ఒక బస్సులో ఇద్దరు హీరోలు , ముగ్గురు విలన్లు , యాబై మంది వెదవలు కలిసి ప్రయాణం చేస్తుంటే ,ఇలాంటి " స్మార్ట్ సీన్ " లే ఉంటాయి!
అరెరే ! ఏమి సమాజం! ఏమి సమాజం! స్మార్ట్ సిటి ల కోసం ఆరాట పడే సమాజం ఇలాగే ఉంటుందా ? ఇందుకా మనం నాగరీకులుం అని మురిసి పోయేది. తప్పు జరుగుతున్నప్పుడు ఖండించడం ఎలాగూ చేత కాదూ , కనీసం దైర్యంగా ఇద్దరు ఆడపిల్లలు తమ పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనను దైర్యంగా ఎదుర్కొంటుంటె , వారికి బాసటగా నిలిచి , తప్పు చేసిన వారిని నాలుగు పీకి , పోలిస్ కేసులు పెట్టించాల్సిన అవసరం లేదా? ఆ బస్సులోని సుమారు 50 మంది ప్రయాణికులు ఇంక్లుడింగ్ స్త్రీలు ఎందుకు మన్ను తిన్న పాముల్లా , అలా మెదల కుండా ఉన్నారు? అసలు ఈ సీన్ వెనుక జరిగినదేమిటి? అమ్మాయిలని బనాయించిన కేసులో 48 గంటలు గడచినా పోలిసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఫైటింగ్ సీన్ సోషల్ మీడియాలో ప్రచారమయ్యకే , అమ్మాయిల తల్లి తండ్రులు పోలీసులన...