Posts

తెలంగాణా రాజ్యానికి ఇదే సరి అయిన అధికారిక చిహ్నం !

                                                                        నూతనంగా ఏర్పడే తెలుగువారి నూతన రాష్ట్రం "తెలంగాణా " కి అధికార చిహ్నం ఎలా ఉండాలి అనే దాని మిద తర్జన భర్జనలు జరగటం , రెండు వర్గాలకు చెందిన ప్రజలు తమ తమ జాతి  గోప్పదనాలను ప్రతిబింబించే చిహ్నాలు ను అధికారిక చిహ్నాలుగా ఉంచాలని కోరడంతో , చివరకు K.C.R గారు ఆ  రెండు వర్గాలు ప్రజలను సంతృప్తి పరచే ఉద్దేశ్యంతో కాకతీయుల తోరణం పెద్దగానూ , చార్మినార్  ను చిన్న గాను , వాటి పైన భారత అధికార చిహ్నం మూడు సింహాల సహిత అశోక చక్రo  తో పాటు త్రిబాష లలో తెలంగాణా పేరు ఉండేటట్లు అధికార చిహ్నానికి ఓ.కే. చెప్పినట్లు తెలుస్తుంది . ఒక లౌకిక రాజకీయ నాయకుడిగా K.C.R గారు చేసింది అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచే చర్యే అయినా , "సూర్యమండలం " గా పేరు గాంచిన కాకతీయ రాజ్య ప్రాంతం అయిన తెలంగాణా రాష్ట్రం కి సూర్యుని చిహ్నం అధికార చిహ్నం లో  లేక పోవడం ఖచ్చితంగా లోటే అని చెప్పవచ్చు .    పూర్వపు  కాకతీయ రాజులు అందరూ సూర్యారాధకులే . అసలు కాకతీయ సామ్రాజ్యO ఆ సూర్య భగవానుడి వర ప్రసాదితం . అందుకే హనుమకొండ వేయి స్తంబాల గుడిలో విష్ణు

సిమాంద్ర ప్రజలు K.C.R గారి పోటో ఇంట్లో పెట్టుకుని , రోజూ మొక్కే రోజు వస్తుoదా !

                                                                              తెలంగాణా ప్రజలు కోరుకున్నట్లు గానే జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది . తెలంగాణా ప్రజలు ముక్యంగా రాజకీయ , విద్యార్ధి , అడ్వకేట్ , ఉద్యోగ వర్గాలు వారు "సంబురాలు " చేసుకుంటారు . ఎలాగు మిగులు బడ్జెట్ ఉంటుంది కాబట్టి కొత్త ప్రబుత్వం అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు . కొత్తగా పెండ్లి చేసుకున్న వారు తోలి నెల  "హనీమూన్ " పేరుతొ జామ్ జామ్ గా జాలిగా గడిపినట్లు , తెలంగాణా తోలి ప్రబుత్వం కూడా "విక్టరి ఇయర్ "ని ఎంజాయ్ చేయవచ్చు . కాని తెలంగాణా కు ఏర్పడబోయే అసలు సమస్య కరెంట్ కష్టాలు . దీనికి పరిష్కారం గురించి K.C.R  గారు ఎక్కడా ప్రస్తావించటం లేదు . దానిని అదిగమించటానికి "గుజరాత్ తరహ సోలార్ ప్రాజెక్టు లను ప్రోత్సాహించడం అనివార్యం అయినప్పటికీ అ దిశగా ఆలోచిస్తున్నట్లు  కొత్త నాయకత్వం ఎక్కడా చెప్పటం లేదు . వారు ఇంకా ఉద్యమాల మూడ్ లో నుండి బయటకు వచ్చిన దాఖలాలు కనపడటం లేదు . పై వర్గాలు  తప్పా సామాన్య ప్రజలు సంబురాలు గురించి ఆలోచించటం లేదు . కనీసం యువతకు విద్యా , ఉపాధి, ఉద్యోగ రంగాలలో

పబ్లిక్ లో స్త్రీని హింసించినా లేక స్త్రీ చేత హింసించ బడినా "వెదవ " అయ్యేది మాత్రం మగవాడే ! అని నిరూపిస్తున్న ఈ వీడియోను చూడండి . .

