ఈ అమ్మాయి వ్యదని సాక్షీ పేపర్ వారే నమ్మటం లేదంటే అలోచించాల్సిందే మరి !

                                                                           
   
పాపం ఎవరో ఒక అమ్మాయి ! ఊరు, పేరు చెప్పటం లేదు . ఈమే చెప్పే విషయం వింటుంటే యువతకు ఆమె  తల్లి తండ్రుల మీద చెప్పరానంత వస్తుంటే ,అనుభవం ఉన్న పెద్దొళ్ళకు మాత్రం కొంచం అనుమానం కలుగుతుంది . మొత్తానికి టూకీగా విషయం ఏమిటంటె
 ఊరూ పేరు చెప్పకుండా ఒక అమ్మాయి పేస్ బుక్ లో ప్రత్యక్షమై , కన్నీటితో తన తండ్రిని ఇలా ప్రస్నిస్తుంది ""నాన్నా.. ఈ ప్రపంచంలో నేను అత్యంతగా ప్రేమించేది మిమ్మల్నే. మీరేది చేసినా నా మంచికే అనుకుని, మీ మాటకే కట్టుబడి ఉన్నా. నాకు పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు, 'నాకు అతను నచ్చలేదు నాన్నా..' అని చెప్పినా వినిపించుకోకుండా అతనికే ఇచ్చి చేశారు! అతను నన్ను చిత్ర హింసలు పెడుతున్నా చూస్తూ ఊరుకున్నారే గానీ, అతన్ని ఒక్క మాట అనలేదు. ఎందుకు నాన్నా ఇలా చేస్తున్నారు ? నాకంటే అతనే ఎక్కువయ్యాడా ?" అని . ఆమె చెప్పేది పూర్తిగా  నిజమని నమ్మలేక పోయినా సమాజంలొ ఆడపిల్లలుకు జరిగే అన్యాయాలు ద్రుష్టిలో ఉంచుకుని , తన వంతు బాధ్యతగా ఈ  విషయం పది మందికి తెలియచేయాలని "సాక్షి " పేపర్ వారు దీనిని తమ పేపర్లో ప్రచురిస్తూ , ఇది ఒక  వేళ అబద్దమని ఎవరైనా తెలియ చేస్తే తమ పేపర్లో సదరు విడియో  తొలగిస్తాం అని ప్రకటించారు . కానీ స్పందనలు చూస్తె  అమ్మాయి తండ్రిని  అసహ్యహించుకునే వారే ఎక్కువుగా ఉన్నారు . ఒన్సైడ్ హియరింగ్ లతో ఒంట్లో పూనకాలు వచ్చి ఊగిపోతూ కామెంట్లు చేయడం మన సమాజంలొ అలవాటైన పద్దతే కాబట్టి వాటి గురించి పెద్ద గా పట్టించుకోవలసిన అవసరం లేదు .

       అసలు అమ్మాయి చెప్పేది నిజమైన పక్షంలో ఆమె కి ఇష్టం లేని పెండ్లి చేయడమే కాక, పెండ్లి రోజునే తండ్రి ముందు ఆమెను పెండ్లి కొడుకు కొడుతుంటే ఏమనలేని తండ్రి ఖచ్చితంగా తండ్రి కాడు . ఆ తర్వాత కూడా  అల్లుడిని  సపోర్ట్ చేస్తూ , కూతురి నరకానికి కారణమైన వాడిని తండ్రిగా గుర్తించాల్సిన అవసరం  ఆ అమ్మాయికీ లేదు కాక లేదు .
 అలా కాక అమ్మాయి చెప్పేది నిజం కాకపోతే , పేస్ బుక్ లో తండ్రి పరువును తీసిన అ కూతురు కూతురు కాదు . అటువంటి కూతురు ఉండడం నిజంగా దురదృష్టం . కాబట్టి ఆమె ను ఆమె మానాన వదిలెయ్యడమే మంచిది . బిడ్డల్ని కనగలరు కానీ వారి రాతల్ని కాదు . మొత్తానికీ రాచి రంపాన పెడుతున్న మొగుడ్ని వదిలి తండ్రి ని పేస్ బుక్ ద్వారా ప్రశినించడం చూస్తుంటే ఇందులో ఎదో ట్విస్ట్ ఉందనిపిస్తుంది . అదేమిటొ తెలియాలంటే దీని మీద ఎవరైనా తెలిసిన వారు స్పందిస్తే కాని అర్దం కాదు . అంత వరకు మీరు  సాక్షి పేపర్లో ప్రచురితమైన విషయం ని క్రింది లింక్ లో చోడ గలరు . http://www.sakshi.com/news/top-news/woman-tells-her-horrible-story-through-facebook-143944?pfrom=home-top-story

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.