను చూసి దేశం లో చాలా మంది జాలి పడాల్సిన పరిస్తితి ఏర్పడింది. పాపం అదికారం లో కాంగ్రెస్ అవినీతి పాలనను , అసమర్ద పాలనను భరించలేక మెజార్టీ డిల్లి వాసులు B.J.P,కి AAP  (ఆం ఆద్మీ పార్టీ) కి వోట్లు వేసారు. దురదృష్ట వశ్శాత్తు కేవలం 4 సీట్ల తేడాతో B.J.P  వారు డిల్లి పీటాన్ని అదిష్టించే అవకాశాన్ని కోల్పోయారు.అలాగే AAP  వారు పాలనా  పాగాలు అందుకోవాలంటే కనీసం 8 సీట్లు కావాల్సి ఉంది. తమకు తగినన్ని సీట్లు రాలేదు కాబట్టి తాము పరిపాలనా బాద్యత స్వీకరించం అని ఎంతో అనుభవం ఉన్న నాయకులు కలిగిన B.J.P  పార్టీ స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ వారు అధికారానికి అందనంత దూరం లో ఉన్నారు కాబట్టి , వారు దైర్యం చేసే అవకాశమే లేదు. ఇక పోతే మిగిల్ంది 28 సీట్లతో రెండవ పెద్ద పార్టీగా అవతరించిన AAP  వారు.   AAP  ఒక రాజకీయ పార్టీ కాదు కేవలం ఉద్యమ సంస్త అని ఆ పార్టి ...

తెలంగాణా బిల్లు తో బట్టబయలు కానున్న కాంగ్రెస్ హై డ్రామా భండారం!

                                                                                                                         బ్రతకని బిడ్డ బారెడు అన్నట్లు , 2014 ఎన్నికల లోపు ఏదో విదంగా తెలంగాణా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి , ఆ తర్వాత ఏమి జరిగినా దాని బాద్యత అంతా ప్రతిపక్షం మీద నెట్టి ,తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం  కంకణం కట్టుకున్నప్పటికి, ప్రతి పక్షాల కుట్ర వల్లే అది సాధ్య పడలేదు అని చాటాలనుకుంటుంది,అదికార కాంగ్రెస్ పార్టీ . అసలు ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపడం లో కేంద్ర హోం శాఖ ప్రదర్శించిన అతిఉత్సాహం చూస్తుంటే ...

దిగ్విజయి సింగ్ గారు తన "తోలి రేయి" కోసం కూడా ఇంత తొందర చేసి ఉండరు!

                                                            పాపం ఆ పెద్దమనిషికి తెలుగు వారు అంటే ఎంత ప్రేమ! ఎంత అపేక్ష! అందుకే తెలుగు వారిని రెండు రాష్ట్రాల ప్రజలుగా చూడాలని, ఈ  మద్య ప్రదేశ్  వీరుడు కంకణం కట్టుకుని , ఆ పనిలో యమ బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది .   ఈ  రోజునే ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యయి. నిన్ననే రాష్ట్రపతి గారు తెలంగాణా విబజన ముసాయిదా  బిల్లును సంతకం చేసి రాష్ట్ర అసెంబ్లీకి పంపారు.దానిమీద అభిప్రాయాలూ పంపడానికి 40 రోజులు గడువు ఇచ్చారు. ఈ  లోపులో అసెంబ్లి అభిప్రాయాన్ని పంపవలసి ఉంటుంది . ఒక వేలా సీమాంద్ర నాయకులు ఏదైనా మతలబ్ చేసి కిరి కిరి పెడదామనుకున్నా, 40 రోజుల తర్వాత ముసాయిదా బిల్లు అసెంబ్లీ నుండి పంపినా ,  పంపకున్నా పార్లమెంట్ బిల్లును ఆమోదించవచ్చు. మరి ఇంత అధికారం కలిగిఉండి కూడా దిగ్విజయ్ సింగ్ గారు ఎందుకు నానా హంగామా చేస్తున్నాడో అర్దం కావటం లేదు.  ఈ  రోజ...

స్వలింగ సంపర్కులను సాచి కొట్టిన సుప్రీం !

