Posts

Showing posts from November, 2013

N.T.R గారి జీవిత చరిత్ర రచన కు బయపడే K.C.R. గారి జీవిత చరిత్ర అయన కుమార్తె రాయాలనుకుంటుందా!?

                                                               ఎవరైనా  పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనిషి గురించి జీవిత చరిత్ర రాస్తాను అనుమతించండి అని ఎవరైనా స్త్రీలు అంటే అనుమానంగా చూడాల్సిన పరిస్తితి  ఉందంటే ఆశ్చర్యం లేదు . అంతే కాదు టక్కున N.T.R  గారు  గుర్తుకు వస్తారు. కారణం  అయన జీవిత చరిత్ర రాస్తాను అని వచ్చిన ఒక మహిళ అయన జీవిత చరిత్రనే మార్చి వేసింది.ఆయనకే ఏకంగా బార్య అయింది. హిందూ జీవన విదాననికి కంకణ బద్దుడైన అయన , విది  లేని పరిస్తితుల్లో మూడవ దశ అయిన వాన ప్రస్తం నుండి రెండవ దశ అయిన "గ్రుహస్తం" లోకి రావాల్సి వచ్చింది. దాని తాలూకు ఎఫెక్టు అయన చనిపోయినా , అయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. అటు కుటుంబపరం గానే కాక ఇటు రాజకీయ పరంగా కూడా , N.T.R...

సచ్చినోడికి ..... చావు తెలివి ఎక్కువే!

                                                       అతనొక క్రైం రిపోర్టర్. క్రైం వార్తలు సేకరించి, సేకరించి ఈ  సమాజం లో క్రిమినల్స్ నేరాలు చేసి కూడా  చట్టానికి దొరకకుండా ఘరానా పెద్దమనుషులుగా ఎలా బ్రతకవచ్చో అవగతం చేసుకున్నాడు. అంతే ! చేస్తున్న రిపోర్టర్ పని మాని వేసి రెయల్టర్ అవతార మెట్టాడు. ప్రజల్ని వంచించి కోట్లు కూడబెట్టాడు . ప్రజలు అతని గురించి తెలుసుకోని కేసులు పెట్టేసరికి , ఆటను ఒక నీటి ప్రమాదంలో కొట్టుకుని పోయాడు . ఆ తర్వాత రెండేళ్ళకు మొన్న దివి నుంచి ఊడి పడినట్లు, విజయవాడలో ప్రత్యక్షమయ్యే సరికి , అతనిని గమనించిన బాదితులు పట్టుకుని పోలీసులకు అప్ప చెప్పారు. ఇప్పుడు అతన్ని విజయావాడ కోర్టు పోలిస్ కస్టడికి ఇచ్చింది. రేపట్నుంచి అయ్యగారి నుంచి,  పోలిసులు అసలు ఏమి జరిగిందో తెలుసుకోబోతున్నారు. కళ్ళు బైర్లు కమ్మే ఈ  క్రిమినల్ ఏ ప్లాన్ తో అటు ప్రజలను ఇటు పోలీసులను బురిడీ కొట్టించాడో చూడండి     అతని పేరు నార్...

"మద్యం తాగుదాం , తాగి అన్నీ చేద్దాం పద" అన్నాడట! ఏమిచేయలెదని క్షమాపణ చెపితే వదిలేశారట!

Image
                                                        మన దేశం లో "నిర్భయ"  నిభందనలు వచ్చాక కూడా , రాకముందు చట్టం  ఎలా ఉందో , ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నారు కాబోలు కొంతమంది అధికారులు. అందుకే మొన్న పనాజీలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఒక డిప్యూటి డైరెక్టర్ గారు తానూ చేసిన సిగ్గుమాలిన పనికి క్షమాపణ లాంటిది  చెపితే ,O.K  అని కేసు క్లోజ్ అన్నారట! వివరాల్లోకి వెళితే :-    మొన్నీ మద్య గోవా లోని పనాజీలో జరిగిన అంతర్జాతీయ చలన చితోత్సవం లో ప్రోగ్రామర్  గా  పనిచెయ్యటానికి డిల్లీ J.N.T.U  కు చెందిన విద్యార్దిని  నియమితురాలైంది. ఆ అమ్మాయి ని ఒక డిప్యూటి డైరెక్టర్ గారు పని ఉంది రమ్మని తన కాబిన్ కి పిలిచాడట. ఏదో పని ఉందేమో కదా అని ఆ అమ్మాయి అక్కడికి వెళితే , " రా, రా, మద్యం తాగుదాం , అని  ఆఫర్ చేసాడట! దానికి ఆ అమ్మాయి ఇబ్బందిగా పిల్ అవుతుంటే , "తాగుదాం, తాగిన తర్వాత అన్నీ చేదాం " అని...

