Posts

Showing posts from June, 2017

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

Image
                                       ప్రపంచం లో వెల్లివిరుస్తున్న  మై చాయిస్ కల్చర్ లో భాగం అయినటువంటి "సింగిల్ పేరెంట్ " సిస్టం ఇండియాలో  కూడా వ్యాప్తి చెందుతుంది అనడానికి  ఉదాహరణ  నటుడు తుషార్ కపూర్ తండ్రి అయిన  విధానం . సింగిల్ పేరెంట్ విధానం అంటే పుట్టిన పిల్ల లేక పిల్లవాడికి  తల్లితండ్రులు ఉండరు. తల్లి లేక తండ్రి మాత్రమే ఉంటారు. ఇదెలా అంటే పెండ్లి అంటే ఇష్టం లేని వారు, అపోజిట్ సెక్స్ మీద ఇంట్రస్ట్ లేనివారు , లెస్బియన్, గే సంబంధాలు పట్ల అనురక్తి కలవారు , తమలో సహజంగా కలిగే సంతాన వాంఛా , తద్వారా వంశాభివృద్ధి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి , ఆధునిక వైద్య శాస్త్రం అందించే సర్రోగసి లాంటి విధానాలు ను పాటించి  తల్లి లేక తండ్రిగా తమ పిల్లలను ఈ భూమి మీదకు తీసుకువస్తున్నారు. అలా సర్రోగసి విధానం ద్వారానే తనకు కొడుకు పుట్టాడని సంతోషంగా ట్విట్టర్ లో ప్రకటించాడు నటుడు నిర్మాత అయినా తుషార్ కపూర్ అనే బాలీవుడ్ నట...

బుర్ర లేని అధికారులను బోరు బావి ఆపరేషన్ కు పంపితే , 40 అడుగుల్లో ఉన్న చిన్నారిని 260 అడుగులకు పంపి చంపారట !!

Image
                                                                         తెలంగాణా రాష్ట్రం లోని రైతులకు తమ పొలాల్లో వేసుకున్న బోరు బావులు వ్యవసాయానికి   కావాల్సిన నీళ్లు ఇచ్చేవి కొన్ని అయితే , రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేవి మరి కొన్ని. అందులో చిన్నారి రైతు బిడ్డలను తమ పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ రైతు కుటుంబాలు వారు పడే బాధ వర్ణనాతీతం. అదేమీ మాయో కానీ , బోరు బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల్లో ఎక్కువ శాతం గిరిజన  బిడ్డలే కావడం విచారించ దగిన విషయం.            మన శ్రీ హరి కోట నుంచి మన శాస్త్రజ్ఞులు అంతరిక్షం లోకి ఏక కాలం లో అనేక ఉపగ్రహాలను , ఎన్నో వేల  కిలోమీటర్లు దూరం లో ఉన్న నిర్ణిత కక్ష్యలలో  విజయవంతంగా ప్రవేశపెడుతూ  విదేశీయులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటె " ఔరా మన శాస్త్రజ్ఞులు ఇంతటి ప్రతిభావంతులా " అని సంభ్రమాశ్చా...

ప్రార్దనలతో పాతీకేళ్ల కొడుకుని పొట్టన పెట్టుకున్న ప్రధానోపాద్యాయురాలు!

Image
                                                                                            ఈ దేశం లో ప్రార్దనలు చేసి రోగాలు నయం చేయవచ్చు అని పబ్లిక్ గా ప్రచరాలు చేస్తూ, తమ గెంతులతో ప్రజలను పిచ్చివాల్లను చేస్తున్నవారిని ఏ విజ్ణానులు కానీ వారి వేదికలు కానీ ఏమి అనరు. అనరూ అనేకంటే అనే దమ్ము వారికి లేదు అనటమే కరెక్ట్. అదే ఏ బత్తిన సోదరులో ఇచ్చే నిరాపాయకరమైన చేప మందు ప్రసాదాలు ఇంతవరకు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని రుజువవుతున్నా, కోడిగుడ్డులకు ఈకలు పీకే సోదనలు చేసి కోర్టులవరకు వెళ్ళి నానా యాగీ చేస్తూ బోల్డంతా ఫ్రచారం పొందటం లో చూపించిన శ్రద్దలో పదవ వంతు అయినా, ఈ ప్రార్ధనా వైద్య చికిస్తకుల మీద పె...

"హలాల్" లో ఆరోగ్య కారణాలు ఉన్నయో లేవో కాని , "ఆదిత్య నమస్కారం " లలో మాత్రం బోల్డన్ని ఉన్నాయి !

