మనకు కావల్సింది "కుల సోషలిజమా?లేక వర్గ సో(శో)షలిజమా?
మన దేశంలో కుల నిర్మూలన జరగాలని కలలు కన్న వారు కను మరుగై పోయారు.మన బారత రాజ్యాంగ నిర్మాతలు, కుల రహిత, మత రహిత వ్యవస్తను నిర్మించాలన్న అవేశంతో వాస్తవాలను మరచి, ఆదర్శ రాజ్యాంగం నిర్మిస్తే, అది ఆదర్శంగానే అధికార కాకి లెక్కలకు పరిమితమై, సోషలిజం వస్తుందని కలలు కంటే అది "శోష" లిజం గా మారి పోయింది. కుల వ్రుత్తులకు పేటెంట్ హక్కులు లేకపోవడం వలన, ఎదుటివారి లాబసాటి కుల వ్రుత్తులనబడేవాటినైతే స్వీకరించారు కాని, ఎదుటివాడి కులాన్ని మాత్రం స్వికరించలేక పోయారు.ఇంతకంటే పచ్చి అవకాశ వాదం ఎక్కడైనా ఉంటుందా? నిజానికి వ్రుత్తులను బట్టే కులాలు ఏర్పడ్డాయి. అసలు వ్రుత్తే చెయ్యనపుడు ఇంకా కులం అనేది ఎక్కడ ఉంటుంది? కాని ఉంది! ఎందుకంటే కులం అనే దానిని వ్రుత్...