"భారత రత్న" ఇచ్చి మరీ ఇడియట్స్ అయిపోయారు.

                                                           శ్రీ చింతామని నాగేశ రామచంద్ర రావు గారు. భారతీయ శాస్త్రవేత్త .బారత ప్రధాని శాస్త్ర విజ్ణాన  సలహాదారు సంఘం కి అదిపతి. ఆయనగారు రసాయన శాస్త్రం లో చేసిన కృషికి మెచ్చి, భారత ప్రభుత్వం ఆయనకి మొన్న "క్రికెట్ దిగ్గజం" సచిన్ టెండుల్కర్ గారితో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన "భారత రత్న" బిరుదు ప్రదానం చేసి గౌరవించింది. దీనికి జాతి యావత్తు హర్ష్ంచింది. కానీ తనకు ఎవరైతే" భారత రత్న"  ఇచ్చి గౌరవించారో , అట్టి రాజకీయ నాయకుల ను అయన గారు తెల్లారే "ఇడియట్స్" అనే మకుటం తో గౌరవించి , వారి పట్ల తనకున్న కసినంతా తీర్చుకున్నారు. ఇది నిజంగా విచారించవలసిన విషయం.    ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు అధిపతులుగా వారి పర్యవేక్షణ లో నడిచేది. రావుగారు సాక్షాత్తు ప్రధాన మంత్రి గారి శాస్త్ర విజ్ణాన సలహాదారు సంఘం కి హెడ్ . ఆయనగారికి ప్రధాన మంత్రి గారితో ఎంతో సన్నిహిత సంబందాలు ఉంటాయి. ఒక వేళ సైన...

జాతికి ద్రోహం చేసిన వాడికి జాతీయ స్తాయిలో "ఉత్తముడు " అవార్డా!?

                                                                                                               మాతృదేవో భవ! పితృదేవో భవ! ఆచార్య దేవో భవ!  అన్నారు పెద్దలు. అంటే ప్రతివారికి కనిపించే దేవతలు వరుసగా తల్లి,తండ్రి, గురువు. ఈ  విదంగా కనిపెంచిన తల్లి తండ్రులుతో పాటు విద్యాబుద్దులు నేర్పి మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన గురువును దేవుడుగా బావించటం మన సాంప్రదాయక విదానం. అటువంటి గురువులలో ఉత్తములైన వారిని జిల్లా , రాష్ట్ర ,జాతీయా స్తాయిలో గుర్తించి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు "ఉత్తమ ఉపాద్యాయుడు " బిరుదులను ప్రదానం చేస్తుంటాయి. జాతీయ స్తాయిలో ఈ  అ...

పాపి కొండలు యాత్రను "రంకు టూరిజం" గా మార్చిన రాజమండ్రి బోట్ ఆపరేటర్లను నిరోదించలేని సీమాంద్రులకు "భద్రాచలం " కోరే నైతిక అర్హత ఉందా?

Image
                                                                                                                           భద్రాచలం పరమ పుణ్య గోదావరీ తీర దామం. అక్కడికి భక్తులు రోజూ  వేల మంది వస్తుంటారు. అక్కడికి వచ్చే వారందరికి ఒకటే బావం . అలౌకిక ఆద్యాత్మిక బావం. దండకారణ్య పచ్చని ప్రకృతి ఒడిలో విలసిల్లిన భద్రాచల  క్షేత్రం  భక్తులకు ఆద్యాత్మికతో కూడిన ఆహ్లాద బావనలు కల్గించ...

అత్యాచారాన్నీ ఆపలేకపోతే ఆనందించేయి ! అవినీతిని ఆపలేకపొతే అందలం ఎక్కించేయి !

                                                    రాజనీతి శాస్త్రం లో ఒక వాదం ఉంది . దాని పేరే ఉపయోగితా వాదం లేదా "అత్యంత ఆనంద మయ " వాదం . దీనిని ఆంగ్ల రాజనీతిజ్ణుడు అయిన "బెందాం " అనే అయన ప్రతి పాదించాడు. అయన ద్రుష్టిలో సహజ న్యాయాలు , సహజ హక్కులు అనేవి పనికి రానివి. ఏ విషయాన్ని అయినా అది కలిగించే ఆనందం , బాదల స్తాయి ద్వారానే అంచనా వేసి నిర్దారించాలంటాడు. దాని ప్రకారమే చట్ట సవరణలు కావాలన్నాడు. దీనికి ఒక ఉదాహరణ చూదాం .                    ఒక వ్యక్తీ వేరే వ్యక్తీ అంగీకారం లేకుండా బలవంతంగా  అతని నోట్లో స్వీట్ పెట్టాడనుకోండి . దాని వలన ఆ స్విట్ తిన్న వ్యక్తికి  షుగర్ వ్యాది లేనపుడు ఏమి నష్టం? ఒక మధుర పదార్దం ఆస్వాదించడం అనేదేగా జరిగింది! మరి దీనికి ఆ స...

