Posts

అన్నదమ్ములుగా విడి పోదాం! బావా బామ్మార్దులు లా కలసి ఉందాం!

Image
                                                                                                                                                                                                                                                                                "అన్నదమ్ములు చావు కోరు, బావ బామ్మార్దులు బ్రతుకు కోరు" అని జన ఉవాచ. అలాగే ఉంది మన తెలంగాణా సీమాంద్ర రాజకీయ,ఉద్యోగుల, విద్యార్దుల పరిస్తితి. ఎందుకంటే అన్న దమ్ములు మద్య రక్త సంబందం తో పాటు ఆస్తులు మీద హక్కులు లాంటివి ఉంటాయి. వారిలో అర్దిక పరమయిన విబేదాలు లేనంత కాలం ఎటువంటి సమస్యను అయినా వారు సునాయాసంగానే పరిష్కరించుకోగలుగుతారు.వారిలో ఉండే సహజ రక్త సంబందం అందుకు దోహదం చేస్తుంది. కానీ ఒక్క సారి ఆర్దిక పరమయిన ఆసక్తులు వారి మద్య బేదాలుకు కారణాలు అయితే బేదాభిప్రాయాలు సమసిపోవడం అంత సుళువు కాదు.రాజ్యాల కోసం అన్న దమ్ములు  కుత్తుకలు కత్తిరించిన చరిత్ర మనిషిది. ఆస్తులు కోసం శాశ్వత శత్రువులుగా మారీ ఆ శత్రుత్వ వారసత్వాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న కుటుంబాలు మన గ్రామీణ భారతంలో కో కొల్లలు.వీటన్నిటికి మూల కారణ

సుభాషితాల బ్లాగుల్లో, సుఖ రోగ అంటీల పబ్లిసిటీ ఎందుకు?

Image
                                                                  నేను ఈ మద్య కొన్ని బ్లాగుల ను చూశాను. విషయ పరంగా, సమాచార పరంగా మంచి సందేశాత్మక, విజ్ణాన దాయకంగా ఉన్న ఆ బ్లాగులు నిస్సందేహంగా చదువరులకు మేలు చేసేవే. కాని ఆ బ్లాగులే కొంత ఎబ్బెట్టు కలిగించే పబ్లిసిటీ అడ్వర్టైస్ మేంట్లు కలిగి ఉండడం చాలా బాదా కరమైన విషయం.   మన భారతీయ కుటుంభ వ్యవస్త మీద విదేశి వ్యాపార బావ జాలికులు ఎంత తివ్రంగా దాడి చేస్తున్నారో ఈ అడ్వర్టైస్ మెంట్లు తెలియ చేస్తున్నాయి. "బోర్ డ్ హౌస్ వైప్  ఆంటిలంటా" ఇంట్లో బోర్ కొట్టి మోర్ సాటిస్పై, చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తుందట! ఎవరైనా ఆసక్తి ఉన్నవారు అడిగితే లింక్ కలుపుతారట, సదరు సైట్ వారు.   ప్రతి దానిలో మంచి తో పాటు చేడూ ఉంటాయి. బ్లాగులు కూడా అందుకు మినాహయింపు కాదు. కాని అశ్లిల చిత్రాలు ప్రదర్శించే బ్లాగులు, వాటి విక్షకులు వేరుగా ఉంటారు. అటువంటి బ్లాగులను "అడల్ట్స్ కంటెంట్" అనే పేరుతో ప్రత్యేక కేటగిరిగా చూపించవచ్చు. కాని అది చాలక మంచిని నేర్చుకుందామనే చదువరుల మనసులు సైతం విక్రుత పరచాలనే దురుద్దేశ్యంతో, అడ్వర్టైస్ సంస్తలు సేఫ్టీ బ్లాగులలో సైతం

మనo నడవ వలసింది "గ్రామ స్వరాజ్యం" వైపు కాదు, నగర రాజ్య స్తాపన వైపు !

