Posts

ఈయన గారు సినిమా నటన లో సింహం లెక్క ! చిత్తం మాత్రం "చిత్త కార్తె కుక్క "లెక్క!!!?

Image
                                                                              కమల్ హాసన్ ! ది గ్రేట్ సిని ఆర్టిస్ట్ . నేను N.T.R గారి నటన తర్వాత అభిమానించే నటన ఈయనదే ! నటన అంటె మూస తరహ పాత్రలు పోషించడం కాదని , వైవిద్యభరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని నమ్మి ఆచరిస్తున్న గొప్ప వ్యక్తీ అతను. అందుకే నటన పరంగా అయన గారు సింహం . కాని నైతిక జీవనం విషయం లో మాత్రం అయన  ఆలోచనలు  గ్రామ సింహం లాగా ఉన్నాయి అనిపిస్తుంది.    ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేది నైతికంగా దిగజారిన పెద్దల సంతానాన్ని ఉద్దేసించి చెప్పే మాట. దాన్ని నిజం చేయాలని చుస్తున్నట్టుంది శ్రీ మాన్ కమల్ హాసన్. అయన వ్యక్తిగత జీవితం అయన ఇష్టం అయినప్పటికి , అయన సెలెబ్రిటి కాబట్టి , అయన ఉంటున్న సమాజం లోని నైతిక జీవన విలువలును  గుర్తించి మసలుకుంటె మంచిది. ఒక ప్రకటన ఇస్తున్నప్పుడు దాని ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో తెలుసుకుని ఇవ్వడం కనీస ధర్మం.             అయన గారు, సహచర్యం అని చెప్పబడే "మోడ్రన్ కీపింగ్ " పద్దతిని ఎందుకు అవలంభించాడొ , దానికి దారి తీసిన పరిస్తితులు ఏమిటో ఆయనకే తెలియాలి. అటువ

"కెమెరామెన్ T V 9 తో యాంకర్ పద్మావతి " ఎపిసోడ్ లో T V 9 కు పెరగడం తప్పా , పద్మావతికి ఒరిగిందేమిటి?

Image
                                                                        ఈ  రోజు కొన్ని మీడియా చాన్నల్లలో ఒక స్క్రోలింగ్ చూశాను. హైదరాబాద్ కి చెందిన యాంకర్ పద్మావతి అనే ఆవిడ తన భర్త సతీష్ ని ప్రియురాలి తో ఉండగా పట్టుకుని దేహశుద్ది చేసి బుద్ది చెప్పిందని. చాలా సంతోషం వేసింది ఆ వార్తా చూసి. కట్టుకున్న ఇల్లాలికి అన్యాయం చేసి మరో ప్రియురాలితో కులుకుతున్నందుకు అతడికి ఆ ఇల్లాలు తగిన బుద్ది చెప్పి ఉంటుంది అనుకున్నాను. కాని ఇదే వార్తా కొన్ని చానల్లలో ఇంకొక రకంగా అంటే యాంకర్ కి వ్యతిరేకంగా రావడం తో ఆసక్తి పెరిగి అసలు కద ఏమిటా అని ఆరా తీస్తే , T V 9 వారి పుణ్యమాని యాంకర్ పద్మావతి ఎపిసోడ్ దొరికింది. అది చూసాక మొగుడు పెళ్ళాల పంచాయతీలు వారికి ఏ మాత్రం ఉపయోగపడుతున్నాయో తెలియదు కాని T V చానల్లు తమ రేటింగ్ లు పెంచుకోవటానికి మాత్రం పిచ్చ పిచ్చగా ఉపయోగ పడుతున్నాయని అర్దమవుతుంది.                పద్మావతి కదనం ప్రకారం ఆమెకు సతీష్ తో పెళ్లి అయి 10 యేండ్లు  అవుతుంది.  వారిది ప్రేమ వివాహం. ఆమె మాటలు బట్టి వారి పెండ్లి అబ్బాయి ఇంట్లో వారికి ఇష్టం లేదు. వారి మోజులు తీరగానే గొడవలు ప్రారంబం అయ్యాయి కాబోలు ,

తన పిల్లల దన విజ్ఞానానికి బలై పోయిన "జన విజ్ఞాన వేదిక " నాయకుడు !

