గోవుల ను కబేళాలకు తరలించే వ్యక్తులను అరెస్ట్ చెసే అధికారం హిందువులకు లేదా ?!
ఈ రోజు పత్రికలలో వచ్చిన ఖమ్మం S.P గారి పత్రికా ప్రకటన చూసాక నాకొక సందేహం కలుగుతుంది . నిజంగా చట్ట ప్రకారం గోవుల వధను అడ్డుకునే అధికారం కానీ, గోవద కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తులను ప్రివేట్ హీందూ వ్యక్తులు అరెస్ట్ చేసి దగ్గర్లోని పోలిస్ వారికీ లేక పోలిస్ స్తేషన్ లో అప్పచెప్పే అధికారం కాని కలిగి లేరా? అనేది నాకొచ్చిన సందేహం. ఈ సందేహం కలగడానికి కారణం పైన చిత్రం లో ఉన్న ఖమ్మం S.P గారి ప్రకటణలోని కొన్ని ఆంశాలు. S.P గారి ప్రకటనానుసారం ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి వాహనముల ద్వారా గోవులను వదశాలకు తరలిస్తునట్లైతే వాటి గురించి సమాచరం మాత్రమే పోలిసులకు ఇచ్చే బాద్యత ప్రజలకు ఉందని, వాటిని అడ్డుకునే అధికారం లేదని ఘంటా పధంగా చెప్పడమే కాక, అలా చెయ్యడం చట్ట విరుద్దం కాబట్టి అటువంటి వారి పై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించడం జరిగింది. శ్.ఫ్ గారి స్తేట్మేంట్ హిందూ యేతరులు విషయం లో కరెక్టు కావచ్చేమో కానీ, గోవులను దైవంగా, మాత గా పూజించే హిందువుల విషయంలో కాదని నా అభిప్రాయం . అది ఎలాగో చూదాం.
చట్ట ప్రకారం భారత దేశంలో ఏ ప్రివేట్ వ్యక్తికైన తన కళ్ళ ఎదుట ఒక కాగ్నిజబుల్ మరియు నాన్ బెయిలబుల్ నేరం జరుగుతుంటే అట్టి నేరానికి పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి దగ్గర్లోని పోలిస్ అధ్కారికి కాని వారు లేని పక్షంలో దగ్గర్లోని పోలిస్ స్తేషన్ కి కాని అప్ప చెప్పే అధ్కారమ్ ఉందని క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ లోని 43వ నిబందన తేలియ చేస్తుంది. దానిని క్రింద ఇవ్వడం జరిగింది .
Section 43 in The Code Of Criminal Procedure, 1973
43. Arrest by private person and procedure on such arrest.
(1) Any private person may arrest or cause to be arrested any person who in his presence commits a non- bailable and cognizable offence, or any proclaimed offender, and, without unnecessary delay, shall make over or cause to be made over any person so arrested to a police officer, or, in the absence of a police officer, take such person or cause him to be taken in custody to the nearest police station.
(2) If there is reason to believe that such person comes under the provisions of section 41, a police officer shall re- arrest him.
(3) If there is reason to believe that he has committed a non- cognizable offence, and he refuses on the demand of a police officer to give his name and residence, or gives a name or residence which such officer has reason to believe to be false, he shall be dealt with under the provisions of section 42; but if there is no sufficient reason to believe that he has committed any offence, he shall be at once released.
గోవద నిరోదక చట్టం ప్రకారం గోవులను వధించడం కాగ్నిజబుల్ నేరం. అలాగే హిందువులకు గోవు అమ్మతో సమా నo . గోవును గో మాత గా పూజించడం జరుగుతుంది. అలాగే దైవంగా బావించి పూజలు కూడా జరుపుతారు హిందువులు. మరి అటువంటి గోవులను వదించబూనడం ఖచ్చితంగా హిందువుల మనో బావాలను విపరీతంగా గాయపరచే చర్య. కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్295A ప్రకారం, హిందువులకు సంబంధించినత వరకు గోవద అనేది నాన్ బెయిలబుల్ నేరం. కాబట్టి అట్టి నేరమ్ ని అడ్డుకునే అధికారం సంబదిత వ్యక్తులను అరెస్ట్ చేసి పోలిస్ వారికి అప్ప చెప్పే అధికారం ఈ దేశం లోని హిందువులకు ఉంది.సెక్షన్ 295A ఇండియన్ పీనల్ కోడ్ ఏమి చెపుతుందో చూడండి.
Section 295A in The Indian Penal Code
272 [295A. Deliberate and malicious acts, intended to outrage religious feelings of any class by insulting its religion or religious beliefs.—Whoever, with deliberate and malicious intention of outraging the religious feelings of any class of 273 [citizens of India], 274 [by words, either spoken or written, or by signs or by visible representations or otherwise], insults or attempts to insult the religion or the religious beliefs of that class, shall be punished with imprisonment of either description for a term which may extend to 4[three years], or with fine, or with both
కాబట్టి పోలిస్ అధికారులు గోవద విషయంలో కేవళమ్ గోవద నిషేద చట్టమ్ ని మాత్రమే కాక, సెఖ్షన్ 295A ఆఫ్ ఇందియన్ పీనల్ కోడ్ ని మరియుక్రిమినల్ ప్రోసీజర్ కోడ్ లోని 43 నిబందనలు క్షుణంగా పరిసీలించి హిందూ వ్యక్తులకు గల అధికారాలు తో కూడిన బాద్యతలను గుర్తించి వలసినదిగా ఈ టపా ద్వారా కోరడమైనది.గోవులను కాపాడడం, పూజించడం హిందువుల ప్రదాన ధర్మంలో ఒకటి. దానిని గుర్తించి గౌరవించాల్సిన బాద్యత భారత దేశం లోని ప్రతి ఒక్కరి పై ఉంది.
గో సంరక్షణ హీందూ కర్తవ్యం గా బావించే వారు ఈ టపాలోని సమాచారం ని షేర్ చెయ్యగలరని మనవి.
Comments
Post a Comment