Image
                                                                                                                   మంచో ,చెడో మన రాష్ట్ర విబజన ప్రక్రియ మొదలయింది . దానిని ఉద్యమాల ద్వారానో , కోర్టు ప్రక్రియల ద్వారానో , మరే రాజకీయ ప్రక్రియల ద్వారానో నిలువరించే చర్యలను మాని , మన తెలుగు జాతి అబ్యున్నతికి ఏమీ చేస్తే బాగుంటుందో ఆలోచిస్తే మంచిదనుకుంటా.    మనం రెండు రాష్ట్రాల ప్రజలుగా విడగొట్ట బడినంత  మాత్రాన మన మద్య ఉన్న కుల, మత , బాషా , సంబందాలు మనల్ని విడి పోనియవు . తెలంగాణా ,అంద్రా అనే బావం ఆప్ట్రాల్ నిన్న మొన్నటిది . కాని మన సామాజిక సంబందం వేల సంవత్సరాల నుండి మన మద్య పెన వేసుకుని అది మన అణువు అణువు  లో నిక్షిప్తం అయి పోయింది . ఆ అణువుల స్పందనే నేడు ఆంద్రా వారు చేస్తున్న ఉద్యమ ప్రక్రియలు. మరి నిన్నటి వరకు తెలంగాణా వారు చేసిన ఉద్యమం దేనికి సంకేతం అని అడగవచ్చు . అది కూడా  అన్నదమ్ములు , అక్క చెల్లెళ్ళ మద్య  సహజ బావోద్వేగాల చర్యలుగానే గుర్తించాలి .ఒక   ఇంటిలో పెద్ద కొడుకు అన్నింటిలో పెత్తనం చెలాయిస్తూ ,చిన్న వారిని నిర్లక్ష్యం చేస్తే గొడవలు కావడం ఖాయం . అదే సమర్దుడైన తండ్రి లేక త

భారత 29 వ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఇటలీలో జన్మించిన, ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనో!

Image
Sonia Gandhi's birthplace, 31, Contrada Maini (Maini street),Lusiana, Italy (the house on the right)                                                        అది 1946  డిసెంబర్ 9  వ తారీకు. ఇటలీ దేశం లో లుశియానా అనే గ్రామంలో  మైనో వంశంలో,సాంప్రదాయిక రోమన్ కాదలిక్ కుటుంబంలో ఒక స్ట్రీ శిశువు జన్మించింది. ఆ శిశువు పేరు ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనో!.  అమే కేవళం ఒక తాపీ మేస్త్రీ కూతురు కావడం వలన ఆమే గురించి ఇటలీలో పెద్దగా ఎవరూ పట్టించుకోక పోవచ్చు! అలాగే ఆమే గారు కేంబ్రిడ్జ్ లోని ఒక గ్రీక్ రెస్టారెంట్ లో  జీవన బ్రుతి కోసం వెయిట్రెస్స్ గా పని చేస్తూ కాలేజిలో ఇంగ్లీష్ బాషా కోర్సు చదువుతున్న రోజులలో ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఒకే ఒక వ్యక్తి పట్టించుకున్నాడు. ఆయనే భారత పూర్వ ప్రధాన మంత్రి ఇందిరా గాందీ గారి పెద్దబ్బాయి రాజీవ్ గాందీ గారు. ఆమేను చూసిన తొలి చూపులోనే మనసు పారేసుకున్న ఆయన అన్నీ పారేసుకోవడం ప్రాంబించే సరికి ఇక లాబం లేదని ఆమే గారిని వివాహం చేసుకుని ఇండియాకు తీసుకు వచ్చారు.    అప్పటి దాక ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనోగా  ఉన్న ఆమే గాందీ గారి వంశం లోకి అడుగు పెట్టి "

సోనియాజీ తో గేమ్స్ ఆడితే రెండుగా విడిపోవాల్సిందే !

                                                                   "మంచీ చెడు తెలిసి కూడ చెప్పలేని పెద్దలు ఎవ్వరికీ ఏమీ  కారు, ఏమీ చెయ్యలేరూ " అన్నాడో సినీ కవి. చెప్పక పోతే చెప్పక పోయారు, కనీసం తమకేమి అవసరం లేదని ఊరుకున్నారా అంటే  అదీ లేదు . మీరిస్తే మాకేమి అబ్యంతరం లేదని సన్నాయి నొక్కులు నొక్కారు . తీరా వీరు చెప్పేది ప్రజలందరి అభిప్రాయమే అనుకుని తెలంగాణా ఇవ్వడానికి సిద్ద పడుతుంటే ఇప్పుడు దానిని ఆపటం ఎలాగా అని మల్లగుల్లాలు పడుటున్నారు.   వీరిని చూస్తుంటే ఎదో సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ లు గుర్తుకు వస్తున్నాయి. "ఖాన్ తో గేమ్స్ అడకు  శాల్తీలు  లేచి పోతాయి " అని ఒక పంచ్ డైలాగ్ ని ఊత పదం గా వాడుతుంటాడు . ఇక్కడ తెలంగాణా విషయంలో మింగలేక, కక్కలేక "ఇవ్వమంటే ప్రజలతో తంటా , వద్దంటే సోనియా అమ్మతో తంటా " అని మదనపడుతూ , ఎవరిని ఏమనలేక "అత్త  మీద కోపం దుత్త మీద చూపించినట్లు " ప్రతి పక్ష నాయకులు వద్దని చెపితే సోనియా తెలంగాణా ఇచ్చేదే కాదు అని సమర్దించుకుంటుంటే , వారి అసమర్ధపుమాటలకు  నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్తితి సమైఖ్య వాదులది.   ఒక రాష్ట్రాన్న

