Posts

పేస్ బుక్ లో పులి ! అసలు పని చెయ్యాల్సి వస్తే ఒంట్లో చలి !?

                                                             ఈ రోజు ఈనాడు పత్రికలో ఒక ఆర్టికిల్ వచ్చింది . పేస్ బుక్ లో వీరాది వీరుల్లా చెలరేగి గంటలు గంటలు చాటింగ్ చేసే కుర్ర కారు , కూరగాయల  మార్కెట్ కు వెళ్లి వెళ్లి బేరం ఆడడానికి తెగ కంగారు పడి పోతున్నారట . ఇటువంటి పరిస్తితిని అదిగమించాలంటే, తల్లి తండ్రులు అప్పుడప్పుడు పిల్లలను వెంట పెట్టుకుని మార్కెట్ కు తీసుకు వెళ్లి బేరమాడే విదానం నేర్పడమే బెస్ట్ అని మానసిక నిపుణులు సెలవిస్తున్నారట !.     కూరగాయలు బెరమాడడానికే తెగ కంగారు పడిపోతున్న కుర్రకారు , తమ పెస్బుక్ మిత్రులతో గంటలు గంటలు ఎలా చాటింగ్ చేయగలుగుతున్నారు అంటే ఒకటే కారణం కావచ్చు. పేస్ బుక్ మిత్రులుకు  సమాదానమివ్వడానికి కావలసినoత  టైం ఉంటుంది . ఎందుకంటే పేస్ బుక్ లో ఒకే సమయంలో నలుగురైగురితో చాటింగ్ చెయ్యడానికి విలు ఉంటుంది కాబట్టి , ఇవతలి వారు సమాదానమివ్వడానికి లేట్ చేసినా అవతలి వారు అసహనం చూపరు . కాని కూరాగాయల బేర గాడు అoత సమయం ఇవ్వడు కదా ! "ఏంటయ్యా ! కొంటె కొను .లేకుoటే లేదు . నా బేరం చెడగొట్టకు " అంటాడు . దానితో కంగారు . చివరకు బేరం ఆడలేక, వాళ్ళు చెప్పిన

ఇంత జరిగాక ఇప్పుడు సుప్రీం కోర్టు ను ఆశ్రయించి రాష్ట్ర విభజన ఆపడం వలన తెలుగు ప్రజలకు లాభమా ?నష్టమా ?

                                                        ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే అయన చేతిలో ఇంకా లాస్ట్ బాల్  ఉండనే బలంగా నమ్ముతున్నట్లు కనపడుతుంది . అలాగే K.C.R  గారు కూడా T.R.S  పార్టిని ఇంకా కాంగ్రెస్ లో విలీనం చేయకుండా మీనమేషాలు లెక్కించడం , పార్టి వర్గాలు చేత కాంగ్రెస్ తో విలినమే కాదు పొత్తు కూడా వద్దని చెప్పించడం చూస్తుంటే ఆ పార్టి వారికి కూడా రాష్ట్ర విభజన చెల్లుబాటు  మిద కొన్ని అనుమానాలు ఉన్నాయి  అనిపిస్తుంది  . తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తేదిని ప్రకటించకుండానే నిన్న K.C.R గారు, అంతకు ముందు చేసిన వాగ్దానం  "నేను తిరిగి అడుగంటూ పెడితే తెలంగాణా రాష్ట్రం లోనే" అన్నదానికి విరుద్దంగా హైదరాబాద్లో అడుగుపెట్టి , గుర్రాలు , లొట్టి పిట్టల సహిత స్వాగత సత్కారాలు స్వికరిoచడం కూడా పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపడానికే నన్నది అర్ధమవుతుంది .    రాష్ట్ర విభజన అనేది రాజ్యంగ బద్దంగా జరగలేదని భారత పార్లమెంటేరియన్లకు అందరికి తెలుసు . విభజన బిల్ చట్టం గా మారాక సుప్రింకోర్టు  వారు తప్పకుండా జ్యోక్యం  చేసుకుంటారని కేంద్రం లోని అ

అమర వీరుల త్యాగ పలితం, ధరల తెలంగాణా ! దొరల తెలంగాణా !?

