బ్లాగుల్లో రాక్షసులు అంటే ఎవరో తెలుసా!!?
నేను డి 22-12-2012 నాడు నా మరొక బ్లాగులో ఇదే శీర్షికతో ఒక టపా ప్రచురించాను . అప్పడు బ్లాగు నిర్వహణలో నాకు ఎదురైనా అనుభవాలను అనుసరించి ఆ టపాను పెట్టడం జరిగింది. వ్యక్తుల బావాలను విమర్శిస్తే బాదపడాల్సింది ఏమి ఉండదు. కాని వ్యక్తీ గతంగా కించపరచే బాషతో బ్లాగర్ లను ఆడిపోసుకుని కీచకానందం పొందుదాం అనే వారిని చూస్తుంటె, "అసలు వ్యక్తిగతంగా ఒక్క పైసా లాభం లేని బ్లాగులను నిర్వహించడం ఎందుకు?ముక్కు ముఖం తెలియని అనాగరికులతో అనిపించుకోవడం ఎందుకు అనిపిస్తుంది . మరొక పక్కేమో ఎవరో ఏదో 1% అనాగరికుల కోసం , 99% అభిమాన వీక్షకులను వదులుకోవడం ఎందుకు అని పిస్తుంది. నా స్నేహితుల్లో చాలా మంది తమ తీరిక సమయాన్ని, ఒళ్ళు ఇళ్ళు గుల్ల చేసుకునే కార్యక్రమాలతో గడిపేస్తుంటారు. దాని కం...