దంపతులు ఇద్దరూ సమానులే అనేది గే ,లెస్బియన్ లకు వర్తిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనేదే హిందూ తాత్విక దృక్పదం!
భారత రాజ్యాంగం తన పౌరులకు సమానత్వం ని ప్రసాదించింది. దీనికి ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల కృతజ్ఞుడి గా ఉండాల్సిందే. ఎవరి దృష్టిలో ఎలా ఉన్ననా , రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమే. అందులో ఆడ, మగ ,థర్డ్ జెండర్ అనే లింగ వివక్షత అనేది చూపించటానికి విలు లేదు. అదిగో అదే కారణం చూపిస్తూ మొన్ననే సుప్రీం కోర్టు భారతీయ శిక్షా స్మృతి లోని 497 సెక్షన్ ,అడల్త్రి నేరానికి శిక్ష పొందే విషంలో స్త్రి పురుషుల పట్ల వివక్ష చూపించడమే కాక, భార్యను భర్త యొక్క ఆస్తిగా బావించే పాత తరం వారి బూజు పట్టిన బావ జాలానికి అడ్డం పట్టేల ఉందని ప్రకటిస్తూ , అసలు అ సెక్షనే నేటి తరానికి పనికి రాదనీ 4:1 మెజార్టి తో అత్యున్నత న్యాయస్తానం కొట్టివేయడం జరిగినది. అయితే 497 సెక్షన్ లో నేరానికి బాద్యుడిగా పురుషుని మాత్రమె చేయడం వెనుక , అడల్త్రి న...