Image
                                                                                                                   జూన్ 21 తేదిని ప్రపంచ యోగ డే గా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం, అందుకు అనుగుణంగా ప్రపంచం లోని అనేక జాతులు, మతాలూ , వర్గాలుకు చెందిన ప్రజలు "యోగ " గురించి, అరోగ్య పరంగా దానికిఉన్న విశిష్టత గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికి  అవగాహన కలిగించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందించవలసిన విషయం. ముక్యంగా భారతీయులైన మనకు చాలా గర్వకారణం . దీనికి ప్రదాన కారణాలు రెండు (1). యోగ అనే ఆరోగ్య ప్రక్రియ కు భారత దేశం పుట్టినిల్లు కావడం . (2). "యోగ " కోసం సంవత్సరం లో జూన్ 21  ని  యోగ డే గా  ప్రకటించడానికి , మన దేశ ప్రదాని గారు ఐక్య రాజ్య సమితిని ఒప్పి...

ఎవడితోనో లేచిపోయిన పెళ్ళాన్ని ,పట్టుకువచ్చి అప్పచెప్పమని "హెబియస్ కార్పస్ " పిటిషనా!! ? హతవిదీ !

Image
                                                                                               మగాళ్ళ విషయం లో కాలం తిరగబడినట్లే ఉంది . మొన్నటిదాకా, ఇంటికాడ కట్టుకున్నది ఎదురుచూస్తుంటే ఆమెను కాదని ,ప్రియురాలి ఇంటిదగ్గర ఉండిపోయిన రసిక పురుషులను బ్రతిమాలో ,బెదిరించో ఇంటికి తీసుకు వచ్చుకోవడానికి, గుట్టుగా సంసారం చేసుకునే స్త్రీలు నానా యాతనలు పడేవారు . ఇల్లాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తూ ,వెలయాల్లు తో గడపడం గొప్ప మగతనం గా బావించే నీచ సంస్క్రుతి మన సమాజంలో ఉంది .దానికి కారణం లైంగిక స్వేచ్చ విషయం లోస్త్రీలకు అమలు చేసిన  కట్టు బాట్లు  పురుషులు కు అమలు చేయడం లో ఉదాసీనత వహించడమే . ఏమి చేసినా ఆడది పడి ఉంటుందిలె అన్న పురుష అహంకారం ఒకవైపు , ఎంత మంది స్త్రీలతో సంబందం కలిగి ఉంటే అంత గొప్ప మగాడిగా సమాజం గుర్తించడం మరొక వైపు ,కొంత మంది పుర...

మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!

Image
                                                              నిన్న ఈ  బ్లాగులో ఒక మళయాళీ నటి మణీ  ప్రవర్తన  గురించి విశ్లేషిస్తూ, "దేనినైనా అమ్ముకొవాడానికి సిద్దపడే వ్యక్తులకు, అలాగే దేనినైన సంచలనం చేసి నిరంతరం వార్తల్లో వ్యక్తులు గా ఉండాలనుకునే వారికి కొంచం దూరంగా ఉంటే మంచిది . వారు చెప్పేదాంట్లో నిజమెంత ఉంటుంది అనేది సందేహమే " అని చెప్పటం జరిగింది. నేను ఊహించి చెప్పినది కరక్టే అని తెల్లారే పాటికి తెలిసి పోయింది.    కేరళకు చెందిన ఒక M.P  గారి మీద మళయాళ  సెన్సేషనల్ నటి , "శ్వేతా మీనన్" ఒక బాంబు పేల్చింది . అదేమిటంటే సదరు 73 సంవత్సారాల వయసున్న M.P గారు ,ఒక పంక్షన్ సందర్బంగా , తనను కావాలని తగులుతూ అసబ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దానిక్ రుజ...

ప్రియురాలు "బొడ్డుని" సైన్స్ ద్రుష్టితో చూస్తారా? సోషల్ ద్రుష్టి తో చూస్తారా?

Image
                                                                                                               నెను నిన్న ఒక పెపర్లో చూశాను, మనిషి బొడ్డు కొన్ని వేల సూక్ష్మ జీవుల స్తావరమ్ అని.అది చూసాక నాకొకటి అనిపించింది  పాపం ఇన్నాల్లు మన "రాఘవేంద్రరావు" గారు  ఈ "ట్రేడ్ మార్క్" తొనే కుర్ర కారుని ఉర్రూతలూగించారు కదా! కేవలం ఆ స్పాట్ చూసే స్పందించే ప్రియుల పరిస్తితి ఏమిటి? ఇదంతా నాకెందుకు అంటే నా టపాలకు అప్పుడప్పుడు సైన్స్ జ్ణానులు అడ్డం తగిలి ఎప్పూడూ "సైన్స్ నే చెప్పుము" అని ప్రబోదిస్తుంటారు.నాకొక చిన్న డౌట్ ఏమిటంటే సైన్స్ జ్ణానులు, ప్రియు...

