Posts

"పశువుల గడ్డి మేసినందుకు పదిహేడేల్లకి శిక్ష విదించారట!

                                                                    ఈ దేశం లో కేవలం ఒక్క న్యాయస్తానాలు మాత్రమే అవినీతి గడ్డి తీంటున్న పెద్దలను నిష్కర్షగా జైల్ లోకి పంపి, ఈ దేశం కోసం తపించే వారిని అప్పుడప్పుడు ఆనందపరుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. 'ఈ దేశం ని ఎవరూ బాగు చెయ్యలేరు, అవినీతి అనేది సర్వసాదార్ణం విషయం' అని మన దేశం లో పామరులు నుంచి మేదావులు  దాకా  ఒక ద్రుడ నిర్ణయానికి వచ్చే శారు.  దీని వలన అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులలో కానీ, అధికారులలో కాని చట్టం అంటే ఏ మాత్రం భయం లేకుండా పోయింది. అవినితి పరులకు జనం నీరాజానాలు పట్టి ఎన్నికలలో గెలిపిస్తుంటే తాము చేసే పనికి ప్రజామోదం ఉంది అని అవినీతి పరులు బుకాయిస్తూ, అధికార దర్పం వెలగపెడుతుంటే చట్టం అంటే గౌరవం ఉన్నవారు, మనది ఖచ్చితంగా ఒక పద్దతి గల ప్రజాస్వామ్య దేశం అని బావిస్తున్న వారు విస్తుపొతున్నారు.కొంత మంది  ప్రజలు అవినీతి పరులను ఆరాదించడం చూసి,ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రద్దుచేసి,  కొంతకాలం నియంత్రుత్వ పాలన వస్తే బాగుండు అని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకు అదికమవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి వారే ఎన్నికలలో వోటింగ

రాహుల్ గాందీ గారు ఒక చెంప పగలగొడితే, కిరణ్ కుమార్ గారు రెండో చెంప పగల గొట్టారు!.

                                                                        నిన్న కేంద్ర సర్కార్ వారికి రెండు చెంప దెబ్బలు తగిలినట్లైంది! అయితే ఈ చెంప దెబ్బలు కొట్టిన వారు ప్రతిపక్ష పార్టీలో, సుప్రీం కోర్టు వారో కాదు. సాక్షాత్తు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉపాద్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ బావి ప్రదాని అభ్యర్దీ శ్రీ రాహుల్ గాందీ గారు కాగా, రెండవ వారు తమ పార్టీ ఏలుబడిలో ఉన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక విదంగా చెప్పాలంటే రాహుల్ గాంది గారి స్టెట్మెంట్ పరిశిలిస్తే కేంద్ర ప్రభుత్వం నైతిక బాద్యత వహించి స్వచ్చందంగా రాజీనామ చేయతగిన తప్పిదం చేసినట్లే లెఖ్ఖ.   ఈ  దేశ సర్వోన్నత న్యాయస్తానం, నేర గాళ్లు చట్టనిర్మాతలుగా ఉండే దౌర్బాగ్య పరిస్తితి నుండి జాతిని రక్షించడానికి  చారితాత్మక తీర్పులను వెలువరించింది.  అందులో ఒకటి ఏ ప్రజా ప్రతినిది  అయినా సరే కోర్టుల చేత నేరస్తుడిగా నిర్దారించబడిన మరుక్షణం నుండే పదవీచ్యుతులవడమే కాక బవిష్యతులో ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కూడా అనర్హులు.  . అలగే క్రిమినల్ కేసుల వలన పోలిస్ కష్టడీ కానీ, జుడిషియల్ రిమాండ్ లో కానీ ఉంటే అట్టి వారు ఎన్

మితిమీరిన ప్రేమ అందుడినే కాదు హంతకుడిని కూడా చేస్తుంది!

