పూజారి మీద కోపం దేవుడి మీద చూపిస్తే ఎలా?
నిన్న ఒకాయన టి.వి లో మాట్లాడు తూ , దసరాకు రావణ దహనం సరికాదని, అసలు రావణుడు ద్రావిడ జాతీయుడు కాబట్టి, మనం రామున్ని దేవునిగ కొలవటం మానేసి, రావణునే కొలవాలని, అసలు రాముడు దేవునిగా కొలవబడడా నికి అనర్హుడని ఏవేవో చెప్పాడు. అదంతా వింటుంటే నాకు తమిళుల నాస్తిక ద్రుక్పదం మనకూ వ్యాపింపచెయ్యడానికి ఆయనగారు కంకణం కట్టుకున్నట్టు అనిపించింది. దానికి తోడు ఆయాన నిమ్న వర్గాలవారైన యస్.టి,యస్.సి, బి.సి,మైనార్టీ వాళంతా మన సాంప్రాదాయక దేవుళ్లను వదీలేసి, రాక్షసులైన,తాటకి, శూర్పణక, మారీచ , సుబాహులను, మహిషాసుర లను కొలవాలని ఎందుకంటే వాళ్లంతా మన ద్రావిడులని గట్టిగా నొక్కి వక్కాణించారు.ఆయన వాదన వింటుటే నాకోక అనుమానం వచ్చింది. ఇన్నాళ్లు మనం పూజించేది మన దేవుళ్లని కాదా ?ఇతర జాతుల వారినా?ఒకసారి విశ్లేషిద్దాం అనుకుని మన దేవుళ్ల చరిత్రను తిరగేసాను. మనకు ముఖ్యమైన ద...