మనం తినే తిండి, కట్టే బట్టా శాస్త్రీయం కానప్పుడు, " చేప మందు" శాస్త్రీయత గూర్చి "గోల" ఏల "శాస్త్రులూ"

Image
                                 కొంత మంది శాస్త్రులు(సైన్స్ విజ్ణానులు అని చెప్పుకునే వారు), పబ్లిసిటీ కోసమో, లేక వెనుక ఎవరి ప్రోత్సాహా ప్రోద్బలమో తెలియదు కాని, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందానా వ్యవహరిస్తుంటారు.  బారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తాము నమ్మిన మతం ని ఆచరించుకునే హక్కు ఇచ్చింది. ఇటువంటి మతపరమైన కార్యక్రమాలు మనిషి ఆరోగ్యానికి కాని, సమాజ బద్రతకు కాని బంగం వాటిల్లనంత వరకు నిర్వహించుకోవచ్చు. అలాంటి మత పరమైన నమ్మికతో కూడినదే హైద్రాబాద్ బత్తిన గౌడ్ సోదరులు నిర్వహిస్తున్న "చేప  ప్రసాదo" పంపీణీ కార్యక్రమం.   ఈ కార్యక్రమం సుమారు నూటా అరవై సంవత్సారులుగా తమ కుటుంబ సబ్యులు నిర్వహిస్తున్నారని గౌడ్ సోదరులు చెపుతున్నారు. వారి తాత గారికి ఒక సాదువు చెప్పిన చేప మందు విదానం ఆస్త్మా(ఉబ్బస వ్యాది) ని నియంత్రిస్తుందని , కాబట్టి ప్రజలకు మ్రుగశిర కార్తే రోజున "చేప  ప్రసాదాన్ని," ఉచితంగా పంపీణీ చేస్తున్నామని బత్తిన సోదరులు చెపుతున్నారు. అలాగే వివిద ప్రాంతాల నుండి అనేక వేల మంద...

"పనోడు పందిరి వేస్తె , పిచ్చుకలు ఎక్కి పడేసినట్లు" అయింది ఆంధ్రా అసెంబ్లీ నిర్మాణం !!!

Image
                                                                                                                            3  నెలల్లో నవ్యాంధ్ర అసెంబ్లీ నిర్మాణం పూర్తీ చేసి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు అమరావతి లో జరిపి తీరుతాం . !         ఇది అమరావతి సాక్షిగా తెలుగు దేశం  నేతలు  తీసుకున్న వజ్ర సంకల్పం . అందుకు అనుగుణంగానే స్పీకర్ గారు దగ్గరుండి కాంట్రాక్టర్ లని గదమాయించి పని చేయించినట్లు ఉంది, అనుకున్న కొద్దీ నెలల కాలం లోనే సుందరమైన పర్మనెంట్ అసెంబ్లీని పోలిన తాత్కాలిక అసెంబ్లీ తయారు అవ్వడం, అందులోనే తమ అసెంబ్లీ సెషన్స్ నిర్వహించుకుని , తమ అభీష్టం నెరవేరింది అన్న ఆనందం లో తెలుగు తమ్ముళ్లు తెలియాడటం జరిగి పోయింది.     ...

విగ్రహాన్ని పడి పడి ముద్దులు పెట్టుకుంటున్న ఈ ముస్లిం లు విగ్రహారాధకులు కారా ?!!

Image
                                               కొంతకాలంగా భారత దేశం లో ఒక ప్లాన్  ప్రకారం  విదేశీ మత విధానాలు మరియు వారి ఆరాధన పద్ధతులు పట్ల స్వదేశీ హిందువులను ఆకర్షించి చివరకు హిందుస్తాన్ ని "ఇస్లానిక్ స్టేట్ " గా మార్చాలనే దురుద్దేశ్యం తో , హిందూ జీవన విధానం లో ముఖ్యమైన "విగ్రహారాధన " గురించి  అనేక  దుష్ప్రచారాలు ను వివిధ రూపాల లో చేయటం మొదలు పెట్టారు. అందుకు "బ్లాగు " లు కూడా అతీతం కాదు. అలాంటి వారి ప్రచారాలకు వ్యతిరేకంగా నేను ఇదివరకు ఇదే బ్లాగులో కొన్ని టపాలు ప్రచురించడం జరిగినది. అవి (1). "విగ్రహం" లో ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకోలేని వారు జ్ఞానులా ?  (2) విగ్రహారాదన"లో కొంత సైన్స్ ఉంది ! దానిని వ్యతిరేకించే వారిలో ఏముంది....?           విగ్రహారాధనను పని కట్టుకుని విమర్శించే వారి వాదనలు ప్రకారం ముస్లిం లు ,విగ్రాహారాధనను అస్సలు ఒప్పుకోరని, విగ్రాహారాధన చేసే వారు సైతానులు అన...