                                                          సుమారు 1300 మంది ఆత్మ హత్యలు చేసుకుంటే కాని తెలంగాణాకు విముక్తి లభించలేదు . ఇది తెలంగాణా లోని ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి వేళా , ప్రతి చోటా నొక్కి వక్కానించిన మాట .అలాగే తెలంగాణా ఏర్పడ్డాక ప్రతి అమరవిరుడి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని K.C.R గారు అన్నట్లు గుర్తు . కాని తెలంగాణా ప్రకటించాక ఈ అమరవీరుల కుటుంబాల వారెవ్వరూ "సంబురాల్లో " పాల్గొన్నట్లు మీడియాలో ఎక్కడా కనిపించలేదు . బహూశా ఆత్మానందం పొంది సంతృప్తి చెంది ఉంటారు .    చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన ముక్యమైన సామజిక పరివర్తన నిమ్న వర్గాల ప్రజలకు రాజ్యాదికారం సిద్దించడం అని భారత రాజ్యంగ నిర్మాత శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు . దానిని నమ్మి తెలంగాణా సాధనకు ఉద్యమించిన వారిలో   గద్దర్ అన్న, విమలక్క, దళిత బహుజన వర్గాల   నాయకత్వంలో లక్షలాది ప్రజలు, కవులు , కళాకారులూ "సామాజిక తెలంగాణా " కోసం నినదించారు . వీరందరినీ దృష్టిలో పెట్టుకునే K.C.R  గారు కూడా తెలంగాణా తోలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించి తాను బహుజనుల పక్షపాతి అన్నంత బావం దళితులలో కలుగ చే

కిరణ్ కుమార్ రెడ్డి &కో ని దారుణంగా అవమానిస్తున్న దిగ్విజయ్ సింగ్ !

                                                     అయన గారి పేరు దిగ్విజయ్ సింగ్ ! మద్య బారతంలో ఉన్న మద్య ప్రదేశ్ కి అయన ఒకప్పుడు ముఖ్యమంత్రి . ఇప్పుడు అ  రాష్ట్రంలో అయన పరిస్తితి ఏమిటంటే మొన్ని మద్య ఆ రాష్ట్ర కాంగ్రెస్ వారు సమావేశాలు నిర్వహించుకుంటుంటే  ఈయన గారు కూడా ఆ సమావేశంలో పాల్గొoదామని ఎగేసుకు వెళ్ళాడట . కాని ఈయన గారి రాకను గమనించిన అక్కడి కాంగ్రెసియులు ఈయనగారు లోపలకు అడుగు పెట్టకుండా ముఖం మీదే తలుపులు మూసేసారట  !దానితో అయన గారు బిక్క ముఖం వేసుకుని డిల్లి దారి పట్టాడట !. ఆది  మద్య ప్రదేశ్ లో అయన పరిస్తితి!   ఒక ఊరికి కరణం ఇంకో ఊరికి వెట్టి అట ! అందుకే మధ్యప్రదేశ్ లో ఎందుకు పనికి రాని ఆయన్ని ఆంద్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ గా నియమించారు . అయన గారి చెతులుమిదగనె తెలంగాణా వచ్చిందన్న సంబరంతో మొన్న తెలంగాణా కాంగ్రెస్ నాయకులు చాలా మంది అయన ఇంటికి వెళ్లి , పూలు పండ్లు ఇవ్వడమే కాక పన్నీరు చల్లి మరి క్రుతజ్ఞతలు  తెలియ చేసారట! దానితో అయన జన్మంటూ ఉంటె "తెలంగాణా గడ్డ " మీదే పుడతాను అని గట్టిగా తిర్మానిమ్చుకున్నాడట !   మరి అటువంటి తెలంగాణాకి వ్యతిరేకంగా ప్రవర్తించిన ముఖ

"తెలంగాణా దొర" ప్రజలకు ఇచ్చిన మాట తప్పి, దేవతను అటువంటి కోరికను కొరుతాడా ? !

                                                        "తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, దళితుడే ముఖ్యమంత్రి " . ఇది తెలంగాణా రాష్ట్ర సమితి అద్యక్షులు అయిన K.C.R   వారు తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం . మరి అటువంటి వాగ్దాన్నాన్ని మరచి పోయారా !? T.R.S  పార్టి స్వయంగా అధికారం లోకి వచ్చినా , లేక ఇతర పార్టీల సహకారంతో అధికారంలోకి వచ్చినా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం K.C.R గారి ప్రదమ కర్తవ్యo . కాని ఈ రోజు టైమ్స్ అప్ ఇండియాలో వచ్చిన ఈ సమాచారం చూస్తుంటే ఆయనగారి వాగ్దాన విశ్వస నియతను తెలంగాణా ప్రజలు శంకిoచే పరిస్తితి ఏర్పడింది . టైమ్స్ అప్ ఇండియా వారి ప్రకారం T.R.S  వారు డిల్లి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక బంపర్ అపర్ ఇచ్చారట ! తెలంగాణా రాష్ట్రానికి తోలి ముఖ్యమంత్రి కావాలన్న K.C.R గారి కోరికను తీరిస్తే తెలంగాణలో M.P సీట్లలో  సింహ బాగం కాంగ్రెస్ వారికే వదిలేస్తాం అని . ఎంత మాట !    నిన్న K.C.R గారు సొనియాగాoది గారిని కుటుంభ సమేతంగా కలిసి తెలంగాణా రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం చూస్తుంటే చాలా మందికి ఒళ్ళు పులకరించి పోయి ఉంటుంది . తెలంగాణా గడ్డకు మళ్ళి పూర్వ వైభవం వచ