సోనియా గాంది, తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన దానిని వెనుకకు తీసుకుంటుందా !?

                                                                K.C.R. గారు ఆంద్రా నాయకులను తెలివిగా అడకత్తెర లో ఇరికించి తెలంగాణా రాష్ట్ర సాధనకు కారకుడయ్యాడు అని చెప్పవచ్చు. తెలంగాణా వారు  రాజకీయంగా  పావులు కదపటంలో  చాణక్యుడికి ఏ మాత్రం తీసి పొరని K.C.R. నిరూపించాడు . అటు అధిష్టాన దేవతని ప్రసన్నం చేసుకోవడంలో సపలిక్రుతుడు అవ్వడమే కాక , తన చాకచక్యంతో ఆమె నైజం ఎరిగి, కూల్ గా ఆమె చేత తెలంగాణాకు  o.k అనిపించాడు .. కొన్నాళ్ళు సునామిలా విరుచుకు పడుతూ ,మరి కొన్నాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటించే  k.c.r. లో అపర చాణక్యుడు ఉన్నాడనటo  లో అతి శయోక్తి లేదు .   ఏమిటి ! k.c.r. గారిని ఇంతలా పోగుడుతున్నాను అనుకుంటారా? అవును మరి. ఈ రోజున తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి ఎవరు ఎన్ని కారణాలు చూపించిన ముక్య కారణం సోనియా గాంది గారి మాట. అవును ఖచ్చితంగా ఆమె తెలంగాణా ప్రజలకు తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన మాటే ఈ రోజు తెలంగాణా ఏర్పడటానికి కారణ మవుతుంది తప్పా వేరేది కాదు. సోనియా గాంది గారి నైజం ఎరిగిన k.c.r. గారు ఆమె పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9 వ తారికున తెలంగాణా ప్రకటన చేసేలా చాలా కసరతు చెసాదు. అందులో బాగమే

మనవు బ్లాగును ఇండి బ్లాగర్ అవార్డ్ కోసం రికమెండ్ చెయ్యగలరని బ్లాగ్ మిత్రులకు,వీక్షకులకు మనవి .

Image
                                                                               మిత్రులకు ,వీక్షకులకు  మద్దిగుంట నరసింహ రావు  వినమ్రం గా మనవి చేయునది ఏమనగా గత సంవత్సరం సెప్టెంబర్ లో ప్రారంబించిన మనవు బ్లాగు ఆనతి కాలంలోనే మీ అందరి అదరాభి మానములతో  83,000 వీక్షణలు పొంది దిన దిన ప్రవర్డ మాన మగుచున్నది. మీరూ చూస్తున్నారు నా బ్లాగు ఎటువంటి కమర్షియల్ సమాచారం కోసం వినియోగించక, కేవలం సామాజిక , మత , కుటుంబ పరమైన అంశాల మిద సమకాలిన పరిస్తితులను విశ్లేషిస్తూ, మిత్రుల పొగడ్తలను, విమర్శలను సమానం గా స్వీకరిస్తూ ముందుకు సాగుతుమ్ది.నా బ్లాగు  మనుగడకు వారందరూ సహకరిస్తున్నందుకు వారికి హృదయ పూర్వక ధన్య వాదములు తెలుపుతున్నాను.   ప్రస్తుతం  మనవు బ్లాగు indiblogger  awards 2013 కొరకు తెలుగు విబాగంలో నామినేట్ అయినది. దిని కొరకు  వీక్షకుల రికమెండ్ అనేది అవసరమని  indi blogger వారి నిబందనలలో ఒకటి . కావున మిత్రులు వీక్షకులు  సహృదయంతో "మనవు" బ్లాగును రికమెండ్ చేసి అవార్డ్ సాదిoచుటలో  తొద్పడగలరని మనవి . రికమెండ్ చేయుటకు లింక్ మిద క్లిక్ చేయగలరు  http://www.indiblogger.in/iba/entry.php?edition=1&en