లైంగిక వేదింపులు లేకుండా ఆడవాళ్ళు ఆపీసుల్లో పనిచెయ్యాలంటే 66%శాతం మంది మగాళ్ళని జైలులో పెట్టాల్సి వస్తుందా?
అవుననే అనిపిస్తుంది ఈ ఆన్లైన్ సర్వే లు చూస్తుంటే .ప్రపంచ వ్యాప్తంగా మహిళా జర్నలిస్ట్లు తమ వ్రుత్తి రీత్యా ఎదుర్కొంటున్న "లైంగిక వేదింపులు" మీద 'ఇంటర్నేషనల్ వుమెన్స్ మీడియా పౌండేషన్',మరియు 'ఇంటర్నేషనల్ న్యూస్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ ' అనే సంస్తలు ఇటివల జరపిన ఆన్లైన్ సర్వే పలితాలు అనుసరించి నూటికి మూడింట రెండువంతుల మంది స్త్రీలు తమ బాసులు మరియు సహౌద్యోగుల చేతిలో లైంగిక వేదింపులకు గురి అవుతున్న వారెనట. వీరి సర్వే పలితాలు చూసిన తర్వాత ఇన్నాళ్ళు "మనువు" పుట్టిన మన దేశం లోని మగవాళ్ళు మాత్రమె స్త్రీల పట్ల తమ "మగబుద్ది" ని ప్రదర్శిస్తున్నారు తప్పా, తక్కిన దేశాల్లోని స్త్రీలు పురుషులతో పాటు సమా...