వీళ్ళు "జూడా"లా ? లేక "ఘోడా" లా ?!

                                                                           


దేనికైనా ఒక పరిమితి ఉంటుంది . ఆ పరిమితి దాటి ప్రవర్తిస్తే చిన్న పిల్లలు అయినా సరే దండనకు గురి కాక తప్పదు ! ఇదే విషయాన్ని మన ఉమ్మడి  రాష్త్ర హై కోర్టు వారు తెలంగాణా రాష్ట్ర జూనియర్ దాక్టర్ లకు స్పష్టం చేసారు , గత  నెల రోజులుగా సమ్మె చేస్తూ ,జబ్బులుతో బాద పడుతున్న ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్న "పిల్ల వైద్యులకు " హై కోర్టు వారి హెచ్చరికలు చెవి కెక్కినట్లు కన్పించడం లేదు . అందుకే అవసరమైతే సుప్రీం కోర్టు కైనా వెళతామని  మీడియాలో సంకేతాలు ఇస్తూ తమ పిల్ల తన్నాన్ని ప్రదర్శిస్తున్నారు . ఇది వారి కెరీర్ కు ఏ మాత్రం మంచిది కాదని కనీసం వారికి విద్యా బుద్దులు చెప్పిస్తున్న తల్లి తండ్రులు , ఇతర పెద్దలు గ్రహిo ఛి వారికి సరి సరి అయిన మార్గ నిర్దేశనమ్ చేయాలి. లేకుంటే తమ పిల్లల బవిష్యత్ నాశనానికి తామే కారకులవుతారు .

  అసలు ఆంద్ర ప్రదేస్ లోని జూనియర్ దాక్టర్ ల సమస్యలు ఏమిటొ ఒక పట్టాన అర్దం కావు . ప్రతి సంవత్సరం సీజనల్ జబ్బులు వచ్చినట్లే వీరికి సమస్యలు వస్తుంటాయి . అది వారి స్టైపండ్ కు సంబందించిందో లేక వారి ఇతర సౌకర్యాలుకు సంబందించిందో అయితే ఎవరైనా సానుభూతితో అర్ధం చేసుకుని సమస్యలు తీర్చ గలుగుతారు . కానీ విద్యా బోదన కు సంబందించి సిలబస్ కూడా విద్యార్దులు చెప్పినట్టే ఉండాలని సమ్మె చేస్తే దాని లోని ఔచిత్యం ఏమిటి ? సిలబస్ ఏమి ఉందాలి ? అని నిర్ణయించాల్సింది సంబo దిత పెద్దలు తప్పా , పాఠాలు నేర్చుకునే పిల్లలు కాదు . 

   వైద్య విద్యార్దులు ఒక సంవత్సరం రూరల్ సర్విస్ చేయడమనేది,మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా చొప్పించిన నిభందన . "వైద్యో నారాయణో హరి " అని వైద్యులను భగవంతునిగా పూజించే మన దేశంలో ఈ నిభందన ను నిజమైన డాక్టర్లు  ఎవరూ వ్యతిరేకించరు. పల్లె ప్రజల సేవ నిజంగా ఒక వరం అని బావిస్తారు . ఈ విషయం లో  సమ్మె చేస్తున్న జూనియర్  దాక్టర్ లు కూడా వ్యతిరేకించటం లేదు కాని తెలివిగా మోకాలడ్డుతున్నారు తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత ప్రాతి పదిక మీద తమను నియమిస్తే "పల్లెవైద్య  సేవలు" చేయడానికి సిద్దం అని చెపుతున్నారు . విద్యార్డులుగా ఒక సంవత్సరం సేవ చేయమంటే ససేమిరా ఒప్పుకొని వారు శాశ్వత ప్రాతి పదిక  మీద చేస్తామనడం విడ్డూరం . అంటె వారి ఉద్దేశ్యం పల్లే సేవలు ఆప్షనల్ గా ఉండాలే తప్పా , కంపల్సరి చేయకూడదని . అలా ఇష్టపడి ఎవరైనా పల్లె సేవలుకు ముందుకు వస్తే వారికి పర్మనెంట్ ఉద్యోగాల్లో ప్రాదాన్యత ఇవ్వాలని వారి అభిమతం .

