ఇకనుండి, ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళాలంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు పక్కన తోడు ఉండాల్సిందే !
"మా కేమండి ! ఉన్నది మగ పిల్లలు ! అప్పో సప్పో చేసి ఏదో రకంగా పైసలు ఇస్తే చాలు , వారి పనులు వారే చూసుకుంటారు . మగ పిల్లాళ్లు కాబట్టి బయట ఎంత సేపు తిరిగినా బయ పడాల్సిన అవసరం లేదు . అలాగే వారు ఉద్యోగాల వేటలో తిరుగుతున్నాప్పుడు కూడా , వారి వెంట తోడూ వెళ్ళాల్సిన అవసరం లేదు . అదే ఆడపిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళినా కుటుంబంలో ఎవరో ఒకరు వెంట ఉండి తీరాల్సిందే . వారికి పెండ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టిందాకా అమ్మాయి రక్షణ కోసం ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండాల్సిందే " . ఇది సగటు తల్లి తండ్రుల ఆలోచన . అది వాస్తవం కూడా . అబ్బాయిలను ఎ...