తెలంగాణా విద్యార్దుల పీజుల కోసం సిమాంద్రా మంత్రులు సుప్రీం కోర్టుకు వెళతాం అనడం దిక్కుమాలిన రాజకీయం కాదా !?
తెలంగాణ ప్రబుత్వం "ఫాస్ట్ " అనే పీజ్ రెయంబర్స్ మెంట్ పధకం తెలంగాణ విద్యార్దుల కొరకు ప్రవేశ పెట్టడానికి ఒక కమిటిని నియమిస్తూ నిన్న జీ.ఓ ఒకటి జారీ చేసింది . దాని ప్రకారం ఇక నుంచి తెలంగాణా లోని విద్యార్దులు పిజ్ రియంబర్స్ మెంట్ పొందాలంటే సంబందిత విద్యార్ధి తల్లి తండ్రులు లేక తాత ముత్తాతలు 1/11/1956 కంటే ముందు తెలంగాణ నివాసులై ఉందాలి . ఈ పధకం ప్రవేశ పెట్టడానికి ముందే తాము దాని చట్టబద్దతను అన్ని కోణాల్లోంచి విశ్లేషించి , గతంలో ఉన్నత న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పులను పరిసీలించాకే తమ ప్రబుత్వానికి "స్తానికత " ను నిర్దారించే అధికారం ఉంది అని రూడి పరచుకున్నాకే 1956 ని స్తానికత నిర్దారణకు ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందని K .C. R గారు గట్టిగా నొక్కి చెప్పడమే కాక , సంబ0దిత తీర్పులను కూడా ఉటంకించడం జరిగింద...