                                                                          ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమించిన వారికోసం వారు ఏమైనా చేస్తారు. ఇంట్లో వారికి రూపాయి ఖర్చుచెయ్యడం ఇష్టపడనివారు సైతం ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతైనా దారపోస్తారు.కారణం వారిలో ఉన్నది స్వార్దం తో కూడిన ప్రేమ మాత్రమే. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. అలాంటి ప్రేమ తల్లినీ,చెల్లీనీ ,భార్యనీ ఒకేలా ప్రేమించేలా చేస్తుంది. కానీ మోహంతో కూడిన ప్రేమలో త్యాగం అనేది ఉండదు. తాను ఇష్టపడిన అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తారు. వారి కోసం అప్పు చేసైనా వారు కోరింది ఇస్తారు. కానీ అదే ప్రేమను ఎదుటి వారు తిరస్కరిస్తే అస్సలు ఓర్చుకోరు. అవసరమైతే తనకు దక్కనిది ఎవరికి దక్క కూడదనే ఉద్దేశ్యంతో  తాము ప్రాణాధికంగా ప్రేమించిన వరినే మట్టుబెడతారు. ఈ విషయం లో రక్తసంబందాలు కూడ అడ్డురావని తమిలనాడు  జరిగిన ఈసంఘటణ రుజువు చేస్తుంది.   అతని పేరు తమిల్ సెల్వన్.ఉండేది కడలూర్ జిల్లాలోని పంచకుప్పం లో. అతనికి మహాలక్ష్మి అనే మేనకొడలు ఉంది. అతను తన  ఇరవైరెండవ యేట నుంచి అంటే అంటే మహాలక్ష్మి యుక్త వయస్కురాలు అయినప్పటి దగ్గరనుంచి ఆమె అంటే ఇష్టం పెంచుకున్నాడ

ఆ దేశం లో అయితే ఉరేస్తారట! ఈ దేశంలో అయితే ఉరేగిస్తారట!

         నిన్న ఫేస్ బూక్ లో ఒక పోస్ట్ చూసాను. చైనాకి మనకి అవినీతి విషయంలో ఎంత అభిప్రాయబేదం ఉందో అర్దమవుతుంది.మనo వ్యక్తి ద్రుక్పదమే తప్పా ,సామాజిక ద్రుక్పదం అంతగా లేనివారం.మనవారు   అభిమాన నటుడి సినిమా పైరసీ చేస్తే, అంకమ శివాలెత్తి పోతారు, అదే ప్రజల సొమ్ము దోచినోడి గురించి ఒక్క మాటా మాట్లాడలేరు.   చైనా లో అవినితికి పాల్పడితే ఉరిశిక్ష విదిస్తారట. అంటే అది మనకు "నిర్భయ" కేసు ఎలాగో వారికి అవినీతి కేసు అలాగ అన్న మాట.మరి వారికి మనకి సామాజిక ద్రుక్పదంలో అంత తేడా ఎలా వచ్చింది? మనం దోపిడిని అంతలా ఎలా సహిస్తున్నాం? పైపెచ్చు అలా దోచిన వారినే మన హీరోలు అంటున్నాం. వారినే పూజిస్తున్నాం. వారికోసం ప్రాణలు సైతం అర్పించడానికి వెనుకాడని అమరవీరులు మన సమాజంలో ఉన్నారు అంటే చైనా వారికి మనకి  తేడా ఎక్కడ వచ్చిందో అర్దం కావటం లేదు. ఈ మద్య ఒక మిత్రుడు నాకొక కద లాంటిది చెప్పా డు. అందులో వాస్తవం ఉంది అన్నాడు. మరి ఉందో లేదో మీరే చెప్పండి.   చెంగీజ్ ఖాన్ తన దండ యాత్రల సమయంలో ఒక టెక్నిక్ పాటించేవాడు అంట. అతను ఎప్పుడూ తన అనుచరులను ,తను జయించిన రాజ్యాలలో రాజులుగా నియమించలేదట! ఏ రాజ్యాన్ని తను హస్తగతం

గోవిందా..గోవిందా! యాబై వేల కోట్లు ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందా!

                                                                     మన సర్కార్లు ఎంతో ప్రతిష్టాత్మకం అని  చేసే కొన్ని కొన్ని పనులు చూస్తుంటే, అవి చిత్తశుద్దితో చేసేవా లేక అస్మదీయులకు లబ్ది చేకూర్చాలని ఎవరో ఇచ్చిన సలహాలను ముందు వెనుక ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలా అని అనిపిస్తుంది. అలాంటిదే నిన్న సుప్రీం కోర్టు వారు చెల్లదని కొట్టివేసిన ఆధార్ కార్డులను తప్పనిసరిచేసే ప్రక్రియ.   గ్యాస్, విద్యుత్, తాగునీటి కనెక్షన్ లకే కాక, ఇక బవిష్యత్ లో ఏ ప్రభుత్వ సేవలను పొందాలన్నా "అధార్ కార్డు" అనేది కంపల్సరీ అని కేంద్ర ప్రభుత్వం వారు  ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాలను నానా హైరాన పెట్టారు.  గాస్ సబ్సీడి పొందాలంటే ఆదార్ కార్డు ఆదారంతో తెరచిన బాంక్ ఖాతా వివరాలు అందచేయాలని, పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రం లోని అయిదు జిల్లాలను ఎంపిక చేసామని, కాబట్టి ఆ యా జిల్లాల ప్రజలు మే లోపు ఆధార్ వివరాలు వివరాలు అటు బాంక్ లో నమోదు చేసుకుని ,అట్టి ఖాతా వివరాలను గాస్ డీలర్ కి  ఇవ్వాలని లేదంటే 'సబ్సిడి కట్' అంటె ఆధార్ అందని ప్రజలు, ఇంకా అధార్ అప్లై చేయని ప్రజలు ఆందోళన చేసారు. రాష్ట్ర ప్రభుత్వ కో

డిగ్గీరాజా గారి ద్రుష్టిలో ముఖ్యమంత్రి గారు మూర్కుడట!?