                                                                                       మన దేశం లో గృహ హింస కి బలి అవుతుంది ఎక్కువ శాతం స్త్రీలే అని అందరూ అనుకునేదే ! కారణం స్త్రీలను అనాదిగా ఈ మగ జాతి అణచివేయడం వలన వారిలో అబలత్వం ప్రబలి పురుష బలానికి బలి అవుతుందని సంప్రాదాయ బావన . కాని గృహ హింస కు బలి అయ్యే పురుషులు కూడా తక్కువేమి కాదు మన సమాజంలో . అయినా అటువంటి పురుషుల పట్ల సమాజంలో చిన్న చూపు ఉంటుంది తప్పా ,బాదిత  స్త్రీల పట్ల  కనపరచిన సానుబూతి ని సమాజం పురుషుల పట్ల చూపదు . మగాడి చేతిలో ఆడది తన్నులు తింటే అ మగాడికి బుద్ది చెప్పటానికి అందరూ సంసిద్దులవుతారు , అదే ఆడదాని చేత మగాడు తన్నులు తింటుంటే అ మాగాడ్ని చూసి నవ్వుకుంటారు తప్పా సీరియస్ గా తీసుకోరు . ఎందుకో తెలుసా ? మగాడు ప్రక్రుతి పరంగానే బలవంతుడు కాబట్టి స్త్రీ చేతిలో తన్నులు తినడమంటే అది వాడి చేత కాని తనం కనుక . కాబట్టి ఎప్పటికి స్త్రీ పురుషులు సమానులు కారు . అది ఇండియాలో అయినా సరే ! ఇంగ్లాండులో అయినా సరే !    ఈ మద్య చేసిన సర్వ్ ల ప్రకారం ఇంగ్లాండులో 40% పురుషులు గృహ హింస బాదితులే నట ! దీనికి కారణ0 స్త్రీలలో వెల్లివిరుస్తున

'గోవిందా' అని అనాల్సిన చోట "జై జగన్ " అన్నందుకే ఇన్ని అనర్దాలా !?

                                                                                మనిషి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రపంచంలో  భగవంతున్ని విశ్వసించే వారు ఉండక పోవచ్చు . ఎన్నో సందర్బాలలో  చేతికందినట్టే అంది ,చివరి క్షణాలలో అవకాశాలు చేజారి పోతూ ఉంటాయి . దానినే మన పెద్దలు "చేతి కందిన ముద్ద  నోటి కందేదాక  గ్యారంటి లేదు " అని అంటుంటారు . అదిగో అటువంటి పరిస్తితులు ఎదురైనప్పుడే నాస్తికులు సైతం భగవంతున్ని నమ్మినట్లు చరిత్రలో ఉదాహరణలు కో కొల్లలు .        గత 5 ఏండ్లుగా మన రాష్ట్రంలో జరుగుతున్నా కొన్ని పరిణామాలు చూస్తుంటే దివంగత ముఖ్య మంత్రి శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఏదో దైవ శాపం తగిలినట్లే అనిపిస్తుంది . నాకు బాగా గుర్తున్న సంఘటన ఏమిటంటే , అసెంబ్లీలో ముఖ్య మంత్రిగా రాజ శేఖర్ రెడ్డి గారు , ప్రతి పక్ష నాయకుడిగా చంద్ర బాబుగారు , తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో జరుగుతున్నా అవక తవకలు గూర్చి సీరియస్ గా చర్చిస్తున్న సందర్బంలో , రాజశేఖర్ రెడ్డి గారు కొంత హేళన గా ప్రవర్తించడం చూసి , అగ్రహోదగ్రులు అయిన చంద్ర బాబు గారు "వెంకటేశ్వర స్వామి విషయంలో  హేళన చేసిన వ

అన్న మాటకు కట్టు బడి K.C.R గారి ప్రభుత్వం 'ఎండోమెంట్ ఏక్ట్ " ను రద్దు చేస్తుందా?

                                                                              తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం "తెలంగాణా రాష్ట్రం " ఏర్పాటు కాబోతుంది . తెలంగాణా లోని ప్రజలు జూన్ 2 వ తేది న సంబురాలు చేసుకోవడానికి రడీ  అవుతున్నారు . అదే రోజు తెలంగాణా ఉద్యమ రధ సారధి , శ్రీ కలువ కుంట్ల  చంద్ర శేఖర్ గారు తెలంగాణా రాష్ట్ర తొలి  ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్రలో తన స్తానం ను సుస్తిరం చేసుకో పోతున్నారు . తెలుగు వారిలో ఎవ్వరికి దక్కని ఒక ప్రత్యెక హోదా -- తెలంగాణా తోలి ముఖ్య మంత్రి -- ఆయనకు దక్కడం అయన పూర్వ జన్మ సుకృతం . దీనికి ప్రధాన కారణం  అయన చేసిన యజ్ఞాలు , పూజలే అని నా విశ్వాసం . నిత్యం అయన పాల బాగానా మెరిసే ఎర్రటి పొడుగాటి కుంకుమ బొట్టే ఆయనకు శ్రీ రామ రక్షా కవచంగా పనిచేసి అయన సంకల్పాన్ని నేర వేర్చoది. ఇదిదేవుడిని నమ్మే అందరికి అనందం కలిగించే విషయం        శ్రీ చంద్ర శేఖర్ రావు గారు ఎన్నికల వేల అనేక ముఖ్యమైన వాగ్దానాలు చేసారు . అందులో హిందూ సమాజానికి అయన ఇచ్చిన వాగ్దానం తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే , హిందూ సంస్తలకు  ప్రభుత్వ పెత్తన పీడ  నుండి విముక్తి కలిగిస్తా

