"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.
నిన్న దమ్మున్న చానల్, దుమ్మురేపే చానల్ లో ఒక స్వామి గారి లీలలు ప్రసారం చేసారు. పాపం, చానల్ వారు ఊహించినట్లు అది బ్లాస్ట్ కాకపోవడానికి కారణాలు ఎన్నున్నా అవి మనకు అనవసరం. కాని వారు ప్రసారం చేసిన అంశాలలో మాత్రం ఒకటి ఆస్చ్యర్యం కలిగించింది. ఒక స్వామీ వారు. చిన్నప్పుడు జులాయ్గా తిరిగినా పెద్దాయ్యకా, ఆయన ఒడ్డూ, పొడుగూ చూసి మూడు సినిమాలలో చాన్సులు ఇస్తే అవి కాస్తా ప్లాప్ అయ్యాయట. అంతే ఒక బ్రహ్మాండమైన నెట్వర్కుతో స్వామీజీ అవతారం ఎత్తితే కోట్లరూపాయసంపాదన అట. ఈయన గారిదగ్గరకు సంపన్న వర్ఘాల స్తీలు వచ్చే వారట. వారి సమస్య ఏమిటంటే , వారి కాపురాలు సజావుగా సాగడం లేదు కాబట్టి, వారి భర్తల మనసు మార్చేలా ఏదైనా పూజలు చెయ్యమని స్వామీ వారిని అడిగే వారట!. ...