బాహ్య సౌందర్యం అంతా బజార్లో అమ్మేసి, ఆత్మ సౌందర్యం తో అమ్మను అయ్యాను అంటున్న "సోఫియా హయత్" !!

Image
                                                                                                                    "సారంగ నాయకి " లను చూసి సంసారులు తలలు దించుకునే కాలం ఇది. ఎందుకంటె తెగిడిచి బజారు వేషాలు వేసే వారి కున్న హంగూ , ఆర్బాటం , గుట్టుగా సంసారం చేసుకునే వారికుండవు గదా! అందుకే "రంగ నాయకి " లు ఏమి చేసినా , ఏదీ మాట్లాడినా చెల్లు బాటు కావాల్సిందే . మొన్న ఆవిడా గారెవరో రంజిత అనే నటీమణి , సెన్సేషనల్ గురువు నిత్యానందతో కలసి ఉన్న పొటోలు బహిర్గత మయ్యాక , "ఇంక నాకేమిటి సిగ్గు " అని ఏకంగా " మాతా ఆనందమయి " గా మారి పోయి , స్వామీజీ తో కలసి స్రీ కాళహస్తి లో చక్కెరలు కొడుతుంటే వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి అధికారులు నానా హైరానా పడ్డారట. దీనికి కారణం వారికున్నడబ్బూ , దర్పం తో పాటు వెనకున్న అజ్ఞాత...

మత మార్పిడి అంటే, ఎడారిలో ఉన్నవాడు ఓడ ఎక్కినట్టు!...

Image
                                                                     మత స్వేచ్చ అనేది భారతీయుల ప్రాదమిక హక్కులో ఒకటి. కాబట్టి పలానా మతంలో ఉండు, అని బలవంతం చేసే అధికారం ఎవరికి లేక పొయినప్పట్టికి, అసలు ఉన్న మతాని కాదని కొత్త మతం స్వీకరించాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించుకోవడం మంచిది.ఎక్కువ మంది మేదావులు చెప్పే మాట ఈ దేశం లో కొన్ని సామాజిక వర్గాల వారు అనుసరిస్తున్న వర్ణ వివక్షతే మత మార్పిడులకు దారి తీస్తుంది అని.ఇది కొంత వరకు నిమ్న వర్గాల వారు మత మార్పిడి విషయం లో నిజమే అనుకుందాం. మరి అగ్ర వర్ణాల వారు ఎందుకు మతం మారుతున్నారు?దీని వెనుక బలీయమైన ప్రలోబాలు ఉన్నాయన్నది నిర్వి వాదాంశం.  అసలు అన్మి మతాల మార్గం ఆ భగవంతుని చేరుకోవడం అయినప్పుడు, మత మార్పిడి అనవసరం మాత్రమే కాదు పనికి రానిది. ఉదాహరణకి మీరు ఎడారిలో ఉన్నారు అనుకుందాం.మీరు భగవంతుని గుడికి పోవడానికి ఆ ఎడారి దాటి వెళ్లాలి అంటే ఏమి చేస్తారు? ఎడారి లో ఉం...

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

Image
                              మనిషి సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యం ఎంత అవసరమో , సమాజం లో సాఫీగా మనుగడ సాగించాలి అంటే మనుషుల మద్య అరోగ్యకరమైన సంబందాలు అంతే అవసరం. అటువంటి ఆరోగ్యకరమైన సంబందాలను కొనసాగించేదుకు నిర్దేసించినవే కట్టు బాట్లు. అటువంటి కట్టుబాట్లను కాలదన్ని "నా ఇష్టం నాది " అని ప్రవర్తించే వారి కుటుంబాలు ఎలాంటి అదమా స్తితికి దిగజారుతాయో తెలుపుతుంది మొన్న నల్గొండలో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్దిని ఝాన్సీ ఆత్మహత్య ఉదంతం. వివరాలులోకి వెలితే,                     నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోములకి చెందిన గుర్రపు పద్మ తన భర్త మరణం తర్వాత కుమార్తె ఝాన్సీరాణి, కుమారుడితో కలిసి నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో నివాసం ఉంటోంది. నల్లగొండ మండలం దీపకుంటకి చెందిన ఝాన్సీ మేనబావ విజయేందర్‌ నుంచి పద్మ రూ.4 లక్షలు అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చాలంటూ విజయేందర్‌ తరచూ పద్మ ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో ఝాన్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. 'నీ కూతురును ఇచ్చి పెళ్లి ...