తిలా పాపం తలా పిడికెడు అని రాష్ట్ర వేర్పాటు నిర్ణయం కేవలం అధికార పార్టీ వారిదే అని ఇతర పార్టీల వారు, ముఖ్యంగ ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం వారు అనటం బాద్యతా రాహిత్యమే అవుతుంది. రాష్ట్ర విబజన అనేది అంద్రా ప్రాంతం లోని అయిదుకోట్ల ప్రజలకు ఇష్టం లేదని, తెలంగానాలోని మెజార్టీ ప్రజల అభిలాష అని తెలిసినపుడు,అదే విషయాన్ని అఖిల పక్ష మీటింగ్ లో చెప్పాల్శి ఉండె. తెలంగాణా ఇవ్వడం, ఇవ్వక పోవడం అనేది పూర్తిగా పాలనా పరమయిన నిర్ణయం కాబట్టి,మరియు రెండు ప్రాంతాల ప్రజల మనో బావాలకు సంబందించినది కాబట్టి, దాని గురించి పార్టి పరంగా తాము ఏమి చెప్ప జాలమని, రాజ్యాంగ ప్రక్రియలో భాగంగ అసెంబ్లీలో...