Image
                                                                    మన సమాజం లో కొంతమంది నిస్వార్దంగా జనం కోసం అహర్నిశలు పని చేస్తూ , తాము నమ్మిన సిద్దాంతం కోసం తన సర్వసాన్ని చివరకు తన ఆస్తి పాస్తులను సైతం సమర్పించేసి " మహాత్ములు " మహా పురుషులు అనిపించుకుంటారు . వీరి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అనే విషయం లో ఎలాంటి సందేహాలు ఉండవలసిన అవసరం లేదు. కాని వీరి అంతులేని ఉదార స్వబావం వలన బాదితులుగా మారేది సదరు మహాత్ముల "కుటుంబ సబ్యులు". అందుకే జనానికి "గాడ్ పాదర్" అయిన వారు కూడా  , ఇంట్లో పిల్లలకి   "గుడ్ పాధర్ " కాలేరు. ఇంట గెలిచి రచ్చ గెలవడమనేది విజ్ఞుల లక్షణం . కాదు సమాజమే నా దేవాలయం . ప్రజలే నా దేవుళ్ళు అనుకున్నప్పుడు ముందు కుటుంబ బాద్యతలు నెరవేర్చి , ఇంట్లో ని సబ్యులందరిని సమావేశపరచి , తన ఆస్తి పాస్తులును ఎవరి వాటా వారికి ఇచ్చివేసి , తనకు వచ్చిన వాటాని , ఇక బవిష్యత్ లో తానూ సంపాదించే దానిని పూర్తిగా తానూ నమ్మిన సిద్దాంతం కోసమో , ప్రజల కోసమో వెచ్సిస్తాను అని స్పష్టంగా చెప్పివేస్తే , అది ధర్మబద్దంగాను, న్యాయబద్దంగాను ఉంటుంది. పిల్లల మనస్సు

బ్లాగుల్లో రాక్షసులు అంటే ఎవరో తెలుసా!!?

Image
                                                                                  నేను డి 22-12-2012 నాడు నా మరొక బ్లాగులో ఇదే శీర్షికతో ఒక టపా ప్రచురించాను . అప్పడు బ్లాగు నిర్వహణలో నాకు ఎదురైనా అనుభవాలను అనుసరించి ఆ టపాను  పెట్టడం జరిగింది. వ్యక్తుల బావాలను విమర్శిస్తే బాదపడాల్సింది ఏమి ఉండదు. కాని వ్యక్తీ గతంగా కించపరచే బాషతో బ్లాగర్ లను ఆడిపోసుకుని కీచకానందం పొందుదాం అనే వారిని  చూస్తుంటె, "అసలు వ్యక్తిగతంగా ఒక్క పైసా లాభం  లేని బ్లాగులను నిర్వహించడం ఎందుకు?ముక్కు ముఖం తెలియని   అనాగరికులతో అనిపించుకోవడం ఎందుకు అనిపిస్తుంది . మరొక పక్కేమో ఎవరో ఏదో 1% అనాగరికుల కోసం , 99% అభిమాన వీక్షకులను వదులుకోవడం ఎందుకు అని పిస్తుంది. నా స్నేహితుల్లో చాలా మంది తమ తీరిక సమయాన్ని, ఒళ్ళు ఇళ్ళు గుల్ల చేసుకునే కార్యక్రమాలతో గడిపేస్తుంటారు. దాని కంటె బ్లాగింగ్ నయం అని సంతృప్తి చెందడం వలననే బ్లాగు నిర్వహణ కొనసాగించడం జరుగుతుంది . నా ద్రుష్టిలో విజ్ఞానం గ్రహించడం , పంచడం రెండూ యజ్ణ o  చేయడం తో సమానం . కాబట్టి బ్లాగర్లు అందరు ఋషులే . అటువంటి యజ్ఞాలకు విఘ్నాలు కలిగించాలని చూసే వారు రాక్షసులు

ఇక నుండి విటులకు ఎయిడ్స్ తగులు కుంటుందో లేదో కాని సెక్షన్ 370 A మాత్రం తగులుకుంటుంది!!!!?

Image
                                                                                        నిన్న మన హైకోర్టు వారు బ్రహ్మాండమైన తీర్పు ఒకటి ఇచ్చారు. ఆ తీర్పు దెబ్బతో వ్యభిచార గృహాలకు వెళ్ళె విటులకు కష్ట కాలం మొదలు అయినట్లే. విటుడిగా కేసులో ఉన్న వ్యక్తిది విచిత్ర పరిస్తితి.  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అయింది సదరు విటుడి గారి పరిస్తితి.టూకీగా కేసు వివరాలు ఏమిటంటె                                                                                                హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనిలో నిర్వహిస్తున్న ఒక బ్రోతల్ హౌస్ మీద దాడి చేసిన పోలిసులు ఇద్దరు నిర్వాహకులు, ఒక విటుడిని పట్టుకుని వారి మీద కేసులు పెట్టారు. అయితే గృహ నిర్వాహకులు మీద పెట్టిన సంబందిత చట్టం లోని సెక్షన్లు  కరెఖ్తువే అయినప్పటికి , విటుడి మీద పెట్టిన సెక్షన్ అతను చేసిన నేరానికి సంబందించింది కాదు. అందుకే ఆతను దైర్యంగా తనను కేసు నుండి విముక్తం చేయాలని హైకోర్టువారిని ఆశ్రయించాడు . విటుడు కోరుకున్నట్లే అతన్ని సదరు సెక్షన్ నుంచి విముక్తం చేసినప్పటికి , సెక్షన్ 370 A అఫ్ I P C క్రింద విచార