సిమాంద్ర కి మరో "కేజ్రి వాల్ " కావాలని ఉవ్విలూరుతున్న సినిమా నటుడు" శివాజీ "

                                                  ఆ మద్య పాలెం దగ్గర జరిగిన "వోల్వో బస్సు" దుర్ఘటనలో 45 మంది దాక చని పోవటం దేశ ప్రజలను ముఖ్యంగా తెలుగు ప్రజలను కలచి వేసింది . అయితే సదరు వోల్వో బస్సు ప్రైవేట్ అపరేటర్లది కావడం , ప్రైవేట్ ఆపరేటర్ల చట్ట వ్యతిరేక విదానాలను రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అధికారులు , పైసలకు ప్రలొబపడి చూసి చూడనట్లు ఉండటం మిద అనేక విమర్శలు వెలువెత్తెసరికి , అందుకు కిరణ్ కుమార్ గారి ప్రబుత్వం స్పందించి ఇప్పటి వరకు ఆకస్మిక దాడులు జరుపుతూ అక్రమంగా తిరిగే ప్రైవేట్ బస్ లను సిజ్ చేస్తూనే ఉంది .         నిజానికి పాలెం వద్ద దుర్ఘటనకు గురి అయిన బస్ ప్రైవేట్ బస్ కాబట్టి దాని యజమాని కాని , బస్సు కి  ఇన్స్యూర్ చేసిన కంపెని కాని నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది . వాటి కోసం అస్సిడేంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్స్ లో క్లైమ్  చేసి బాదితులు నష్ట పరిహారం పొందవచ్చు . అయితే జరిగిందో ఘోర దుస్సంఘటన కాబట్టి  బాదితులె కాకుండా ,ప్రజలు కూడా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం వలననే ప్రైవేట్ ఆపరేటర్ల మిద చర్యలు తీసుకుంది . అయితే ఈ సంఘటన ను డిల్లి లోని "నిర్భయ " సంఘటన లాగా చేసి  దాన

ముగ్గురూ అమ్మాయిలనే ఎందుకు చంపాడు ? ఆ పై తను ఎందుకు మాయం అయ్యాడు ?

Image
                                                           కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా , వింటున్నా నిజంగా వేలాది సంవత్సరాల మానవ ప్రస్తానం ఎటువైపు వెళుతుంది ? మానవత్వం వైపా ? దానవత్వం వైపా అనిపిస్తుంది . నిన్న నిజామాబాద్ నగర శివారులలొ జరిగిన ఈ ఘోరం చూస్తుంటే మనుషుల్లో దానవత్వం ఎంతగా ప్రభలి పోయిందో అర్ధమవుతుంది . అమాయకమైన , ముగ్ద మోహనంగా ఉండే ఆ  చిన్నారులను , కర్కశంగా పెట్రోల్ పోసి కాల్చి చంపింది ఒక మనిషి అంటే నమ్మ బుద్ది కావటం లేదు . నిందితుడు ఆ పిల్లల్ని ఎప్పుడూ ఆడించే వాళ్ళ బాబాయ్ అంటే అసలు నమ్మబుద్ది కావటం లేదు . కాని జరిగిన ఘోరం వెనుక ఉన్న కారణాలు పరిసిలిస్తుoటే  మీడియాలో వస్తున్న కధనాలు కూడా అనుమానం రేకెత్తిoచేవిగా  ఉన్నాయి . అవేమిటో చూదాం .    నిజామాబాద్ జిల్లా , రెంజల్   మండలం , భూపల్లి లోని రఘుపతి రెడ్డి గారికి 3 గురు కుమారులు. వారితో పాటు తన వదిన  కుమారుడును తనే పెంచి పెద్ద చేసాడు . అతని పేరు నరేందర్ రెడ్డి . నరేందర్ రెడ్డి కి ప్రస్తుతం 35 యేండ్లు . అంత వయసు వచ్చినా అతనికి పెండ్లి కాలేదట . అతనికి ఆర్దిక పరమైనా , ఇతరత్రా సమస్యలేమీ లేకున్నా పెండ్లి కాక పోవటం , దాని కో