మెదడు లేని వాడికి ఒక చోట అంటితే , మేదావికి మూడు చోట్ల అంటుద్దన్నట్లుంది యీయన గారి పని !

Image
                                                                            కేజ్రి వాల్ ! డిల్లికి  మాజీ ముక్య మంత్రి వర్యులు . ఈయన  గారికి  కేజ్రివాల్ అనే పేరు కంటే , "క్రేజీ వాలా " అనే పేరు సరిగ్గా సరి పోతుంది !. ఎందుకంటే ఈయన లో పబ్లిసిటి పిచ్చి ఎక్కువ . నిరంతరం ఏదో ఒక కొత్తదనం తో  పనికి రాని పని చేస్తూ నిరంతరం  ప్రజల దృష్టిలో పడాలని తెగ తాప్రతయ పడి  పోతుంటాడు . దానిలో బాగంగానే ఈ  సో కాల్డ్ మేదావి చివరకు అతి తెలివికి పోయి  కావాలని జైలు  పాలయ్యాడు . ఈయన  పిచ్చి తనం చూసిన డిల్లి ప్రజలు ఇటువంటి వాడినా , తాము మేదావి అని బ్రమపడి ఒత్లేసింది అని బాద పడుతుంటే , అయన పార్టి సభ్యులు మాత్రం  ఈ పిచ్చోడి తో లాభం లేదని అమ్ అద్మి  పార్టికి రాజీనామా చేసి వెళ్లి పోతున్నారు .   మన దేశం లో చాలా మంది మేధావులకు జ్ఞానం పుష్కలంగా ఉన్నా , ఇంగిత జ్ఞానం లేక పోవడం వలన ,ఎక్కడెలా ప్రవర్తించాలో తెలియక అభాసు పాలవుతూ ఉంటారు . అలాంటి వారిలో కేజ్రివాల్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు . భగవంతుడు ఇచ్చిన డిల్లి రాష్ట్ర   ముక్య మంత్రి అవకాశాన్ని , తనకున్న "కొస వెర్రి " బుద్దితో చేజేతుక్లారా

ఏప్రిల్ 15 న నేను కోరుకుంది ,నిన్ననే నిజమైంది !

Image
                                                                                   ఏప్రిల్ 15 న నేను  పేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాను . దానిలో నా అభిప్రాయాన్ని క్రింది విదంగా తెలిపాను . నా ఆలోచనే కరెక్టు అన్నట్లు గా  తెలుగు ప్రజలు చాలా తెలివిగా తమ తీర్పును తెలియ చేసారు . దీనితో తెలుగు వారంటే గొర్రెలు అని బావిoచిన  చెళ్ళున చెంప మిద చరచి నట్లైంది . విజ్ఞులు కోరుకున్నట్లు తెలుగు ప్రజలు తమ ధర్మాన్ని తాము నిర్వర్తించారు . ఇక వారి ఆకాంక్షలు గుర్తించి ,అందుకు అనుగుణంగా పాలనను అందించాల్సిన బాద్యత T.R.S , T.D.P , B.J.P  ప్రభుత్వాల పై ఉంది . యావత్ తెలుగు వారికి అభినందనలతో ......     పేస్ బుక్ లో ఏప్రిల్ 15 న నేను పెట్టిన పోస్ట్ :   తెలంగాణాలొ T.R.S , సీమాంద్రా లో T.D.P., భారత దేశంలో B.J.P అధికారం లోకి వస్తేనే ,రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు కలిగే అవకాశముంది . తెలంగాణ లో N.D.A కూటమి అధికారం లోకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి , అభివ్రుద్ది మీద అవగాహన లేని తెలంగాణా కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టె బదులు , తెలంగాణా ప్రాంత స్వార్దం కోసమే పుట్టిన T.R.S పార్టీ వారికి అధికార