ఎంత మేదావి అయినా ,ఒంటె నెక్కక పొతే ఓట్లు వేసేది లేదన్నారట హైదరాబాద్ వాసులు!
నిజంగా మానాభి మానాలు ఉన్న వారికి , మేధావులకు ఈ కాలపు రాజకీయాలు చూస్తుంటే ఎంత అసహ్యం వేయాలో అంత అసహ్యం వేస్తుంది . ఎన్ని డిగ్రీలు పుచ్చుకున్నా , ఎంత మేదావి అయినా రాజకీయం లోకి అడుగు పెట్టాకా చేతులు కట్టుకు నిలబడి , పైసాకు పనికి రాని వాడితో పోటీలు పడి నానా మాటలు అనిపించుకోవలసిందే . ఇంట్లో పెళ్ళాం బిద్దలుని పట్టించుకోని వారు, బలాదూర్ గా పోకిరిగా తిరిగే వారు , జులుం చేసి ప్రజలను భయపెట్టే వారు , చీటికి మాటికి కొట్లాటలు కు పోయి కేసులు పెట్టించుకునే వారు , విరే రాజకీయ రంగానికి పనికొచ్చే కార్యకర్తలు . వీరికి బాగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారు గాడ్ పాదర్లుగా ఉంటె , ఆనతి కాలంలోనే నాయకులై ప్రజల ని ఎలేయ్యడానికి , అర్హత సంపాదిస్తారు . అటువంటి వారు , రాజకీయ పార్తిలలో ప్రదాన స్తానాలో ఉంటె , వారికి చిన్న పెద్ద అని కా...