ఆశిష్ నంది గారి సిద్దాంతం ఆంద్రా, కర్ణాటక లలో ఎందుకు ఫెయిల్ అయింది?


ఆశిష్ నంది ఒక పేరొందిన సామాజిక వేత అంట! ఈయన గారి ఇతర సామాజిక సిద్దాంతాలు గురించి నాకు తెలియదు కాని , ఈ మద్య ఆయన గారు సూత్రీకరించిన ఒక సిద్దాంతం వింటే నాకు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన గారి సిద్దాంతం లేక అభిమతం ఏమిటంటే ఈ దేశం లో పెరిగిపోతున్న అవినీతికి నిమ్నవర్గాల వారే కారణమంట. దీనికి గాను ఆయన పశ్చిమ బెంగాల్ని ఉదాహరణగా చూపిస్తూ, గత వందేళ్లుగా అక్కడ నిమ్నవర్గాల వారెవ్వరూ, అదికారం దరిదాపుల్లోకి రాకపోవడం వల్లే, అక్కడ అవినీతీ తక్కువుగా ఉందని తేల్చేశారు మహా సామాజిక శాస్త ఘనాపాటి గారైన నంది గారు.
               నేను ఈ విషయం లో ఎక్కువు లోతులోకి వెళ్లి  విశ్లేషించ దల్చుకోలేదు. ఆయన గారు తన సూత్రీకరణకు పశ్చిమ బెంగాల్ని ఉదాహరణగా చెప్పారు కాబట్టి, ఒక వేళా అదే నిజమయితే, ఆయన   గారి సిద్దాంతం ఆంద్రా, కర్ణాటక లలో ఎందుకు ఫెయిల్ అయింది? ఆయనే సమాదానం చెప్పాలి.ఈ రెండు రాష్ట్రాల్లో, ఇటీవలి పరిణామాలు గమనిస్తే, గత వందేళ్లుగా ఎంత అవినీతి జరిగిందో పదేళ్లలో అంత అవినీతీ జరిగింది. ఆ అవినీతికి మూల కారకులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, బారత అత్యున్నత నేర పరిశోదక విబాగం వారి అభ్హిప్రాయం! వారీ మీద విచారణ జరపటానికే నెలల తరబడి పరిశోదన సాగుతుంది. వారు రాష్ట్రాల ఎల్లల్నే తారుమారు చేసారని అభియోగం. ప్రాదమిక  సాక్ష్యాలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్తానం కూడ నమ్మింది. మరి వారెవ్వరూ ఆశిష్ నంది గారు చెప్పిన సామాజిక వర్గాలకు సంబందించిన వారు కాదు.

    ప్రతి మనిషికి తను పుట్టిన కులం, మతం, ప్రాంతం పట్ల అభిమానం ఉండవచ్చు. ఉండాలి కూడా. కాని తాను సామాజిక వేత అని పించుకుంటున్నపుడు , కోమ్చం పక్షపాత రహితంగా ఉండాలి. లేదా తన వాదానికి బలమయిన సాక్శ్యాదారలు చూపించగలగాలి. నాకు తెలిసి అవినీతికి ప్రత్యేకంగా ఒక వర్గం వారో, ప్రాంతం వారో కారణం కాదు. అలా అయితే, దానిని నిర్మూలించటం తేలికే. ఒక రకమయిన మానసిక దౌర్బల్యం లాంటిది అవినీతి ని ఆచరించడం.దీనికి చికిత్స చేయ గలిగిన వాడు పాలకుడు అయితే దానిని నిర్మూలించడం ఆసాద్యమేమి కాదు. ఏ నాడైతే దనం కి ప్రాదాన్యత తగ్గి, గుణానికి ప్రాదాన్యత ఇస్తామో ఆ నాడు అవినీతి ఇంతగా ఉండక పోవచ్చు. లక్ష కోట్లు ఉంటే ఏమి లాబం లక్షణంగా బ్రతకలేనప్పుడు?అవినీతిని మనం వదలలేక పోతే, ఆనందం, ప్రశాంత జీవితం  అనేవి, మనల్ని వదలి పోవడం ఖాయం 

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )