"ప్రేమికుల దినం" కంపల్సరి, !
అమ్మా నాన్నలను ప్రేమిస్తే,అది ప్రేమ కాదు!
అన్న దమ్ములను ప్రేమించేది,ప్రేమ కాదు!
అక్కా,చెల్లెళ్ల,పట్ల చూపేది ప్రేమ కాదు!
ఆలు మగల మద్య ఉండేది ప్రేమ కాదు మరి!
తోటివారి పట్ల చూపేది ఏది ప్రేమ కాదు!
మన దేశం పట్ల మనం చూపేది ప్రేమ కాదట!
కొంత మంది అమ్మాయిలు, అబ్బాయిలు మద్య ఉండే ఆ కెమిస్ట్రీ యే
ప్రేమయితే, అట్టి ప్రేమకు "దినం" అనేది కంపల్సరి,
అట్టి "ప్రేమికుల దినం" తో వారి, కొంపలూ సరే సరి!
మరి ఆ బంధాల ప్రేమ గూడ ప్రేమే కదా.. పువ్వుల పరిమళం మిమ్మల్ని అడిగి సువాసన అందిస్తుందా?.. అయిన వాళ్ళైనా కాకపోయినా, ప్రేమ ఎవరికైనా పంచవచ్చు... అది షేర్ చేసుకునే రూపాలు వేరు తప్ప.. కొన్ని మంచివి.. కొన్ని చెడ్డవి అని లేవు.. అన్ని ప్రేమలూ సరైనవే..
ReplyDelete