మా నియోజక వర్గం లో "తీన్ మార్ మల్లన్న " కన్నా , "తిక్కల చెల్లవన్న" కే ఓట్లు ఎక్కువ వచ్చాయి !!!?
అమ్మయ్యా ! చచ్చి చెడి నల్గొండ ,ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల నియోజక వర్గ ఓట్లు లెక్కింపు పూర్తి చేసారు అధికారులు. పాపం ! మొన్న ఉదయం,నల్గొండ నాగార్జున కాలేజిలో మొదలుపెట్టిన ఓట్ల లెక్కింపు ,నిన్న రాత్రి తో పూర్తీ అయి ,తెరాసా అభ్యర్ధి శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని విజేత గా ప్రకటించడం తో సమాప్తం అయింది .దీనికి గాను ఓట్ల లెక్కింపులో ఎంతో ఓపికతో పాల్గొన్న అధికారులు , ఏజెంట్లను అభినందించి తీరవలసిందే ! అలాగే విజేత అయిన శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి శుభాభినందనలు . మామూలు ఓట్ల కు ,పట్టభద్రుల ఓట్లకు చిన్న తేడా ఉంది. మామూలు ఓట్లను మనకు నచ్చిన గుర్తు మీద ఒక ముద్ర వేస్తే సరి పోతుంది .కాని పట్టభద్రులు వేసే ఓట్లు తమకు నచ్చిన వారికి ,ప్రాదాన్యత క్రమంలో ఓట్లు వేయాలి . పట్టభద్రులు అంటే సామాన్య నిరక్షరాస్యులు ...