పనుల కోసం "లాడ్జ్ రూం " లకు వెళ్ళే స్త్రీల పట్ల సుప్రీం కోర్ట్ జడ్జి లకైన "అదే బావం" ఉంటుందని తెలియ చేస్తున్న "స్టెల్లా జేమ్స్ " గారి స్వీయ అనుభవం

                                                       ఈ  ఉదంతం లో  నిజమెంతో , అబద్దమెంతో మనకు తెలియదు. ఆరోపణలు చేసింది ఇటీవలే న్యాయవాద పట్టా  తీసుకుని సుప్రీం కోర్టులో ప్రాక్టిస్ మొదలెట్టిన మహిళా న్యాయవాది స్టెల్లా జేమ్స్ అనే ఆవిడ. ఆరోపణలు చేయబడిన వ్యక్తీ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి . అందుకే దీనికి పెద్ద పబ్లిసిటి వచ్చింది. ఇక వివరాలు లోకి వెళితే:-   స్టెల్లా జేమ్స్ గారు గత ఏడాది న్యాయ విద్య ఆఖరు సంత్సరం చదువుతూ , కోర్సులో బాగంగా ఒక సుప్రీం కోర్టు జుడ్జ్ గారి దగ్గర 6 నెలలు శిక్షణ తీసుకున్నదట. పోయిన డిసెంబర్ 24 వ తారీకున డిల్లీ లో నిర్భయ ఆందోళనలు జరుగుతున్న వేళ, ఆవిడగారు అయన గారు బస చేసిన హోటల్ రూం  కి వెల్లిందట . రూం  కి వెళ్ళటానికి ఆమె చెపుతున్న కారణం, నిర్భయ కేసులో సదరు జడ్జ్ గారి సహ...

నా తెలంగాణా , భద్రాచలం ,మునగాల గాయాల వీణా !

                                                    నా తెలంగాణా కోటి రత్నాల వీణ ! అన్నారు దాశరదీ . ఆ మకుటం మీద ఎంతో మంది కవితలు అల్లారు. పద్యాలు పాడారు. చివరకు మన బ్లాగర్లు కూడా ఆ పేరుతొ  బ్లాగులు ఓపెన్ చేసి తమ పద్య పాటవాన్ని ప్రదర్సిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ  మద్య  ఆంటొణి కమిటీ సోనియమ్మకు సమర్పించిన నివేదిక కానీ , సీమాంద్ర కేంద్ర మంత్రుల కోరికల చిట్టా కానీ , చివరకు సమైఖ్య వాది  ముఖ్యమంత్రి గారు పంపిన రాష్ట్ర నివేదిక కానీ తెలియ చేసేది ఏమిటంటే ,ఖమ్మం జిల్లాలోని భద్రాచలం , నూగుర్ మండలాలు, నల్గొండ జిల్లాలోని మునగాల మండలం గ్రామాలు కేవలం పరిపాలనా సౌలబ్యం కొరకు 1956 తర్వాత తెలంగాణా ప్రాంతాలలో కలిపారు కాబట్టి , గతం లో తెలంగాణా వారు కోరుకుంది కూడా  1956 ముందు తెలంగానే కాబట్టి , రూలు ప్రకారం ఆ ప్రాంతాలను సీమంద్ర లో కలపాల్సి ఉంటుంది అని .    ఇదే జరిగితే తెలంగాణా తల్లికి కి రెండు పెద్ద గాయాలు అవటం ఖాయం. ఒకటి ఖమ్మం జిల్...

టి.వి. రాములమ్మ, తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ లు తప్పా , తెలంగాణా వారికి మిగిలేది ఏమి లేనట్లుంది!

                                                           ఈ  మద్య తెలంగాణా కాంగ్రెస్ వారు తెలంగాణా వచ్చేసిందని సోనీయమ్మను కీర్తిస్తూ ఉరూరా సంబురాలు చేసుకుంటునారు. వారి ప్రదాన ఉద్దేశ్యం తెలంగాణా వచ్చిందని చాటడం కాదు, తెలంగాణ ఇచ్చింది తమ నాయకురాలు సోనియా గాందీ యే తప్పా అందులో T.R.S  వారి ఘనత ఏమి లేదని చెప్పడమే. సరే బాగానే ఉంది. తెలంగాణా ఇచ్చింది ఎవరు , తెచ్చింది ఎవరు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు 2014 లో తేలుస్తారు కానీ, అసలు పదేళ్ళు పైనా పోరాడి సాదించమంటున్న "తెలంగాణా రాష్ట్రం " వలన తెలంగాణా ప్రజలకు ఎక్కువ లాభిస్తుందా? సీమాంద్రా ప్రజలకు ఎక్కువ లాభిస్తుందా ఒక సారీ చూదాం .      నిన్న మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాటన్నారు      " తెలంగాణ రాష్ట్రం " ఏర్పాటు వలన సీమాంద్రుల కంటే తెలంగాణ వారే ఎక్కువ నష్టపోతారు". అలాగే డిల్లీలో దిగ్విజయ్ సింగ్ గారు కూడా  ఒక విలువైన మాట చెప్పారు...