                                                                       అవును మరి!తర తరాలకు సరిపడా సంపాయించుకునే  బంగారం లాంటి అవకాశం వస్తే,దానిని కాదని ప్రజలు, సెంటిమెంట్ అంటూ పట్టుకు వెలాడడం మూర్ఖత్వం కాదు మరి?అదే అవకాశం డిగ్గీ గారికి వస్తేనా, నా సామి రంగా, హైద్రాబాద్ వాళ్ళని హడలెత్తించి ఫాయిదా పోందేవారే!మరి ఆ తెలివి తేటలు మన కిరణ్ గారికి లేవాయే! అంత తెలివి గలిగిన వాడు కాబట్టే  మద్య ప్రదేశ్ లో కాంగ్రెస్ సమావేశం లో పాల్గొనకుండా డిగ్గి రాజా ముఖం మీదే తలుపులు మూ శారు అక్కడి కార్య కర్తలు . ఇంతకి మన ముఖ్యమంత్రి గారి మీద డిగ్గీ రాజా అని పిలువబడే దిగ్విజయ్ సింగ్ గారికి ఎందుకంత దుగ్ద!?   మొన్న సీమాంద్రా మంత్రుల సతీమణులు రాష్ట్రపతి గారిని ఇతర డిల్లీ పెద్దలను కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ణప్తి చేసారు. అందులో భాగంగానే డిగ్గీ రాజా గారిని కలిస్తే ఆయనకు చిర్రెతుకొచ్చిందట. ఒక సారి విభజన కు ఓ.కె అన్నాకా మాటి మాటికి ఈ రాయాబారాలేంటి అని అసహనం ప్రదర్శించారట." అయినా మిమ్మల్ని కాదు మీ ముఖ్యమంత్రిని అనాలి, ఎంత మూర్కుడు కాకపోతే కావాల్సిన దానిని అడగకుండా, అయిపోయిన రాష్ట్ర విభజన ఆ

హాంపట్..ఆమెను చంపి,అతడిని 13 వ అంతస్తు నుండి తోసేసి చంపిన ఆ భూతం ఏవరో తెలుసా!?

                                                               దెయ్యం! భూతం! కాష్మోరా!మోహినీ! పిశాచీ! కొరివి దెయ్యం! ఇవ్వన్నీ మనిషిని ఆవహించి వారిని ఉన్మాదులను చేసే మానసిక రోగాల పేర్లు. కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ఉన్మాదానికి గురైన వారికి ఎటువంటి విద్యా అర్హత లేని మంత్రగాళ్ళు, భూత వైద్యులు, పకీర్లు ఈ ఉన్మాదాన్ని వదిలిస్తున్నారు. దెయ్యం పట్టి చనిపోయిన వారు ఉన్నట్లు ఉదంతాలు లేవు అనుకుంటా!కానీ కాష్మోరా ను మించిన భయంకర బూతం ఇప్పుడు యువతను ఆవహించి వారి ప్రాణాలను వారే తీసుకునేటట్లు చేస్తుంది. ఈ భూతం పుట్టేది ఎందులో తెలుసా? నవ నాగరిక జీవన విదానం లో!ఈ భూతం ఎవరిని ఆవహిస్తుందో తెలుసా? చదుకోని వారి జోలికి అసలు పోలెదు. చదువుకున్న వారి లోనే తిష్ట వేసి వారు చచ్చే వరకు వేదిస్తుంది. వీరికి భూతం పట్టిందని వీరికి తెలియదు, వీరీ చుట్టూ ఉండే నవ నాగరీకులకు తెలియదు. తీరా వారు చని పోయాక మాత్రం" పిచ్చోళ్ళు! ఇంత చిన్న విషయానికే చని పోతారా!" అని ఒక నిట్టూర్పు విడుస్తారు. మరి ఇప్పట్టికైనా ఆ భూతం ఏదో గ్రహించారా? దాని పేరే "స్ట్రెస్". మానసిక ఒత్తిడి.నేడు పదహారేళ్ల  పాటు చదువుకుని ,