                                                       గారాబం ఎక్కువైతే వెన్న కాల్చుకుని తింటాను అన్నాడట వెనుకటికి పిల్లోడు ఒకడు ! అలా ఉంది మన దేశం లోని కొంతమంది హక్కుల పోరాటాలు. మనం ఏది చేయ్యాలో ఏది చెయ్యకూడదో సాద్యమైనంత వరకు ప్రక్రుతి గురువులా అన్నీ చెపుతూనే ఉంటుంది. కాబట్టి ప్రకృతిని మించిన గురువు లేదు నేర్చుకునే శక్తి ఉంటే. ఇదే దత్తాత్రేయుల  వారి సిద్దాంతం.      మనుషులమైన మనం శక్తి కొరకు ఆహారం బుజించాలంటే నోటితోనే తినాలి. ఆ సౌలబ్యం కరువైన రోగులకు  సూదుల ద్వారా శక్తిని ద్రవ రూపంలో శరీరానికి అందిస్తారు. కానీ అన్నీ సక్రమంగా ఉన్న వారు నేను నోటి తో తినను , ఇంకా దేనితో అయినా తింటాను అంటే , నీ ఇంట్లో నువ్వు తిను , నీ చావు నీవు చావు అంటారు. అంతే కానీ నీవు చేసే పనిని కూడా  సమాజం ఆమోదించాలి, నిన్ను ఎవరూ తప్పు పట్టకూడదు అంటే ఎలా? అసహజమైన పని చెయ్యడాన్ని ఖండించే అధికారం సమాజం కి ఉంటుంది. నీవు చేసే పిచ్చి పనిని మరొకరు చేయకు...

పాతిక మందిలో లేని సమైక్యతా ,5 కోట్ల మందిలో ఉందనడం ఆత్మ వంచన కాదా ?

                                                            ఇన్నాళ్ళు సీమాంద్రా కాంగ్రెస్ వారందరూ సమైఖ్య వాదులని యావత్  భారత దేశ ప్రజలను  తమ మోసపు మాటలతో మబ్య పెడుతూ వస్తున్న , సీమాంద్రా కాంగ్రెస్ నాయకుల భండారం , నిన్నట్టి అవిశ్వాస తీర్మాన నోటిసుతో బట్ట బయలు అయింది. భారత పార్లమెంటులో సిమాంద్రా ప్రాంతం నుంఛి 25 పార్లమెంటు సీట్లు ఉంటే, తెలంగాణా నుంచి 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది కేవలం రాజకీయ పరమైనది. దానికి ప్రజల మనోబావాలు తో పని లేదు . ఒకవేళా మెజార్టీ లేదా నిర్దిష్ట ప్రమాణాలు  తో కూడిన   ప్రజల మనోబావాలు పరిగణనలోకి తీసుకోవాలి అని రాజ్యాంగం లో పొందుపరచబడి ఉన్నట్లైతే , ఈ  రోజు తెలుగు ప్రజలు కు ఇన్నీ డ్రామాలు చూడాల్సిన అగత్యం ఉండేది కాదు. కానీ ఇటువంటి రోజు వస్తుందని ఆ నాటి రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించి ఉండరు. ఈ  నాటి రాజ్యాంగ నిర్మాతలకు అంత ఆలోచనా చేసే బుద్దితో పాటు తీరిక కూడా లేదు. అందుకే ...

ఆమ్ ఆద్మీకి ఒక చొట అంటితే , కేజ్రీవాల్ లాంటి వారికి మూడు చోట్ల అంటుద్దట !