  జూనియర్ దాక్టర్ లలో ఇలాంటి అలోచనలు రావడానికి ఒకటే కారణం అనిపిస్తుంది .వైద్య విద్యాబ్యాస అడ్మిషన్ లలో నూటికి 60% మంది మెరిట్ ప్రాతి పదిక మీద ప్రవేశాలు పొందుతుంటే 40% మంది కోట్లు కుమ్మరించి వైద్య విద్యను కొనుకుo టున్నారు . మరి అటువంటి ధనిక విద్యార్దులు "పల్లె సేవలు" చేయమంటే చేస్తారా ? ఎంత నామోషి ! వారి ద్రుష్టిలో వైద్యం డబ్బు పోసి కొనుకున్నది . తిరిగి కార్పోరేట్ వైద్యo ద్వారా తమ డబ్బుకు పదింతలు రాబట్టుకునే తమని ప్రభుత్వం పల్లెలకు వెళ్లి పూర్ పీపుల్ కు సేవ చెయ్యమంతుందా ! నాన్సెన్స్! అది పూర్ &ప్యూర్  దాక్టర్ ల పని తప్పా తమ పని కాదు . అందుకే అటువంటి వారిని పల్లెలకు శాశ్వతం గా పంపించి పని చేయించుకోవాలి కాని  కోట్లు ఖర్చు పెడుతున్న తమకు అలాంటి నిభందన ఏమిటి? అని ఆలోచించే వారు వెనుక ఉండి నడిపిస్తున్న ఉద్యమం లా  కనిపిస్తుంది ప్రస్తుతం "జూడాలు " చేస్తున్న ఉద్యమమ్. మరి అటువంటి డాక్టర్ లను "జూడాలు" అనడం కంటె "ఘోడా" లు (ఘోరమైన దాక్టర్ ) అనడం కరెక్టేమో !

    వైద్య పరిజ్ణానమ్ అనేది ఎంతో మంది మహానుబావుల నిస్వార్ద త్యాగ పలం. దానిని కోట్లు పెట్టి కొనుక్కోవడమనేది  అజ్ఞానపు అలోచన . ప్రజలకు నిస్వార్దం గా వైద్య సేవలు అందించే గుణం లేని వారు వైద్యులుగా అనర్హులు.  మన  జాతి  దౌర్బాగ్యం కొద్ది వైద్యం వ్యాపారం అయి ఉండవచ్చు . కాని వైద్యులు "సొంత లాభం కొంత మానుకోక పోతే " మన సమాజం లోని పేద ప్రజలు బ్రతికే పరిస్తిటి లేదు . వారి కోసమే మన పూర్వికులు మనకు వైద్య విజ్ఞానం అందించారు తప్పా , మీరు వ్యాపారం చేసుకోవడానికి కాదు . 100 కోట్లు ఇచ్చినా వైద్యవిద్యకు తక్కువే . అది అమూల్యం . మరి అటువంటి వైద్య విద్య కావాలంటే మీలోని నిస్వార్దం నిరోపించుకోవడానికి " పల్లె సేవలు" తప్పని సరి .

  పల్లె ప్రజకు వైద్య సేవలు అందించి "జూడా " లుగా ఉంటారో , లేక నిరాకరించి "ఘోడాలు" అనిపించుకుంటారో తేల్చుకోవలసింది సమ్మె లో పాల్గొంటున్న జూనియర్ డాక్టర్లు మాత్రమే . ఏది ఏమైనా చట్ట ప్రకారం సమ్మె చేసే హక్కు జూనియర్ దాక్టర్ లకు లేదన్నిది నిర్వివాదాంశం .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!