నాగు పాము మహిమలను స్వయంగా వీక్షించిన మా తల్ల్లి తండ్రులు

Image
                                                                                                                    నాగు పాములకు ఎటువంటి విశిశ్టతలు ఉండవు, అది ఒక విష జీవి అంటారు. ఒక వేళ నేను ఎప్పుడూ అబద్దం ఆడటం ఎరుగని మా తల్లితండ్రుల ద్వారా వారి స్వానుభవాలు విని ఉండక పోతే నేను అలాగే అనుకుని ఉండేవాడినేమో! ఏది ఏమైనా నాగు పాములు కి మన తెలుగు జాతికి ఒక అవినాబావ సంబందం ఉంది. మనం   నాగజాతికి చెందిన వారం అని చెపుతారు. అలాగే మన దేవదేవుల్లైన విష్ణువు, శివుడు ఇద్దరికీ నాగ దేవత, ఆదిశేషుడు ఎప్పుడూ  అంటిపెట్టుకుని ఉంటూ ఆరాద్య దైవలలో ఒక రయ్యారు. అందుకే తెలి...

బాయ్ ఫ్రెండ్ తో కలసి ఎగిరే "తారాజువ్వలు" చూద్దామని ఏకాంతానికి వెళితే , అక్కడున్న కీచకులు "చుక్కలు" చూపించబోయారట!

                                                         మళ్లి  అలాంటి  సంఘటనే హైదరాబాద్ లో జరిగింది. కాకపొతే ఇందులో మృగాళ్ళ పాత్ర దారులు దేశాన్ని రక్షించాల్సిన సైనికులు . వాళ్లకి రోజూ  క్రమశిక్షణ తో కూడిన సైనిక వ్యాయామం తో పాటు , నిబందనలు ఉంటాయి. వాటిని ఉల్లంఘిoస్తే కఠిన శిక్షలూ ఉంటాయి. అయినా సరే కట్టు తప్పారు . బాయ్ఫ్రెండ్ తో ఏకాంతం లో ఉన్న ఆ అమ్మాయిని పట్టుకుని అత్యాచారం చేయ బోయారట. చివరకు "నిర్భయ" చట్టం క్రింద బుక్కయారు.    వివరం గా విషయO  ఏమిటంటే ఆ అమ్మాయి వయసు పదిహేడేళ్ళు. ఇంటర్ చదువుతుంది. దీపావళి రోజున అందరు ఆనందంగా పండగ చేసుకునే సమయం లో ఈమెకు బాయ్ ప్రెండ్ తో కలసి గుడి కి వెలదామనిపించిందట. సరే డిగ్రీ చదువుతున్న అతనితో కల్సి మహేంద్ర గిరి లోని సాయి బాబా గుడికి వెల్లింది. ఆ బాబాకి మొక్కి ఆశీ ర్వాదాలు పొందాక , అప్పటికే రాత్రి అయి నగరం అంతా "బాణా సంచాలు" కాలుస్తున్నట్లుంది , తారాజువ్వలు వెలుగులు జిమ్ముత...

మా బ్లాగు మిత్రులకు, వీక్షకులకు,అగ్రిగ్రేటర్లకు దీపావళి శుభాకాంక్షలు తో ........... manavu

Image
                                                                      మా బ్లాగు మిత్రులకు, వీక్షకులకు,అగ్రిగ్రేటర్లకు  దీపావళి  శుభాకాంక్షలు తో   ...........  manavu

'ఆవు' నీదేరా అబ్బాయి! పాలలో సగం వాటా మటుకు నీ సీమాంద్రా అన్న కే!

                                                                                                                               ఏదైన ఒక ఆస్తిని పొందుతున్నపుడు దానీ మీద సర్వ హక్కులతో బదిలీ అయితేనే అ ఆస్తికి యజమానీ అని చెప్పుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆస్తి బదలాయింపులు పత్రాలలో ఆ మేరకు రాయటం జరుగుతుంది . కానీ కొన్ని సందర్బాలలో అన్నదమ్ముల ఆస్తుల పంపకాలలో కానీ, ప్రెస్క్రిప్షన్ రైట్స్ పొరుగువారికి ఉన్న ఆస్తులలో కానీ , ఆస్తి మీద యాజమాన్య హక్కు ఒకరిదైతే , దాని మీద కోంత  అనుభవ హక్కులు వేరే వారిక ఉంటాయి. ఉద...