                                                            పదిమందిలోకి వచ్చాక పట్టు విడుపుల దోరణితో వ్యవహరించాలి. అలా పట్టు విడుపులు లేకుండా మంకు పట్టు కు పోయే వాడు ఏమి సాదించలేడు .అందుకే మన పెద్దలు ఒక మాట అంటూ ఉంటుంటారు. తెలివిలేనోడికి ఒక చోట అంటితే అతి తెలివి గలవాడికి మూడు  చోట్ల అంటుద్ది అని. ఈ  సూత్రం కేజ్రివాల్ కి వర్తిస్తుందా అని అనిపిస్తుంది అతని వ్యవహార శైలి చూస్తుంటే!   డిల్లీ రాష్ట్ర ఎన్నికలలో ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వక పోవడం ఒక గందరగోళ పరిస్తితిని సృష్టిస్తుంది . తాము కేజ్రీవాల్ కి మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ అంటుంటుటే , తాము అటు కాంగ్రెస్ , ఇటు B.J.P  లకు సమాన దూరం లో ఉంటామని ఆంఆద్మీ పార్టీ అదినేత కేజ్రీవాల్ అంటున్నారు. ఈ దోరణీ గమనించి తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా లేమని అతి పెద్ద పార్టిగా ఆవిర్భవించిన B.J.P  అంటుంది. అంటే గవర్నర్ పాలన లో డిల్లీ ఉండబోతుందబ్న్న మాట! మరి డిల్లీ ప్రజలు...

కుహానా లౌకిక వాదాన్ని కూల్చివేస్తున్న భారతీయ యువత !

                                                    ఈ రోజు వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల పలితాలు సరళీ గమనిస్తుంటే ఒక విషయం  సష్టమవుతుంది. అబద్దాలతో అందరిని ఎల్లకాలం మోసం చెయ్యలేరు. అలాగే ఇన్నాళ్లు మత వాద పార్టీ అని ముద్ర వేసి B.J.P  ని కుహానా లౌకిక వాద కాంగ్రెస్ పార్టీ ప్రజలను మబ్య పెట్టి తన పబ్బం గడుపుకుంటూ  వచ్చింది. కానీ అసలు లౌకిక వాదం అంటే నీ,నా అనే బేద భావం లేకుండా అన్ని వర్గాల ప్రజలను దోపిడి చెయ్యడమే అనే ఒక కొత్త అర్దాన్ని అధికార కాంగ్రెస్ చెప్పింది. ఇన్నాళ్ళు ఈ   పార్టీ  ఆడింది ఆటగా , పాడింది పాటగా సాగటానికి కారణం కాంగ్రెస్కి సాంప్రాదాయంగా ఉన్న ఓటు బాంక్ . స్వాంతత్ర్యోద్యమం లో ఆ పార్టీ చేసిన కృషి తాలూకు పలితాన్ని నెహ్రూ కుటుంబం ఇన్నాళ్ళు అనుభవిస్తూ వస్తుంది. వృద్ద తరం లో ఆ పార్టీ పట్ల ఉన్నఅభిమానం  , నెహ్రూ కుటుంబం పట్ల ఆరాధనా బావం గా గా మారి ఆ కుటుంభ వారసులనే డిల్లీ గద్దె పైన కోర్చొబెడుతో వస్తున్నారు. ...

కోట్ల మంది ప్రజల కోరికను కాదని , అసద్దుద్దిన్ గారి కోరికను తీర్చు తుందా పిరోజ్ గాందీ గారి కోడలు!?

                                                             ఎంకి పెండ్లి సుబ్బి చావు కొచ్చిందట. అలా ఉంది ఈ  పిరోజ్ గాందీ గారో కోడలు వ్యవహరం. ఆవిడ గారీ పుట్టిన రోజు బహుమతిగా తెలంగాణా ఇచ్చేద్దామనే తలంపుతోనే హడావుడిగా అంత పెద్ద వ్యవహారాన్ని కూడా  ఒక "టేబుల్ ఐటం " గా మార్చివేసి కూరలు పంపకం లాగా పంచి వెస్తుంది.   అసలు రాయల తెలంగాణా ఎవరు అడిగారు? మొదట్నుంచి ఈ  ప్రతిపాదన చేస్తూ వచ్చింది హైద్రాబాద్లో తప్పా మరెక్కడా లేని MIM  పార్టీ అద్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ . ఆ తర్వాత ఈ  ప్రతిపాదన  తమ ప్రాంతానికి లాభిస్తుందని సీమ లోని కర్నూల్, అనంతపురం నాయకులు 2 వ ఆప్షన్ గా డిమాండ్ చెయ్యడం ప్రారం బించారు. ఇక కేంద్రం లోని కోంతమంది పెద్దలు అయితే , ఎవరు రాష్ట్ర విబజన గురించి ...