కూతురిని అతి కిరాతక చర్యలకు గురిచేసిన వాడిని ఈ విడియోలో చూపినట్లు శిక్షించాలి !!!?

Image
                                                                              మొన్న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న మైనర్ బాలిక పై అత్యాచారం , హత్య కేసు లోని నిజాలు బయటపడి సబ్య సమాజాన్ని నివ్వెర పోయేలా చేసింది. తండ్రి అనే పదానికే మాయని మచ్చను తెచ్చిన ఆ నరరూప రాక్షసుడికి ఒక్క క్షణం కూడా భూమి మీద బ్రతికే హక్కు లేదు. విచారణ ల పేరెఉతో ఆ నీచుడు బ్రతికిన ప్రతి క్షణం సబ్య సమాజం సిగ్గుతో చచ్చి పోతూనే ఉంటుంది . రాజ్యంగ పరంగా విదించే శిక్షలు  దారి తప్పిన మనుషుల పై ప్రయోగిస్తే ఉపయోగం కాని, అసలు మానవత్వమే కోల్పోయిన వారికి పనికి రాని శిక్షలు అవి. సంస్కరణాత్మక శిక్షా విదానం నేరస్తులలో  మార్పు తేలేనప్పుడు కనీసం బయోత్పాతక శిక్షా విదానం ద్వారా అయినా నేరస్తులను బయం కలిగేలా చేయడం కొంతలో కొంత నేర కట్టడికి ఉపయోగ పడవచ్చు. ఎవ్వరూ చూడని రహస్య ఎన్ కౌంటర్ కన్నా బహిరంగ నరికివేతే  రేప్ +హాత్య దోషులకు సరి అయిన గుణ పాఠం .                     సబ్య ప్రపంచం మొత్తం షరియా చట్టాలును  నిరసిస్తున్నా, ఇటువంటి మానవ మృగాలను దునుమాడటానికి అవే సరి అయినవి అనిపిస్తుంది. సౌది లో ఎవరైనా నిందితుడు రేప్ చేసి చంపితే  అందుకు

తెలంగాణా హోం మంత్రి గారి మీసాల పవర్ కు సవాల్ విసిరిన నలుగురు రేపిస్ట్ హంతకులు!

Image
                                                                         ఒక రాజ్యంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలంటె ,సామాన్య  ప్రజలకు చట్టాలు మీద గౌరవంతో పాటు వాటికి నిబద్దులై నడచుకునే తత్వం అలవడి ఉండాలి .అలాగే నేర ప్రవ్రుత్తి కలిగిన వారికి, చట్టాలను అమలు చేసే అధికారులు అంటె గుండెల్లొ రైళ్ళు పరుగెత్తాలి. అలా కాకుండా డబ్బుకు ఆశపడి తోకూపుకుంటు పనిచేసే లాలుచి యంత్రాంగం ఉన్న సమాజంలో మూడు రేప్ లు ఆరు మర్డర్ లు తప్పా ఇంకా ఏమి కానరావు.  నిన్న రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటణ యావత్ తెలంగాణా ప్రజలు తల దించుకునే లా ఉంది . ఇది డిల్లి నిర్భయ కేసుకన్నా ఘోరాతి ఘోరమైన కేసు. కాని విచిత్రం ఏమిటంటే దీని మీద మహిళా సంఘాలు కాని, కనీసం బాదితుల సామాజిక వర్గానికి చెందిన వారినుండి కాని స్పందన లేదు. బహుసా ప్రస్తుతం బయట కాస్తున్న  ఎర్రటి ఎండలకు ఆడోళ్ళ చైతన్యం మాడి పోయి ఉంటుంది . మనం నవ నాగరీకులం అని చెప్పుకునే హక్కుని ఎప్పుడొ కోల్పోయాం. కాని అప్పుడప్పుడు అయినా డిల్లి లాంటి సంఘటనలు  అయినా స్పందించి "కాకుల్లొనే కాదు , మాలోను సంఘ జీవన విదాన స్పందన ఉంది " అని అనిపించుకుంటున్నాం . మరి అలాంటి స్